Tuesday, July 31, 2012

మహేష్ బాబు బర్తడే సందర్భంగా రిలీజ్.......

Svsc Second Trailer Release August 9
సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు.
ఆ మధ్య సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ ట్రైలర్‌ను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఈ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో రాముడు, లక్ష్మణుల పాత్రల్లా ఉంటాయి వెంకటేష్ మహేష్ బాబు పాత్రలు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

ప్రస్తుతం ఈచిత్రం షూటింగుకు బ్రేక్ ఇచ్చాడు. కూతరు సితార పుట్టిన ఆనందంలో ఉన్న సూపర్ స్టార్...కొన్ని రోజుల పాటు ఆమెతో గడిపేందుకు షూటింగుకు శెలవు పెట్టారు. తన పుట్టినరోజు వేడుక అనంతరం బహుషా తిరిగి షూటింగులో పాల్గొనే అవకాశం ఉంది.

పెళ్లి చేసుకోబోతున్న సల్మాన్ ఖాన్?..........

Salman Khan Wants Get Married Soon
వయసు యాభై ఏళ్లకు చేరువవుతున్నా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్న సంగతి తెలిసిందే. తను ఎంతగానో ప్రేమించిన ఐశ్వర్యరాయ్ తనను కాదనడమే కాకుండా, పిచ్చోడిగా ముద్ర వేసిందనే బాధతో సల్లూ భాయ్ చాలా కాలం స్ట్రగుల్ అయ్యాడు. ఆ తర్వాత కత్రినా కైఫ్, మరికొందరు అందగత్తెలతో సల్లూ భాయ్ ఎఫైర్లు నడిపారు.

సల్మాన్ దుసురు స్వభావం వలనే అన్ని బెడిసి కొట్టాయనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఎఫైర్లకు దూరంగా ఉంటున్న సల్మాన్ మెల్లిమెల్లిగా వరుస హిట్లతో టాప్ హీరో పొజిషన్‌కి వెళ్లాడు. ఇప్పటి వరకు పెళ్లి జోలికి పోని ఈ హీరో....త్వరలో ఓ ఇంటి వాడవుతున్నట్లు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం సల్లూభాయ్‌కి ఇంట్లో వాళ్లు సంబంధాలు చూసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా వాళ్లను కాకుండా మంచి కుటుంబం నుంచి సల్మాన్‌కి పిల్లను వెతికే ప్రయత్నంలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ..... జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండాలనే ఆలోచన లేదని సమాధానం ఇచ్చారు. నన్ను ప్రేమించే అమ్మాయిలు ఉన్నారనే క్లూ కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరమే ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈగకు కళ్లెం వేయలేక పోయిన బాలయ్య మూవీ!......

Ukup Fails Slow Down Eega Pace At Usa Bo
నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య పాత్రలో మంచు మనోజ్, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రానికి తొలి వారాంతం బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ చిత్రంతో పాటు విడుదలైన రాజేంద్ర ప్రసాద్ ‘ఓనమాలు' చిత్రాన్ని కలెక్షన్ల పరంగా వెనక్కి నెట్టేసిన బాలయ్య, మనోజ్ సినిమా గతంలో రిలీజ్ అయిన రాజమౌళి ‘ఈగ' చిత్రం జోరును మాత్రం తగ్గించ లేక పోయింది.
యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం...జూలై 27న విడుదలైన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా' పరిమిత సంఖ్య గల స్క్రీన్లలో అమెరికా వ్యాప్తంగా విడుదలైంది. గడిచిన వీకెండ్ లో ఈచిత్రం రూ 38.09 లక్షలు ($ 68,722) కలెక్షన్లు సాధించింది.

దీంతో పాటు రిలీజైన మరో తెలుగు చిత్రం ‘ఓనమాలు' చిత్రం క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూ రేటింగుల పరంగా మంచి టాకే వచ్చినా పరిమిత సంఖ్య గల స్క్రీన్లలో విడుదలై యావరేజ్ రెస్పాన్‌తో కలెక్షన్ల పరంగా మాత్రం వీకైంది. ఈ చిత్రం గడిచిన వీకెండ్‌లో రూ. 1.80 లక్షలు ($ 3,243) మాత్రమే వసూలు చేసింది.

అయితే జూలై 6న విడుదలైన రాజమౌళి గ్రాఫికల్ వండర్ చిత్రం ‘ఈగ' మాత్రం దాదాపు 25 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ చివరి వీకెండ్‌లో ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. 25 రోజులు గడిచేనాటికి యూఎస్ బాక్సాఫీసులో ఈగ కలెక్షన్లు రూ. 5.87 కోట్లకు చేరుంది. యూఎస్ఏ బాక్సాఫీసు చరిత్రంలో ఒక తెలుగు సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించడం రికార్డు.

నా పేరు నాగార్జున...నన్ను అలానే పిలవండి .......

"నా పేరు నాగార్జున. ఇక నుంచి కూడా అలానే పిలవండి. సాయి నాగార్జున, నాగ్‌ సాయి.. ఇలాంటి పేర్లతో పిలవొద్దు" అన్నారు నాగార్జున. నాగార్జున 'శిరిడిసాయి'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ.మహేష్‌రెడ్డి నిర్మాత. కీరవాణి స్వరాలు అందించారు. ఈ సినిమాలోని గీతాలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు.
nagarjuna s shirdi sai audio released
"నేను నటించిన 'శిరిడిసాయి' సినిమా పెద్ద విజయం సాధించాలని ప్రత్యేకంగా కోరుకోను. ఎందుకంటే... బాబా ఎప్పుడో హిట్‌. కోట్లాది భక్తుల హృదయాలలో స్థానం సంపాదించుకొన్నారు. సాయి పాత్ర పోషించడం నా అదృష్టం. ఈ సినిమా ఒప్పుకొన్న తరవాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. సాయి తత్వం బోధపడింది. ఎదుటి వారి సంతోషమే మన సంతోషం అనే విషయం అర్థమైంది. అమ్మ దూరమయ్యాక నాన్నగారిలో చిరునవ్వే చూడలేకపోయా. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయనలో సంతోషం మొదటిసారి చూశా. ఆయన నవ్వు నాకో వరం. ఈ సినిమాలోని పాటలన్నీ బాగున్నాయ''అని నాగార్జున చెప్పారు.

అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ''సినిమా తీయడం అంటే మాటలు కాదు. నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఇంత మంచి సినిమా తీయడానికి ధైర్యం చేసిన నిర్మాతలు ధన్యులు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు. మంచి చేసే మనసులోనే దేవుడు ఉంటాడనేది నేను నమ్మే సిద్ధాంతం. నిజమైన భక్తి అంటే తనను తాను అర్పించుకోవడం. భక్తిభావం అనేది వేషధారణలో ఉండదు. కళ్లతో పలికించాలి. అదెలాగో నాగార్జునకు బాగా తెలుసు. కీరవాణి పాటలు ఆహ్లాదకరంగా ఉన్నాయని''అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ... ''నా సినిమాలకు కీరవాణి మంచి బాణీలు ఇస్తారని అందరూ అనుకొంటారు. కానీ నాగార్జున సినిమాలకే ఆయన అదిరిపోయే పాటలిచ్చారు. 'అన్నమయ్య' పతాక సన్నివేశాల్లో వచ్చే 'అంతర్యామి..' పాట తెలుగు సినిమాల్లోనే ఓ అద్భుతం. ఈ సినిమాలోని 'వస్తున్నా బాబా' అనే గీతం కూడా ఆ స్థాయిలో ఉంటుంది''అన్నారు .

''ఇందులో దాసుగుణ మహరాజు పాత్ర పోషించా. ఈ సినిమా ఒప్పుకొన్న తరవాత మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటోంద''ని చెప్పారు శ్రీకాంత్‌. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''సాయి తత్వాన్ని వెండితెరపై చెబుదామనేది మా లక్ష్యం. అది రాఘవేంద్రరావు ఎంతో అందంగా తీర్చిదిద్దారు''అన్నారు. కీరవాణి స్పందిస్తూ ''నా పాటల ద్వారా స్వరాభిషేకం చేసే శుభఘడియ ఈ సినిమా ద్వారా వచ్చింది. నాగార్జున బాబాగా ఒదిగిపోయారని'' అన్నారు.
ప్రముఖ గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ ''నాగార్జున నాకిష్టమైన నటుడు. నిజ జీవితంలో ఎలాంటి ఈగోలు లేని వ్యక్తి. ఈ సినిమాలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా ఉంది''అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, లోక్‌సభ సభ్యులు మధుయాష్కీ, సినీ ప్రముఖులు అమల, నాగచైతన్య, అఖిల్‌, డి.సురేష్‌బాబు, అల్లు అతరవింద్‌, అశ్వనీదత్‌, దిల్‌ రాజు, ఎస్‌.గోపాలరెడ్డి, కమలినీ ముఖర్జీ, పరుచూరి బ్రదర్స్‌, చంద్రబోస్‌, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో నాగ్ ‘లవ్ స్టోరీ’ శాటిలైట్ రైట్స్!........

Nag Love Story Satellite Rights Rs 6 Cr
కింగ్ నాగార్జున్, సౌతిండియా బ్యూటీ నయనతార కలిసి నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ'. నాగార్జున కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈచిత్రం శాటిలైట్స్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో రూ. 6 కోట్లు చెల్లించేందుకు ప్రముఖ తెలుగు రీజనల్ ఛానల్ ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది.

నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సదరు చానల్ ముందుకు వచ్చినట్లు సమాచారం.

ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. త్వరలో ఈచిత్రం యు.ఎస్ లో 40 రోజుల భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. అనీల్ బండారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం.
నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

కెమెరామేన్ గంగతో రాంబాబు' బిజినెస్ రికార్డు........

Pawan S Cgr East Godavari Rights At All Time High
పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం బిజినెస్ మొన్న అల్లు అరవింద్ నైజాం తీసుకోవటంతో ఓ రేంజిలో మొదలైంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి రైట్స్ ని ఆర్.ఆర్.ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వారు ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు రెండున్నర కోట్లు ఈ ఏరియో కోసం వారు ఇస్తున్నట్లుగా ట్రేడ్ లో వినపడుతోంది. ఈ మొత్తం ఆ ఏరియాకి పెద్ద రికార్డే.

