Thursday, December 6, 2012

'బాద్‌షా'లో ఎన్టీఆర్ క్యారక్టరైజేషన్ కేక


Badshah Shoot At Shamshabad
ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజధానిలో షూటింగ్ జరుగుతోంది. శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.ఈ సందర్బంగా కలిసిన మీడియాతో శ్రీను వైట్ల మాట్లాడారు.

చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గురించి శ్రీనువైట్ల చెప్తూ...అతనొక్కడే. కానీ ఓ సైన్యం నడిచొస్తున్నట్టుంటుంది. చాలా తక్కువ మాట్లాడతాడు.. కానీ ప్రతి మాటా ఓ మిస్సైల్‌లా దూసుకొస్తుంది. ఒక్కసారే మాటిస్తాడు... ప్రాణం ఉన్నంత వరకూ దానికి కట్టుబడి ఉంటాడు. అందుకే... అతను 'బాద్‌షా' అయ్యాడు. ఇంతకీ అతని గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు శ్రీను వైట్ల.

''పేరుకి తగ్గట్టే.. శక్తిమంతమైన కథ ఇది. ఎన్టీఆర్‌ని ఇది వరకెప్పుడూ చూడని కోణంలో చూపిస్తున్నాం. పాత్ర తీరే కాదు.. ఆయన గెటప్‌ కూడా సరికొత్తగా ఉంటుంది''అని నిర్మాత తెలిపారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు.

థాయ్‌ భాషలో రాజమౌళి 'ఈగ'

Rajamouli Eega Be Released Thai Version
'ఈగ'త్వరలో ధాయ్ లాండ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఈగ' తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు విదేశాలకీ ఎగరబోతోంది. థాయ్‌ భాషలోకి 'ఈగ' చిత్రాన్ని అనువదించబోతున్నారని సమాచారం. థాయ్‌లాండ్‌ దేశవాసులూ సినీప్రియులే కావటంతో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు.

భారత సంస్కృతికి దగ్గరగా ఉంటాయి వారి పద్ధతులు, అభిరుచులు. 'ఈగ'లోని సాంకేతిక మాయాజాలంతోపాటు ఆత్మ మరో ప్రాణిలోకి ప్రవేశించడం లాంటి అంశాలు థాయ్‌లాండ్‌ వాసులకు నచ్చుతాయనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. భారత చిత్రసీమ ఇన్నాళ్లూ ఆ దేశాన్ని షూటింగులకు అనువైన ప్రాంతంగా మాత్రమే భావించింది. ఇక థాయ్‌లాండ్‌ని ఓ మార్కెట్‌గా మలచుకోబోతున్నారు. ఆ దేశానికి చెందిన కొందరు ఎగ్జిబిటర్లు ఇప్పటికే పలువురు హిందీ నిర్మాతలతో ఒప్పందాలు చేసుకున్నారు... అనువాద హక్కుల కోసం. వచ్చే యేడాది నుంచి భారతీయ చిత్రాలు థాయ్‌లోకి అనువాదం కాబోతున్నాయన్న మాట.

నో ఫంక్షన్ : రిలీజైన ‘సారొచ్చారు’ ఆడియో

మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘సారొచ్చారు' ఆడియో ఎలాంటి హడావుడి, ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజైంది. ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. రవితేజ ఇమేజ్ కు తగిన విధంగా ఈచిత్రంలో దేవిశ్రీ మాస్ బీట్లతో పాటు, వినసొంపైన మొలోడీలను కంపోజ్ చేసాడు.
sarocharu audio released directly into the market
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్ వివరాలు
1. మేడ్ ఫర్ ఈచ్ అదర్
2. జగదేక వీరా
3. రచ్చ రంబోలా...
4. గుస గుస
5. కాటుక కళ్లు

Wednesday, December 5, 2012

రాజమౌళితో చేయాలని ఉంది :- అక్షయ్ కుమార్

Akshay Kumar Wants Rajamouli
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘కిలాడీ 786' షూటింగులో బిజీగా గడుపుతున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన అక్షయ్ కుమార్ ఇక్కడ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నాడు. ఈచిత్రం భిన్నంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా సౌత్ సినిమా స్టాండర్డ్స్‌పై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు అక్షయ్ కుమార్ స్పందిస్తూ...‘సౌత్ సినిమాలపై నేను సీరియస్ గా దృష్టి పెడుతున్నాను. నా సినిమాల్లో చాలా వరకు సౌతిండియా దర్శకులు తీసిన సినిమాలకు రీమేకే. వారు చాలా ప్రతిభా వంతులు. సౌతిండియా సినీ పరిశ్రమలో పని చేసిన వారు బాలీవుడ్ ఇంటస్ట్రీలో పని చేయడానికి ఆసక్తి చూపితే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. నాకు రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఉంది, కానీ అది కుదురుతుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను' అంటూ అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ లో నటించబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్టయిన ‘తుపాకి' చిత్ర రీమేకులో చేయబోతున్నాడు. కథాపరంగా ఇది ముంబయిలో జరిగే అంశం కావడంతో హీరో అక్షయ్‌కుమార్‌ హిందీలో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విపుల్‌షా నిర్మాతగా తెరకెక్కనుంది. మురగదాస్ దర్సకత్వం వహిస్తారు.

Latest Info ప్రభాస్ ‘మిర్చి’

Prabhas Mirchi Shooting Wrapped Up Dec 11
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘మిర్చి' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగుకు సంబంధించిన పని దాదాపుగా అయిపోయినట్లే. మరో వారం రోజుల్లో షూటింగ్ వర్క్ మొత్తం పూర్తి కానుందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం. రేపటి నుంచి ఓ సాంగుతో పాటు మిగిలి ఉన్న కొన్ని సీన్లను షూట్ చేయనున్నారు.

యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
గతంలో ఈచిత్రాన్ని డిసెంబర్లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నిర్మాతలు, ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా థియేటర్ల సమస్య కారణంగా ‘మిర్చి' ఫిబ్రవరి 8న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Thursday, September 6, 2012

‘షిరిడి సాయి’ రివ్యూ..........





అన్నమయ్యతో ఊహించని విజయాన్నందుకున్న నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి.. అదే కోవలో శ్రీరామదాసును తెచ్చి, మరో విజయాన్నందుకున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన మరో ఆధ్యాత్మిక చిత్రం ‘షిరిడి సాయి’. తొలి రెండు సినిమాలైతే మనకు కొంచెం కొత్తే. దీనికి తోడు దర్శకేంద్రుడు.. తనదైన గ్లామర్, ఎంటర్టైన్మెంట్ టచ్ ఇచ్చి.. ఆ సినిమాల్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్దారు. ఐతే తాజా చిత్రం మాత్రం ఆ రెండింటికీ భిన్నమైంది. అక్కడ భక్తుడు ప్రధాన పాత్రధారి అయతే ఇక్కడ దైవానిది ముఖ్య పాత్ర. కాబట్టి మసాలాలు అద్దే అవకాశం లేదు. అందులోనూ ఇది అందరికీ తెలిసిన కథ. ఇప్పటికే సాయి నేపథ్యంలో సినిమాలు కూడా వచ్చాయి. ఇన్ని పరిమితుల మధ్య తయారైన ‘షిరిడి సాయి’ ప్రేక్షకుల్ని మెప్పించిందా..? చూద్దాం!

కథ గురించి చెప్పాల్సిన కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ తెలిసిందే. సాయి పుట్టుక నుంచి మరణం వరకు ఆయన జీవితాన్ని చూపించారు. ఇలాంటి సినిమా తీయాలన్న ప్రయత్నం మెచ్చదగిందే. ఐతే పైన చెప్పుకున్న పరిమితుల మధ్య ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దితే తప్ప ప్రేక్షకులకు ఎక్కదు. ఈ విషయంలో చిత్ర బృందం కొంతమేరకు విజయవంతమైంది. సినిమా ప్రథమార్ధంలో బాబా మహిమల మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. ద్వితీయార్ధంలో సాయితత్వాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు.  ఐతే అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలో విభిన్నమైన సన్నివేశాలు చూపించడానికి ఇందులో ఎక్కువ అవకాశం లేకపోయింది. భక్తి విషయాన్ని పక్కనబెడితే.. సాయి తత్వాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో రాఘవేంద్రరావు సఫలమయ్యారు. టైటిల్స్ సమయంలో సాయి జన్మ వృత్తాంతాన్ని బొమ్మల రూపంలో చెప్పడం.. ఆ సందర్భంగా వచ్చే పాట ఆకట్టుకుంటాయి. గతలో వచ్చిన సాయి సినిమాలకు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు చేశారు. శ్రీహరి పాత్ర ఆ ఉద్దేశంతో తెచ్చిందే. ఐతే ఆ పాత్ర పండలేదు. శ్రీహరి ఏమాత్రం ఆ పాత్రకు సూటవలేదు. ఆరంభంలో ఆంగ్లంలో డైలాగులు చెప్పే శ్రీహరి పాత్ర.. చివర్లో స్లాంగ్ కూడా మార్చకుండా అచ్చతెలుగులో మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. షాయాజి షిండే పాత్రను విలన్ లా ప్రొజెక్ట్ చేయాలని చూశారు కానీ.. అతనికి ఏదో ఒక దశలో జ్నానోదయం అవుతుందని ముందే అర్థమవతుంది. ఐతే కావాలనే అతని పాత్రను చివరిదాకా పొడిగించారు. షాయాజి పాత్ర ద్వారా కాస్త వినోదం పండిద్దామన్న ప్రయత్నం చేశారు కానీ.. అదేం ఫలితాన్నివ్వలేదు. ప్రథమార్ధం సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ కు ముందొచ్చే శ్రీరామనవమి-ఉరుసు సన్నివేశం బావుంది. క్లైమాక్స్ లో నాగ్ ను చూస్తే అన్నమయ్య గుర్తొస్తుంది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. రాఘవేంద్రరావు తన ప్రత్యేకత అంతా ఇక్కడే చూపారు. ఐతే అంతకుముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని తగ్గిస్తాయి. బాలసాయిగా చేసిన కుర్రాడు ఆకట్టుకోలేదు. నటీనటుల మేకప్ విషయంలో శ్రద్ధ వహించలేదు. బాలసాయి పెద్దవాడై తిరిగి వచ్చే సమయానికి ముసలావిడ మేకప్ మార్చారు కానీ.. శరత్ బాబు మాత్రం అంతకు ముందులాగే ఉంటాడు. కమలిని కూడా తొలి సన్నివేశంలో ఓ మేకప్ తో ఉంటుంది.. తర్వాతి సన్నివేశంలో మరోలా ఉంటుంది. ఇవి చిన్న విషయాలే కావచ్చు. వీటిని పట్టించుకోకుంటే ప్రేక్షకుడు సినిమాలో లీనం కాలేడు.

