కమల్‌హాసన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ కావటం లేదు. దానికి కారణం డిస్ట్రిబ్యూటర్స్ కరువు అని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తయారుకావటంతో ఈ సినిమాకు ఎక్కువ రేట్లు చెప్తున్నారని అందుకే బిజినెస్ కావటంలేదని చెన్నై వర్గాలు సమాచారం. బిజినెస్ మొదలైన వెంటనే రిలీజ్ డేట్ అపీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు.
ఈ చిత్రాన్ని హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసి కమల్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్ బిర్జూ మహారాజ్ దగ్గర కథక్ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు శేఖర్ కపూర్ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ స్వరాలు సమకూర్చారు.
అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాహల్ బోస్ ని విలన్ గా కనిపించనున్నారు. సమీరా రెడ్డిని హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ చిత్రమే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.....
No comments:
Post a Comment