Sunday, September 2, 2012

ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో నాకు తెలుసు : పూరీ........

 


 ''ఇన్నేళ్ల విరామం తరవాత మళ్లీ పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో నాకు తెలుసు. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. రాంబాబు పాత్రలో కొత్త పవన్‌ని చూస్తారు. మణిశర్మ అందించిన బాణీలు బాగున్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు పూరీ జగన్నాధ్. పూరీ జగన్నాధ్,పవన్ కళ్యాణ్ తో... ప్రస్తుతం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'గా సిద్ధమవుతున్నారు. ఆదివారం పవన్‌కల్యాన్‌ జన్మదినం. ఈ సందర్భంగా పూరీ ఇలా స్పందించారు.

'బద్రి' తరవాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబరు 18న విడుదల చేయాలనుకొన్నారు. కానీ ఇప్పుడు వారం రోజుల ముందే.. అంటే అక్టోబరు 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అత్యంత వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కి మణిశర్మ స్వరపరిచిన పాటలను ఈ నెలలోనే విడుదల చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో పవర్‌ఫుల్ జర్నలిస్ట్‌గా పవన్ కనిపించనున్నారు. శక్తివంతమైన కథాంశంతో, పూర్తి ఎంటర్‌టైనర్‌గా పూరిజగన్నాథ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని దానయ్య తెలిపారు. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో తీపి జ్ఞాపకంగా నిలిచిపోయే సినిమా ఇది అవుతుందని పూరిజగన్నాథ్ చెబుతున్నారు.'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.
ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం....

No comments:

Post a Comment