పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో
నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం
వహిస్తున్న ఈచిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి
దానయ్య భారీ బడ్జెత్‌తో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
జూన్ 15న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అమీర్ పేటలోని సారథి స్టూడియోలో ప్రారంభం అయింది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం సారథి స్టూడియోలో వేసిన సెట్ కోసం నిర్మాత దాదాపు రూ. 3 కోట్ల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్‌కు ఉన్న స్టామినాపై నమ్మకంతో నిర్మాత సెట్ కోసం అంత మొత్తం వెచ్చించినట్లు చర్చించుకుంటున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. తమన్నా పోషించబోయే పాత్ర పేరు గంగ. పూరి మార్కు డైలాగులు, స్ర్కీన్ ప్లేతో పవర్ స్టార్ మేనరిజానికి తగిన విధంగా పూర్తి ఎంటర్‌టైన్మెంట్స్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ఉంటుంది.
అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి......................

No comments:
Post a Comment