Friday, June 29, 2012

ఆగస్టులో బాలకృష్ణ ఫ్యాన్స్ కు పండగ...............

Balakrishna Srimannarayana Release Aug
బాలకృష్ణ తాజా చిత్రం ‘శ్రీమన్నారాయణ' ఓవర్ సీస్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ రెడీ అవుతోంది. ఈ చిత్రం ఆడియోను జూలై నెలాఖరున చేసి,రిలీజ్ ని ఆగస్టు రెండో వారంలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రబాస్ చిత్రం రెబెల్ కు క్లాష్ కాకుండా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. రెబెల్ కూడా ఆగస్టులోనే విడుదల కానుంది. ఆగస్టు 15న రిలీజ్ ఉండవచ్చుని వినిపిస్తోంది.
ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై బాలకృష్ణ కథానాయకుడిగా రవికుమార్ చావలి దర్శకత్వంలో ‘మిరపకాయ్' నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ... ‘మలేషియాలో తీసిన ఫైట్, సాంగ్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ఈ షెడ్యూల్‌లో చేసిన వర్క్ ‘శ్రీమన్నారాయణ'కు హైలెట్‌ అవుతుంది. బాలకృష్ణతో శ్రీమన్నారాయణ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు అభిమానులు బాలయ్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు ‘శ్రీమన్నారాయణ'లో ఉంటాయి అన్నారు.
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

రామ్ చరణ్ కి వినాయిక్ సెంటిమెంట్ కలిసొస్తుందా?

Will Vinayak Sentiment Work Cherry

రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి వినాయిక్ చెర్రీ అనే టైటిల్ ని పెట్టాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. చెర్రి అనేది రామ్ చరణ్ ముద్దు పేరు. గతంలోనూ అల్లు అర్జున్ ముద్దు పేరు అయిన బన్నిని సినిమాకి పెట్టి సూపర్ హిట్ కొట్టారు. దాంతో ఈ సారి అదే సెంటిమెంట్ తో అదే రూట్ లో వెళ్తున్నట్లుగా చెప్తున్నారు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వాలైంటైన్స్ డే సందర్బంగా విడుదల చేసారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ క్రిందటి నెలలో వివాహానికి ముందు రెగ్యులర్ గా జరిగింది. అక్కడ రామ్ చరణ్ మీద ఫైట్ సీక్వెన్స్ లను చిత్రీకరించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మాచో లుక్ తో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని వినాయిక్ చెప్తున్నారు.
ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో నిలబడిపోయే చిత్రమని అంటున్నారు. ఆకుల శివ కధ అందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చే కుమారుడుగా కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఈ చిత్రం కాక జంజీర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రం షూటింగ్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. వినాయిక్.. అల్లు అర్జున్ తో చేసిన బద్రీనాధ్ తర్వాత రూపొందిస్తున్న చిత్రం ఇదే.

Wednesday, June 27, 2012

పూరీకి పవన్ కళ్యాణ్ స్ట్రిక్టు కండీషన్స్ .........

Pawan S Strict Conditions Puri Jagannath
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'ని పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విషయంలో పవన్ స్ట్రిక్టుగా పూరీ కి కండీషన్స్ పెట్టాడని వినికిడి. ముఖ్యంగా పూరి జగన్నాధ్ రెగ్యులర్ సినిమాల్లో ఉండే వల్గారిటి డైలాగులు,హీరోయిన్స్ ఎక్సపోజింగ్ ఈ చిత్రంలో కుదరదని ముందే చెప్పినట్లు సమాచారం. తన స్టైల్ ప్రకారం సీన్స్ చేయలే కానీ పూరీ రెగ్యులర్ హీరో క్యారెక్టరైజేషన్ ని తనపై రుద్దకూడదని చెప్పినట్లు చెప్తున్నారు.
ఇక సెట్స్ పైన కూడా డైలాగుల్లో చాలా మార్పులు చేయిస్తున్నాడని,ఎక్కడా అశ్లీలం ద్వనించినా వెంటనే తీసేయిస్తున్నాడని,తన సినిమాలలో అవి ఉండకూడదని ఖచ్చితంగా చెప్పి ఎడిట్ చేయిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దాంతో పూరీ కి కొంత ఇబ్బంది ఎదురైనా తప్పటం లేదని అంటున్నారు. అలాగే అలీ కామెడీ ట్రాక్ కూడా వల్గారిటీ లేకుండా చూడమని మరీ మరీ చెప్పినట్లు సమాచారం.
తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.
ఇందులో పవర్‌స్టార్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు.
ఇక ఈ చిత్రానికి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు

బ్యానర్ : యూనివర్సల్ మీడియా
నటీనటులు:పవన్ కళ్యాణ్,కాజల్ అగర్వాల్,ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

ప్రముఖ హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్, దర్శకురాలు మృతి.........