ఈ చిత్రం ప్రారంభమైన నాటి నుంచీ బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందులోనూ గబ్బర్ సింగ్ చిత్రం యాభై రోజులకే అరవై మూడు కోట్లు వసూలు చేయటంతో ఆ ఎఫెక్టు ఈ తాజా చిత్రంపై పడనుంది. ఈ నేఫద్యంలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు'రిలీజ్ కు ముందే దాదాపు యాభై కోట్ల వరకూ బిజినెస్ జరగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. తెలుగులో పాటు,తమిళ,మళయాళ భాషల్లో ఒకే సారి విడుదల చేయాలని దర్సక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు డబ్బింగ్,మిగతా పనులును వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా మూడు భాషల్లో విడుదల అవుతున్న పవన్ చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి ఇదో రికార్డు.
ఇక ఈ చిత్రం పద్మాలయా స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారి సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఓ స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్ ని అక్కడ వేసారు. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. మొన్నటివరకూ సారధిలో వేసిన మెకానిక్ షెడ్ లో సీన్స్ పూర్తి చేసారు.
'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.

Monday, July 30, 2012

డైరక్టర్ శ్రీను వైట్లకు ఎన్టీఆర్ ఆ గిప్ట్.....

Ntr Jr Presents Gift Sreenu Vaitla
జూ.ఎన్టీఆర్,శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం బాద్షా. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ..శ్రీను వైట్ల దర్శకత్వపు స్కిల్స్ నచ్చి ఓ కాస్ట్ లీ వాచ్ ని గిప్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని రచయిత గోపీ మోహన్ మైక్రో బ్లాగింగ్ సైట్ లో తెలియచేసారు. ఆయన రాస్తూ..బాద్షా ఎన్టీఆర్ ...టాకీ షెడ్యూలు పూర్తైన సందర్భంగా సంతోషంగా ఓ అందమైన,అద్బుతమైన వాచ్ ని ప్రజెంట్ చేసారు. శ్రీను వైట్ల కూడా అందుకు ప్రతిఫలంగా ఓ బ్లాక్ బస్టర్ ని ఎన్టీఆర్ కి గిప్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని రాసుకొచ్చారు. 2013 సంక్రాంతికి విడుదల అయ్యే ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
మొదటి షెడ్యూల్ ని దూకుడు తరహాలోనో ఫారిన్ షెడ్యూల్ తో అంటే ఇటిలీలో ప్రారంభించారు. తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. అక్కడే రెండు పాటలు కాజల్,ఎన్టీఆర్ మధ్యన తీయనున్నారు. అలాగే ఎమ్.ఎస్ నారాయణ,కాజల్,వెన్నెల కిషోర్,ఎన్టీఆర్ మధ్యన కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని తీస్తున్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఇక ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు. ఇక అందుకోసం ప్రత్యేకంగా ముంబై నుంచి మేకప్ స్పెషలిస్టులు వచ్చి మరీ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన ఫోషో సెసన్స్ కూడా నడిచాయి. దాంతో ఆ క్యూరియాసిటీ పోకుండా ఫస్ట్ లుక్ వదిలేవరకూ ఎన్టీఆర్ పబ్లిక్ లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.

మెకానిక్ గా నాగచైతన్య హైలెట్ అవుతారు..........

Naga Chaitanya Plays Skilled Mechanic In Autonagar
దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆటోనగర్ సూర్య'. ఈ చిత్రంలో నాగచైతన్య స్కిల్ డ్ మెకానిక్ గా కనిపించనున్నారు. మూడు రోజుల టాకీ పార్ట్ మినహా చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దర్శకుడు దేవకట్టా మాట్లాడుతూ.."మా సినిమాకు విజయవాడకి ప్రత్యేకంగా కనెక్షన్ ఏమీ లేదు. ఆటోనగర్ అనేది అక్కడ ఆటో మొబైల్ కమ్యూనిటీ బిజినెస్ సెంటర్. మెకానికల్ బిజినెస్, పొలిటికల్ ఇంటర్ లింక్ లతో కథనం నడుస్తుంది" అన్నారు.

నాగాచైతన్య పాత్ర గురించి వివరిస్తూ... "చైతూ ఈ చిత్రంలో స్కిలెడ్ మెకానిక్ గా కనిపించనున్నారు. పూర్తిగా హీరో సెంట్రిక్ స్క్రిప్టు ఇది. ప్రస్దానం కన్నా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అన్నారు. ఇక దేవకట్టాకు డైలాగ్స్ విషయంలో మంచి గ్రిప్ ఉందని గతంలో ప్రస్దానం నిరూపించింది. ఆ చిత్రంలో లోతైన భావమున్న డైలాగులుకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ చిత్రకు మొదట ఆడియో టీజర్ విడుదల చేసి మరీ క్రేజ్ క్రియేట్ చేసారు" అన్నారు.
ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో డైలాగును కూడా వినిపించారు. అది ... "చూడు బాబాయ్ కొట్టుకు చావటానికి మన మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు, భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కడికి ఒక హక్కు ఉంది ...తెలిసిన పని చేసుకుంటూ అడగడమ్...కానీ ఆ హక్కుని కబ్డా చేసుకుంటూ అడగడమ్ నీ హక్కు అనుకుంటున్నా..హిస్టరీ లో జరిగిన ప్రతీ పోరాటానికి,యుద్దానికి ఇదే కారణం... అవును బాబాయ్ నేను అనాధనే కానీ అనామకుడ్ని కాదు నా పేరు సూర్య...ఆటో నగర్ సూర్య..."

ఇక ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే...విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్‌ సూర్య' చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది.
ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

‘ఊ కొడతారా...’ ఫస్ట్‌ డే, సెకండ్ డే కలెక్షన్స్........

Ukup 1st Day 2nd Days Collections

వినాయక్ చిత్రంలో రామ్ చరణ్ గెటప్ ఇదే..........

Ram Charan Teja Fights Baddies On The Hooghly Ghats
 ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కి సెంటమెంట్స్ ఎక్కువ అని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తూంటారు. అదే కోవలో తనకు బాగా అచ్చి వచ్చిన కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ప్రస్తుతం రామ్ చరణ్ తో షూట్ చేస్తున్నారు. మొన్న శుక్రవారం నుంచి కోలకతా లో షూటింగ్ మొదలైంది. అక్కడ ప్రస్తుతం ప్రదీప్ రావత్ తో, కొంతమంది బ్లాక్ కమెండోలతో షూట్ చేస్తున్నారు. జూలై 22 న మొదలైన ఈ షూటింగ్ లో రామ్ చరణ్ శుక్రవారం నుంచి పాల్గొంటున్నారు. అక్కడే జూలై 30 వరకూ జరుగుతుంది. ఆషిష్ విధ్యార్ది,బ్రహ్మానందం,కాజల్ పైన వచ్చే సన్నివేసాలు కూడా అక్కడ నెక్ట్స్ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. అక్కడ షూట్ చేస్తూండగా తీసిన ఫోటో ఇది.

గతంలో వివి వినాయక్ చిత్రాలైన అదుర్స్,లక్ష్మి కూడా కోలకతా బ్యాక్ డ్రాప్ లో చేసి విజయం సాధించారు. దాంతో తనకు లక్కి ఛామ్ గా వినాయక్ ..కోలకతాని భావిస్తున్నారు. ఈ చిత్రం కూడా బాగా వర్కవుట్ అవుతుంని చెప్తున్నారు. పూర్తి కామెడీ, యాక్షన్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫైట్స్ ని కనల్ కన్నన్ చిత్రీకరిస్తున్నారు. పైట్ కోసం కాకుండా ఈ సిటీ బ్యాక్ డ్రాప్ లో కథకు లింక్ ఉందని అందుకే ఇక్కడ షూట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. చెర్రీ అనే టైటిల్ ని ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు.

రామ్‌చరణ్‌ ఇక మాస్‌ని ఆకట్టుకొనే కథలతోనే తెరపైకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడాయన యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మించే చిత్రంలో నటిస్తున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకుడు. ఈ చిత్రంలో కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్. డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం కోల్‌కతాలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 21 నుంచి అక్కడ పోరాట దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్‌ చేయనున్నారు. ''మాస్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్‌ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్‌' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్‌ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్‌ చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదకు వస్తుంది. సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు.

చిరంజీవికి పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్..........

Pawan Kalyan Birthday Gift Chiranjeevi
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలు లేవనే పుకార్లు గత కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లను పటా పంచలు చేయడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు. అన్నయ్య బర్తడే(ఆగస్టు 22) వేడుకలను ఘనంగా చేయాలని, అదే సందర్భంలో తన తాజా చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ వేడుకలకు యూనిట్ సభ్యులు ఎవరూ మిస్ కాకూడదని పవన్ కళ్యాణ్ ఆర్టర్ వేసినట్లు, అభిమానులు కూడా భారీ ఎత్తున హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ భారీ విజయంతో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. గతంలో పవన్-పూరి కాంబినేషన్లో బద్రి సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. దీంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో హిట్టయిన ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మాస్ ఆడియన్స్ మెచ్చే డైలాగులు రాయడంలో మంచి అనుభవం ఉన్న పూరి ఈచిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో కేక పెట్టించే డైలాగులు రెడీ చేశాడు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల స్థలంలో జరుగుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్‌పై పాట చిత్రీకరణ జరుగుతోంది.
అక్టబోర్ 18న విడుదల చేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని వివిధ స్టూడియోల్లో శరవేంగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

'రెబల్‌' ఫస్ట్ లుక్ టీజర్, ఆడియో రిలీజ్ డేట్స్..........

