ధర్మపథ క్రియేషన్స్ అధినేత కె.రాజశేఖర్ అనగానే ‘గౌతమబుద్ధ’ చిత్రం
మనకళ్లముందు సాక్షాత్కరిస్తుంది. గౌతమబుద్ధ అనగానే మనమందరం గర్వించే
దృశ్యకావ్యం నిలుస్తుంది. ‘గౌతమబుద్ధ’ మనం గర్వించే దృశ్యకావ్యం కనుకనే
ప్రభుత్వం కూడా మెచ్చి నంది అవార్డులను అందజేసింది. మహా పండితుడు సద్గురు
శివానంద కుమారుడైన రాజశేఖర్ తండ్రి యొక్క ఉత్తమాభిరుచిని వంట పట్టించుకున్న
వాడు గనుక రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా ‘గౌతమబుద్ధ’ను నిర్మించారు.
డబ్బు సంపాదించిన వారు, కోట్లాది రూపాయల టర్నోవర్తో వ్యాపారాలను
చేస్తున్నవారు చిత్రరంగాన, చిత్రరంగానికి అవతల ఎందరో ఉన్నారు. కానీ వారి
దృష్టి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల వైపే ఉంటోంది. ధర్మపధ క్రియేషన్స్
అధినేత రాజశేఖర్ అమెరికాలో వ్యాపార రంగంలో ఎంతో బిజీమాన్ అయినప్పటికీ
కళాభిరుచితో తన దృష్టిని చిత్రరంగం వైపు మళ్ళించి నిన్న ‘గౌతమబుద్ధ’
చిత్రాన్ని ఇవ్వాళ ‘మైహార్ట్ ఈజ్ బీటింగ్’ అనే చిత్రాన్ని నిర్మించారు.
మొదటి చిత్రానికి రెండో చిత్రానికి కూడా డబ్బును లెక్క చేయలేదు. ఒక మంచి
చిత్రాన్ని తీయాలి, అందరూ మెచ్చే చిత్రాన్ని తీయాలి. ఈ చిత్రం ద్వరా
ప్రేక్షకులకు, యూత్ కు మొత్తం సమాజానికే చక్కని మెసేజ్ ఇవ్వాలి అన్న మంచి
ఆలోచన ఉన్న నిర్మాత రాజశేఖర్ అందిస్తున్న ఈ రెండో చిత్రం విషయానికి
వస్తే...
ప్రేమకు కూడా ఒక బాధ్యత ఉందని చెప్పే చిత్రం ఇది
‘మైహార్ట్ ఈజ్ బీటింగ్’ చిత్రం గురించి రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘ ‘మైహార్ట్ ఈజ్ బీటింగ్’ అనే చిత్రం మంచి ప్రేమకథా చిత్రం. యు.ఎస్.ఎ. బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా షూటింగ్ చేసుకొని వచ్చాం. నేను వ్యాపార రీత్యా అక్కడే ఉంటాను గనుక చిత్రాన్ని అక్కడే తీయటం జరిగింది. ఈ ప్రేమ కథా చిత్రం రొటీన్ గా వచ్చే ప్రేమ చిత్రంలా ఉండదు. ఇందులో ప్రేమ అనేదానికి ఒక బాధ్యత కూడా ఉండాలని చెప్పాం. యువతీ యువకులు నచ్చిన అమ్మాయిని లేదా నచ్చిన అబ్బాయిని ప్రేమించవచ్చు. అయితే ఆ ప్రేమ తల్లిదండ్రులకు బాథ కలిగించేదిగా ఉండకూడదు. ప్రేమ విషయంలో పిల్లలు తమ కుటుంబం పట్ల కూడ ఒక బాధ్యతను కలిగిఉండాలని చెప్పడమే ఈ చిత్రం యొక్క ఉద్దేశ్యం. ఇలా పిల్లలు - తల్లిదండ్రుల మధ్య జరిగే సన్నివేశాలను అందంగా మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు. చిత్రం చూస్తున్నంతసేపూ ఒక ఫీల్ కు గురవుతాము. ఇందులో రేవంత్, రాజిత నాయకా, నాయికలుగా నటించారు. వాళ్లిద్దరూ ప్రేక్షకుల చేత ప్రశంసలందుకునే విధంగా నటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఇద్దరు యువకులు దర్శకత్వం వహించారు. వాళ్లిద్దరూ అరుణ్ రుద్ర,, కిరణ్ మీగడ, వీళ్లు కూడా అనుభవజుల్లా చేశారు. ఈ చిత్రం ద్వరా అరుణ్, కిరణ్ లు మంచి పేరు తెచ్చుకుంటారనటంలో సందేహం లేదు.
నంది అవార్డును తెచ్చిపెట్టిన ‘గౌతమబుద్ధ’ ఎలాంటి అనుభూతిని తెచ్చింది?
‘‘మా తొలి చిత్రం ‘గౌతమబుద్ధ’ నాన్నగారి ఇష్టప్రకారం. ఆయన అభిరుచి మేరకు నిర్మించాను. ఫైనాన్షియల్ గా ఏమిటన్నది అలా ఉంచితే అనేక మంది ప్రేక్షకులు, మిత్రులు, శ్రేయోభిలాషుల నుండి ఎక్కువ ప్రశంసలందుకున్నాను. ఈ రోజుల్లో ‘గౌతమబుద్ధ’ సినిమా ఏమిటన్న వారు కూడా సినిమా చూశాక కంగ్రాట్ చేశారు. ముఖ్యంగా ఆ సినిమా విడుదలకు కాని, ఇతరత్రా కాని అప్పటి ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డిగారు, పెద్దలు డా. దాసరి నారాయణరావుగారు ఎంతో సహకరించి ప్రోత్సహించారు. ఆ విధంగా ‘గౌతమబుద్ధ’ నాకు మంచి అనుభూతిని కలిగించింది.
ఇక ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ చిత్రం విషయానికి వస్తే ఓ అందమైన మెసేజ్ ను మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఇంతకుముందు చెప్పినట్లు యూత్ ఫుల్ ఫిలిమ్ గా, మంచి ఫ్యామిలీ సినిమాగా రూపొందించాము. అలాగే ఈ నాటి ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ కూడా కావాల్పినంత ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నేను కూడా నటించాను.

No comments:
Post a Comment