Tuesday, January 31, 2012

సృష్టికి ప్రతిసృష్టి టుస్సాడ్స్‌ మ్యూజియం.........


బాలీవుడ్ అందాల రాణులు కరీనా కపూర్‌, ఐశ్వర్యారాయ్‌లతో కలిసి ఫొటోలు దిగాలని ఉందా..? మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ని కలవాలనుందా..? బాలీవుడ్ టాప్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ల పక్కన నిలబడాలనుందా..? వీరందరినీ ఒేకసారి దర్శించాలనుందా..? అయితే వెంటనే లండన్‌లోని మేడ్మ టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. మన దేశానికి చెందిన ఈ ప్రఖ్యాత సెలబ్రిటీలే కాదు ప్రముఖ సెలబ్రిటీలు మైకెల్‌ జాక్సన్‌, బ్రిట్నీ స్పియర్స్‌ వంటి ఎందరినో ఒేక చోట సందర్శించే అద్భుతమైన వేదిక ఈ మ్యూజియం. ఇటువంటి ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలతో ఏర్పాటైన టుస్సాడ్స్ మ్యూజియం దేశ,విదేశాల్లో ఎంతో పేరొందింది. సందర్శకులకు మరచిపోలేని అనుభూతులను మిగిల్చే ఈ మ్యూజియం నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించింది. టుస్సాడ్స్ మ్యూజియంలో ఏడుగురు ఇండియన్‌ సెలబ్రిటీలకు చోటుదక్కింది. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మైనపు బొమ్మను ఇక్కడ మొదట ఏర్పాటుచేశారు. అమితాబ్‌ కోడలైన ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు కూడా మ్యూజియంలో చోటు దక్కింది. వీరితో పాటు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ల మైనపు బొమ్మలను ఇక్కడ ఏర్పాటుచేసి వారి అభిమానులను ఆకట్టుకున్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ బ్యాట్‌ ఎత్తి కనిపించే మైనపు బొమ్మ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక టుస్సాడ్స్ మ్యూజియంలో చేరిన చివరి ఇండియన్‌ సెలబ్రిటీ బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనాకపూర్‌.
సృష్టికి ప్రతిసృష్టిని తలపించేవిధంగా లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియం రూపుదిద్దుకుంది. మ్యూజియంలోని ప్రముఖుల మైనపు బొమ్మలను చూసి సందర్శకులందరూ విస్తుపోకుం డా ఉండలేరు. లండన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నేడు ఈ మ్యూజియం పేరు తెచ్చుకుంది. ప్రముఖుల మైనపు బొమ్మలను అద్భుతంగా రూపొందించి ఇక్కడ ఏర్పాటుచేశారు. జీవకళ ఉట్టిపడుతూ సజీవంగా గోచరించే ఆ విగ్రహ రూపాలను చూసినవారు చూపుతిప్పుకోకుండా ఉండలేరు.
రెండు శతాబ్దాల చరిత్ర...
