చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గురించి శ్రీనువైట్ల చెప్తూ...అతనొక్కడే. కానీ ఓ సైన్యం నడిచొస్తున్నట్టుంటుంది. చాలా తక్కువ మాట్లాడతాడు.. కానీ ప్రతి మాటా ఓ మిస్సైల్‌లా దూసుకొస్తుంది. ఒక్కసారే మాటిస్తాడు... ప్రాణం ఉన్నంత వరకూ దానికి కట్టుబడి ఉంటాడు. అందుకే... అతను 'బాద్‌షా' అయ్యాడు. ఇంతకీ అతని గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు శ్రీను వైట్ల.
''పేరుకి తగ్గట్టే.. శక్తిమంతమైన కథ ఇది. ఎన్టీఆర్‌ని ఇది వరకెప్పుడూ చూడని కోణంలో చూపిస్తున్నాం. పాత్ర తీరే కాదు.. ఆయన గెటప్ కూడా సరికొత్తగా ఉంటుంది''అని నిర్మాత తెలిపారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్.
ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు.