పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారా? సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించబోతున్నారా? అంటే అవుననే గాసిప్స్ వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్లో...
‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో సదరు ప్రొడక్షన్ హౌస్ మొదలవ్వనుందని చర్చించుకుంటున్నారు. దీని ద్వారా టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంతో పాటు చిన్న, భారీ బడ్జెట్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారటన పవర్ స్టార్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో. ఎంత టాప్ హీరో అయినా.... కొన్నాళ్ల వరకు మాత్రమే. అన్నయ్య చిరంజీవి లాగా వయసు పైబడ్డాక సినిమాల నుంచి తప్పుకోక తప్పదు. అయితే రాజకీయాలంటే ఇంట్రస్టులేని పవన్ కళ్యాణ్ భవిష్యత్‍లో సినీ నిర్మాణ రంగంలో రాణించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. అదే విధంగా దర్శకత్వంపై కూడా దృష్టి పెట్టనున్నాడట.
No comments:
Post a Comment