రాఘవేంద్రరావు మునుపటి స్థాయిలో మాయ చేయలేకపోయారు కానీ ఉన్న పరిమితుల్లోనే ‘శిరిడి సాయి’ని బాగానే తీశారు. కొన్పి సన్నివేశాల్లో ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. పాటల చిత్రీకరణ.. అందులోనూ మొదటి పాట ‘ఒక్కడే దేవుడు’ పాట చిత్రీకరణ బాగుంది. ఖర్చుకు వెనుకాడకుండా మంచి ప్రయత్నం చేసిన నిర్మాత మహేష్ రెడ్డిని అభినందించాలి. సినిమాను నిలబెట్టడానికి కీరవాణి శాయశక్తులా ప్రయత్నించారు. ఆయన సంగీతమే సినిమాకు ప్రధాన ఆకర్షణ.  స్కోర్ తీసి చూస్తే.. సన్నివేశాలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కడే దేవుడు, నీ పాదముల.. పాటలు ఆకట్టుకుంటాయి.  ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ తీసి చూస్తే.. సన్నివేశాలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కడే దేవుడు, నీ పాదముల.. పాటలు బాగా ఆకట్టుకుంటాయి. పరుచూరి బ్రదర్స్ మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. నువ్వు తినడం ప్రకృతి, పక్కవాడిది దోచుకు తినడం వికృతి, నువ్వు తింటూ పక్కవాడికి పెట్టడం సంస్కృతి.. అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి డైలాగులు మరికొన్ని ఉన్నాయి.

అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రల్లో ఒదిగిపోయిన నాగార్జున సాయి పాత్రలోనూ ఆకట్టుకున్నారు.ఆరంభంలో సాయి పాత్రలో నాగ్ ను చూడగానే మామూలుగా అనిపిస్తారు. సినిమా సాగే కొద్దీ పరిణతి కనిపిస్తుంది. సన్నివేశాలు సాగే కొద్దీ సాయి దేవుడిలా మారుతున్న భావన కలిగిస్తాడు నాగ్. పతాక సన్నివేశంలో మళ్లీ అన్నమయ్య, శ్రీరామదాసులను గుర్తుకు తెచ్చారు. ఐతే కొన్నిచోట్ల ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు సూటవలేదు. పతాక సన్నివేశంలో, మరికొన్ని సన్నివేశాల్లో చక్కగా అభినయించిన నాగ్.. కొన్నిచోట్ల మాత్రం ఇబ్బందిగా కనిపించారు. పాత్ర హావభావాల విషయంలో యూనిఫార్మిటీ మెయింటైన్ చేయలేకపోయారు. బహుశా దర్శకుడి సూచన మేరకు అలా చేశారేమో. మూడు రోజుల పాటు తాను పైలోకానికి వెళ్లొస్తానని చెప్పే సన్నివేశంలో నాగ్ నటన అంతగా ఆకట్టుకోలేదు. అన్నీ తెలిసిన దేవుడు.. అంత ఉద్వేగానికి ఎందుకు గురవుతాడో అర్థం కాదు. పరిణతితో కనిపించాల్సిన సాయి పాత్ర అంత ఉద్వేగానికి లోనవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐతే ఓవరాల్ గా నాగ్ సాయిబాబా పాత్రలో మెప్పించారు. దాసుగణంగా శ్రీకాంత్, నానావతిగా సాయికుమార్, సుందరీబాయిగా కమలిని, సెహన్ షాగా శరత్ బాబు ఆకట్టుకున్నారు.

మొత్తంగా చూస్తే శిరిడి సాయి నిరాశ పరచదు. ఈ కాలంలో ఇలాంటి సినిమాలు రావడం గొప్ప విషయం. రొటీన్ మాస్ సినిమాల మధ్య ‘శిరిడి సాయి’ ఉపశమనాన్నిచ్చేదే. ఐతే అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల రోజులు వేరు. లాంగ్ రన్ లో సినిమాలు నిలబడ్డాయి. కానీ ఇప్పుడంతా ఒకట్రెండు వారాల్లో తేలిపోయే వ్యవహారం. కాబట్టి పోటీని తట్టుకుని ‘షిరిడి సాయి’ నిలబడుతుందా లేదో చూడాలి........

Tuesday, September 4, 2012

వర్మ ‘భూత్ రిటర్న్స్’ ఫస్ట్‌లుక్.....

ఈ మద్య వరస గొడవలతో వివాదాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మకు ఎప్పుడు ఒకలాగే ఉండటం అసలు నచ్చదు. ప్రచారం కోసం అనవసరపు వివాదాలు సృష్టించి ఆ తరవాత అప్పలరాజు, దొంగల ముఠా వంటి సినిమాలు తీసి జనాలను ఫూల్స్ ను చేసిన వర్మ ఇప్పుడు కొద్దిగా మార్పు కోసం సినీ జనాలను భయపెట్టే ప్రయత్నాల్లో పడ్డాడు. గతంలో తాను రూపొందించిన ‘భూత్'కు సీక్వెల్‌గా ‘భూత్ రిటర్న్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

ram gopal varma bhoot returns first poster out


తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టరే ఇలా భయపెడుతుంటే సినిమా ఎలా ఉంటుందో? అక్టోబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 3డి ఫార్మాట్‌లో దీన్ని రూపొందించారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా...ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈ చిత్రాన్ని విడుదచేస్తున్నారు. రామ్ గోపాల్ కెరీర్లోనే ఇది ఫస్ట్ 3డి సినిమా.

నిన్నటి తరం కథానాయిక మనీషా కోయిరాలా ఇందులో తల్లి పాత్ర పోషించగా, ఆరేళ్ళ అలయ్న అనే పాప కీలక పాత్ర పోషించింది. ఈ కథ వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, వీరిద్దరే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు. జేడీ చక్రవర్తి మరో పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'భూత్ రిటర్న్స్ హర్రర్ మూవీ. బూత్ సినిమా మిమ్మల్ని భయపెడితే.., భూత్ రిటర్న్స్ మిమ్మల్ని చంపేస్తుంది' అని అంటున్నాడు వర్మ. వివాదాలతో చేసిన ప్రయోగాలూ కాసులు రాల్చవనే ఉద్దేశానికి వచ్చి తిరిగి తన పాత ఫార్ములానే నెత్తి కెత్తు కుంటున్న వర్మ ఈ సినిమాతో ఎంత వరకు సఫలీకృతం అవుతాడో వేచి చూడాలి.

శ్రీకాంత్ సినిమా ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్......

Pawan Kalyan Launch Devaraya Audio
శ్రీకాంత్, విదీష, మీనాక్షి దీక్షిత్ కాంబినేషన్లో నాని కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవరాయ'. నానిగాడి సినిమా సమర్పణలో సన్ రే ఇంటర్నేషనల్ పతాకంపై కిరణ్ జక్కం శెట్టి, నాని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 12న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పాటలను ఆవిష్కరించనున్నారు.

ఈ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ...‘పవన్ కళ్యాణ్ మా ఫంక్షన్‌కు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కెరీర్లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. శ్రీకృష్ణ దేవరాయలు, దొరబాబుగా ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తారు. రాయలవారి గెటప్‌లో ఆయన చాలా హుందాగా ఉన్నారు. షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ తదితర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం డీటీఎస్ వర్క్ కు సిద్ధం అవుతున్నాం. చక్రి సంగీతం ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల ద్వితీర్థంలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు.
100 సినిమాల హీరో శ్రీకాంత్‌ శ్రీకృష్ణదేవరాయలుగానూ, విలేజ్‌లో దొరబాబుగానూ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘దేవరాయ'. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ 'నాని నాకు మూడు కథలు చెప్పారు. అందులో ఈ కథ నచ్చి నాకూ ప్లస్‌ అవుతుందని అంగీకరించాను. చెప్పినట్లు బాగానే తీశాడు. ఇందులో దేవరాయగా, దొరబాబుగా రెండు పాత్రలు పోషించాను. ఒకరకంగా చెప్పాలంటే ఇష్టపడి, ఒల్లు దగ్గర పెట్టుకుని పనిచేశాను.

మహేష్ సినిమాలో దేవిశ్రీ ఎక్స్‌పర్మెంట్......

 


మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్‌తో తొలి సినిమా కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.

ఇందులో ఓ సాంగుపై దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్‌పర్మెంట్ మొదలు పెట్టాడు. దీని గురించి తన మైక్రో బ్లాగింగ్ సైట్లో ప్రస్తావిస్తూ...‘మహేష్ బాబు, సుకుమార్ సినిమాకు సంథింగ్ స్పెషల్‌గా రాడికల్లీ డిఫరెంట్‌గా ట్యూన్స్ ట్రై చేస్తున్నాను. ఇది తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా ఉండబోతోంది. కొత్తదనాన్ని ఆడియన్స్ స్వాగతిస్తారని తన నమ్మకం' అంటూ పేర్కొన్నారు.

సుకుమార్ తన వరుస సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ప్రిపర్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య, ఆర్య2, జగడం, 100% లవ్ చిత్రాలకు దేవిశ్రీనే స్వరాలు సమకూర్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమాకు దేవిశ్రీ అందించే అందించే సంగీతంపై కూడా మంచి అంచనాలున్నాయి....


కమల్‌ 'విశ్వరూపం'లేటుకి కారణమేంటి?

 


కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ కావటం లేదు. దానికి కారణం డిస్ట్రిబ్యూటర్స్ కరువు అని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తయారుకావటంతో ఈ సినిమాకు ఎక్కువ రేట్లు చెప్తున్నారని అందుకే బిజినెస్ కావటంలేదని చెన్నై వర్గాలు సమాచారం. బిజినెస్ మొదలైన వెంటనే రిలీజ్ డేట్ అపీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు.

ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసి కమల్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్‌ బిర్జూ మహారాజ్‌ దగ్గర కథక్‌ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు శేఖర్‌ కపూర్‌ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చారు.

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాహల్ బోస్ ని విలన్ గా కనిపించనున్నారు. సమీరా రెడ్డిని హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ చిత్రమే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.....


పవన్‌పై ఆవి రూమర్లే......

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మూడో సెటప్ పెట్టారని, తీన్ మార్‌లో నటించిన రష్యన్ భామ డానా మార్క్స్‌తో డేటింగ్ చేస్తున్నారని, వీరు ఇద్దరు అమ్మానాన్నలు కూడా అయ్యారని నిన్న టీవీ ఛానల్స్, నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలను మేం ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇవన్నీ వట్టి రూమర్లే అని తేలి పోయింది.

డానా మర్క్స్‌కు ఇప్పటికే కాల్విన్ మాస్సన్ అనే వ్యక్తితో మే 5, 2012లో పెళ్లయిందని... ప్రస్తుతం వారు కలిసే ఉంటున్నారని స్పష్టమవుతోంది. అయితే డానా మాత్రం గర్భవతి కాలేదని వాళ్ల రిలేషన్ షిప్ ఫోటోలు చూస్తే స్పష్టమవుతోంది. ఎలాంటి ఆధారం లేకుండానే కేవలం పుకార్లను బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్‌పై ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.... పవన్ కళ్యాణ్‌కి పోటీ‌గా టాలీవుడ్లో రాణిస్తున్న ఓ స్మార్ట్ స్టార్ హీరోకు సంబంధించిన అభిమాని రవి పవన్ కళ్యాణ్ ఇలాంటి రూమర్లు స్ర్పెడ్ కావడానికి కారణం అయ్యారని తెలుస్తోంది. అతని సోషల్ నెట్వర్కింగ్ లోని మెసేజ్‌లను పరిశీలించిన పవన్ అభిమానులు అతనిపై కేసు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా... పవనిజం అంటూ అభిమానిస్తున్న తమ హీరోపై ఉమనిజం అంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై నిజాలు నిగ్గు తేలడంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Monday, September 3, 2012

రామ్ చరణ్ ‘నాయక్’ స్టోరీ ?...