Rebel First Look Teaser Releasing On
ప్రభాస్ తాజాగా చేస్తున్న చిత్రం 'రెబల్‌'. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ఆగస్ట్ 2 న విడుదల చేయనున్నారని సమాచారం. అళాగే ఆడియోని ఆగస్టు 18న,సినిమాని సెప్టెంబర్ సెకండ్ వీక్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా, దీక్షాసేథ్‌ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల కోసం రూ.2 కోట్ల వ్యయమైంది. ప్రత్యేకంగా కాళీమాత విగ్రహాన్ని తయారుచేయించారు. స్వరాల బాధ్యతను కూడా లారెన్స్‌ తీసుకొన్నారు.


దర్శకుడు లారెన్స్ చిత్రం గురించి మాట్లాడుతూ... "రెబల్‌గా ముద్రపడ్డ ఓ యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే ఎలా ఉంటుందనేదే మా రెబెల్ చిత్రం. అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది. మా హీరో నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే" అన్నారు.
అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెపుతూ.. "లాభనష్టాల గురించి అతను ఆలోచించడు. కేవలం మంచి చెడులే ముఖ్యమంటాడు. గెలుపోటములపై అతనికి బెంగ లేదు. తిరుగుబాటు చేసి పోరులో నిలవడమే అవసరమంటాడు. అందుకే అతను రెబల్‌గా ముద్రవేయించుకున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఇంతగా తిరగబడ్డ ఆ పోరు బిడ్డ ఎవరు? అతని అసలు లక్ష్యమేమిటి? తదితర విషయాలు మా సినిమాలో చెప్తున్నాం. అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు" అన్నారు.

ప్రభాస్ ఈ చిత్రం గురించి చెపుతూ.. "షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా" అని ప్రభాస్ చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా

భార్య పుట్టిన రోజుకు రామ్ చరణ్ ఇచ్చిన సర్పైజ్ గిప్ట్.....

What Ram Charan Teja Gifted His Wife For Her Birthday
రామ్ చరణ్ తేజ తన బార్య ఉపాసన వివాహం అయ్యాక జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజుకు ఓ ఆశ్చర్యకరమైన గిప్ట్ ఇచ్చి సర్పైజ్ చేసారు. ఐర్లాండ్ నుంచి తెప్పించిన మినియేచర్ లాంటి అతి చిన్న గుర్రం ఆమెకు ప్రెజెంట్ చేసారు. ఆమె ఈ గిప్ట్ తీసుకుని తన పుట్టిన రోజుకు ఇన్నాళ్లలో ఇంత అధ్బుతమైన గిప్ట్ రాలేదని చెప్పటం అతనికి ఆనందాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ... "ఆమెను ఓ ఖరీదైన డైమండ్ నక్లెసో, లేక కారో గిప్ట్ గా ఇచ్చినా ఇంతలా సంబరపడేది కాదు" అన్నారు.

అలాగే... "ఆమె పుట్టిన రోజు నా జీవితంలో ఓ స్పెషల్ మూవెమెంట్. నేను దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల పాటు ఈ గిప్ట్ ని ఎంపిక చేసి ఐర్లాండ్ నుంచి తెప్పించటానికి శ్రమ పడ్డాను. నా శ్రమ నాకు ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ఈ గిప్ట్ కోసం చిరంజీవి ప్యామిలీ కూడా దృష్టి పెట్టింది. ఇది అరుదైన బ్రీడ్. ఓ సైలర్ ప్రెండ్ ఈ గుర్రం సరైన సమయానికి తెచ్చివ్వటానికి సహాయపడ్డారని చెప్తున్నారు. ఈ గుర్రం 31 ఇంచెలు దాకా పెరుగుతుంది. అలాగే పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు దాకా లైఫ్ స్పాన్ తో బ్రతుకుతుంది" అన్నారు.

ఇంకా ఇదే విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ "మా అమ్మ మా ఇంటి వెనకాల ఉండే ఆమె గార్డెన్ లో ఈ గుర్రంకి ఎయిర్ కండీషన్ తో ఓ షెల్టర్ కట్టించటానికి ఒప్పుకుంది. ఈ గుర్రం మా కుటుంబానికి ఓ గర్వ కారణం. ఇప్పటివరకూ మా మదర్ నా గుర్రాలను వేటినీ ఆ గార్డెన్ లోకి రానివ్వలేదు. కానీ దీనికి పర్మిషన్ ఇచ్చింది అన్నారు. ఈ గుర్రం తనకీ, తన భార్యకి, కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇస్తోందని, చాలా ముద్దుగా ఆ గుర్రం ఉందని" చెప్పుకొచ్చారు.
ఇక తన ట్విట్టర్ ఎక్కౌంట్ క్లోజ్ చేసిన విషయమై మాట్లాడుతూ.. "ట్విట్టర్ ఎక్కౌంట్ రకరకాల సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా నా ప్రెవసీని దెబ్బకొడుతోంది. నేను ప్రత్యేకంగా నా స్నేహితులని ఎవరైనా భర్తడే విషెష్.. ట్విట్టర్ లో చెపితే.. ఫోన్ చేయకండా ట్విట్టర్ లో పెడుతున్నాడు... ఆ స్టార్ తో నాకు విభేధాలు వచ్చాయంటూ పెడర్దాలు తీస్తున్నారు. దాంతో నేను మళ్లీ వివరణ ఇఛ్చుకోవాల్సి వస్తోంది. వీటిన్నటి కన్నా నా రిలేషన్స్ నిలుపుకోవటానికి ట్విట్టర్ ఎక్కౌంట్ డిలేట్ చేయటమే బెస్ట్ అనిపించింది" అని చెప్పారు.

ప్రియమణి 'చారులత' స్టోరీ లైన్ ఏంటి?.....

About Priyamani Charulatha Story
ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన చిత్రం 'చారులత'. పొన్ను కుమరన్‌ దర్శకత్వంలో తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో ఇది రూపొందింది. చిత్రం కథ విషయానికి వస్తే''పుట్టుకతోనే ప్రియమణిది తన సోదరితో విడదీయలేని బంధం. ఎందుకంటే శరీరాలు కలిసి జన్మించిన అవిభక్త కవలలు వారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంపై ప్రేమ అనే అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే అసలు కథ. అందులో ఒకరు విలన్ గా మారి మరొకరి జీవితంతో ఆడుకుంటారు. ఎవరు విలన్, ఎందుకలా నెగిటివ్ గా మారారు అన్నది మిగతా కథ.

అవిభక్త కవలలుగా ప్రియమణి నటన అందర్నీ ఆకట్టుకొంటుంది. ఉత్కంఠ కలిగించేలా ఉంటుందీ హారర్‌ చిత్రం. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని''అని నిర్మాత చెప్తున్ననారు. ‘చారులత' చిత్రంలో ప్రియమణి ఈ కవలల పాత్ర చేస్తున్నారు. థాయ్ చిత్రం ‘అలోన్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు ‘చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సాధించారు ప్రియమణి. ఆమెకు మరో జాతీయ అవార్డుని తెచ్చిపెట్టే చిత్రం ఇది అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి సినిమా మొత్తం చారు, లత అతుక్కునే ఉంటారా లేక శస్త్ర చికిత్స ద్వారా విడదీస్తారా? అనేది ప్రస్తుతానికి సీక్రెట్. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు.

ఒక సన్నివేశంలో దుడుకుగా, ఆ వెంటనే అమాయకంగా నటించడం అంత సులువు కాదని, దర్శకుడి సహకారంతో చేస్తున్నానని ప్రియమణి పేర్కొన్నారు. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్'కి ఉత్తమ నటిగా ప్రియమణి జాతీయ అవార్డు అందుకున్నారు. ‘చారులత' మరో జాతీయ అవార్డు తెచ్చిపెట్టడం ఖాయం అని కన్నడరంగం వారు అంటున్నారు. ఈ చిత్రంలో సీత, శరణ్య, ఆర్తి తదితరులు నటిస్తున్నారు. గీతా ఫిలిమ్స్‌ ద్వారా ఈ సినిమా విడుదలవుతుంది. ఛాయాగ్రహణం: ఎన్‌.వి.పన్నీర్‌ సెల్వం, సంగీతం: సుందర్‌ సి.బాబు.

Saturday, July 28, 2012

సల్మాన్, హృతిక్‌లను టార్గెట్ చేసిన ‘ఈగ’.......

Eega Dance Like Salman Hrithik Makki
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ' చిత్రం హిందీలో ‘మక్కి' పేరుతో విడుదలవ్వనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇందుకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ మొదలు కానుంది. ఈగ తెలుగు వెర్షన్‌లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ స్టెప్పులేసింది.
అయితే హిందీలోనూ అదే సీన్లు పెడితే అక్కడి ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున....బాలీవుడ్ టాప్ హీరోల డాన్స్ ను ఇమిటేట్ చేసేలా ఆ సీన్లను మోడరేట్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ల డాన్స్‌ను ఈగతో చేయిస్తారట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు.
ఇప్పటికే ఈగ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయం సాధించడంతో హిందీలోనూ కాసుల వర్షం కురిపిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. బాషా బేదం లేకుండా ఈ గ్రాఫికల్ వండర్ చిత్రాన్ని చూసేందుకు తెలుగు, తమిళం తెలియని ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ చిత్రాన్ని కొన్ని చోట్ల ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో విడుదల చేశారు.

‘గబ్బర్ సింగ్’ 75 డేస్ సెంటర్స్.......

Gabbar Singh 75 Days Centers
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం విజయవంతంగా 75 డేస్ పూర్తి చేసుకుని 100 రోజుల దిశగా దూసుకెలుతోంది. నేటికి సినిమా విడుదలై 79వ రోజు. ఇప్పటికే ఈచిత్రం కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 గ్రాసర్‍‌గా నిలిచింది. అదే విధంగా 306 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.
75 డేస్ సెంటర్స్ విషయానికొస్తే...మొత్తం 87 సెంటర్లలో ఈచిత్రం ప్రదర్శింపబడినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం : 16
సీడెడ్ : 26
నెల్లూరు : 01
కృష్ణా : 06
గుంటూరు : 10
వైజాగ్ : 12
ఈస్ట్ గోదావరి : 12
వెస్ట్ గోదావరి : 05
మొత్తం : 87

శ్రీదేవి సినిమాలో అతిథి పాత్రలో ‘బిల్లా’.....