టుస్సాడ్స్‌ మ్యూజియానికి చారిత్రక విశిష్టత ఉంది. 200 ‚సంవత్సరాల క్రితం ఏర్పాటైన మ్యూజియంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అప్ప ట్లో ఇంగ్లాండ్‌లో మేడమ్‌ టుస్సాడ్‌ ప్రముఖుల మైనపు బొమ్మలను తయా రుచేస్తుండేవారు. ఆమె తన మైనపు బొమ్మలను అన్ని ప్రాంతాల కూ తిరిగి ప్రదర్శించేవారు. 30 సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి విసిగిపోయిన మేడమ్‌ టుస్సాడ్‌ తన కళాఖండాలకు స్థిరంగా ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మేడమ్‌ టుస్సాడ్‌ మైనపు బొమ్మల మ్యూజియం ఏర్పాటైంది. 1835లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించగా అప్పటికి మేడమ్‌ టుస్సాడ్‌ వయసు 74 సంవత్సరాలు.
కొంతకాలం అనంతరం ఈ మ్యూజియం నిర్వహణ బాధ్యతలను తన కుమారులకు అప్పగించారు. అంతకుముందే మైనపు బొమ్మలను రూపొందించడంలో ఆమె పలువురికి శిక్షణనిచ్చారు. ఇక మరికొద్ది సంవత్సరాల్లో తాను మరణిస్తాననగా స్వయంగా తన మైనపు బొమ్మను ఆమె రూపొందించుకోవడం విశేషం. మ్యూజియంలో నేటికీ మేడమ్‌ టుస్సాడ్‌ మైనపు బొమ్మ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 1850 సంవత్సరంలో ఆమె తన ఆస్తినీ, మ్యూజియాన్ని కుమారులకు అప్పగించి తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత చాలా కాలం వరకు ఆమె కుమారులే దాని నిర్వహణ బాధ్యతలను చూశారు.
ఆకట్టుకునే వివిధ విభాగాలు...
టుస్సాడ్‌ మ్యూజియంలో సందర్శకులను ఆకట్టుకునే విభాగాలెన్నో ఉన్నాయి. వాటిలో చరిత్రలో చెప్పుకోదగ్గ ప్రముఖులను నిజంగా చూస్తున్నామా అనిపించే మైనపు మూర్తులు సందర్శకులను మైమరపిస్తాయి. వీటితో పాటు చరిత్రలో చెప్పుకోదగ్గ ముఖ్యమైన ఘట్టాలను కూడా మైనపు దృశ్యాలుగా ఇక్కడ చూడవచ్చు. మూడో రిచర్డ్‌, విక్టోరియా మహారాణి, ఇతర రాణులు, రాజుల ప్రతిమ లు, క్రీడాకారులు, సినీతారల మూర్తులు, చర్చిల్‌, గోర్బచె వ్‌ వంటి రాజకీయ నాయకుల శిల్పాలు మైనంతో రూపు దిద్దుకొని ఇక్కడ కనువిందుచేస్తాయి. మార్లిన్‌ మన్రో, ఎల్విన్‌ ప్రెస్లీ వంటి సెలబ్రిటీ రూపాలు ఇక్కడ మైనపు బొమ్మలు సందర్శకులను మురిపిస్తాయి. అగాధా క్రిస్టీలాంటి రచయిత్రితో పాటు ఇతర ప్రముఖ రచయిత లు ఇక్కడ కొలువు తీరి కనిపిస్తారు. 200 సంవత్సరాల క్రితం ఏర్పాటైన టుస్సాడ్స్ మ్యూజియంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నారుు. అప్పట్లో ఇంగ్లాండ్ లో మేడవ్గు టుస్సాడ్స్ప్రముఖుల మైనపు బొమ్మలను తయారుచేసి అన్ని ప్రాంతాలకూ తిరిగి వాటిని ప్రదర్శించేవారు. 30 సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి విసిగిపోరుున ఆమె చివరికి 1835లో తన పేరిట మ్యూజియాన్ని ప్రారంభించారు.
ప్రత్యేక ఆకర్షణగా...
టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది స్లీపింగ్‌ బ్యూటీ. 1765వ సంవత్సరానికి చెందిన ఫ్రాన్సు రాజు 15వ లూరుూ ప్రియురాలు మేడమ్‌ డుబా రీ విశాలమైన పట్టె మంచంలో పట్టు పరుపుల మీద సుందరమైన స్వప్నాలను దర్శిస్తూ నిద్రపోతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ మైనపు బొమ్మ ఛాతి పైకి కిందకి కదలడం వల్ల అది బొమ్మ కాదు మనిషే అని భ్రాంతికి గురవుతారు సందర్శకులు. దేశ,విదేశాలకు చెందిన పర్యాటకులు స్లీపిం గ్‌ బ్యూటీని తిలకించేందుకు ప్రత్యేకంగా టుస్సాడ్స్‌ మ్యూజియానికి విచ్చేస్తారు. ఈ బ్యూటీని తిలకించి మైనపు బొమ్మను తయారుచేసిన వారి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతారు.
కనువిందుచేసే ఇండియన్‌ సెలబ్రిటీలు...
వివిధ దేశాలకు చెందిన ఎందరో సెలబ్రిటీలు మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కనువిందు చేస్తారు. వీరి సరసన మన దేశానికి ప్రముఖ సెలబ్రిటీలను కూడా చేర్చి వారిని గౌరవించారు మ్యూజియం నిర్వాహకులు. ఇక మ్యూజియంలో మొదటిసారిగా ఏర్పాటుచేసిన ఇండియన్‌ సెలబ్రిటీ అమితాబ్‌ బచ్చన్‌. ాబిగ్‌ బి్ణగా పేరొందిన ఆయన మైనపు బొమ్మను మ్యూజియం లో ఏర్పాటుచేశారు. ఈ మ్యూజియంలో అమితాబ్‌ కోడలైన ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు కూడా చోటు దక్కింది. ఈ అందాలభామ మైనపు బొమ్మ ఇక్కడ కనువిందు చేస్తుంది. వీరితో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ల మైనపు బొమ్మలను ఇక్కడ ఏర్పాటుచేసి వారి అభిమా నులను ఆకట్టు కున్నారు. క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌గా పేరుగాంచిన సచిన్‌ టెండూల్కర్‌ బ్యాట్‌ ఎత్తి కనిపించే మైనపు బొమ్మ ఇక్క డ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మైనపు బొమ్మను సచిన్‌ తన భార్య అం జలి, కూతురు, కుమారుడుతో కలిసి సందర్శించి మైమర చిపోయారు. ఇక టుస్సాడ్‌ మ్యూజియంలో చేరిన చివరి ఇండియన్‌ సెలబ్రిటీ బాలీవుడ్‌ ముద్దు గుమ్మ కరీనాకపూర్‌. కొద్ది రోజుల క్రితం కరీనా మైన పు విగ్రహాన్ని మ్యూజియం లో ఏర్పాటుచేశారు. ఈ మ్యూజియానికి విచ్చేసిన కరీనా తన విగ్రహాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు. మ్యూజి యంలో మన దేశ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల విగ్రహాలను కూడా తిలకించవచ్చు. ఈ మైనపు బొమ్మల తయారీ కోసం వీరిద్దరూ కళాకారుల ఎదుట మోడల్స్‌గా కూర్చొని సహకరించడం విశేషం. అంతేకాదు తాము ధరించిన దుస్తులను మ్యూజియానికి సమర్పించగా వాటిని మైనపు బొమ్మలకు తొడిగారు.


అమెరికాలో అందమైన ప్రేమ కధ.....................


ధర్మపథ క్రియేషన్స్ అధినేత కె.రాజశేఖర్ అనగానే ‘గౌతమబుద్ధ’ చిత్రం మనకళ్లముందు సాక్షాత్కరిస్తుంది. గౌతమబుద్ధ అనగానే మనమందరం గర్వించే దృశ్యకావ్యం నిలుస్తుంది. ‘గౌతమబుద్ధ’ మనం గర్వించే దృశ్యకావ్యం కనుకనే ప్రభుత్వం కూడా మెచ్చి నంది అవార్డులను అందజేసింది. మహా పండితుడు సద్గురు శివానంద కుమారుడైన రాజశేఖర్ తండ్రి యొక్క ఉత్తమాభిరుచిని వంట పట్టించుకున్న వాడు గనుక రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా ‘గౌతమబుద్ధ’ను నిర్మించారు. డబ్బు సంపాదించిన వారు, కోట్లాది రూపాయల టర్నోవర్తో వ్యాపారాలను చేస్తున్నవారు చిత్రరంగాన, చిత్రరంగానికి అవతల ఎందరో ఉన్నారు. కానీ వారి దృష్టి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల వైపే ఉంటోంది. ధర్మపధ క్రియేషన్స్ అధినేత రాజశేఖర్ అమెరికాలో వ్యాపార రంగంలో ఎంతో బిజీమాన్ అయినప్పటికీ కళాభిరుచితో తన దృష్టిని చిత్రరంగం వైపు మళ్ళించి నిన్న ‘గౌతమబుద్ధ’ చిత్రాన్ని ఇవ్వాళ ‘మైహార్ట్ ఈజ్ బీటింగ్’ అనే చిత్రాన్ని నిర్మించారు. మొదటి చిత్రానికి రెండో చిత్రానికి కూడా డబ్బును లెక్క చేయలేదు. ఒక మంచి చిత్రాన్ని తీయాలి, అందరూ మెచ్చే చిత్రాన్ని తీయాలి. ఈ చిత్రం ద్వరా ప్రేక్షకులకు, యూత్ కు మొత్తం సమాజానికే చక్కని మెసేజ్ ఇవ్వాలి అన్న మంచి ఆలోచన ఉన్న నిర్మాత రాజశేఖర్ అందిస్తున్న ఈ రెండో చిత్రం విషయానికి వస్తే...
ప్రేమకు కూడా ఒక బాధ్యత ఉందని చెప్పే చిత్రం ఇది
‘మైహార్ట్ ఈజ్ బీటింగ్’ చిత్రం గురించి రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘ ‘మైహార్ట్ ఈజ్ బీటింగ్’ అనే చిత్రం మంచి ప్రేమకథా చిత్రం. యు.ఎస్.ఎ. బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా షూటింగ్ చేసుకొని వచ్చాం. నేను వ్యాపార రీత్యా అక్కడే ఉంటాను గనుక చిత్రాన్ని అక్కడే తీయటం జరిగింది. ఈ ప్రేమ కథా చిత్రం రొటీన్ గా వచ్చే ప్రేమ చిత్రంలా ఉండదు. ఇందులో ప్రేమ అనేదానికి ఒక బాధ్యత కూడా ఉండాలని చెప్పాం. యువతీ యువకులు నచ్చిన అమ్మాయిని లేదా నచ్చిన అబ్బాయిని ప్రేమించవచ్చు. అయితే ఆ ప్రేమ తల్లిదండ్రులకు బాథ కలిగించేదిగా ఉండకూడదు. ప్రేమ విషయంలో పిల్లలు తమ కుటుంబం పట్ల కూడ ఒక బాధ్యతను కలిగిఉండాలని చెప్పడమే ఈ చిత్రం యొక్క ఉద్దేశ్యం. ఇలా పిల్లలు - తల్లిదండ్రుల మధ్య జరిగే సన్నివేశాలను అందంగా మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు. చిత్రం చూస్తున్నంతసేపూ ఒక ఫీల్ కు గురవుతాము. ఇందులో రేవంత్, రాజిత నాయకా, నాయికలుగా నటించారు. వాళ్లిద్దరూ ప్రేక్షకుల చేత ప్రశంసలందుకునే విధంగా నటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఇద్దరు యువకులు దర్శకత్వం వహించారు. వాళ్లిద్దరూ అరుణ్ రుద్ర,, కిరణ్ మీగడ, వీళ్లు కూడా అనుభవజుల్లా చేశారు. ఈ చిత్రం ద్వరా అరుణ్, కిరణ్ లు మంచి పేరు తెచ్చుకుంటారనటంలో సందేహం లేదు.
నంది అవార్డును తెచ్చిపెట్టిన ‘గౌతమబుద్ధ’ ఎలాంటి అనుభూతిని తెచ్చింది?
‘‘మా తొలి చిత్రం ‘గౌతమబుద్ధ’ నాన్నగారి ఇష్టప్రకారం. ఆయన అభిరుచి మేరకు నిర్మించాను. ఫైనాన్షియల్ గా ఏమిటన్నది అలా ఉంచితే అనేక మంది ప్రేక్షకులు, మిత్రులు, శ్రేయోభిలాషుల నుండి ఎక్కువ ప్రశంసలందుకున్నాను. ఈ రోజుల్లో ‘గౌతమబుద్ధ’ సినిమా ఏమిటన్న వారు కూడా సినిమా చూశాక కంగ్రాట్ చేశారు. ముఖ్యంగా ఆ సినిమా విడుదలకు కాని, ఇతరత్రా కాని అప్పటి ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డిగారు, పెద్దలు డా. దాసరి నారాయణరావుగారు ఎంతో సహకరించి ప్రోత్సహించారు. ఆ విధంగా ‘గౌతమబుద్ధ’ నాకు మంచి అనుభూతిని కలిగించింది.
ఇక ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ చిత్రం విషయానికి వస్తే ఓ అందమైన మెసేజ్ ను మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఇంతకుముందు చెప్పినట్లు యూత్ ఫుల్ ఫిలిమ్ గా, మంచి ఫ్యామిలీ సినిమాగా రూపొందించాము. అలాగే ఈ నాటి ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ కూడా కావాల్పినంత ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నేను కూడా నటించాను.

తారల ఇళ్లల్లో మంగళవాయిద్యాలు.............


బాలీవుడ్ తారల ఇళ్లల్లో మంగళవాయిద్యాలు మారుమోగే సమయం వచ్చింది. ఈ ఏడాదిలో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. అయితే రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా పెళ్లి మాత్రం ఖరాయింది. వీరిద్దరూ వచ్చే నెల మూడున దంపతులు కాబోతున్నారు.
బ్యాండ్.. బాజా.. బారాత్... ప్రస్తుతం బాలీవుడ్ తారలు కొం దరు ఈ ఆలోచనలోనే ఉన్నారు. ఈ సంవత్సరం బాలీవుడ్‌లో కనీసం ఐదారు పెళ్లిళ్లయినా జరుగుతాయని అంటున్నారు. వీటిలో మొదటిది రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియాల పెళ్లి. ఎనిమిది సంవత్సరాలుగా సాగుతోన్న ఈ జంట ప్రేమాయణం త్వరలో పెళ్లిగా మారనుంది. ఏళ్ల్ల తరబడి ఓపికపట్టి రితేశ్ తన తండ్రి కేంద్రమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను ఒప్పించాడు. ఈ జంట ఫిబ్రవరి 3వ తేదీన ఒకటవనుంది. ప్రస్తుతం వీరు తమ పెళ్లి శుభలేఖలను అందజేయడాన్ని కూడా ఆరంభించారు. ఈ పెళ్లి వేడుకలు జనవరి 31న ప్రారంభమవుతున్నాయి.
పెళ్లి తేదీ ఇంకా నిశ్చయించకపోయినా మరో ఒకటి రెండు నెలల్లో ఒకటి కానున్న మరోజంట కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌లది. తన పెళ్లి తేదీని ఏజెంట్ వినోద్ సినిమా విడుదలతో ముడిపెట్టిన ఈ జంట మార్చిలో ఒక్కటి కావచ్చని అంటున్నారు. మరో జంట జాన్ అబ్రహా, ప్రియలు కూడా ఈ ఏడాది మనువాడే అవకాశాలున్నాయి. వీరి ప్రేమాయణం పెరైండు జంటలంతటి సుదీర్ఘమైనది కాకపోయినా బిపాసా బసుకు దూరమైన తరువాత జాన్ పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి జాన్ అబ్రహం, ప్రియ ఇప్పటికే అమెరికాలో పెళ్లి చేసుకున్నట్లు కూడా వదంతులు వినిపించాయి.
విద్యాబాలన్ పెళ్లి గురించి ముంబైలో చాలా కాలంగా చెప్పుకుంటున్నారు. విద్యాబాలన్, యూ టీవీ సీఈఓ సిద్దార్థరాయ్ కపూర్‌ల ప్రేమ వ్యవహారంపై కొంతకాలంగా కథనాలు కనిపిస్తున్నాయి. అయితే డర్టీ పిక్చర్‌తో చాలా కాలం తరువాత.. అది కూడా ఊహించనంతటి భారీ స్థాయిలో సక్సెస్ చవిచూసిన విద్యాబాలన్ పెళ్లి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అందుకే ఏ ప్రకటనా చేయకుండా అది తన వ్యక్తిగత వ్యవహారమని తప్పించుకుంటోంది. అయినప్పటికీ ఈ ఏడాది ఆఖరులోగా వీరిద్దరూ ఒకటి కావచ్చని అంటున్నారు.
ఈ సంవత్సరం పెళ్లితో ఒక్కటి కానున్న జంటల పేర్లలో రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య చాలాకాలంగా ప్రేమాయణం సాగుతోందని అంతా చెప్పుకుంటున్నప్పటికీ వీరిద్దరూ కలిసి ఒక్కసారి కూడా పబ్లిక్‌గా కనబడలేదు. ఈ మధ్యనే రాణి, ఆదిత్యలు కుటుంబ సమేతంగా విదేశాల్లో హాలిడే గడిపి తిరిగివ్త స్తుండగా ముంబై విమానాశ్రయంలో కనిపించారని అంటున్నారు. ఇంతకాలంగా ఒక్కసారి కూడా జంటగా బయట కనిపించని హఠాత్తుగా విమానాశ్రయంలో ప్రత్యక్షం కావడంతో సినీ మీడియాకు కావాల్సినంత మేత దొరికింది. ఈ ఏడాది వీళ్లు కూడా పెళ్లి చేసుకోవచ్చని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నటి ఇషా శర్వాణీ, క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా త్వరలో ఒక ఇంటివారు కాన్నుట్లు ఇటీవలే వార్తలొచ్చాయి.