 


మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘నాయక్' చిత్రం స్టోరీ లైన్ లీకైనట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నవిషయం తెలిసిందే. స్టోరీ వివరాల్లోకి వెళితే....

రామ్ చరణ్... రామ్, చెర్రీగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. వీరిలో రామ్ మాస్ అయితే...చెర్రీ క్లాస్. రామ్ గొడవల్లో తలదూరుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కొందరిని హత్య చేస్తాడని తెలుస్తోంది. రామ్ చేసిన హత్యలకు అదే పోలికలో ఉన్న చెర్రీ పోలీసులు అరెస్ట్ చేస్తారట.

ఇంటర్వల్‌లో ట్విస్ట్ .. ఈ కేసులో చెర్రీను కోర్టులో ప్రవేశపెట్టి వాదోపవాదాలు విన్న తరువాత చెర్రీకు జడ్జీ శిక్ష విధిస్తుండగా రామ్ ఏంట్రీ ఇస్తాడని...రామ్ తనే ఈ హత్యలన్నీ చేశానని ఈ హత్యలతో చెర్రీకు ఏ సంబంధం లేదని ఒప్పుకుని లొంగిపోతాడట. ఇక సెకండాఫ్‌లో రామ్ ఆ హత్యలు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరిస్తాడని అంటున్నారు.

ఇలా చిత్రం సీన్‌ టు సీన్ ట్విస్ట్‌లతో వివి వినాయక్ భారీ రేంజ్లో తెరకెక్కించాడట. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికిఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో.. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్ చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు.


రాణాపై త్రిష సంచలన వ్యాఖ్యలు.....

Rana Was Special My My Life
దగ్గుబాటి యువ హీరో రాణా, త్రిష మధ్య సంథింగ్ సంథింగ్ మ్యాటర్ నడుస్తోందని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నసంగతి తెలిసిందే. అయితే అటు త్రిషతో పాటు రాణా కూడా ఈ వార్తలను ఖండించారు. అయితే రాణాతో ఉన్న సంబంధంపై త్రిష తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

"రానాతో నేను పంచుకోలేని విషయం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నాకు సంబంధించిన ప్రతి సంగతీ రాణాకు తెలుసు...రాణాది అర్థం చేసుకునే మనస్తత్వం. తన వాళ్లను అతనెంతో జాగ్రత్తగా చూసుకుంటాడు, తన జీవితంలో రాణాకు ప్రత్యేకమైన స్థానం ఉంది' ఉంది అంటూ జనాల్లో అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది త్రిష.
"రాణా నాకు ఎంతో మంచి మిత్రుడు. దాదాపు పదేళ్ల నుంచీ మేం ఒకరికొకరం తెలుసు. మేం ఇరుగుపొరుగు ఇళ్ల వాళ్లం కూడా. మా మధ్య ప్రేమ, పెళ్లి లాంటి ఏమీ లేవు. నేను దాపరికం లేకుండా ఉంటానని మీకు తెలుసు కదా. ప్రస్తుతానికి ఎవరితోనూ ప్రేమ, పెళ్లి వంటివి లేవు'' అని మరోసారి తెగేసి చెప్పింది.

రాణాతో సంబంధం లేదంటూనే...త్రిష ఇలా మాట్లాడుతుండటంతో ఎక్కడో తేడా కొడుతుందని, భవిష్యత్‌లో వీరు ప్లేటు ఫిరాయించినా ఆశ్చర్య పడక్కర్లేదని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో చాలా మంది సీని జంటలు మొదట ఇలానే బుకాయించి ఆ తర్వాత జనాలకు షాకిస్తూ కలిసిన సందర్భాలున్నాయని గుర్తు చేస్తున్నారు. మరి రాణా-త్రిష ఆ బాపతేనా? కాదా? అనేది త్వరలోనే బయటపడుతుంది.

అమె పవన్ తొ వుంతె ఇతనెవరు? ....

 
 


Sunday, September 2, 2012

ఐటం సాంగ్ కోసం ప్రెంచ్ గెడ్డం సగం తీసేసా:నాగ్.....

Charmi Sizzle As Sakkubai
నాగార్జున తన తాజా చిత్రం లవ్ స్టోరీ కోసం ప్రెంచ్ గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన తన గెడ్డం సగం తీసేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే చెపుతూ...తాజాగా ఛార్మి కోసం చేసిన సక్కుబాయి ఐటం సాంగ్ కోసం నా గడ్డం సగం తీసేయాల్సి వచ్చింది. నేను మళ్లీ త్వరగా పెంచాలి. ఎందుకంటే దశరధ్ తో చేస్తున్న రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీలో పాత్రకు ఈ గడ్డం ఉండాలి అన్నారు. ఇక ఢమురకం చిత్రంలో సక్కుబాయి పాట వస్తుంది.

లక్ష్మిరాయ్ ని అనుకున్న తర్వాత అనుకోకుండా సీన్ లోకి వచ్చేసి ఛార్మి ఈ పాట ఛాన్స్ ని కొట్టేసింది. అన్నపూర్ణ వేసిన సెట్ లో ఈ పాటను చాలా లావిష్ గా తీసారు. ఈ విషయమై ఛార్మి చాలా ఆనందంగా ఉంది. ఆమె ఈ పాటకు చెందిన ఫోటోలను ట్విట్టర్ లో ఉంచి తన హ్యాపీనెస్ ని తెలియచేసింది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ జరుగుతుంది. మరో మూడు,నాలుగు రోజుల్లో ఈ పాట పూర్తి కానుంది. ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ,అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.

ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ....‘నా కెరీర్లోనే మొదటి సారి ఇలాంటి ఫాంటసీ మూవీ చేస్తున్నాను. హై టెక్నికల్ వేల్యూస్‌తో చేశారు. నా కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది నాకు చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుంది' అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ...‘ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. నాగార్జున కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ అవుతుంది. జులై రెండో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...‘నాగార్జున కెరీర్లోనే ఇదో పెద్ద లాండ్ మార్క్ అవుతుంది. నిర్మాత వెంకట్ ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నారు' అని చెప్పారు. కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి మాట్లాుడుతూ...‘ఒక వైపు పోస్టు ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి' అని చెప్పారు.

కవలలుగా ప్రియమణి్,హీరో సూర్య సినిమాలూ....

Kv Anand S Maatran Differs From Priyamani
ఇప్పుడు తమిళ,తెలుగు పరిశ్రమలలో హాట్ టాపిక్ ఏమిటంటే...సూర్య నటించిన మాట్రాన్, ప్రియమణి నటించిన చారులత కథ ఒక టేనా..అని. ఎందుకంటే ఈ రెండు సినిమాలూ కూడా అవిభక్త కవలల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నాయి. అయితే చారులత చిత్రం ఎలోన్ అనే థాయిల్యాండ్ చిత్రానికి రీమేక్ అని దర్శకనిర్మాతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే మాట్రాన్ చిత్రం అమెరికాలో జరిగిన ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కించినట్లు దర్శకుడు కె వి ఆనంద్ చెబుతున్నారు. ఎలోన్ చిత్రాన్ని తాను చూశానని ఆ చిత్రానికి, మాట్రాన్ చిత్రానికి సంబంధం ఉండదని ఆయన అంటున్నారు.

మాట్రాన్ విషయానికి వస్తే..వరుస విజయాలతో ప్రముఖ యువ హీరోల వరుసలో ముందున్న సూర్య అవిభక్త కవలలుగా నటించిన చిత్రం మాట్రాన్. హిట్ చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాతి అఘోరం నిర్మిస్తున్నారు. ఉత్తమ నిర్మాణ విలువలతో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రం పలు విశేషాలను సంతరించుకుంది. అయన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత సూర్య కెవి ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మాట్రాన్ అక్టోబర్ 12న విడుదల కానుంది.

మాట్రాన్ కథ .. అవిభక్త కవలలుగా పుట్టిన యువకుల జీవితంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనలు, ఎదురయ్యే సంకట పరిస్థితులు, వినూత్న అనుభవాల సమాహారమే మాట్రాన్ చిత్రం అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తెలపనున్నట్లు అంటున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందంతో కూడిన అభినయం, హరీష్ జయరాజ్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ కాగలవంటున్నారు. మాట్రాన్ చిత్ర షూటింగ్‌ను మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రాంతాలతో పాటు లాటేరియా (రష్యా), బాల్గన్ దేశాల్లోనూ చేశారు. స్వదేశీ సాంకేతిక నిపుణులతో పాటు విదేశీ నిపుణులు మాట్రాన్ కోసం పని చేశారు.

ఇక చారులత ఈ వారంలో తెరపైకి రానుంది. ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన చిత్రం చారులత. కన్నడంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన ద్వారకేష్ ఫిలింస్ సంస్థ కన్నడం, తమిళం భాషల్లో నిర్మించిన ఈ చిత్రంపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్ర విజ యంపై ఎంత నమ్మకం లేకపోతే దీన్ని తెలుగులో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, తమిళంలో సాక్సే పిక్చర్స్, మలయాళంలో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడానికి ముందుకొచ్చాయి.

ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో నాకు తెలుసు : పూరీ........

 


 ''ఇన్నేళ్ల విరామం తరవాత మళ్లీ పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో నాకు తెలుసు. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. రాంబాబు పాత్రలో కొత్త పవన్‌ని చూస్తారు. మణిశర్మ అందించిన బాణీలు బాగున్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు పూరీ జగన్నాధ్. పూరీ జగన్నాధ్,పవన్ కళ్యాణ్ తో... ప్రస్తుతం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'గా సిద్ధమవుతున్నారు. ఆదివారం పవన్‌కల్యాన్‌ జన్మదినం. ఈ సందర్భంగా పూరీ ఇలా స్పందించారు.

'బద్రి' తరవాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబరు 18న విడుదల చేయాలనుకొన్నారు. కానీ ఇప్పుడు వారం రోజుల ముందే.. అంటే అక్టోబరు 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అత్యంత వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కి మణిశర్మ స్వరపరిచిన పాటలను ఈ నెలలోనే విడుదల చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో పవర్‌ఫుల్ జర్నలిస్ట్‌గా పవన్ కనిపించనున్నారు. శక్తివంతమైన కథాంశంతో, పూర్తి ఎంటర్‌టైనర్‌గా పూరిజగన్నాథ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని దానయ్య తెలిపారు. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో తీపి జ్ఞాపకంగా నిలిచిపోయే సినిమా ఇది అవుతుందని పూరిజగన్నాథ్ చెబుతున్నారు.'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.
ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం....

Saturday, September 1, 2012

మరో భూతం పట్టుకొస్తోన్న వర్మ!......