Acclaimed Screenwriter Nora Ephron Dead At 71

Sunday, June 24, 2012

307 సెంటర్లతో రికార్డు సృష్టించబోతున్న ‘గబ్బర్ సింగ్’.............


పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది. అంచనాలకు మించిన కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈచిత్రం మెగా అభిమానుల దాహాన్ని తీర్చింది.
gabbar singh 50 days 307 centers
ప్రస్తుతం గబ్బర్ సింగ్ చిత్రం విజయవంతంగా 6 వారాలు పూర్తి చేసుకుని 7వ వారంలోకి అడుగుపెట్టి 50 రోజుల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లో రికార్డులు బద్దలు కొట్టిన గబ్బర్ సింగ్ మరో బిగ్గెస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకోబోతోంది. హయ్యెస్ట్ థియేటర్స్(301)లో 50 రోజులు పూర్తి చేసకున్న మగధీర ఇప్పటి వరకు నెం.1 స్థానంలో ఉండగా....గబ్బర్ సింగ్ చిత్రం తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టబోతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ‘గబ్బర్ సింగ్' ప్రస్తుతం 307 థియేటర్లలో రన్ అవుతోంది. ఇవే థియేటర్లు 50 రోజులు పూర్తయ్యే వరకు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గబ్బర్ సింగ్ ఓవర్సీస్‌లో ఏ తెలుగు సినిమా కూడా సాధించలేని సూపర్ కలెక్షన్స్ రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్

దేవుడు చేసిన..'ఆడియోకి పవన్ ఎందుకు రాలేదు?

Why Pawan Didn T Attend Dcm Audio Function

రవితేజ, ఇలియానా జంటతో దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు'ఆడియో మొన్న శుక్రవారం రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఈ పంక్షన్ కి పవన్ కళ్యాణ్ వస్తాడని రూమర్ వచ్చింది. కొన్ని మీడియా ఛానెల్స్ కూడా దీన్ని సపోర్టు చేస్తూ న్యూస్ లు ప్రసారం చేసాయి. దాంతో పవన్ అబిమానులంతా ఆశించారు. పూరి తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ హీరోగా చేస్తున్నారు కాబట్టి వస్తాడని భావించారు. పవన్ అభిమానులు కూడా చాలా మంది ఈ పంక్షన్ కి హాజరయ్యారు.
అయితే పూరీ ..పవన్ ని ఆహ్వానించాడని కానీ పవన్ పూర్తిగా బిజీగా ఉండటంతో రాలేకపోవాడని సమాచారం. గత మూడు రోజులుగా నైట్ ఎఫెక్టు లు ఫైట్ సీక్వెన్స్ లు షూట్ జరుగుతూండటంతో పవన్ రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా అప్పుటికే ఒక రోజు ఫ్యాన్స్ విపరీతంగా సారధి స్టూడియోకు రావటంతో డిస్ట్రబ్ అయ్యి లేటైంది. ఆడియో రోజు కూడా లేటైతే దాని ఎఫెక్టు చివరలో రిలీజ్ ముందు పడుతుందని భావించిన పూరీ కూడా పట్టుబట్టలేదని తెలుస్తోంది.
సినిమా ఆడియో సీడీలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాపై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శిల్పకళావేదికలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆడియో సీడీలతో పాటు థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు.
రఘు కుంచె మాట్లాడుతూ " అందరూ దేవుడు చేసిన మనుషులే. నేను మాత్రం పూరి చేసిన మనిషిని. నాకు నారుపోసి, నీరు పెట్టింది పూరీనే. అతనికి ఫ్రెండ్‌గా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఇందులోని పాటలు రాయడానికి భాస్కరభట్ల ఎంత వేదనపడ్డాడో ప్రత్యక్షంగా చూశా. తప్పకుండా ఈ పాటలు అందర్నీ అలరిస్తాయి'' అని తెలిపారు.

Friday, June 22, 2012

దర్శకుడు త్రివిక్రమ్‌ టెన్షన్.. టెన్షన్!...


