ఈ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ...‘పవన్ కళ్యాణ్ మా ఫంక్షన్‌కు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కెరీర్లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. శ్రీకృష్ణ దేవరాయలు, దొరబాబుగా ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తారు. రాయలవారి గెటప్‌లో ఆయన చాలా హుందాగా ఉన్నారు. షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ తదితర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం డీటీఎస్ వర్క్ కు సిద్ధం అవుతున్నాం. చక్రి సంగీతం ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల ద్వితీర్థంలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు.
100 సినిమాల హీరో శ్రీకాంత్ శ్రీకృష్ణదేవరాయలుగానూ, విలేజ్‌లో దొరబాబుగానూ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘దేవరాయ'. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ 'నాని నాకు మూడు కథలు చెప్పారు. అందులో ఈ కథ నచ్చి నాకూ ప్లస్ అవుతుందని అంగీకరించాను. చెప్పినట్లు బాగానే తీశాడు. ఇందులో దేవరాయగా, దొరబాబుగా రెండు పాత్రలు పోషించాను. ఒకరకంగా చెప్పాలంటే ఇష్టపడి, ఒల్లు దగ్గర పెట్టుకుని పనిచేశాను.
No comments:
Post a Comment