 




పట్టువదలని విక్రమార్కుడు బేతాళుడిని భుజాన వేసుకొన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ జనాలను భయపెట్టడానికి అలుపెరగకుండా దెయ్యాల సినిమాలను వెంటేసుకు వస్తుంటాడు. ప్రతి సారి విఫలుడయ్యే వర్మ…మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేస్తుంటాడు. నాటి ‘రాత్రి’, ‘దెయ్యం’ మొదలు మొన్నటి ‘ఫూంక్’ వరకూ అన్నీ పరాజయాలే…కానీ ఒకే ఒక దెయ్యం సినిమా వర్మకు సక్సెస్ రుచి చూపించింది అదే ‘భూత్’. ఊర్మిలా, అజయ్ దేవగణ్ లు ప్రధాన పాత్రధారులుగా 2003లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని, వర్మకు కలెక్షన్లు, ఊర్మిలకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. తాను తీసిన ఈ చెప్పుకోదగ్గ దెయ్యం సినిమా నుంచి మరింత రసం పిండుకోవడానికి వర్మ ప్రయత్నం చేస్తున్నాడు. ‘డిపార్ట్ మెంట్’ దెబ్బకు వర్మ కంపెనీ భారీ నష్టాల్లో పడిపోయింది. ఈ నేపథ్యంలో ‘భూత్ రిటర్న్స్’ ను కూడా నితిన్ మోహన్ అనే నిర్మాత సహకారంతో వర్మ కంపెనీ నిర్మిస్తుండటం గమనార్హం. ఈ సినిమాతో వర్మ మనీషా కొయిరాలకు నటిగా మళ్లీ జీవితాన్ని కల్పిస్తున్నాడు. వివాహానంతరం జీవితాన్ని గందరగోళపరుచుకొన్న మనీషను వర్మ తన సినిమా ద్వారా తిరిగి ఇండస్ట్రీకి దగ్గర చేస్తున్నాడు. దీనికైనా వర్మను అభినందించాలేమో. ఈ సినిమాలో వర్మ ఆస్థాన నటుడు జేడీ చక్రవర్తి మెయిన్ మేల్ రోల్ చేస్తున్నాడు. అంతే కాదు…వర్మ 3డీలో తీస్తున్న తొలి సినిమా ఇది. ఇక యాధాతథంగా హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఆక్టోబర్ 12 న విడుదల కాబోతోంది ‘భూత్ రిటర్న్’

'బ్లూ స్కై సినిమాస్' చేతికి బ్రహ్మీ ‘జెఫ్ఫా’ రైట్స్....

 


టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘జెఫ్పా' చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. జెఫ్ఫా' అనే పదాన్ని తెలుగు చిత్రాల్లో బ్రహ్మానందం ఉపయోగించినంతగా ఎవరూ యూజ్ చేసి ఉండరు... ఇప్పుడు అదే 'జెఫ్ఫా' అనే సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించడం విశేషం.. ‘‘నో రేప్, నో మర్డర్, నో కిడ్నాప్, నో మాఫియా, బట్ స్టిల్ హి మోస్ట్ వాంటెడ్'' అనేది దీనికి క్యాప్షన్లు.

ఈ చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్, డివిడి-విడిసి రైట్స్ ‘బ్లూ స్కై సినిమాస్' సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం టీజర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం టెర్రరిస్టు జఫ్పార్ ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్ంరలో ఇంకా అలీ, వేణు మాధవ్, ఇతర కమెడియన్లు కూడా నటిస్తున్నారు....


నిర్మాణ రంగంలోకి ‘పవర్ స్టార్’?

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారా? సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించబోతున్నారా? అంటే అవుననే గాసిప్స్ వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్లో...
‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో సదరు ప్రొడక్షన్ హౌస్ మొదలవ్వనుందని చర్చించుకుంటున్నారు. దీని ద్వారా టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంతో పాటు చిన్న, భారీ బడ్జెట్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారటన పవర్ స్టార్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో. ఎంత టాప్ హీరో అయినా.... కొన్నాళ్ల వరకు మాత్రమే. అన్నయ్య చిరంజీవి లాగా వయసు పైబడ్డాక సినిమాల నుంచి తప్పుకోక తప్పదు. అయితే రాజకీయాలంటే ఇంట్రస్టులేని పవన్ కళ్యాణ్ భవిష్యత్‍‌లో సినీ నిర్మాణ రంగంలో రాణించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. అదే విధంగా దర్శకత్వంపై కూడా దృష్టి పెట్టనున్నాడట.


ఆ రెండు హైలెట్‌గా 'గంగతో రాంబాబు'....

 


‘నువ్వు నందావైతే నేను బద్రి..బద్రినాథ్' ఈ డైలాగ్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీసు షేక్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి' సూర్ డూపర్ హిట్ అయింది. ఆ చిత్రం తర్వాత పన్నెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తోన్న సూపర్ సెన్సేషనల్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'ను సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బేనర్‌పై నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

సెప్టెంబర్ 2 పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర విశేషాల్ని నిర్మాత డి.వి.వి దానయ్యను అడిగినప్పుడు... ‘పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాలో. పవర్ స్టార్ పెర్ ఫార్మెన్స్ హైలెట్‌గా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్మెంట్, సూపర్ సాంగ్స్‌తో, థ్రిల్లింగ్ యాక్షన్‌తో ప్రేక్షకులు, పవన్ అభిమానులు అందరూ మెచ్చే విధంగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' రూపొందుతోంది. టోటల్ టాకీ పార్ట్ పూర్తయింది. సెప్టెంబర్‌లో బ్యాలెన్స్‌రెండు పాటల చిత్రీకరించడంతో చిత్రంలోని ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. మా బేనర్లో, పవర్ స్టార్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది. పూరి జగన్నాథ్ పవర్ స్టార్ కోసం రాసిన సూపర్ డైలాగలకు థియేటర్లు చప్పట్లతో దద్దరిల్లుతాయి. ఏకథాటిగా సింగిల్ షెడ్యూల్ లో ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేయగలిగామంటే పూరి ప్లానింగ్, పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ ప్రధాన కారణాలు. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఇంత పెద్ద సెన్సేషనల్ ఫిల్మ్ తీస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రం నిర్మాణంలో అన్ని విధాలా ఎంతో సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను' అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...‘బద్రితో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేసే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి పవర్ ఫుల్ సినిమా ఎక్స్ ఫెక్ట్ చేస్తున్నారో అలాంటి పవర్ ఫుల్ సినిమా ఇది. డెఫినెట్ గా కళ్యాణ్ కెరీర్లో ఓ ల్యాండ్ మార్క్ అవుతుంది. ఇందులో కొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తారు' అన్నారు.

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న ఫష్ట్ మూవీ ఇది. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే పూరి జగన్నాథ్ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ తో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. కెమెరామెన్ గంగతో క్యారెక్టర్ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న క్యారెక్టర్' అన్నారు.

క్లైమాక్స్ సన్నివేశం జరుగుతుండగా ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ చెప్పిన పెద్ద డైలాగ్ కి షాట్‌లో ఉన్న వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపితే దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకుని అభినందించారు. ఇలాంటి సూపర్ సీన్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి.
ఈ చిత్రం కోసం మణిశర్మ 5 సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. పూరి-మణి కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి', ‘చిరుత' వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత వస్తోన్న మరో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఇది. సెప్టెంబర్లో విడుదలయ్యే ఈ ఆడియోలో 5 పాటలు దేనికదే హైలెట్ అవుతాయన్నారు.......


(బర్త్ డే స్పెషల్) పవర్ స్టార్ ప్రస్థానం...

అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో మెగా స్టార్ చిరంజీవి తమ్ముడుగా హీరోగా పరిచయమై గోకులంతో సీత, సుస్వాగతం వంటి విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని తొలి ప్రేమతో లవ్ స్టోరీస్ లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి తమ్ముడుతో అన్నకు తగ్గ తమ్ముడుగా అద్భుత విజయాన్ని సాధించి బద్రితో తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని ఖుషితో రికార్డులు బ్రేక్ చేసి అందరూ తన స్టైల్ ని ఫాలో అయ్యే రేంజికి ఎదిగి జానితో దర్శకుడుగా పరిచయమై గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం చిత్రాలతో ఓపెనింగ్స్ క్రియేట్ చేసి జల్సాతో బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసి కొమురం పులి, తీన్ మార్, పంజా చిత్రాల తర్వాత గబ్బర్ సింగ్ తో మళ్ళీ తన పవర్ ఏమిటో చూపించి కలెక్షన్ల వర్షం కురిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కెమెరా‌మెన్ గంగతో రాంబాబుతో మరోసారి సరికొత్త రికార్డు సృష్టించడానికి వస్తున్నాడు.
happy birthday pawan kalyan


ఆయన అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి సోదరుడు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిల మూడవ కుమారుడు కొణిదల కళ్యాణ్ బాబు. పవన్, సెప్టెంబరు 2, 1973న జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలోని మెగాస్టార్ చిరంజీవి (శివ శంకర వర ప్రసాద్), పవన్‌కు పెద్దన్నయ్య . నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య . పవన్, పరిశ్రమలోని తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి ని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. సెప్టెంబర్ 2తో 41వ వసంతంలోకి అడుగు పెడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి  పుట్టినరోజు శుభాకాంక్షలు.....

Friday, August 31, 2012

కలలో కూడా ఊహించలేదు : మోహన్‌ బాబు...

 

‘ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం. ఎందుకంటే విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మహత్తరమైన ఉన్నతమైన ఉద్యోగం అది. క్రమ శిక్షణ నేర్పే కొలువు కూడా అది. మీ అందరికీ తెలుసు...నేను సినిమా నటుడు కాకముందు ఉపాధ్యాయుడిగా పని చేశానని. అయితే ఒక సంవత్సరం ఆ వృత్తి లో పని చేసిన తర్వాత నా ‘కులం' ఆ సంస్థ యజమానికి తెలిసి, అది రుచించని కారణంగా నన్ను వారు ఉద్యోగం నుంచి తొలిగించిన విషయం కూడా మీకు గతంలో పలుమార్లు చెప్పి ఉన్నాను. నేనే కాదు...మా నాన్నగారు కూడా బడిపంతులు ఉద్యోగం చేసారు. ఆయన పేరు నారాయణస్వామి నాయుడు. ఆయన జీవితమంతా పిల్లల్ని తీర్చిదిద్దడానికి వెచ్చించారు. ఆయన క్రమ శిక్షణే నాక్కూడా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే...సెప్టెంబర్ 1న తిరుపతికి సమీపంలో నేను నెలకొల్పిన విద్యా సంస్థల సముదాయం ‘శ్రీ విద్యానికేతన్'లో గ్రాడ్యుయేషన్ డే గర్వంగా జరుపుతున్నాను.200 మంది ఎంటెక్ విద్యార్థులకు ఈ రోజు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు మంచి స్నేహితుడైన, పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ శ్రీ ఇక్భాల్ సింగ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ శుభ సందర్భంలో నా మనసు ఎంతో ఆనందంగానూ గర్వంగానూ ఉంది. కలలో కూడా ఊహించని రీతిలో నేను విద్యా సంస్థల్ని నెలకొల్పడం, ఎంతో మంది పేద విద్యార్థులకు కుల, మతాలకు అతీతంగా ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చి చదువు చెప్పించే అవకాశం దొరకడం నా జీవితంలో మరువలేని ఓ ఆనందకర ఘట్టంగా నేను భావిస్తున్నాను.

స్పెయిన్ కి వెళ్లిన అల్లు అర్జున్...

