యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
గతంలో ఈచిత్రాన్ని డిసెంబర్లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నిర్మాతలు, ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా థియేటర్ల సమస్య కారణంగా ‘మిర్చి' ఫిబ్రవరి 8న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
No comments:
Post a Comment