Friday, January 13, 2012

బిజినెస్ మేన్' చిత్ర సమీక్ష ...................


                                          'బిజినెస్ మేన్' చిత్ర సమీక్ష     3/5

                             ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకం ఫై పూరి జగన్నాద్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
                            'ముంబాయిని మాఫియ రహిత నగరం గా మార్చామని'- ముంబాయి పోలీసు కమీషనర్ ప్రకటించిన రోజునే అక్కడ సూర్య అడుగు పెడతాడు.  ముంబాయిని ఉచ్చపోయిన్చడానికే వచ్చానని చెప్పుకునే సూర్య ఆ క్రమం లోనే ముందుకు సాగుతూ సూర్య భాయ్ గా ఎదుగుతాడు.  మరో పక్క పోలీసు కమీషనర్ కూతురినే ప్రేమలోకి దించుతాడు.  సమాజంలో పలుకు బడి పెరుగుతున్నా-  పోలీసులు తో పాటు సూర్య కు  ప్రత్యర్ధులు కూడా  పెరుగుతారు. వారిని ఎదుర్కొంటూ , మాఫియాని కార్పోరేటీకరిన్చాలనే  సూర్య తన కోరిక తీర్చుకోవడానికి ఏమి చేసాడనేదే  ఈసినిమా ...

                           ' పోకిరి' వంటి  పెద్ద  హిట్  కాంబి నేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో, పేరుకు తగ్గట్టే  బ్రహ్మాండమైన బిజినెస్ తో  విడుదలయ్యింది . అసలే ' దూకుడు' మీదున్న మహేష్ బాబు తో అభిమానుల ఆశల మేరకు సినిమా అందించడం అంత తేలిక కాదు.  పూర్తిగా  ఆసహజం, ఆచరణ సాధ్యం కాని కధనే తీసుకున్నా ... ప్రత్యేకం గా పెట్టే  కామెడీ వంటి  అనవసరమైన ఫార్ములా జోలికి పోకుండా ...సూటిగా చెప్పడం ద్వారా అయితే  పూరీ జగన్నాద్ ఈ చిత్రం లో విజయవంతం అయ్యాడు.  మహేష్ బాబు నటన,  పూరి మాటలు- టేకింగ్  , తమన్ సంగీతం ఈ చిత్రం లో హై లైట్స్ .  మాఫియా నేపధ్యం పాతదే అయినా  వేగం గా నడపడం వల్ల , సినిమాలో  వినోదం తగ్గిందనే  అసంతృప్తి  కలగా కుండా ...బోర్  లేకుండా చెయ్య గలిగారు. మహేష్ తో  నెగిటివ్  ఛాయలున్న రఫ్ఫ్  పాత్రను చాలా బాగా  చేయించారు. ఒక విధం గా  ఈ చిత్రం అంతా  మహేష్  వన్ మేన్ షో  అనే చెప్పాలి. బ్యాంకు నుండి పత్రాలు  దోపిడీ చేయడం, ఐ .టి దాడుల పేరుతో  ఎన్నికల ఫండ్ దొంగిలించడం, ఎన్నికలకోసం వేలకోట్లు ఇవ్వడం ...మొదలైన ఎన్నో అర్ధం లేని అంశాలు ఈ చిత్రం లో ఉన్నాయి. హీరో పనిగట్టుకుని  కమీషనర్ కూతుర్ని ట్రాప్ చెయ్యాలనుకోవడం , వారి మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత  వారి మధ్య వచ్చే సన్నివేశాలు అంత రక్తి కట్టలేదు. గట్టి విలన్ పాత్ర లేకపోవడం వల్ల , సినిమా క్లైమాక్స్ కూడా  అంత ఆసక్తికరంగా లేదు. 'యువత గొప్ప లక్ష్యం పెట్టుకోవాలి...దాన్ని సూటిగా సాధించేయాలి' -అంటూ దర్శకుడు  సినిమా చివరిలో  హీరో తో  ఇప్పించిన సందేశం వినడానికి బాగుంది. ఈ చిత్రం లో హీరో  సాధించిన విధం గా జరగాలంటే  సినిమాల్లోనే సాధ్యం. ఇంటర్వెల్ ముందు  గ్యాంగ్ ఫైటే చేస్తూ  హీరో హీరోయిన్ కంట బడటం' పోకిరి' ఇంటర్వెల్ సీన్ ని గుర్తు చేస్తుంది.