   

రీసెంట్ గా విడుదలైన జులాయి హిట్ టాక్ తెచ్చుకోవటంతో హ్యాపీ ఫీలైన అల్లు అర్జున్ కొద్ది రోజులు రెస్ట్ కు హాలీడే ట్రిప్ కు వెళ్లారు. స్పెయిన్ లో ఈ హాలీడే ని ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం చివరలో ఇక్కడికి తిరగి వస్తారని సమాచారం. ఇండియాకి తిరిగి రాగానే... తన తదుపరి చిత్రం హడావిడిలో పడిపోతారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చి ఈ మ్యూజిక్ సిట్టింగ్ లో పాల్గొంటారని సమాచారం.

అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన పూరీ జగన్నాగ్ ఈ మేరకు స్కిప్టు వినిపించటం జరగింది. అది విన్న అల్లు అర్జున్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారని సమాచారం. అసలు కరెక్షన్ ఏమీ చెప్పలేదని,ఈ చిత్రం తన కెరిర్ లో మరోసారి దేశముదరు రేంజిని దాటే హిట్ వస్తుందని నమ్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.

సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'శిరిడి సాయి' - సెప్టెంబర్‌ 6 విడుదల...



అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్‌లో వస్తోన్న 'శిరిడి సాయి' చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు వున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి.

ఈ చిత్రం విడుదల కోసం నాగార్జున అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎ.సులోచనా రెడ్డి సమర్పణలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్న 'శిరిడిసాయి' ఈరోజు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత ఎ.మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ - ''ఈరోజు మా శిరిడి సాయి సెన్సార్‌ పూర్తి చేసుకుని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఒక మహాద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మా యూనిట్‌ని ప్రశంసించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నాగార్జునగారి అభిమానులు, ప్రేక్షకులు, సాయిబాబా భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్‌లో మొదటి సినిమాగా వస్తోన్న 'శిరిడి సాయి' చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ వుంది'' అన్నారు.

'ఏక్ థా టైగర్' 2 వారాల్లో రూ. 185 కోట్లు...

Ek Tha Tiger Earns Rs 185 Cr At Indian Box Office
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్' చిత్రం దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకెలుతోంది. తొలి 5 రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్లు సాధించిన ఈచిత్రం తొలివారం తన హవా కొనసాగించినప్పటికీ...రెండో వారంలో మాత్రం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. రెండు వారాల్లో రూ. 200 కోట్లు వసూలు చేస్తుందని అనుకున్నప్పటికీ కొద్దిపాటి తేడాతో అంచనాలు మిస్సయి రూ. 185 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే 2 వీకెండ్లలోనూ ఇండియన్ బాక్సాఫీసు వద్ద టాప్ పొజిషన్లో కొనసాగింది.

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అననంగా రెండు రోజులతో కలుపుకుని తొలి వీకెండ్‌లో రూ. 154.21 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే మొదటి వారంలో పోల్చుకుంటే రెండో వారంలో మాత్రం ఒక్కసారిగా 80% బిజినెస్ డ్రాప్ అయింది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 16 రోజుల్లో ఈచిత్ంర రూ. 185.5 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే సినిమా కేవలం సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్ పైనే ఆడుతోంది. సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బిజినెస్ మరో వారంలో పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘జోకర్' చిత్రం ఈ రోజు విడుదలవ్వడం కూడా ఈ చిత్రానికి గట్టి పోటీ అని చెప్పొచ్చు.

జూ ఎన్టీఆర్ కొత్తలుక్‌ హల్చల్....

జూ ఎన్టీఆర్, కాజల్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘బాద్ షా'. చిత్రంలో జూ ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా కొత్తలుక్‌తో కనిపించనున్నారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో జూ ఎన్టీఆర్ సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించిన విషయం తెలిసిందే. జూనియర్ కర్లింగ్ హెయిర్ కాస్త సాఫ్ట్ హెయిర్‌లా తయారైంది. అదంతా కూడా అతను నటిస్తున్న ‘బాద్ షా' చిత్రం షూటింగులో భాగంగా చేసిన మేకప్ స్టైల్. జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో 7 సరికొత్త హెయిర్ స్టైల్స్‌లో కనిపించనున్నాడు.
ntr baadshah first look


తాజాగా బాద్ షా చిత్రానికి సంబంధించిన జూ ఎన్టీఆర్ న్యూలుక్ స్టిల్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదలయ్యాయి. ఫోటోలో కనిపిస్తున్నది ‘బాద్ షా' చిత్రంలోని స్టిల్లే. కొన్ని పాటల్లో...కొన్నీ సీన్లలో జూనియర్ ఈ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తెప్పించారు. ఈ సినిమాలో జూనియర్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తేవడం ఖాయం అంటున్నారు.

మరో వైపు ఈచిత్రానికి సంబంధించి జూ ఎన్టీఆర్ పై విదేశాల్లో చిత్రీకరించిన డాన్స్ వీడియో షాట్ ఒకటి లీక్ అయింది. యూ ట్యూబ్‌లో ఇది హల్చల్ చేస్తోంది. అందులో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగి పోయాయి....

Thursday, August 30, 2012

రాణా జస్ట్ ఫ్రేండు మత్రమె : త్రిష...

 


దగ్గుబాటి హీరో రాణా, త్రిష మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. త్రిషకు రాణా ఓ ప్లాటినం ఉంగరాన్ని, నగల సెట్‌ను బహూకరించాడనే వార్త కూడా ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలను త్రిష ఖండించింది.

ఈ ప్రచారం అబద్ధమని, రాణాతో తనకు నిశ్చితార్థం కాలేదని త్రిష మండిపడింది. ఆ ఫొటోలూ వార్తలూ అవాస్తవమని.. తాను, రాణా ఎప్పటినుంచో మంచి స్నేహితులమని.. అలాంటి ది తమ మధ్య ఏదో జరుగుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఆమె తెలిపింది. అసలు జరగని ఎంగేజ్‌మెంట్ గురించి లేనిపోని వదంతులు సృష్టించొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్న తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది.


ఆసక్తి రేపుతున్న ‘రాంబాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్....

cameraman ganga tho rambabu first look wallpaper
 చిరంజీవి పుట్టినరోజుకు ఫస్ట్ లుక్ తో అలరిస్తాడనుకున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కాస్తా అనుకున్న సమయానికి రాలేకపోయాడు. తాజాగా ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడే విడుదలకానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 2న  ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫస్ట్ లుక్ తో పాటు ‘గబ్బర్ సింగ్’ శతదినోత్సవ వేడుక కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది.

సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జర్నలిస్టుగా మొదటి సారి నటిస్తున్న పవన్ ను దర్శకుడు పూరి జగన్నాధ్ తన దైన శైలిలో తీర్చిదిద్దాడని, పూరి డైలాగులు అద్యంతం అలరిస్తాయని తెలుస్తోంది. పూరి దేవుడు చేసిన మనుషులు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్ గా తేలడంతో ఢీలాపడ్డ పవన్ అభిమానులు అంతగా చింతించాల్సిన అవసరం లేదని యూనిట్ వర్గాలు అంటున్నాయి. కేవలం మూడు పాటలు ఈ చిత్రంకోసం చిత్రీకరించాల్సి ఉంది. అందమైన లొకేషన్ల కోసం పూరి జగన్నాధ్ వెతుకుతున్నారు.

హా... నారాయణా (‘శ్రీమన్నారాయణ’ రివ్యూ)....

 


హీరో మారువేషం ఎందుకు వేస్తాడు? తననెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి! శ్రీమన్నారాయణలో బాలయ్య కూడా రకరకాల వేషాల్లో విలన్లను చంపడానికి వెళ్తాడు. ఒకసారి ‘ఒక్కమగాడు’లో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ వేషమేస్తాడు.. ఇంకోసారి సుల్తాన్ సినిమాలో గడ్డం క్యారెక్టర్ తరహా వేషమేస్తాడు. ఇంకోసారి నరసింహావతారమే ఎత్తుతాడు. మరి అతణ్ని ఎవరూ గుర్తుపట్టలేదా అంటే అదేం కాదు.. విలన్లు అతణ్ని చూడగానే ‘‘శ్రీమన్నారాయణా.. నువ్వా’’ అంటూ నోరెళ్లబెడతారు! హీరో వాళ్లను చంపేసి చక్కా పోతాడు. బాలయ్య విన్యాసాలు అభిమానులకు బాగానే ఉంటాయి.. కానీ సగటు ప్రేక్షకుడికే ఓ సందేహం.. ఇంతకీ హీరో ఆ వేషాలెందుకు వేసినట్లు.. అని. శ్రీమన్నారాయణ గురించి చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇది అభిమానులను మెప్పించే.. సగటు ప్రేక్షకుడికి సంతృప్తినివ్వని సినిమా! స్థూలంగా ఇది ఓ ఏవరేజ్ మూవీ.

శ్రీమన్నారాయణ (బాలకృష్ణ) ఓ టీవీ జర్నలిస్టు. అతను ఓ ల్యాండ్ స్కాంను బయటపెట్టి.. బైల్ రెడ్డి (జయప్రకాష్ రెడ్డి), పులికేశవరెడ్డి (సుప్రీత్), హర్షద్ మెహతా (సురేశ్)లకు శత్రువుగా మారతాడు. శ్రీమన్నారాయణ తండ్రి కల్కి నారాయణ మూర్తి (విజయ్ కుమార్) ఓ రైతు నాయకుడు. అతను జై కిసాన్ పేరుతో రైతుల కోసం ఓ ట్రస్టు నెలకొల్పి.. రూ. 5 వేల కోట్ల విరాళాలు సేకరిస్తాడు. ఐతే అనుకోకుండా నారాయణమూర్తి చనిపోతాడు. డబ్బు మాయమవుతుంది. ఈ డబ్బులు శ్రీమన్నారాయణే దొంగిలించినట్లు నేరం మోపబడుతుంది. అతను జైలుకు వెళ్తాడు. ఇంతకీ డబ్బులెక్కడికి పోయాయి? నారాయణమూర్తి ఎలా చనిపోయాడు? శ్రీమన్నారాయణ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? తనను ఇరికించిన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.
ఇప్పటికే లెక్కలేనన్నిసార్లు తెలుగు తెరపై చూసిన ప్రతీకార కథే ఇది. పోనీ కథనమైనా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. అంతా ఊహించినట్లే సాగుతుంది. హీరో ఒక్కో విలన్ని చంపడం చూస్తుంటే మొన్నటి దూకుడు వద్దన్నా గుర్తొస్తుంది. పైగా ఆ సినిమాలో ఉన్న కోట శ్రీనివాసరావు, సుప్రీత్ ఇందులోనూ ఉన్నారాయె. స్క్రీన్ ప్లేలో ఆసక్తికర విశేషాలేం లేవు. ఐతే ఇంటర్వెల్ మలుపు, ద్వితీయార్ధం రొటీన్ గానే ఉన్నా.. అభిమానులకు, మాస్ కు నచ్చే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయం సాధించాడు. తొలి ముప్పావు గంటలో పేలవమైన సన్నివేశాలు.. ఎలాంటి మలుపులు లేని కథనం… పావుగంటకోసారి వచ్చే సిగరెట్ సాంగులు.. చూస్తుంటే బాలయ్య ఖాతాలో మళ్లీ ఓ ఫ్లాపు చేరడం ఖాయమనిపిస్తుంది. అప్పటిదాకా అభిమానులు కూడా నీరసంగానే ఉంటారు. ఐతే ఇంటర్వెల్ కు ముందు మలుపుతో కథ ట్రాక్ లోకి వచ్చి.. ఆసక్తి నెలకొంటుంది. ఐతే ఇంటర్వెల్ తర్వాత అంతా ఊహించినట్లుగానే సాగినప్పటికీ ప్రథమార్ధంతో పోలిస్తే చాలా రిలీఫ్ గానే ఉంటుంది. ద్వితీయార్ధంలో బాలయ్య నటన, డ్యాన్సులు, ఫైట్లు అన్నీ అభిమానుల్ని అలరించేలా సాగుతాయి.