Ajith Kumar Cameo Sridevi English Vinglish
ఒకప్పటి అందాల తార శ్రీదేవి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'ఇంగ్లిష్ వింగ్లిష్" చిత్రం ద్వారా ఆమె మళ్లీ రంగుల సినీ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాని ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నారు శ్రీదేవి.

చెన్నయ్ నుంచి వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ చిత్రంలో తమిళ నటుడు, బిల్లా మూవీ హీరో అజిత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతనిపై కొన్ని సీన్లు చిత్రీకరించారని తెలుస్తోంది. శ్రీదేవికి వీరాభిమాని అయిన అజిత్ ఆ చిత్ర దర్శకులు అడగ్గానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒకే చెప్పాడట.
ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రాన్ని బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అజిత్‌తో నటింపజేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. అలా అని అందాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ సన్నటి తీగలా నవనవలాడుతోంది. మరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఏమేరకు సక్సెస్ అవుతుందో..

నేనున్నాననీ... నీకేం కాదని!(అమలను ఎత్తుకున్న నాగ్)....

నేనున్నాననీ..నీకేం కాదని! అంటూ నాగార్జున ఓ సినిమాలో పాడిన పాట గుర్తుందా. తన ప్రియ సఖికోసం ఈ పాటందుకుంటాడు హీరో. తాజాగా రియల్ లైఫ్‌లో ఈ పాట అందరికీ గుర్తొచ్చేలా చేశాడు నాగ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో వేడుకకు భార్య అమలతో కలిసి హాజరైన నాగార్జున కార్యక్రమం అయిపోయిన తర్వాత అమల స్టేజీపై నుంచి దిగడానికి ఇబ్బంది పడుతుంటే ఎత్తుకుని కిందకు దించారు.
nagarjuna amala life is beautiful music launch
ఇదే కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ....నా భార్య అమ్మలా లేదు అక్కలా ఉంది. నాదృష్టిలో ఆమె ఇప్పటికీ ఏంజిల్‌లానే కనబడుతుందనేలా ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు తన ముద్దుల భార్యకు అందరి సమక్షంలో ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నాడు.

అమల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తోంది. పెళ్లయిన తర్వాత దాదాపు 20 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమల ఇన్నాళ్లకు మళ్లీ వెండితెరపై కనిపించనుంది. మళ్లీ అమల స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడంపై భర్తగా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున.

Friday, July 27, 2012

ఛస్తారా... చంపేయమంటారా (‘ఊకొడతారా.. ఉలిక్కి పడతారా' రివ్యూ)

బాలకృష్ణ సినిమా అంటే ఆ క్రేజే వేరు... అందులోనూ పెదరాయుడు లాంటి విజయవంతమైన పాత్ర తరహా రోల్ అని ఊరిస్తే... ఇంకేముంది ఫ్యాన్స్ కే కాక మిగతా వారికి కూడా పండగే. అయితే ఆ రెండు విషయాలనే క్రేజి ఎలిమెంట్స్ గా తీసుకుని మిగతావి విస్మరిస్తే మాత్రం చూసేవారికి అగ్నిపరీక్షే. బాలకృష్ణ గెస్ట్ గా ఇంకా చెప్పాలంటే ఘోస్ట్ గా నటించిన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పాలి. బాలకృష్ణ గెటప్ దగ్గరనుంచి డ్రామా లుక్ తెచ్చిన నిర్లక్ష్యం చాలా భాదేస్తుంది. అయితే బాలకృష్ణ ని గెస్ట్ గానే భావించి ప్రక్కన పెడితే మంచు మనోజ్, అతని అక్క మంచు లక్ష్మి ప్రసన్న కొత్త దనం కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా క్లైమాక్స్ పేలవంగా ఉన్నా మంచు లక్ష్మి ప్రసన్న నటన మాత్రం శభాష్ అనిపిస్తుంది.
manchu manoj uu kodathara ulikki padathara film review
సంస్థ: మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌
నటీనటులు: బాలకృష్ణ, మంచు మనోజ్‌, దీక్షాసేథ్‌, లక్ష్మీ ప్రసన్న, ప్రభు, సుహాసిని, భానుచందర్‌, పృథ్వీ, రఘుబాబు తదితరులు.
దర్శకత్వం: శేఖర్‌ రాజా
నిర్మాత: మంచు లక్ష్మీప్రసన్న
సంగీతం: బెబో శశి
సమర్పణ: మోహన్‌ బాబు
విడుదల: జూలై 27,2012.

గతంలో ఓ వెలుగు వెలిగిన గంధర్వ మహల్ కి అద్దెకు వస్తాడు ఓ యువకుడు(మంచు మనోజ్). అప్పటికే ఆ గంధర్వ మహల్ ని అక్రమంగా ఆక్రమించుకుని ఉన్నవారిని గెంటేసి, ఆ మహల్ ప్రస్తుత యజమాని (ప్రభు)ని మంచి చేసుకుంటాడు. అంతేగాక ఆయన కూతురు (దీక్షాసేధ్)ని ప్రేమలో దింపే ప్రయత్నం చేస్తూంటాడు. అయితే ఓ రోజు అతనికి ఆ గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు (బాలకృష్ణ) ఆత్మ కనిపించి భయపెట్టి, వార్నింగ్ ఇస్తుంది. పోనీ పారిపోదామంటే అక్కడ నుంచి వెళ్లనివ్వకుండా అడ్డు పడుతుంది. ఇంతకీ నరసింహ నాయుడు కథ ఏమిటి... నరసింహరాయుడు కుటుంబానికి ఆ యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి... గంధర్వ మహల్ ను రక్షించే క్రమంలో ఆ యువకుడుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ.

చంద్రముఖి, అరుంధతి వంటి సినిమా చేయాలనుకుని రెడీ చేసినట్లున్న ఈ చిత్రంలో ఎక్కడో క్లైమాక్స్ ట్విస్ట్ ని నమ్ముకుని ఫస్టాఫ్ ,సెకండాఫ్ లను ఏదీ రివిల్ చేయకుండా నీరసంగా నడిపారు. ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర ను సరిగా డిజైన్ చేయలేదనిపిస్తుంది. బాలకృష్ణ పాత్ర ఎంతసేపూ "ఎవరైనా గంధర్వ మహల్ నాది అన్నాడో.... "అంటూ తన మహల్ గురించే తపనపడుతూ, దానికోసం పైట్ చేస్తూంటాడు. అలాగే హీరో మంచు మనోజ్ పాత్ర ని ట్విస్ట్ కోసం ఎవరో ఏమిటో చెప్పకుండా మొదటి నుంచి చివరి దాకా మూసి పెట్టి ఉంచటంతో ఆ పాత్రతో పండవలిసిన సీన్స్ పండలేదు. దాంతో ఎంతసేపూ మనోజ్ పాత్ర సస్పెన్స్ గానే ఉంటుంది తప్ప ఎంజాయ్ చెయ్యనివ్వదు.

అదే చంద్రముఖిలో రజనీపాత్ర మొదటే సైక్రాటిస్ట్ గా రివిల్ చేసి.. చంద్రముఖి పాత్రను సస్పెన్స్ లో పెడతాడు. దాంతో ఫస్ట్ నుంచి చివరకి దాకా రజనీపాత్ర ఫన్ తో సాగుతూ ఎంటర్టైన్ చేస్తుంది. అదే ఈ సినిమాలో బాలయ్య పాత్ర, మనోజ్ పాత్ర రెండూ సస్పెన్స్ లో పెట్టడంతో డ్రామా పుట్టలేదు. ఒక పాత్రని రివిల్ చేసి మరో పాత్రను రివిల్ చేసినప్పుడే ఇలాంటి ధ్రిల్లర్ సినిమా ట్విస్ట్ లు పండుతూంటాయి. లేకపోతే క్లైమాక్స్ దాకా ప్రేక్షకుడుకి ఏమీ అర్దకాక బిక్కమొహం వేసుకుని చూడాల్సిన స్ధితి వస్తుంది. "ఎవరైనా గంధర్వ మహల్ నాది అన్నాడో....", "రాయుడు చంపాలి అనుకంటే బ్రహ్మ దేముడు కూడా ఆపలేడు. కాపాడాలి అనుకుంటే యముడు కూడా చంపలేడు ".... వంటి డైలాగులలో తప్ప బాలకృష్ణను పూర్తిగా వాడుకోలేదనిపిస్తోంది. ఈ చిత్రం స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిపానని చెప్పారు కానీ.. అదే మైనస్ అనిపిస్తుంది.

ఇక పాటల విషయంలో బాలకృష్ణపై ప్లాష్ బ్యాక్ లో వచ్చే అనురాగమే... మెలోడి ట్యూన్ తో ఆకట్టుకుంటుంది. ఇక హాస్య నటులు ధర్మవరుపు వంటి వారు కామెడీ చేసినా పెద్దగా పండలేదు. నటీనటుల్లో మంచు లక్ష్మి ప్రసన్న క్లైమాక్స్ సన్నివేశంలో తన విశ్వరూపం ప్రదర్శించి ఆశ్చర్యపరుస్తుంది. ఆమెకు ఈ సినిమా తర్వాత బయిట బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. ఇండస్ట్రీ మంచి ఆర్టిస్టుని ఉపయోగించుకోవటంలేదనిపిస్తుంది. సోనూ సూద్ మరో సారి అరుధంతిని గుర్తు చేస్తాడు. అలాగే సెకండాఫ్ లో వచ్చే సాయికుమార్ పాత్ర, గెటప్ పెద్ద జోకర్ లాగ ఉండి నవ్విస్తుంది తప్ప విలనీ కురిపించదు. అదో మైనస్ గా మారింది.