Trivikram Feel Tension
టాప్ దర్శకులు రాజమళి, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి వాళ్ల దగ్గర నుంచి చిన్నా చితకా దర్శకుల వరకు తాము తీసే చిత్ర్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే ఆశతోనే మొదలు పెడతారు. అయితే అన్ని సార్లు వాళ్లు అంచనాలను చేరుకోలేదు. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు, సూపర్ హిట్ అవుతాయనే నమ్మకం ఉన్న కాన్సెప్టులు, కథలు చాలా సందర్భాల్లో బాక్సాఫీసు వద్ద బొల్తా పడుతూ ఉంటాయి.
దర్శకుడు త్రివిక్రమ్ విషయానికొస్తే...మంచి టాలెంట్ ఉన్న మాటల రచయితగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ అదే కాన్ఫిడెన్స్‌తో దర్శకత్వంలోకి దిగారు. తన మాటల మాయతో, మంచి స్క్రీన్ ప్లేతో సినిమాను నెగ్గుకురాగల సత్తా ఉన్నోడని పేరు తెచ్చుకున్నాడు. పవన్ జల్సా చిత్రం త్రివిక్రమ్ రేంజి పెంచింది.
అయితే అన్ని సార్లు విజయం మనవెంటే ఉండదు. త్రివిక్రమ్ గత సినిమా ‘ఖలేజా' పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఆ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ తాజాగా ‘జులాయి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంత గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ సినిమా ఏ రేంజిలో ఉంటుందో అని సినీ జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ దర్శకుడికైనా పరీక్షా కాలమే. దీంతో సినిమా భవిష్యత్ ఏమిటో అని చాలా టెన్షన్ గా ఉన్నాడట త్రివిక్రమ్.
అల్లు అర్జున్, ఇలియాన జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జులాయి' చిత్రాన్ని జులై 13న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఈచిత్రానికి సంబంధించిన ప్లాటినమ్ డిస్క్ వేడుకను జులైన 8న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.

పాచిక పారలేదు(‘శకుని’రివ్యూ)............

తెలుగులో స్ట్రెయిట్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సెటిలవ్వాలనే తమిళ హీరో కార్తీ పాచిక ‘శకుని'చిత్రంతో పారేటట్లు కనపడటం లేదు. అతని గత చిత్రాలు 'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ'తరహాలో ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ కూడా యావరేజ్ మూవీ గా సెటిల్ అయ్యేటట్లు కనపడుతోంది. ఫస్టాఫ్ బాగానే నడిచినా కీలకమైన సెకండాఫ్ పూర్తిగా పొలిటికల్ సీన్స్ తో నిండిపోయి...హీరోయిన్ కి ఒక్క సీన్ కూడా లేకుండా పోవటం పెద్ద మైనస్ గా మారింది. అయినా హీరో సైడి కిక్ సంతానం పంచ్ లు,కార్తీ నటన సినిమాను చివరి వరకూ కూర్చో బెడతాయి. అలాగే మహేష్ బిజినెస్ మ్యాన్ కథనం ని కూడా ఈ సినిమా గుర్తు చేయటం మరో విశేషం.

karthi s sakuni review

ప్రాణంగా భావించే ఇల్లు మెట్రో రైలు సబ్ వే కానస్ట్రక్షన్ లో అక్రమంగా పోతోందని ఆపటానికి హైదరాబాద్ వస్తాడు కాకినాడ కుర్రాడు కమల్‌ (కార్తి). అయితే ముఖ్యమంత్రి (ప్రకాష్‌రాజ్‌)స్వయంగా కాంట్రాక్ట్ తీసుకున్నాడని తెలుసుకుని షాక్ అవతాడు. దాంతో ఏం చెయ్యలేని పరిస్ధితుల్లో ముఖ్యమంత్రితో తగువుపడతాడు. అక్కడ నుంచి తన దైన శైలిలో పాచికలు కదిపి రాజకీయ చదరంగం ఆడతాడు. ఆ క్రమంలో అతను ఏ విధమైన పరిస్దితులుని ఎదుర్కున్నాడు. ఎలా ఎత్తుకు పై ఎత్తులు వేసి తలపండిన రాజకీయనాయకులను సైతం మట్టికరిపించాడు అనేది మిగతా కథ. అలాగే ఈ జర్నీలో అతని మరదలు శ్రీదేవి (ప్రణీత)తో ప్రేమ ప్రయాణం పెట్టుకుంటాడు. అది ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