‘సామాన్యుడు’ సినిమాతో తనకంటూ ఓ శైలి ఉందని చూపిన రవికుమార్ చావలి.. ఇందులో ఏమాత్రం తన ముద్రను వేయలేకపోయాడు. ఓ మాస్ హీరో చేతిలో బందీ అయిపోయిన రవి.. రొటీన్ కథ, రొటీన్ కథనాలతో బండి నడిపించేశాడు. క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం, కృతకంగా అనిపించే పాటలు చూస్తేనే అతను ఎంతగా కాంప్రమైజ్ అయ్యాడో అర్థమవుతుంది. మన దర్శకుల్లో ఇటీవల కనిపిస్తున్న పెద్ద సమస్య ఏంటంటే వారు సమాజానికి సంబంధించిన ఏ విషయాన్నీ వాస్తవిక కోణంతో పరిశీలించట్లేదు. జనరల్ ఒపీనియన్స్ ను నమ్మి అదే వాస్తవమన్నట్లు చూపిస్తున్నారు. హీరోను జర్నలిస్టుగా చూపించిన దర్శకుడికి మీడియా విషయంలో కనీస అవగాహన కూడా లేదని అర్థమవుతుంది. ఓ స్కాంను జర్నలిస్టు బయటపెడితే.. ఆ జర్నలిస్టు స్కాంను బయటపెట్టాడని.. అతనికి అభినందనలు వెల్లువెత్తాయని స్క్రోలింగ్ ఇస్తారా.. సినిమాటిక్ గా సన్నివేశాలుండాలనుకుంటే హీరోను మామూలు వ్యక్తిగానే చూపించొచ్చు కదా. జర్నలిస్టుగా చూపించడమెందుకు?
ఓ రైతు నాయకుడు నాలుగు మీటింగుల్లో మాట్లాడేసి, రూ.5 వేల కోట్లను తాను సొంతంగా సమీకరించేస్తాడా..? అతణ్ని బ్యాంకులోనే కూర్చోబెట్టి చంపేసి, విలన్లు అంత సులభంగా డబ్బులు కొట్టేస్తారా? హీరో విలన్లను జైల్లోనే ఉంటూ సీబీఐ అధికారిని వెర్రి వెంగళప్పను చేసి, విలన్లను చంపేస్తాడా? దర్శకుడు మరీ ఇంత స్వేచ్ఛ తీసుకుంటే ఎలా? ప్రేక్షకుడిని మరీ తక్కువ అంచనా వేస్తే ఎలా? హీరోను అత్యంత శక్తిమంతుడిగా (మన హీరోలు అంతేకదా) చూపించిన దర్శకుడు.. విలన్ పాత్రల్ని మరీ బలహీనంగా మార్చేశాడు. పాటల కోసం కూర్చిన సన్నివేశాలు.. పాటల చిత్రీకరణ.. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ మరీ రొటీన్ గా, మొహం మొత్తేలా ఉన్నాయి. చక్రి సంగీతం ఔట్ డేటెడ్. పాటలు పేలవంగా ఉన్నాయి. అన్నీ రొటీన్ మాస్ సాంగ్సే. పోలూర్ ఘటికాచలం మాటలు కొన్ని చోట్ల మాత్రమే బాగున్నాయి. అందరూ వారసత్వంగా ఆస్తిని కోరుకుంటారు.. నువ్వు నా ఆశయాన్ని కోరుకున్నావు అనే డైలాగ్ బాగుంది. కానీ పదేపదే వాడటం వల్ల దాని విలువ తగ్గిపోయింది. విజయ్ కుమార్ రైతుల గురించి చెప్పే మాటలు కూడా ఓకే. దువ్వాసి మోహన్ క్యారెక్టర్ తో మాస్ కు నచ్చే పంచ్ లు వేయించాడు రచయిత. ఐతే కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు హద్దులు దాటాయి. దువ్వాసి కనిపించిన కాసేపు బాగానే నవ్వించాడు. అతని తర్వాత జయప్రకాష్ రెడ్డి కాస్త నవ్వులు పంచాడు. ఎమ్మెస్, కృష్ణభగవాన్ ల కామెడీ పండలేదు. హీరోయిన్లు పాటలకు తప్ప మరెందుకూ పనికి రాలేదు. ఉన్నంతలో పార్వతి మెల్టన్ పాత్ర కాస్త నయం. కానీ ఆమె మరీ బక్కచిక్కి చూడలేనట్లు తయారైంది.

బాలయ్య తన అభిమానుల్ని వందశాతం సంతృప్తి పరిచాడు. వారేం కోరుకుంటారో అదిచ్చాడు. ఈ వయసులోనూ డ్యాన్సులు, ఫైట్ల విషయంలో బాగా కష్టపడ్డాడు. బాలయ్య మేకప్ విషయంలో మళ్లీ ఏమాత్రం శ్రద్ధ కనబరచలేదు. నప్పని విగ్గు, డ్రెస్సులు, ముఖానికి అతికించినట్లు మేకప్ ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.
రొటీన్ సబ్జెక్టే అయినా.. పరమవీరచక్ర, అధినాయకుడు లాంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఒప్పుకోవడం మంచి నిర్ణయమే. ఫలితం కూడా నిరాశ కలిగించకపోవచ్చు.


Wednesday, August 29, 2012

బాబా సెహగల్ ‘పవర్ సాంగ్' .....

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా.....బాగా ఇంప్రెస్ అయిన పాప్ గాయకుడు బాబా సెహగల్ ‘పవర్ సాంగ్' కంపోజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ యొక్క తత్వాన్ని ‘పవనిజం' అంటూ ఆరాదిస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపే విధంగా ఈ సాంగ్ ఉండనుంది. పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ‘పవర్ సాంగు'ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా సెహగల్ మాట్లాడుతూ...పవర్ సాంగ్ పవన్ కళ్యాణ్‌కి భజనలా ఉండదని స్పష్టం చేసారు. పవర్ స్టార్ యొక్క ఇమేజ్‍‌ని, ఆయన ప్రత్యేకతని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని వివరిస్తూ... అతనిపై ప్రేక్షకులు, అభిమానులు కురిపిస్తున్న అభిమానాన్ని ప్రతిభింభిస్తూ ఉంటుందన్నారు.

తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడటం మొదలు పెట్టాక పవన్ కళ్యాణ్ గురించి తెలిసింది. పవన్‌‍‌కి ఉన్న ట్రెమండస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్యర్య పోయారు. పీపుల్ ఆయన పట్ల అంత క్రేజీగా ఉండటానికి కారణం ఏమిటో ఆయన సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను కూడా పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్ అయిపోయానని బాబా సెహగల్ చెప్పుకొచ్చారు. పవర్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారికి అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు.


‘సుడిగాడు’ కలెక్షన్స్ (ట్రేడ్ టాక్)....

 


‘అల్లరి' నరేష్, మోనాల్ జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి. నిర్మించిన ‘సుడిగాడు' క్రితం శుక్రవారం విడుదలైంది . ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అల్లరి నరేష్ గత చిత్రాలు దేనికి రానంతగా ఈ చిత్రానికి కలెక్షన్స్ వస్తున్నాయి. విడుదలైన ఐదు రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్లు కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా నైజాంలో రెండు కోట్ల యాభై లక్షలు రూపాయలు కలెక్టు చేసిందని చెప్తున్నారు. ఇదే రన్ కంటిన్యూ అయితే ఫస్ట్ వీక్ లోనే పది కోట్లు వరకూ కలెక్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ కలెక్షన్స్ కు ప్రధాన కారణం పబ్లిసిటీ అని తేలుస్తున్నారు. మీడియాలో ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ చేయటంలో ట్రైలర్స్,పోస్టర్స్ ప్రధాన పాత్ర పోషించాయి. అందుకు తగ్గట్లుగానే ఓపినింగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజులు ఈ చిత్రం ఓ రేంజిలో కలెక్షన్స్ రాబట్టింది. కామెడీ చిత్రం కావటం, పెద్ద హీరోలను స్పూఫ్ చేయటం ఈ సినిమాకు కలిసివచ్చింది. తమ హీరోలను ఏ విధంగా స్పూఫ్ చేసారు అన్నది వీక్షించటానికే జనం ఎగబడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు.


సూపర్ బైక్ రేసింగ్ పార్ట్నర్లుగా నాగార్జున -ధోని


 టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, క్రికెటర్ ధోనీ బిజినెస్ పార్ట్నర్లు అయ్యారు. బైక్‌లంటే వల్లమాలిన వ్యామోహం కనబర్చే టీమిండియా కెప్టెన్ ధోనీ, రేసింగులంటే పడిచచ్చే సినీ నటుడు నాగార్జున ఇప్పుడు సంయుక్తంగా రేసింగ్ రంగంలకి దిగారు. వరల్డ్ సూపర్ బైక్ చాంపియన్‌షిప్‌లో ధోనీ- నాగార్జున టీమ్ పాల్గొననున్నాయి.

వచ్చే ఏడాది ఈ చాంపియన్‌షిప్ జరగనుంది. అంతకంటే ముందు దాని అనుబంధ రేస్ అయిన ఎఫ్ఐఎమ్ సూపర్‌స్పోర్ట్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మహీ-నాగార్జున సొంత జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు 'ఎమ్ఎస్‌డీ ఆర్-ఎన్ రేసింగ్ టీమ్ ఇండియా' అని నామకరణం చేశారు. 17 రేసుల చాంపియన్‌షిప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌లో జరిగే 10వ రేసులో మహీ-నాగ్ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఫ్లోరియన్ మరినో (ఫ్రాన్స్), డాన్ లిన్‌ఫుట్ (బ్రిటన్) ధోనీ-నాగ్ జట్టుకు రైడర్లు.

ఓ మధ్యవర్తిద్వారా ధోనీకి, నాగార్జునకు లింకు కలిసినట్లు ప్రముఖ ఆంగ్లపత్రిక పేర్కొంది. ఈ క్రమంలో ఇద్దరూ ఈ బైక్ రేసింగ్ జట్టులో పార్ట్నర్లు అయినట్లు స్పష్టమవుతోంది. ధోనీ మేనేజర్ అరుణ్ పాండే ఈ రేసింగ్ జట్టుకు మేనేజింగ్ డైరెక్టర్ కాగా...నాగార్జున డైరెక్టర్‌గా ఉన్నారని సమాచారం.


మళ్లీ వాయిదా పడ్డ ప్రభాస్ ‘రెబల్’.....

