Monday, September 3, 2012

రాణాపై త్రిష సంచలన వ్యాఖ్యలు.....

Rana Was Special My My Life
దగ్గుబాటి యువ హీరో రాణా, త్రిష మధ్య సంథింగ్ సంథింగ్ మ్యాటర్ నడుస్తోందని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నసంగతి తెలిసిందే. అయితే అటు త్రిషతో పాటు రాణా కూడా ఈ వార్తలను ఖండించారు. అయితే రాణాతో ఉన్న సంబంధంపై త్రిష తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

"రానాతో నేను పంచుకోలేని విషయం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నాకు సంబంధించిన ప్రతి సంగతీ రాణాకు తెలుసు...రాణాది అర్థం చేసుకునే మనస్తత్వం. తన వాళ్లను అతనెంతో జాగ్రత్తగా చూసుకుంటాడు, తన జీవితంలో రాణాకు ప్రత్యేకమైన స్థానం ఉంది' ఉంది అంటూ జనాల్లో అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది త్రిష.
"రాణా నాకు ఎంతో మంచి మిత్రుడు. దాదాపు పదేళ్ల నుంచీ మేం ఒకరికొకరం తెలుసు. మేం ఇరుగుపొరుగు ఇళ్ల వాళ్లం కూడా. మా మధ్య ప్రేమ, పెళ్లి లాంటి ఏమీ లేవు. నేను దాపరికం లేకుండా ఉంటానని మీకు తెలుసు కదా. ప్రస్తుతానికి ఎవరితోనూ ప్రేమ, పెళ్లి వంటివి లేవు'' అని మరోసారి తెగేసి చెప్పింది.

రాణాతో సంబంధం లేదంటూనే...త్రిష ఇలా మాట్లాడుతుండటంతో ఎక్కడో తేడా కొడుతుందని, భవిష్యత్‌లో వీరు ప్లేటు ఫిరాయించినా ఆశ్చర్య పడక్కర్లేదని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో చాలా మంది సీని జంటలు మొదట ఇలానే బుకాయించి ఆ తర్వాత జనాలకు షాకిస్తూ కలిసిన సందర్భాలున్నాయని గుర్తు చేస్తున్నారు. మరి రాణా-త్రిష ఆ బాపతేనా? కాదా? అనేది త్వరలోనే బయటపడుతుంది.

No comments:

Post a Comment