కార్తీకి తెలుగు నాట ఉన్న క్రేజ్ ఏమిటన్నది ఈ చిత్రం హౌస్ ఫుల్ ఓపినింగ్స్ మరో సారి తెలియచేసాయి. అయితే కథలో గ్రిప్ లేకుండా కేవలం సీన్స్ తో కాలక్షేపం చేయటం ఈ సినిమాకు ముప్పు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా అసలు కథలోకి ఇంటర్వెల్ దాకా రాడు. ఫస్టాఫ్ మొత్తం కథకు కొద్దిగా కూడా సంభందం లేని హీరోయిన్ తో లవ్ సీన్స్ నడిపి...సెకండాఫ్ లో అసలు హీరోయిన్ ప్రస్దావన లేకుండా చేసారు. అలాగే సెకండాఫ్ లో రిలీఫ్ కోసమన్నా ఆమెను తీసుకురాలేదు. ఈ విభజన సరిగ్గా ఉంటే బాగుండేది. సెంకండాఫ్ మొత్తం మహేష్ బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని గుర్తు చేస్తూ కధనం నడుస్తుంది. ఎక్కడో ఫైనల్ ట్విస్ట్ దాకా రాష్ట్రాన్ని శాసింతే దుర్మాడైన ముఖ్యమంత్రి ఓ సామాన్యడుని ఏమీ చేయలేక కేవలం తలపట్టుకు కూర్చుంటం విచిత్రమనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కమిడియన్ సంతానం తన పంచ్ లతో చిత్రాన్ని నిలబెట్టాడని చెప్పాలి. అలాగే కార్తీ ఎప్పటిలాగే చాలా ఈజ్ తో పాత్రలో పరకాయప్రవేశం చేసి ఆకట్టుకుంటాడు. హీరోయిన్ ప్రణీత చేయటానికి ఏమీలేదు. ఉన్న కాసేపు పెద్దగా ఆకట్టుకోలేదు. సీనియర్స్ రాధిక,కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్,నాజర్ తమ తమ పరిధుల్లో బాగా చేసారు. అయితే రాదిక,నాజర్ ఎపిసోడ్స్ స్క్రీన్ టైమ్ ఫిలప్ చెయ్యటానకి తప్ప కథను ముందుకు నడపవు. కెమెరా,ఎడిటింగ్ చాలా బాగున్నాయి. సంగీతం యావరేజ్ గా ఉంది.
ఫైనల్ గా ప్రతీ డబ్బింగ్ చిత్రం గొప్పగా ఉండదు అనే పాఠం మరోసారి ఈ చిత్రం చెబుతుంది. అలాగే మంచి కాన్సెప్టు సరైన కథనం లేకపోతే ఎలా డెల్యూట్ అవుతుందో ఈ సినిమా నిరూపిస్తుంది. ఓవరాల్ గా ఎక్కువ ఎక్సపెకేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఫరవాలేదనిపిస్తుంది.

ప్రభాస్ సినిమా ‘శాటిలైట్’ రికార్డు................

ఈమధ్య కాలంలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి సినిమాకు శాటిలైట్ హక్కుల రూపంలో భారీ మొత్తం అందుతోంది. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే చెప్పేక్కర్లేదు. కోట్లకు కోట్లు ఆఫర్ చేస్తున్నాయి మన టీవీ చానెల్స్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘రెబెల్’ సినిమా కూడా ఈ శాటిలైట్ రైట్స్ విషయంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది.
ఈ సినిమా టీవీ ప్రసార హక్కుల్ని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ 5 కోట్ల 75 లక్షలు వెచ్చించి దక్కించుకున్నట్టు టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇది ఓ రికార్డనే చెప్పచ్చు. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్ సరసన ఇందులో తమన్నా, దీక్షా సేథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Thursday, June 21, 2012

7 ఏళ్ల తర్వాత రవితేజ, దేవిశ్రీ కాంబినేషన్.....................

 Ravi Teja Devi Sri Prasad Combination Ater 7 Years
 దాదాపు 7 సంవత్సరాత తర్వాత మాస్ మహారాజ్ రవితేజ, మాస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, భద్ర చిత్రాలు అప్పట్లో మ్యూజికల్‌గా మంచి విజయం సాధించాయి. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోంది. ‘సార్ వస్తారా' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన కాజల్, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై 1 నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో మాస్ మసాలా సాంగులు రిపీట్ అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.
రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందబోతోంది. యాక్షన్ తో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్స్ హై టెక్నిక్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దానికి తగిన విధంగా దేవిశ్రీ బాణీలు సమకూర్చనున్నారు.
దేవిశ్రీ ఇటీవల సంగీతం అందించిన గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ హీరోగా వస్తున్న బాలీవుడ్ మూవీ జంజీర్ చిత్రానికి కూడా దేవిశ్రీ మ్యూజిక్ అందించబోతున్నాడు. అతను మ్యూజిక్ అందించి ‘జులాయి' చిత్రం ఆడియో విడుదలై విజయవంతం అయింది.


‘ఈగ‌’ ఏమౌతుందో అని రాజమౌళి ఆందోళన!................


ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘ఈగ' చిత్రం జులై 6న విడుదలకు సిద్దం అవుతోంది. అప్పుడెప్పుడో విడుదల చేస్తానని చెప్పిన వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రేక్షకులకు చికాకు తెప్పించిన రాజమౌళి చిత్రం ఆలస్యానికి కారణం ఏమిటో ప్రతి రోజు ప్రోగ్రెస్ రిపోర్టు ప్రేక్షకులు వివరిస్తూ....ఇంకా ఇన్ని గ్రాఫిక్ షాట్స్ పూర్తి కావాల్సి ఉందంటూ నచ్చ చెబుతూ ప్రేక్షకుల్లో ఈగ చిత్రంపై మళ్లీ ఆసక్తి పెంచేలా అష్ట కష్టాలు పడుతున్నారు.
rajamouli dubs eega

ఈగ చిత్రం స్టోరీ ఇప్పటికే స్వయంగా లీక్ చేసిన రాజమౌళి ఇప్పుడు అంతర్మథనంలో పడ్డట్లు ఆయన తపన బట్టి స్పష్టం అవుతోంది. సినిమా స్టోరీ చెప్పడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. కేవలం గ్రాఫిక్స్ చూడ్డం కోసమే వెళ్లాలా? అనే అనే ఆలోచనలో ఉన్నారు చాలా మంది. అయితే రాజమౌళి మాత్రం తన టేకింగ్, గ్రాఫిక్స్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన గ్రాఫిక్స్ రాజమౌళి ప్రేక్షకులకు చూపించబోతున్నారనేది మాత్రం నిజం. ఇందు కోసం ఆయన చాలా కష్టపడుతున్నారనేది ప్రోగ్రెస్ రిపోర్టు చూస్తే స్పష్టం అవుతోంది. అన్నట్లు ఈచిత్రంలో ‘ఈగ'కు డబ్బింగ్ రాజమౌళి స్వయంగా చెబుతున్నారు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో ఈచిత్రం రూపొందుతోంది. కీరవాణి సంగీతం అందించిన ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటి ఇండియాలో నిర్మితమైన అద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రాల్లో ‘ఈగ' కూడా చోటు దక్కించుకోనుంది. ఇందుకోసం కోట్ల రూపాయల ఖర్చుతో అందుకు సంబంధించి ఎఫెక్ట్స్ చేయిస్తున్నారు. సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకమైన కెమెరాలు వాడారు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు.........................

సీతమ్మ వాకిట్లో...'పై ప్రకాష్ రాజ్ ట్వీట్.............

వెంకటేష్‌, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తండ్రిగా కీ రోల్ ని చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో పబ్లిసిటీ ప్రారంభించారు. రీసెంట్ గా ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ...రామోజి ఫిల్మ్ సిటీలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'సెట్లో ఉన్నాను. మహేష్,వెంకటేష్,శ్రీకాంత్ అడ్డాల,దిల్ రాజు,గుహన్ వీళ్లంతా సినిమాలో ప్రతీ మూవ్ మెంట్ ని చాలా ప్రేమిస్తూ పనిచేస్తున్నారు. వండ్రపుల్ గా సినిమాని తీర్చి దిద్దుతున్నారని ట్వీట్ చేసారు.
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.
అలాగే ...''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ ఎవరి బతుకులు వాళ్లు బతికేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా నాన్న దగ్గర చేసిన వాగ్ధానం కోసం ఆ అన్నదమ్ములు ఏం చేశారో తెర మీదే చూడాలంటున్నారు దిల్‌ రాజు. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'...అలాగే మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఇదో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది అన్నారు . వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా చేస్తున్నారు. సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌................

షాకిస్తున్న ‘కెమెరామెన్ గంగతో...’ సెట్ ఖరీదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెత్‌తో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
జూన్ 15న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అమీర్ పేటలోని సారథి స్టూడియోలో ప్రారంభం అయింది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం సారథి స్టూడియోలో వేసిన సెట్ కోసం నిర్మాత దాదాపు రూ. 3 కోట్ల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్‌కు ఉన్న స్టామినాపై నమ్మకంతో నిర్మాత సెట్ కోసం అంత మొత్తం వెచ్చించినట్లు చర్చించుకుంటున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. తమన్నా పోషించబోయే పాత్ర పేరు గంగ. పూరి మార్కు డైలాగులు, స్ర్కీన్ ప్లేతో పవర్ స్టార్ మేనరిజానికి తగిన విధంగా పూర్తి ఎంటర్‌టైన్మెంట్స్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ఉంటుంది.
అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి......................