మనోజ్ ఎప్పటిలాగేనే ప్రతీ ప్రేమ్ లో కొత్తదనం కోసం ప్రయత్నించాడు. అయితే ఆ కొత్త దనం కనిపించినప్పుడల్లా అతనిలో తెలుగుతనం లోపిస్తూంటుంది. చాలా సార్లు డైలాగు డెలవరీలో తన తండ్రి డైలాగ్ కింగ్ ని అనుకరిస్తూండటం కూడా బావుంది. దీక్షాసేధ్...నటన అనేది నేర్చుకోకుండా సినిమాలు కంటిన్యూగా చేస్తూ రిటైర్ అయ్యిపోయేటట్లు ఉంది. కెమెర్ అద్బుతం కాదు కానీ బావుంది అనిపిస్తుంది. ఎడిటింగ్ మరింత షార్పు గా ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో చేస్తే బావుండేది. సంగీతం ఏదో పాప్ సాంగ్స్ వింటున్న ఫీల్ కలగ చేసింది.
దర్శకుడుగా పరిచయమైన శేఖర్ రాజా... మంచి కథను ఎన్నుకుంటే ఉలిక్కిపడే సినిమా చేయకపోయినా ఊ కొట్టే సినిమా అయినా చేయగలడని, సీనియర్ దర్సకుడులా నటీనటులను హ్యాండిల్ చేసిన తీరు చెప్తుంది. నిర్మాతగా మంచు లక్ష్మి ప్రసన్న మంచి నిర్మాణ విలువతో ఈ సినిమా రూపొందించింది. కథ విషయంలోనూ జాగ్రత్త పడితే ఆమె మంచి విజయాలు సాధించగలరు అని ధైర్యంగా ఖర్చు పెట్టిన తీరు చెప్తోంది.
ఫైనల్ గా ఆరు కోట్ల పైగా ఖర్చు పెట్టిన గంధర్వ మహల్ ని అంత ఖర్చు పెట్టిన సెట్ ఎలా ఉందో ఆసక్తి ఉంటే చూడటానికి ఈ సినిమాకి వెళ్లాలి. ఇక రెగ్యలర్ గా మంచు మనోజ్ సినిమాలు చూడటం అలవాటు పడిన వారికి ఈ సినిమా అతని మ్యానరిజంస్ క్యాజువల్ గా అనిపిస్తాయి.

ఒలంపిక్ షూటర్‌కు పవన్ ఆర్థిక సాయం........


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఒలంపిక్ క్రీడాకారిణికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. రైఫిల్ షూటింగును ఇష్టపడే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. తన ప్రతి సినిమాలోనూ తుపాకి పట్టుకునే సీన్లు తప్పకుండా ఉండేలా చూసుకుంటాడు పవర్ స్టార్. తుపాకులపై ఉన్న మోజే కాబోలు ఆయన్ని ఓ క్రీడాకారిణికి సహాయం చేసేలా చేసింది.
pawan kalyan sponsors shooter
ఆంధ్రప్రదేశ్‌కి ప్రాతినిధ్యం వహిస్తూ 50 మీటర్ల రైఫిల్ షూటింగ్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగులో ఇండియాలోనే టాప్ 15లో చోటు దక్కించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించింది అనంతపురం వాసి రేఖ. అయితే ఒలంపిక్స్ లో పాల్గొనడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సహాయం అందించి పోత్సహించారు. ఈ రోజు కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ స్పాట్లో రేఖ పవన్ ను కలవగా వెంటనే పవర్ స్టార్ స్పందించారు.

ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ నన్ను ప్రొత్సహించి ఆర్థిక సహాయం అందించడమేకాక మనో ధైర్యాన్ని నింపారని, ఆయన మాటలు నాలో ఉన్న క్రీడా స్ఫూర్తిని మరింత పెంచాయి. ఇన్నాళ్లు ఆయనలో హీరోను మాత్రమే చూశాను...ఈ రోజు ఆయనలోని మహోన్నత వ్యక్తి చూశాను అని వ్యాఖ్యానించారు.

తమిళనాడు: ఈగ చేతిలో మగధీర రికార్డు ఢాం.......

Rajamouli S Naan Ee Eega Does Record Collection

దర్శకుడు రాజమౌళి తమిళనాడులో తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్నాడు. తమిళనాడులో తెలుగు సినిమాల కలెక్షన్ల రికార్డు చూసుకుంటే ఇప్పటి వరకు 2009లో వచ్చిన ‘మగధీర' టాప్. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టింది ‘ఈగ'. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు రాజమౌళే కావడం గమనార్హం.

తమిళంలో ‘నాన్ఈ' పేరుతో రిలీజైన ఈగ మూవీ మూడు వారాల్లో రూ. 18.22 కోట్లు వసూలు చేసింది. దీంతో మగధీర రికార్డు బద్దలయినట్లయింది. అసలు తమిళ సినిమా చరిత్రలోనే అక్కడ ఒక డబ్బింగ్ చిత్రం ఈ రేంజిలో కలెక్షన్లు కురిపించడం ఇదే తొలిసారి. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా రిలీజైన ‘బిల్లా 2' పోటీని తట్టుకుంటూ ఇన్ని వసూళ్లు సాధించడం విశేషమే మరి. తమిళనాడు వ్యాప్తంగా ఈచిత్రం ఇప్పటికీ 185 స్క్రీన్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.

సుదీప్, సమంత, నాని హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రం...కేవలం ఇండియన్ బాక్సాఫీసులోనే కాదు ఇంటర్నేషనల్ బాక్సాఫీసులోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈచిత్రం వసూళ్లు 50 కోట్లు దాటేసింది. మనికొన్ని నెలల్లో ఈగ చిత్రం హిందీలో ‘మక్కి' పరుతో 3డిలో రిలీజ్ కాబోతోంది.

రాజమౌళి దర్శకత్వం, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ అద్భుతాలు సినిమాను తెలుగు సినీ పరిశ్రమ గర్వపడే స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి ఎన్నడూ లేని విధంగా రెండు సంవత్సరాలు కష్ట పడ్డారంటే దీనిపై అతని కమిట్ మెంట్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈచిత్రానికి సంగీతం: కీరవాని, నిర్మాత: సాయి కొర్రపాటి, సమర్పణ: సురేష్ బాబు, దర్శకత్వం: రాజమౌళి

సాయి సన్నిధిలో ‘షిరిడి సాయి’ షూటింగ్ పూర్తి.........

నాగార్జున నటిస్తోన్న ‘శిరిడిసాయి' చిత్ర చివరి రోజు షూటింగ్ సాయి సన్నిధి అయిన షిరిడీలో గురువారం(జూలై 26) జరుపుకుంది. దీంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. అంతకు ముందు బుధవారం హైదరాబాద్‌లో శిరిడీసాయి భారీ హోర్డింగ్‌ను ఆవిష్కరించిన అనంతరం నాగార్జున కుటుంబ సభ్యులు అమల, అఖిల్,
shirdi sai shooting completed
జూలై 30న హైదరాబాద్‌లో ఆడియో విడుదల కానుంది. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సూపర్ హిట్ భక్తి రస చిత్రాల తర్వాత కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షుల్లో ఈచిత్రంపై మంచి అంచనాలున్నాయి.
శ్రీకాంత్, శరత్ బాబు, సాయికుమార్, శ్రీహరి, షాయాజీ షిండే, డా. బ్రహ్మానందం, అలీ, సంపత్, అనంత్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, కమలిని ముఖర్జీ, రోహిణి హట్టంగడి, వినయ్ ప్రసాద్, మజుతా దేశ్ ముఖ్, కౌశిక్, నాగేష్ భోస్లే, దేవేందర్ డాడ్కే, దినకర్ గవండే, దీపాలి డాడ్కే, భవాని, రవిభట్, విజయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి ఎంఎం కీవవాణి సంగీతం అందించారు. ఇందులోని పాటల్ని సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, శ్రీరామ జోగయ్య శాస్త్రి, వేదవ్యాస్, మేడిచర్ల సత్యనారాయణ మూర్తి తదితరులు వ్రాశారు. ఛాయాగ్రహణం : ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్ : శర్వన్, కళ : భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం : భక్త సురేష్, కథా సహకారం : పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్ : ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. విక్రమ్ కుమార్, నిర్మాత : ఎ. మహేష్ రెడ్డి, సమర్పణ : శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం : కె. రాఘవేంద్రరావు

పూరీ 'దేవుడు చేసిన మనుషులు'పై ఆ రూమర్ ?.......

Devudu Chesina Manushulu No Busines
రవితేజ తాజా చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'ఆగస్టు 15న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిజినెస్ కావటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇది రూమర్ అని కొందరు కొట్టిపారేస్తున్నా..రిలీజ్ డేట్స్ మార్చటం వెనక అసలు కీలకం ఇదే అంటున్నారు. బిజినెస్ కాకపోవటానికి కారణం పూరి జగన్నాధ్ కారణం అంటున్నారు. చిత్రంలో కథేమీ లేదని ప్రకటించటం తో వ్యాపార వర్గాలు వెనకంజ వేస్తున్నాయని,అందులోనూ రవితేజ ప్లాపుల్లో ఉండటం కూడా ఈ సినిమా బిజినెస్ కు మైనస్ గా మారిందంటున్నారు.

వాస్తవానికి రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ అనగానే నిజానికి బయ్యర్లు పోటీలు పడి బిజినెస్ జరిగాలి. కానీ దీనికి విరుద్ధంగా జరగడం ట్రేడ్‌ సర్కిల్‌లలో ఆశ్చర్యం కలిగిస్తోంది. పూరి జగన్నాథ్‌కు రీసెంట్‌గా 'బిజినెస్‌మేన్‌' సూపర్‌హిట్‌ చిత్రంగా తన అకౌంట్‌లో ఉంది. రవితేజ మాత్రం వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నాడు. లేటెస్ట్‌గా వచ్చిన 'దరువు' కూడా పెద్ద ప్లాప్ అయ్యింది. ఈ పరాజయాల కారణంగానే 'దేవుడు చేసిన మనుషులు' ముందుగా అంచనా వేసిన ప్రకారం వ్యాపారం జరుపుకోవడం లేదని సమాచారం. ఫ్లాప్‌ హీరో సినిమాను కొనడం అంటే రిస్క్‌ చేసినట్టే.

