బాలీవుడ్ తారల ఇళ్లల్లో మంగళవాయిద్యాలు మారుమోగే సమయం వచ్చింది. ఈ ఏడాదిలో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకునే
అవకాశాలున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. అయితే రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా పెళ్లి మాత్రం ఖరాయింది. వీరిద్దరూ వచ్చే
నెల మూడున దంపతులు కాబోతున్నారు.
బ్యాండ్.. బాజా.. బారాత్... ప్రస్తుతం బాలీవుడ్ తారలు కొం దరు ఈ ఆలోచనలోనే ఉన్నారు. ఈ సంవత్సరం బాలీవుడ్‌లో కనీసం ఐదారు పెళ్లిళ్లయినా జరుగుతాయని అంటున్నారు. వీటిలో మొదటిది రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియాల పెళ్లి. ఎనిమిది సంవత్సరాలుగా సాగుతోన్న ఈ జంట ప్రేమాయణం త్వరలో పెళ్లిగా మారనుంది. ఏళ్ల్ల తరబడి ఓపికపట్టి రితేశ్ తన తండ్రి కేంద్రమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను ఒప్పించాడు. ఈ జంట ఫిబ్రవరి 3వ తేదీన ఒకటవనుంది. ప్రస్తుతం వీరు తమ పెళ్లి శుభలేఖలను అందజేయడాన్ని కూడా ఆరంభించారు. ఈ పెళ్లి వేడుకలు జనవరి 31న ప్రారంభమవుతున్నాయి.
పెళ్లి తేదీ ఇంకా నిశ్చయించకపోయినా మరో ఒకటి రెండు నెలల్లో ఒకటి కానున్న మరోజంట కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌లది. తన పెళ్లి తేదీని ఏజెంట్ వినోద్ సినిమా విడుదలతో ముడిపెట్టిన ఈ జంట మార్చిలో ఒక్కటి కావచ్చని అంటున్నారు. మరో జంట జాన్ అబ్రహా, ప్రియలు కూడా ఈ ఏడాది మనువాడే అవకాశాలున్నాయి. వీరి ప్రేమాయణం పెరైండు జంటలంతటి సుదీర్ఘమైనది కాకపోయినా బిపాసా బసుకు దూరమైన తరువాత జాన్ పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి జాన్ అబ్రహం, ప్రియ ఇప్పటికే అమెరికాలో పెళ్లి చేసుకున్నట్లు కూడా వదంతులు వినిపించాయి.
విద్యాబాలన్ పెళ్లి గురించి ముంబైలో చాలా కాలంగా చెప్పుకుంటున్నారు. విద్యాబాలన్, యూ టీవీ సీఈఓ సిద్దార్థరాయ్ కపూర్‌ల ప్రేమ వ్యవహారంపై కొంతకాలంగా కథనాలు కనిపిస్తున్నాయి. అయితే డర్టీ పిక్చర్‌తో చాలా కాలం తరువాత.. అది కూడా ఊహించనంతటి భారీ స్థాయిలో సక్సెస్ చవిచూసిన విద్యాబాలన్ పెళ్లి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అందుకే ఏ ప్రకటనా చేయకుండా అది తన వ్యక్తిగత వ్యవహారమని తప్పించుకుంటోంది. అయినప్పటికీ ఈ ఏడాది ఆఖరులోగా వీరిద్దరూ ఒకటి కావచ్చని అంటున్నారు.
ఈ సంవత్సరం పెళ్లితో ఒక్కటి కానున్న జంటల పేర్లలో రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య చాలాకాలంగా ప్రేమాయణం సాగుతోందని అంతా చెప్పుకుంటున్నప్పటికీ వీరిద్దరూ కలిసి ఒక్కసారి కూడా పబ్లిక్‌గా కనబడలేదు. ఈ మధ్యనే రాణి, ఆదిత్యలు కుటుంబ సమేతంగా విదేశాల్లో హాలిడే గడిపి తిరిగివ్త స్తుండగా ముంబై విమానాశ్రయంలో కనిపించారని అంటున్నారు. ఇంతకాలంగా ఒక్కసారి కూడా జంటగా బయట కనిపించని హఠాత్తుగా విమానాశ్రయంలో ప్రత్యక్షం కావడంతో సినీ మీడియాకు కావాల్సినంత మేత దొరికింది. ఈ ఏడాది వీళ్లు కూడా పెళ్లి చేసుకోవచ్చని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నటి ఇషా శర్వాణీ, క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా త్వరలో ఒక ఇంటివారు కాన్నుట్లు ఇటీవలే వార్తలొచ్చాయి.

No comments:
Post a Comment