 


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు లారెన్స్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రెబెల్'. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. తొలుత ఈచిత్రం ఆడియో సెప్టెంబర్ 5న, సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.....పోస్టు ప్రొడక్షన్ పనులు లేటవుతుండటంతో సెప్టెంబర్ 14న ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.


‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బిజినెస్ డిటేల్స్....

 


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ చిత్రం బిజినెస్ చాలా ఊపుగా జరుగుతోంది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రం ఘన విజయం సాధించటంతో అలాంటి కాన్సెప్ట్ తరహాలో ఈ చిత్రంకి ట్రేడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. వచ్చే నెల 13న విడుదల అవుతున్న ఈ చిత్రం నైజాం రైట్స్ ని దిల్ రాజు ఫ్యాన్సీ ఎమౌంట్ కు తీసుకున్నారు. అలాగే ఆంధ్రా రైట్స్ మొత్తం ఇప్పటికే అమ్ముడుపోగా, సీడెడ్ రైట్స్ కూడా బిజినెస్ ముగింపు దశలో ఉంది. అలాగే ఓవర్ సీస్ బిజినెస్ చాలా బాగ జరిగినట్లు చెప్తున్నారు. ఇక శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు మంచి ఎమౌంట్ కి ఇప్పటికే తీసుకున్నారు.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...-‘‘నేను ఏ సినిమా చేసినా విలువల్ని మాత్రం మర్చిపోను. ఈ సినిమా మిమ్మల్ని షాక్‌కి, థ్రిల్‌కి గురి చేస్తుందని చెప్పను కానీ, కొన్నాళ్ల పాటు మీతో జర్నీ చేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. కోరికలు, ఆశలు, సంతోషాలు... ఇదే ఈ సినిమా కథ. ఓ కాలనీలోని ఆరుగురు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది. మన బాంధవ్యాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమా ఓ విధంగా నా కల. ఈ కల కార్యరూపం దాల్చడానికే రెండేళ్లు పట్టింది. ఈ సినిమా మేకింగ్‌లో చాలా అవాంతరాలు ఎదురొచ్చినా అధిగమించగలిగాం. వేటూరిగారు లేకపోవడం నాకు గొప్ప విషాదం. ఈ సినిమాలో అమల తొలుత చేయనన్నారు. చాలా బతిమిలాడాను. ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఈ విషయంలో నాగార్జున గారికి కృతజ్ఞతలు చెబుతున్నా'' అన్నారు.


Tuesday, August 28, 2012

‘పవనిజం’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు....

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పవనిజం'పై ఓ పాట ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఈ పాట రిలీజ్ డేట్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఈ సాంగును రిలీజ్ చేయబోతున్నారు.

తనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఉదారగుణం, స్టైల్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పట్ల... అభిమానులు ఎంతో గర్వంగా ఫీలవుతూ ఉంటారు. అలాంటి స్టార్ కోసం పాడుతున్న పాటను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబా సెహగల్ తానే స్వయంగా లిరిక్స్ రాసి మరీ దీన్ని కంపోజ్ చేసారు.

పవర్ స్టార్ అభిమానులకు కలకాలం గుర్తిండి పోయేలా... మంచి జోష్‌తో కూడి ఈ పాట ట్యూన్స్ ఉండనున్నాయి. ఇందులో ఇప్పటి వరకు పవన్ నటించిన సినిమాల పేర్లతో పాటు, అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాలను తెలియ పరుచనున్నారు. అదే విధంగా అభిమానులంటే పవన్ ఎంత విలువిస్తారో కూడా ఇందులో పొందు పరుచనున్నట్లు తెలుస్తోంది.


రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్ సినిమా !...

 


సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్లో గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించబోతున్నానరే వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఏవిఎం శరవణన్ ఈ ఇద్దరు స్టార్లతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల నిర్మాత శరవణన్, కమల్ హాసన్ ప్రొడ్యూసర్ నివాసంలో భేటీ అయ్యారని...ఈ క్రమంలో రజనీ, కమల్ కాంబినేషన్ సినిమా ప్రస్తావనకు వచ్చిందిన తెలుస్తోంది.

ఈ విషయమై శరవణన్ మాట్లాడుతూ...ఈ ఇద్దరి కాంబినేషన్ కేవలం కె. బాలచందర్ వల్లనే సాధ్యం. ఈ ఇద్దరు స్టార్లకు గురువు ఆయన. ఆయన వల్లే వాళ్లు ఈ స్థాయికి వచ్చారు. వాళ్ల ఇద్దరితో సంయుక్తంగా ఆయన గతంలో చాలా చిత్రాలు రూపొందించారు అని చెప్పుకొచ్చారు.

రజనీ, కమల్ కాంబినేషన్ ఐడియాపై బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి ఆనందం వ్యక్తం చేసింది. అయితే తన తండ్రి ప్రస్తుతానికి వీరుతో సినిమా చేయాలనే ఆలోచనలో మాత్రం లేరని వెల్లడించారు. ఏది ఏమైనా వీరి కాంబినేషన్లో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి త్వరలోనే అదని నిజం కావాలని ఆశిద్దాం.


రామ్ చరణ్ 'నాయక్ ' లేటెస్ట్ ఇన్ఫో ....

Ram Charan Kajal Dancing Iceland
 రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ‘నాయక్ ' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ది లీడర్ అనేది ట్యాగ్ లైన్ తో రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఐస్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నిన్నటి వరకూ శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో పాట రీమిక్స్ ని అమలా పౌల్,రామ్ చరణ్ లపై చిత్రీకరించారు. రామ్ చరణ్, కాజల్ ఇద్దరూ ఈ రోజు(ఆగస్టు 27,2012)నుంచీ ఐస్ ల్యాండ్ లో రొమాన్స్ చేసుకోనున్నారు. వీరిద్దరి మధ్యా అక్కడ రెండు పాటలు చిత్రీకరించనున్నారు. ఇక ఈ చిత్రం 2013 సంక్రాతికి విడుదల కానుంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా,ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము''అన్నారు.

ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్‌ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తున్నామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు అన్నారు.

10 కోట్లతో బన్నీ న్యూ గెస్ట్‌హౌస్ ?....

 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్‌ను మరింత లగ్జరీగా గడిపేందుకు అన్ని హంగుళతో కూడిన గెస్ట్ హౌస్‌ను నిర్మించుకుంటున్నాడు. గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్లో నిర్మాణం అవుతున్న ఈ గెస్ట్ హౌస్ ఇంటర్నేషనల్ స్టాండర్స్, అత్యాధునిక ఆర్కిటెక్చర్‌‍తో నిర్మిస్తున్నారు.

ఈ గెస్ట్ హైస్‌లో విశాలమైన స్విమ్మింగ్ ఫూల్ తదితర ఏర్పాట్లతో పాటు ఓపెన్ రూఫ్ ఉన్న బెడ్ రూమ్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. బెడ్ రూమ్ నుంచి నేరుగా ఆకాశంలో చుక్కలను చూస్తూ కబుర్లు చెప్పుకోవచ్చన్నమాట. అదే విధంగా స్నేహితులు, బంధువులతో కలిసి పార్టీలు చేసుకోవడాని బెస్ట్ ప్లేసుగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. ఈ ఇంటి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారట. పుట్టుకతోనే చాలా రిచ్ అయిన బన్నీకి ఇలాంటి ఇల్లు నిర్మించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.....


బాలకృష్ణ, నారా రోహిత్‌ 'క్షత్రియులు'.......

Balakrishna Nara Rohit Movie Title
నందమూరి బాలకృష్ణ, నారా రోహిత్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్లానింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ అంటూ ఒక టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ క్షత్రియుడు. అయితే బాలకృష్ణ,నార రోహిత్ ఇద్దరిలో ఎవరు క్షత్రియుడు టైటిల్ జస్టిఫై చేసేటట్లు కథ అల్లుతున్నారో తెలియలేదు. ఇక ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుందని తెలుస్తోంది. నారా రోహిత్ పర్శనల్ గా దగ్గరుండి ఈ స్క్రిప్టుని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తన కెరీర్ కి బ్రేక్ రావాలని నారా రోహిత్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే దర్శకుడు ఓ యవ డైరక్టర్ అని ...ఆయన్ని బాలకృష్ణ యాక్టెప్ట్ చేయాలని తెలుస్తోంది.

ప్రస్తుతం ఒక్కడినే షూటింగ్ లో ఉన్న రోహిత్ కి ఆ స్క్ర్రిప్టు బాగా నచ్చి వెంటనే చేయాలనే ఉత్సాహంతో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే బాలకృష్ణ.. మంచు మనోజ్ చిత్రంలో గెస్ట్ గా చేసి మల్టి స్టారర్ కి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో తన బంధువైన నారా రోహిత్ చిత్రం వెంటనే ఓకే అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం ఫ్యామిలీ ,యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య..శ్రీమన్నారాయణ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. అది తీరిక దొరకగానే స్క్ర్రిప్టు పూర్తిగా వినటం జరగుతుందని చెప్పారుట. ఇక ఈ చిత్రం ఓకే అయితే సోలో నిర్మాతలే దీన్ని నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది.

మాస్క్'లో సూపర్‌హీరోగా జీవా....

 

 నాకు తెలిసిన సూపర్‌హీరోలు అంటే ఎన్టీఆర్, ఎమ్జీఆర్. వారి సినిమాల నే ‘మాస్క్'లో ఆదర్శంగా తీసుకోవడం జరిగింది అని చెప్పారు మిస్కిన్ దర్శకత్వంలో జీవా తమిళంలో నటించిన చిత్రం ‘ ముగమూడి'. ఈ సినిమాను ‘మాస్క్' పేరుతో మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్ ప్రై.లిమిటెడ్ ద్వారా నిర్మాత ఆర్బీ చౌదరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 31న ‘మాస్క్' విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవా పై విధంగా స్పందించారు.

అలాగే ....‘మాస్క్'లో సూపర్‌హీరోగా చేశాను. అయితే ఆ పాత్రకు మానవాతీత శక్తులేం ఉండవు. తనలో అంతర్గతంగా దాగున్న ఓ మానవశక్తే ఆ పాత్రను సూపర్ హీరోను చేస్తుంది. గతంలో వచ్చిన కొన్ని సూపర్‌హీరోల చిత్రాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమాను మలిచామని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వాటికీ ‘మాస్క్'కీ సంబంధం ఉండదు. ఇది పూర్తి భిన్నమైన నేపథ్యం. కనిపించడానికి సూపర్‌హీరో సినిమాలా అనిపించినా... మన దేశానికి చెందిన భావోద్వేగాలన్నీ ఇందులో మెండుగా ఉంటాయి అన్నారు.

ఇక చాలా ఇంట్రిస్టింగ్ నేపథ్యంతో ఓ అద్భుతంగా మిస్కిన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 90 శాతం రాత్రి సమయంలోనే ఈ కథ నడుస్తుంది. హాంకాంగ్‌లో పేరిన్నికగన్న ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాకు పనిచేశాను. ఇందులో పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. కుంగ్‌ఫూలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలాగే సంగీత దర్శకుడు కె పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. టోటల్‌గా ‘మాస్క్' ఓ యూనివర్సల్ ఫిలిం అని జీవా తెలిపారు.