మహేష్ బాబు నటుడిగా ఈ చిత్రం లో మరింత పక్వమైన  నటన ప్రదర్శించాడు. మాన్లీగా కనిపిస్తూ , మంచి హావభావ ప్రకటనతో సంభాషణలు పలికి ఆకట్టుకున్నాడు.   కాజల్ పాత్ర,నటన గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. ఆమె తండ్రి పోలీసు కమీషనర్ గా నాజర్ , రాజకీయ నాయకులుగా ప్రకాష్ రాజ్, సయ్యాజి షిండే , రాజా మురద్ , ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, గణేష్, ధర్మవరపు,భరత్ రెడ్డి ,మాస్టర్ ఆకాష్  నటించారు. పూరి జగన్నాద్ అందించిన సంభాషణలు చాలా సినిమాల తర్వాత ఇందులో రొటీన్ కి భిన్నం గా, అర్ధవంతంగా, పవర్ ఫుల్ గా  వున్నాయి. తమన్ పాటల్లో ఒకటి పాత హిందీ ట్యూన్ , ఐటెం సాంగ్ కి వాడుతారనుకున్న ' సార్ వస్తారోస్తారా 'పాటను హీరో - హీరోయిన్ లతో చేసారు. ఈ పాట తో పాటు' చందమామ' పాట కూడా బాగా చిత్రీకరించారు. ఈ పాటలోహీరో - హీరోయిన్ ల సున్నితమైన  ముద్దు ముచ్చట ప్రేక్షకులకు బోనస్ . 'బ్యాడ్  బోయ్స్' పాటలో ముంబై నటి  శ్వేతా భరద్వాజ్ అందంగా  చేసింది.  అయితే సెన్సార్ 'బ్లర్' ల వల్ల  పూర్తిగా ఆస్వాదించ లేక పోయారు. నేపధ్య సంగీతం చాలా బాగుంది. విజయ్ ఫైట్స్,శ్యాం ఫోటో గ్రఫీ ,శేఖర్ ఎడిటింగ్ బాగున్నాయి.

Wednesday, January 11, 2012

Venkatesh Bodyguard Earns U Certificate.............

Victory Venkatesh Bodyguard film is set for a grand release on January 14 on the eve of Sankranti and as the release date is nearing by, the filmmakers have sent the Bodyguard first copy to censor Board. The regional censor Board members had awarded the film with Clean U certification.
Bodyguard is directed by Gopichand Malineni and produced by Bellamkonda Suresh on Sai Ganesh Productions banner. Thaman is the music director. Trisha played heroine role and Saloni, Prakash Raj, Ali played major roles.

Bodyguard is the remake of Malayalam hit with similar title and it has been already remade in all south languages apart from Bollywood. The film turned out as success in all the versions and hope it shows the same fate in Telugu too...