దీనికి తోడు పూరీ జగన్నాధ్ తాను దేవుడు చేసిన మనుషులు చిత్రాన్ని కథ లేకుండా తీసినట్లుగా పూరి పలుమార్లు చెప్పడం వల్ల బయ్యర్ల అనుమానం నిజమైంది. మరోవైపు ఈ చిత్రంలో ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ రిలయన్స్‌ భారీ పెట్టుబడి పెట్టింది. దాంతో నిర్మాణ వ్యయం తడిసి మోపెడయింది. ఆ రేంజ్‌లో బిజినెస్‌ జరగాలంటే కొంత ఇబ్బందే అయినా, నిర్మాతకున్న గుడ్‌విల్‌ వల్ల వాటిని అధిగమించి రిలీజ్‌ చేస్తారని వ్యాపార వర్గాల సమాచారం.

ఒకేతరహా కథాంశాలను అంగీకరిస్తుండడం వల్ల రవితేజకు ఈ ఇబ్బంది తప్పడం లేదు. రెమ్యునేషన్ కి ఇచ్చే ప్రాధాన్యత కథకు ఇవ్వడని, సినిమా ఎలా తీస్తారో కూడా తెలుసుకోకుండా సైన్‌ చేస్తారని ఆయనపై విమర్శలూ ఉన్నాయి. దీనిని నిజం చేస్తూ ఆయన చిత్రాలన్నీ పరాజయం పాలవుతున్నాయి. ఇది తెలిసీ బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారన్నది నిజం.

Thursday, July 26, 2012

గ్రీస్, ఐస్‌లాండ్‌కు రామ్ చరణ్.......


Charan Vinayak Shoot Greece Iceland
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో గ్రీస్, ఐస్ లాండ్‌కు వెళ్ల బోతున్నాడు. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న షూటింగ్‌లో భాగంగా యూనిట్ సభ్యులతో కలిసి చెర్రీ అక్కడికి వెలుతున్నాడు. ఆగస్టులో అక్కడ షూటింగ్ ప్రారంభం కానుంది...ప్రొడక్షన్ వర్గాల నుంచి అందిన సమాచారం.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుందట.

ఈచిత్రంలో తన తండ్రి నటించిన కొండవీటి దొంగ చిత్రంలోని ‘శుభలేఖ రాసుకున్నా' అనే సాంగుకు స్టెప్పులు వేయన్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగు కోల్ కతాలో జరుగుతోంది. అక్కడ చరణ్ పై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ ‘జంజీర్'తో పాటు...వంశీ పైడి పల్లి దర్శకత్వంలో ‘ఎవడు'చిత్రంలో నటిస్తున్నాడు.

జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ శాటిలైట్ రైట్స్ రికార్డు రేటు!.......

Baadshah Satellite Rights Rs 7 25 Crores
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్ షా' చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయిలో పలకనున్నాయి. ఈ చిత్రం హక్కులు దక్కించుకునేందుకు రెండు పాపులర్ టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. వీటిలో ఓ ఛానల్ ఏకంగా రూ. 7.25 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో డీల్ ఫైనల్ కానుంది.
యంగ్ టైగర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్...శ్రీను వైట్ల సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ రేంజిలో పెట్టుబడి పెట్టేందుకు టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. శాటిలైట్ రైట్స్ ఈ రేంజిలో ఉన్నాయంటే....ఇక ఇతర మార్గాల్లో సినిమాకు వచ్చే ఆదాయం భారీగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శ్రీను వైట్ల దర్వకత్వంలో రూపొందుతున్న ‘బాద్ షా' చిత్రం షూటింగ్ ఇటీలీలో పూర్తి చేసుకుని స్విట్జర్ లాండ్‍‌లో జరుపుకునేందుకు సిద్దం అవుతోంది. నాన్ స్టాప్‌గా డిసెంబర్ వరకు జరిగే షూటింగుతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అదే నెలలో ఆడియో విడుదల కానుంది. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

‘ఈగ’ లాభాల్లో 22 లక్షలు చారిటీ కోసం...రాజమౌళి.....

Ss Rajamouli Donates Portion Eega Collection
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ' చిత్రం భారీ విజయం సాధించి మంచి లాభాలు తెచ్చి పెడుతుండటంతో లాభాల్లో కొంత మొత్తాన్ని చారిటీ కోసం డొనేట్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. లాభాల్లో రూ. 22 లక్షలు ‘ప్రాజెక్ట్ 511' కోసం విరాళంగా ఇస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ఆసక్తి కలవారు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవాలసి కోరారు.

‘ప్రాజెక్ట్ 511' అనేది హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని గవర్నమెంటు పాఠశాలల్లో కనీస ప్రాథమిక అవసరాలైన టాయ్ లెట్స్, బ్లాక్ బోర్డ్స్, బెంచీలు, మొబైల్ సైన్స్ ల్యాబ్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ లాంటి వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 62,000 వేలకు పైగా పిల్లలు 312 పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ‘ది హైదరాబాద్ రౌండ్ టేబుల్ నెం.8 చారిటబుల్ ట్రస్ట్' ఈ ప్రాజెక్టును లీడ్ చేస్తోంది.

బడా దర్శకుల గుప్పిట్లో స్టార్ హీరోలు!.......

లాభాలొచ్చే సినిమా తీయాలంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరోలతో అయితేనే సేఫ్. అప్పుడప్పుడు స్టార్ హీరోలు లేకుండా ‘ఈగ' లాంటి సినిమాలు సక్సెస్ అయినా ప్రతిసారి అలాంటి మ్యాజిక్ పని చేస్తుందనే నమ్మకం లేదు. అలా అని స్టార్ హీరోల సినిమాలన్నీ హిట్టవుతాయని కాదు. కాక పోతే అది మాగ్జిమమ్ సేఫ్ రూట్.
star heroes big directors hand
బడా దర్శకులు, బడా నిర్మాతలు, బడా హీరోలు...ఇలా బడాబాబుల ఆలోచనలన్నీ బడాగానే ఉంటాయి. తమ రేంజి ఉన్న వారితోనే సినిమా తీయాలనుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతున్నది అదే. టాలీవుడ్ టాప్ దర్శకులు రాజమౌళి, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు చూపుతో బడా హీరోల డేట్స్ అన్నీ అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్నారు.

ఇటీవలే ఈగ చిత్రంతో హిట్ కొట్టిన రాజమౌళి...నెక్ట్స్ ప్రభాస్‌తో సినిమాకు సిద్దం అవుతున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‍తో సినిమాలు...ఇలా నాలుగేళ్ల పాటు బిజీ అయిపోవడానికి సిద్ధం అవుతున్నారు. మరో దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‍‌తో చేస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో సినిమాతో పాటు మహేష్ బాబు బిజినెస్ మేన్-2 చిత్రం చేయబోతున్నాడు.
మరో దర్శకుడు శ్రీను వైట్ల దూకుడు చిత్రాన్ని మించిన హిట్ కొట్టాలని కమిట్ మెంట్‌తో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్‌తో ‘బాద్ షా' చిత్రం చేస్తున్న వైట్ల...ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ లతో సినిమాలకు కథను సిద్దం చేసుకోబోతున్నాడు. అదే విధంగా వివి వినాయక్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా తర్వాత చిరంజీవి 150వ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. బాలయ్య 100వ సినిమాకు కూడా వివి వినాయక్ పేరే వినిపిస్తోంది.

హిందీ ‘ఈగ’లో అభిషేక్‌ వార్తపై రాజమౌళి క్లారిటీ......

Abhishek Bachchan Won T Star Eega Hindi Version
హిందీ ‘ఈగ' చిత్రాన్ని బాలీవుడ్ స్టార్లతో తీయాలనే ఆలోచనలో ఉన్నారని, ఇందుకోసం అభిషేక్ బచ్చన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సుదీప్, సమంత పాత్రలను యదావిధిగా డబ్బింగ్ చేసి, తక్కువ నిడివిగల నాని పాత్ర స్థానంలో అభిషేక్‌తో రీషూట్ చేసి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆ వార్తల సారాంశం.

ఈ వార్తలపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ...అవన్నీ కేవలం రూమర్లే అని కొట్టిపారు. హిందీ ‘ఈగ'లో అభిషేక్ నటిస్తున్నాడనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈగ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నామని, ఈగ చిత్రంపై వస్తున్న రూమర్లను నమ్మ వద్దని స్పష్టం చేశారు.
ఈగ చిత్రాన్ని హిందీలో ‘మక్కి' పేరుతో విడుదల చేస్తున్నారు. 3డి టెక్నాలజీతో ఈ చిత్రాన్ని హిందీలోకి కన్వెర్షన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించడంతో హిందీలోనూ కాసుల వర్షం కురిపిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పై ఆ రూమర్.. నిజమేనా?......


Pawan Kalyan Play Jesus Christ
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బాలీవుడ్ కు ప్రయాణం కట్టారని, కొండా కృష్ణం రాజు దానికి నిర్మాత అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది పవన్ కళ్యాణ్ చేసే స్క్రిప్టు మరేదో కాదని గతంలో...మొదలెట్టి ఆపేసిన ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారీగా మొదలెట్టిన ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అందులో పవన్ కళ్యాణ్ జీసస్ క్రైస్ట్ అని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ప్రిన్స్ ఆఫ్ పీస్ కోసం తీసుకున్న అడ్వాన్స్ రెమ్యునేషన్ కోసమే పవన్ తిరిగి ఆ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. అదే స్క్రిప్టుని రీ మోడల్ చేసి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఇది రూమరా,నిజమా అన్నది తెలియని సందిగ్ద స్దితిలో ఉంది. నిర్మాతలు ఈ విషయమై స్పషటమైన ప్రకటన చేస్తే బావుంటుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇదే కనుక నిజమైతే ఈ సారి సింగీతం గారు డైరక్టర్ గా కొనసాగుతారా లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది.

