ప్రభాస్ సినిమా ‘శాటిలైట్’ రికార్డు................
ఈమధ్య
కాలంలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి సినిమాకు శాటిలైట్
హక్కుల రూపంలో భారీ మొత్తం అందుతోంది. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే
చెప్పేక్కర్లేదు. కోట్లకు కోట్లు ఆఫర్ చేస్తున్నాయి మన టీవీ చానెల్స్. ఈ
నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘రెబెల్’ సినిమా కూడా ఈ శాటిలైట్
రైట్స్ విషయంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది.
ఈ సినిమా టీవీ ప్రసార హక్కుల్ని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ 5 కోట్ల 75
లక్షలు వెచ్చించి దక్కించుకున్నట్టు టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.
ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇది ఓ రికార్డనే చెప్పచ్చు. లారెన్స్
దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్ సరసన ఇందులో తమన్నా, దీక్షా సేథ్
కథానాయికలుగా నటిస్తున్నారు.
No comments:
Post a Comment