వర్మ ఆ రెండు సినిమాలు ఆగిపోయినట్లే?....

 


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో హడావిడిగా అమ్మ 3డి చిత్రం చేస్తానని ప్రకటించారు. అంతేగాక రానా ప్రధాన పాత్రలో అందం అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించారు. అయితే అమ్మ చిత్రానికి భారీ బడ్జెట్ అవటంతో ఆ సినిమా ఆపేసారు. ఆ తర్వాత దగ్గుపాటి రానా చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ కావటం,డిపార్టమెంట్ చిత్రం అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవటంతో వర్మ ఈ అందం చిత్రాన్ని మూలన పెట్టేసారని వినపడుతోంది. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం సత్య సీక్వెల్,భూత్ 2, 26/11 ముంబై ఎటాక్స్ సినిమాలపైనే ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో భూత్ చిత్రాన్ని తెలుగుకి డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు.

అజయ్ దేవగన్, ఊర్మిళతో రామ్ గోపాల్ వర్మ తీసిన హారర్ చిత్రం 'భూత్' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రానుంది. 'భూత్-2' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వర్మ త్రీడిలో రూపొందిస్తున్నారు. గతంలో అజయ్ దేవగన్, ఊర్మిళతో వర్మ తీసిన 'భూత్' సినిమా చక్కని విజయాన్నే సాధించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు వర్మ. 'భూత్-2' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వర్మ త్రీడీలో తెరకెక్కిస్తున్నారు.

హీరో హీరోయిన్లు పాడుబడిన బంగళానుండి బయటకు రావటం 'భూత్'లో చివరి సన్నివేశం. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న జె.డి.చక్రవర్తి, మనీషా కోయిరాలా ఆ బంగళాలోకి ఎంటరవటంతో సీక్వెల్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ. మనీషా కోయిరాల 'భూత్-2' తో రీ-ఎంట్రీ ఇస్తోంది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ సినిమాతో మళ్ళీ పాత వర్మను చూస్తారని హీరోగా నటిస్తున్న జెడి. చక్రవర్తి అన్నారు. ఇందులో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి మధుశాలిని నటిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

రామ్ గోపాల్ వర్మ,జెడీ చక్రవర్తి కాంబినేషన్ లో రూపొందిన సత్య అప్పట్లో ఓ సంచలనం. ముంబై మాఫియామీద వర్మ తీసన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ ని జాన్ అబ్రహం నిర్మించబోతున్నట్లు సమాచారం. విక్కీ డోనర్ చిత్రంతో నిర్మాతగా విజయం సాధించిన జాన్ అబ్రహం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉన్నారు. తన బ్యానర్ పై సీరియస్ సబ్జెక్టులు చేయాలనుకుంటున్నట్లు జాన్ తెలిపారు. అందులో భాగంగానే వర్మ నుంచి విన్న సత్య సీక్వెల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సత్య సీక్వెల్ లో జెడీ నటిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.


Monday, August 27, 2012

నిర్మాతగా గర్వంగా చెప్పుకునే చిత్రం శిరిడీ సాయి: నాగార్జున...


అక్కినేని నాగార్జున కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ.. తనూ కొత్త పాత్రలను పోషిస్తుంటాడు. అవే నటనను పురిగొల్పుతాయని అంటున్నారు. నలుగురు నడిచిన దారిలో కాకుండా నలుగురికి దారి చూపించే దిశగా ఆయన పాత్రలు పోషిస్తుంటారు. క్లాస్‌ మాస్‌ కాకుండా పెద్దలకు భక్తి భావాన్ని పెంపొందించే పాత్రలనూ చేస్తున్నారు. తాజాగా శిరిడీ సాయి పాత్రను పోషించారు.

నాగార్జున పుట్టిన రోజు ఈ నెల 29. అంటే బుధవారం. సోమవారం ఆయన్ను అన్నపూర్ణ స్టూడియోలో కలిశాం. ముందుగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాం. వెబ్‌దునియా పేరు చెప్పగానే... దునియా అంతా మీదే అంటూ.. ఛలోక్తి విసిరారు. ఈ సందర్భంగా ఆయన వెబ్‌దునియాకు పలు విషయాలను తెలియజేశారు.

శిరిడీసాయి గురించి ఏమయినా ప్రత్యేకతలు తీసుకున్నారా?
కె. రాఘవేంద్రరావు చెప్పినట్లే చేశాను. నిజానికి ఈ సినిమా ఆరంభానికి ముందు పెద్దగా తెలియదు. వినడం తప్ప. శిరీడీ కూడా వెళ్లనూలేదు. కానీ అనూహ్యంగా ఓసారి శిరీడీ వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చాక రాఘవేంద్రరావు కథ చెప్పారు. ఆ క్షణం నుంచి ఏదో రూపంలో బాబా అనుగ్రహం లభిస్తూనే ఉందని చెప్పారు. ఈ చిత్రాన్ని అన్నమయ్య, రామదాసులతో పోల్చకూడదు. ఇది సాయి చరిత. హావభావాలు, వేషధారణ కోసం.. గత బాబా సినిమాలు చూడమన్నా.. చూడలేదు. దర్శకునిపై నమ్మకంతో చేశాను. అన్నమయ్య తర్వాత 15 ఏళ్ళకు ఈ సినిమా చేశాను.

అభిమానుల నుంచి స్పందన ఎలా ఉంది?
కొత్తగా ఏం చేసినా అభిమానులు స్వీకరిస్తారు. ఎంకరేజ్‌ చేస్తారు. నా కెరీర్‌లో జరుగుతుంది అదే. కలెక్షన్ల గురించి వారు మాట్లాడుకోరు. అభిమానుల పేరుతో ఏదో మాస్‌ మసాలా చేశాక రిజల్ట్‌ రాకపోతే వేస్టేగదా. వారికి కావాల్సింది మంచి సినిమా. అది చేస్తుంటాను.

శిరిడీ సాయి పాత్రలు యూత్‌కు నచ్చుతాయంటారా?
అసలు బాబా భక్తుల్లో ఎక్కువమంది యువతే. శిరిడీలోనే కాదు ఎక్కడ బాబా దేవాలయాలున్నా అంతా వారే కన్పిస్తారు. యువతలో ఆధ్యాత్మిక చింతన కన్పించడం నాకు ఆశ్చర్యమేసింది.

హీరోలకు ఒక ఇమేజ్‌ ఉంటుంది. ఈ విషయంలో మీ ఆలోచన ఏమిటి?
నటుడికి ఇమేజ్‌ అనేది లేకపోతే స్టార్‌ కాలేరు. అయితే ఆ కథ చేస్తే ఇమేజ్‌ వస్తుందేమోనని ఆతృత నాలో లేదు. నలుగురు మెచ్చిన కథ అయితే చాలు. ప్రేక్షకుల్ని మెప్పించే ఇమేజ్‌ కంటే ఇంకేం కావాలి చెప్పండి. నేను స్టార్‌ అయినా భిన్నంగా కథలు చేయడం ఆదరించడం అదృష్టంగా భావిస్తున్నాను.

మీ బేనర్‌లో వచ్చిన రాజన్న ఫలితం ఎలాగుంది?
ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. బిజినెస్‌ పరంగా పెద్దగా వర్కవుట్‌ కాలేదు. ఇటీవలే టీవీలో కూడా వేసేశారు. చూసివాళ్లు ఫోన్లు చేసి నటుడిగా ధన్యుడివయ్యావని, తెలిసినవారు మెచ్చుకుంటుంటే అంతకంటే కావాల్సింది ఏముంది..? నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్‌లో రావడం ఇప్పటికీ గర్వంగా ఫీలవుతున్నా. ఆ చిత్రాన్ని చలనచిత్రోత్సవాలకు కూడా పంపించాలి.

ఇప్పుడు కొత్త గెటప్‌లో లవ్‌స్టోరీ చేస్తున్నారే?
అవును. అది పరిణితితో కూడిన కథ. నాదైన శైలిలో ఉంటుంది. దర్శకుడు దశరథ్ దాన్ని చక్కగా చెబుతున్నారు.

డమరుకం ఆలస్యానికి కారణం?
ఇది దేవుడికి మనిషికి సంబంధించిన కథే అయినా భక్తుడి కథ కాదు. 'డమరుకం' చిత్రం చిత్రీకరణ పూర్తయింది. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా బాగా తీశాడు. అయితే కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వల్ల రిలీజ్‌ ఆలస్యమైంది. నిర్మాత ఆర్‌.ఆర్‌. వెంకట్‌ రాజీ లేకుండా ఖర్చుచేశారు. సోసియో ఫాంటసీ కథలో మాస్‌ మసలాను అద్భుతంగా మిక్స్‌ చేసి దర్శకుడు తెరకెక్కించారు. నా 25 ఏళ్ల కెరీర్‌లో ఎవరూ చేయని కొత్త తరహా చిత్రమిది. బ్యాలెన్స్‌ పాటను ఈ నెల 30 నుంచి చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నాం.

మాఫియా చిత్రం చేస్తున్నారు?
అవును. భాయ్‌ అనేది టైటిల్‌. అయితే మాఫియా కథ కాదు. హలో బ్రదర్‌లా ఎంటర్‌టైనర్‌. వీరభద్రమ్‌ కథ చెప్పాడు. కానీ టైటిల్‌ అలా ఉంటుంది అంతే.

మూడు తరాలు నటించే చిత్రం ఎంతవరకు వచ్చింది?
కొంత సమయం పడుతుంది. ఎందుకంటే విక్రమ్‌ కె.కుమార్‌ కథ చెప్పాడు. బాగా నచ్చింది. అయితే దానికి కొన్ని మెరుగులు దిద్దాలి.

అఖిల్‌ రంగప్రవేశం?
ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. సినిమా అంటే ఇంట్రెస్ట్‌.. ఇటీవలే వాళ్ళమ్మ నటించిన సినిమా షూటింగ్‌కు వెళ్లాడు. చూశాక.. షూటింగ్‌ అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. శేఖర్‌ కమ్ముల చెప్పిన కథ నచ్చి లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌లో నటించింది.

ఫిల్మ్‌ స్కూల్‌ విశేషాలు?
మనదగ్గర సాంకేతిక నిపుణుల కొరత ఉంది. సినిమా రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. రాబోయే ఐదేళ్ళలో డిజిటల్‌ విధానం వస్తుంది. 24 క్రాఫ్ట్‌లోనూ ఆ మార్పులు కన్పిస్తున్నాయి. అందుకే కొత్త పద్ధతులు తెలుసుకోవాలి. ఎక్కడో విదేశాల్లోనో, ముంబై ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్‌లో చేరువలో ఉండాలని ఫిల్మ్‌ స్కూల్‌ స్థాపించాం. మంచి నిపుణులు తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నాం.

మరి మీ బేనర్‌లో చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
ఉంది. మా బేనర్‌లో చేస్తూ.. ఫిల్మ్‌ స్కూల్‌ వారిని ఇన్వాల్వ్ చేస్తూ తీస్తున్నాం. భాయ్‌ చిత్రం పూర్తిగా మా బేనర్‌తోపాటు మా విద్యార్థులు పని చేస్తున్నారు. మంచి కథ, కథనాలు దొరికితే చిన్నచిన్న చిత్రాలు కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాం.. అని ముగించారు.