ఇక అప్పట్లో ఈ చిత్రం గురించిన వార్తలను పరిశీలిస్తే...పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ కి ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే టైటిల్ ని నిర్ణయించినట్లు సమాచారం.జీసస్ క్రిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నఆ చిత్రంలో పవన్ ఓ ఫిల్మ్ డైరక్టర్ గా కనపించనున్నారు. ఇక గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్‌ సంస్థ కొండా కృష్ణంరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

జెకె భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మితమవుతుంది. దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికల్నే ఎంపిక చేసుకుని నటింపచేసారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్‌ సూత్రాల్ని పాటించారని చెప్తున్నారు అన్నారు.

అంచనాలకు తగ్గట్లుగా...(‘ఊకొడతారా..ఉలిక్కి పడతారా' ప్రివ్యూ)...


Manchu Manoj S Uu Kodathara Ulikki Padathara Preview
బాలకృష్ణ అతిధిపాత్రలో రూపొందిన చిత్రం ‘ఊకొడతారా..ఉలిక్కి పడతారా' ఈ నెల 27న విడుదల అవుతోంది. మంచు మనోజ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ వర్గాల్లోనే కాక,ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. బ్లాక్ కామెడీగా చెప్పబడుతున్న ఈ చిత్రం పై గత రెండు సంవత్సరాలుగా మనోజ్ వర్క్ చేస్తున్నారు. ప్లాఫ్ ల్లో ఉన్న తన కెరీర్ కి ఈ చిత్రం హిట్ ఇచ్చి నిలబెడుతుందని భావిస్తున్నాడు.

కథలోకి వస్తే...గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు (బాలకృష్ణ). గంధర్వ మహల్‌ను సొంతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మహల్‌లోకి ఓ యువకుడు (మంచు మనోజ్‌) ప్రవేశిస్తాడు. నరసింహరాయుడు కుటుంబానికి ఆ యువకుడికి ఉన్న సంబంధం కథలో కీలకం. నరసింహరాయుడు మహల్‌ను రక్షించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ.

విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే ప్రధాన బలం. ప్రతి సన్నివేశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. బాలకృష్ణ, మనోజ్‌ల నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. వారు తమ పాత్రలకు ప్రాణం పోశారు. గంధర్వమహల్‌ సెట్‌ని రూ.6 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రత్యేక ఆకర్షణ'' అన్నారు.
ఇప్పటికే ‘ఊకొడతారా..ఉలిక్కి పడతారా'ట్రైలర్స్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై ‘ఊ కొడతారా..ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారు. గత నెలలో ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Wednesday, July 25, 2012

మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు........

Mohan Babu Comments On Tfi
సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ఐక్యత లేదని, నిర్మాతల మండలిలో పనిలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమలో అంతా కలిసున్నామనే వాదనలో నిజం లేదని, అంతా అబద్ధమని, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిశ్రమ తయారైందని మోహన్ బాబు చెప్పారు.

పైరసీ విషయంలో నిర్మాలంతా ఒక్కతాటిపై లేరని, ఇక్కడ న్యాయం చేసే వాళ్లు, కనీసం పట్టించుకునే వారు కూడా లేరన్నారు. గతంలో విష్ణు నటించిన సినిమా పైరసీ రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. సినీ పరిశ్రమలో ఐక్యత ఉందనే విషయం అవాస్తవమని, అలా అనే వాళ్లు తన ముందు వచ్చి చెబితే అన్ని విషయాలు చెబుతానన్నారు.

మోహన్ బాబు వ్యాఖ్యలతో పరిశ్రమలోని డొల్లతనం బయట పడినట్లయింది. పరిశ్రమలో వర్గ పోరు నడుస్తుందని...ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలకు మోహన్ బాబు మాటలు బలం చేకూరినట్లయింది. మరో రెండు మూడు రోజుల్లో ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

పరిశ్రమలోని చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు రెండుగా చీలి పోయి పోటీ పడుతున్నారు. పెద్దనిర్మాతలైన సురేష్ బాబు వర్గం తరుపున స్రవంతి రవికిషోర్ పోటీ చేస్తుండగా...చిన్న నిర్మాతలకు సపోర్టుగా దాసరి లాంటి వారి అండతో తమ్మారెడ్డి భరద్వాజ బరిలో నిలిచారు.

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఆడియో ట్రాక్ లిస్టు........

Life Is Beautiful Track List
ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని ఆగస్టు 15 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 27న ఆడియో విడుదల కానుంది. అభిజిత్, సుధాకర్, కౌశిక్, షాగున్, జారా, రేష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్ ఈచిత్రంలో ముఖ్య పాత్ర ధారులు. అమల అక్కినేని, హీరోయిన్ శ్రియ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వణమాలి, అనంత శ్రీరామ్ పాటలు రచించారు.
ఆడియో ట్రాక్ లిస్టు
01 - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఆర్టిస్ట్: కెకె
రచయిత: అనంత శ్రీరామ్
02 - బ్యూటిఫుల్ గర్ల్
ఆర్టిస్ట్: కార్తీక్
రచయిత: వనమాలి
03 - అటు ఇటు ఊగుతూ...
ఆర్టిస్ట్: శ్రీ రామచంద్ర
రచయిత: అనంత శ్రీరామ్
04 - ఇట్స్ యువర్ లవ్...
ఆర్టిస్ట్: నరేష్ అయ్యర్
రచయిత: అనంత శ్రీరామ్
05 - అమ్మ అని కొత్తగా...
ఆర్టిస్ట్: శశి కిరణ్, శ్రావణ భార్గవి
రచయిత: వనమాలి
06 - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (పాప్)
ఆర్టిస్ట్: శ్రీ రామచంద్ర
రచయిత: అనంత శ్రీరామ్

‘గుండెల్లో గోదారి’ ఫస్ట్‌లుక్......

tapsi s gundello godari first look
ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం ‘గుండెల్లో గోదారి'. నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం విడుదలపై నిర్మాత లక్ష్మి మీడియా ప్రకటన చేయనున్నారు.

‘అందాల రాక్షసి’ సెన్సార్ రిపోర్ట్......

Andhala Rakshasi Censor Report
నవీన్, రాహుల్, లావణ్య ప్రధాన పాత్రధారులుగా వారాహి చలన చిత్రం పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘అందాల రాక్షసి'. హను రాఘవపూడి దర్శకత్వంలో సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

ఈ చిత్రం ట్రైలర్స్‌కు, ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవడం కూడా సినిమాపై మంచి అంచనాలు పెరగడానికి కారణం అయింది. అన్నం ఉడికిందో లేదో ఓ మెతుకు పట్టుకుని చెప్పినట్టుగా... ఒక సినిమాలోని రెండు మూడు సీన్లు చూసి, ఆ సినిమా ఆడుతుందో లేదో నిర్మాత దిల్ రాజు ఇట్టే చెప్పేస్తాడని పేరుంది. అలా తను అంచనా వేసి, కొన్న సినిమాలు అతనికి ఘనవిజయాలు సాధించిపెట్టాయి కూడా. ఇప్పుడలాగే, 'అందాల రాక్షసి' చిత్రాన్ని ఆయన తీసుకున్నాడు

ఈ చిత్రం గురించి దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ- కుటుంబ ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిన ప్రేమకథ ఇదని, భూమి, సూర్యుడు, చంద్రుడు ఈముగ్గురి మధ్య ఓ ప్రేమకథ సాగితే ఎలా ఉంటుందో ఈ చిత్రం కూడా అలా వుంటుందని అంటున్నారు. 90ల్లోని బ్యాగ్రౌండ్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా దీన్ని రూపొందించారు. ఆగస్టు రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత:సాయి కొర్రపాటి, కధ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:హను రాఘవపూడి.

'సుడిగాడు'లో 'ఈగ' స్పూఫ్ ఎలా చేసారంటే...

Sudigaadu S Spoof On Rajamouli S Eega
రాజమౌళి తాజా సూపర్ హిట్ చిత్రం ఈగ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్పూఫ్ ని అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడు లో పెడుతున్నారు. ఈగ మాదిరిగానే సుడిగాడు లో కూడా మొదట డైరక్టర్ వాయిస్ తో మొదలవుతుంది. ఈగలో దర్శకుడు రాజమౌళి..కూతురుకి కథ చెప్తున్నట్లుగా పెట్టినట్లుగానే ఇందులో బీమినేని శ్రీనివాసరావు..తన కూతురు కథ చెప్పమని అడిగితే ..తెలుగు హీరో కథ చెప్తానని,వాడిపేరు సుడిగాడు అని మొదలెడతారు. ఇలా సినిమా మొదటనుంచే స్ఫూఫ్ తో మొదలెడుతున్నారు.

'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత. మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ అయి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం. విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇటీవలే కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం. అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్‌ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
పింకి పింకి పోంకి ఫాదర్ హేడ్ ఎ డాంకీ అంటూ అల్లరి నరేష్ ఈ చిత్రం కోసం పాట పాడారు. తన తాజా చిత్రం 'సుడిగాడు'కోసం ఆయన స్వయంగా ఈ పాటను పాడారు. మొత్తం ఓ ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట తెరకెక్కుతోంది. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌.

పవన్ బాలీవుడ్ ప్రాజెక్ట్...బడ్జెట్ ఎంత?....

Pawan Kalyan B Project 30m
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మూవీ ఖరారైన విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని కొండా కృష్ణం రాజు శ్రీ వరసిద్ది వినాయక ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. అయితే ఈచిత్రం బడ్జెట్ ఎంత? నేపథ్యం ఏమిటి? దర్శకుడు ఎవరు అనే చర్చ సర్వత్రా సాగుతూనే ఉంది.
గతంలో కొండా కృష్ణం రాజు సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా ఏసుక్రీస్తు జీవితంపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత చాలా రోజులు ఆ సినిమా ఊసెత్తక పోవడంతో అంతా ఆ చిత్రం రద్దయిందనే అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ నిర్మాత మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ తో బాలీవుడ్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే దర్శకుడు సింగితం శ్రీనివాసే అని మాత్రం చెప్పలేదు.

అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం ఆయన తీయబోయేది ఏసుక్రీస్తు జీవితంపై సినిమానే అని, పవర్ స్టార్ ఇందులో జీసెస్ గా కనిపించబోతున్నారని, ఈ షూటింగ్ జెరూసలెం, బెత్లహాంలలో జరుగనుందని ప్రచారం జరుగుతోంది. మొత్తం 30 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.

పవన్ పోషించే పాత్ర విషయానికొస్తే...జీసస్ కు శిలువ వేసే ముందు కాళ్ళకు, చేతులకు మేకులు కొడతారు. అలా మేకులు కొట్టే వ్యక్తి చాలా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ తన పని తాను చేసుకుంటూ వుండగా..మేకులు కొట్టే టప్పుడు జీసస్ చిందించిన రక్తం ఒక్కసారిగా ఆ క్రూరుడి మొఖంపై పడుతుందట. ఆ రక్తం తన మొఖం పై నుంచి కారుతూ కంటిపైకి రావటం, తన కంట్లోనుంచి రక్తం కారుతుండటంతో ఆ క్రూరుడు తన క్రూరత్వాన్ని గ్రహించుకుని ఒక్కసారిగా మారు మనస్సు పొంది తను మేకులు కొట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడట.

ఒక్క రక్తపుబొట్టు ఆ క్రూరుడ్ని మార్చటం ఆ సినిమాకి కీలకమైన మలుపు అవుతుందని తెలుస్తుంది. అలా క్రూరత్వమైన పాత్ర నుంచి ఓ మంచి మనిషిగా మారే పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిర్మాత కొండా కృష్ణం రాజు ఈ సినిమా విషయమై పూర్తి క్లారిటీ ఇస్తే తప్ప పై వార్తల్లో నిజం ఎంతో తేలే అవకాశం లేదు.

Tuesday, July 24, 2012

సోనీ ఎరెక్సన్ స్మార్ట్‌ఫోన్‌లు (2012).....

Sony Ericsson

సోనీ ఎరెక్సన్ లైవ్‌విత్ వాక్‌మెన్ – WT19i:
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ. ధర రూ.13,600.
సోనీ ఎరెక్సన్ లైవ్‌విత్ వాక్‌మెన్ – WT19i(వైట్):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.13,600.
సోనీ ఎరెక్సన్ మిక్స్ వాక్‌మెన్ WT13i(బ్లాక్ అండ్ గ్రీన్):
3మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 3 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.5,200.
సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా మినీ ప్రో SK17i(బ్లాక్):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.13000.
సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా మినీ ప్రో SK17i(వైట్):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.13000.
సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా ప్రో (బ్రౌన్ అండ్ సిల్వర్):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 8.1మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 0.3మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3.7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.18500.
సోనీ ఎరెక్సన్ ఫెంగ్లీ టెక్స్ట్ ప్రో CK15i(వైట్):
2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 3 అంగుళాల టచ్‌స్ర్కీన్, 3.2మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, క్వర్టీ కీప్యాడ్, జీపీఆర్ఎస్, ఎడ్జ్ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.7,300.
సోనీ ఎరెక్సన్ టెక్స్ట్ CK15i(వైట్):
3.2మెగాపిక్సల్ కెమెరా, 2.5 అంగుళాల టీఎఫ్‌టీ స్ర్కీన్, క్వర్టీ కీప్యాడ్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై,  32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.5100.
సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా యాక్టివ్ ST17i(బ్లాక్ అండ్ ఆరెంజ్):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్, 3 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.15,100.
సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్ (బ్లాక్):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 8.1మెగాపిక్సల్ కెమెరా, 4.2 అంగుళాల టీఎఫ్‌టి టచ్‌స్ర్కీన్, 1.4గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, 2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, ధర రూ.25,000.
సోనీ ఎరెక్సన్ టెక్స్ట్ CK15i(బ్లూ):
3.2మెగాపిక్సల్ కెమెరా, 2.5 అంగుళాల టీఎఫ్‌టీ స్ర్కీన్, క్వర్టీ కీప్యాడ్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.5,100.
సోనీ ఎరెక్సన్ టెక్స్ట్ CK15i(పింక్):
3.2మెగాపిక్సల్ కెమెరా, 2.5 అంగుళాల టీఎఫ్‌టీ స్ర్కీన్, క్వర్టీ కీప్యాడ్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.5,100.
సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్ (వైట్):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 8.1మెగాపిక్సల్ కెమెరా, 4.2 అంగుళాల టీఎఫ్‌టి టచ్‌స్ర్కీన్, 1.4గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, 2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, ధర రూ.25,000.
సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా నియో వీ (బ్లూ):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3.7 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.18000.
సోనీ ఎరెక్సన్ మిక్స్ వాక్‌మెన్ WT13i(బ్లాక్ పింక్):
3మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 3 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.5,200.
సోనీ ఎరెక్సన్ ఎక్స్‌పీరియా ప్రో (బ్లాక్):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 8.1మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 0.3మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3.7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ రికార్డింగ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.18500.

వాటిని వెనక్కి నెట్టి..కొత్త ట్రెండ్!.......

Milagrow Tab

ల్యాప్‌టాప్‌లతో పాటు సాధారణ టాబ్లెట్ పీసీలను వెనక్కినెడుతూ ‘టాబ్ టాప్ పీసీ’ ఆవిర్భవించింది. టాబ్లెట్ కంప్యూటర్‌ను పోలి ఉండే ఈ ఆధునిక కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను డెస్క్‌టాప్ పై పెట్టుకుని పనిచేసుకోవచ్చు. వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవతున్న ఈ డివైజ్‌కు మిలాగ్రో సంస్థ రూపకల్పన చేసింది. అరచేతిలో ఇమిడే ఈ పరికరాల్లో ఎన్నెన్నో ప్రత్యేకతలు ఒదిగి ఉన్నాయి…
ప్రధాన ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
శక్తివంతమైన ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
హైడెఫినిషన్,
3జీ సిమ్ స్లాట్,
10 గంటల బ్యాకప్ నిచ్చే బ్యాటరీ,
50 ఇన్ బుల్ట్ అప్లికేషన్స్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ,
వై-ఫై,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ.
వివిధ ధరల శ్రేణుల్లో ఈ గ్యాడ్జెట్‌లు అందుబాటులో ఉన్నాయి.

సామ్‌సంగ్ కొత్త టాబ్లెట్ ‘గెలాక్సీ టాబ్ 2’.........

Samsung 10.1 inch Galaxy Tab 2

మెగాబ్రాండ్ సామ్‌సంగ్ ‘గెలాక్సీ టాబ్ 2’ పేరుతో పెద్ద స్ర్కీన్ కలిగిన సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో లోడై ఉన్న ఈ గ్యాడ్జెట్ కమ్యూనికేషన్ ఇంకా కంప్యూటింగ్ అవసరాలను సమృద్థిగా తీరుస్తుంది. టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు
క్లుప్తంగా….
- 10 అంగుళాల టచ్‌స్ర్కీన్,
- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి,
- డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
- 1జీబి ర్యామ్,
- 3మెగాపిక్సల్ రేర్ కెమెరా,
- వీజఏ ఫ్రంట్ కెమెరా,
- హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
- వై-ఫై, బ్లూటూత్ వీ3.0, యూఎస్బీ 2.0,
- డిజిటల్ కంపాస్,
- మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
- మ్యూజిక్ ప్లేయర్ (సౌండ్ ఎలైవ్),
- పొలారిస్ డాక్యుమెంట్ ఎడిటర్,
- సామ్‌సంగ్ అప్లికేషన్స్,
- సామ్‌సంగ్ టచ్‌విజ్, లైవ్ ప్యానల్ యాక్సిస్,
- స్టాండర్డ్ లియోన్ 7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
- హెచ్‌ఎస్‌పీఏ+ 21ఎంబీపీఎస్ 850/900/1900/2100
- యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్, లైట్ సెన్సార్,
- ధర రూ.33,000.

ఎన్.ఆర్.ఐలకు రాజమౌళి అపాలజీ...!.....

Rajamouli Apologises Nri
దర్శకుడు రాజమౌళి ఇటీవల పైరసీ దారులపై, పైరసీ వెర్షన్లు డౌన్ లోడ్ చేసుకుంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి పొగరుగా ఎన్.ఆర్.ఐలకు వార్నింగ్ ఇచ్చినట్లు కామెంట్స్ వచ్చాయి. దీనిపై రాజమౌళి ఈ రోజు స్పందిస్తూ నా మాటలు అలా ధ్వనించి ఉంటే అపాలజీ ఇస్తున్నాను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కేవలం తీవ్రమైన, తరచూ పైరసీకి పాల్పడే వారిపై మాత్రమే కోపం చేస్తూ వార్నింగ్ ఇచ్చాను అని చెప్పుకొచ్చారు.

పైరసీ మూలంగా ఈగ చిత్రానికి భారీ నష్టం వాటిల్లుతోందని, ఇప్పటి వరకు 6,55,000 మంది ఈగ పైరసీ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, దీని వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. గత వారం బీటెక్ స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఈగ పైరసీ వెర్షన్‌ను టోరెంట్‌లో పోస్టు చేసి, సినిమా పైరసీని స్ప్రెడ్ చేస్తూ అరెస్టయ్యారని రాజమౌళి గుర్తు చేశారు.

ఈగ చిత్రమే కాదు..ఏ సినిమా పైరసీ చేసినా, పైరసీ వెర్షన్ ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నానేరమే. ఏపి ఫిల్మ్ ఛాంబర్, యాంటీ పైరసీ సెల్ సంయుక్తంగా సీరియస్‌గా ముందుకు సాగుతున్నారు. పైరసీని ప్రొత్సహించి చిక్కుల్లో పడవద్దు అని రాజమౌళి కోరారు.

వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈగ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ బాబు సమర్పణలో ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి ప్రభాస్‌‍తో సినిమా చేయబోతున్నారు.

సునీల్ సరసన హాట్ ఆండ్రియా..?.......

Is Andrea Pair Up With Sunil
హీరో సునీల్ సరసన హాట్ తమిళ భామ ఆండ్రియా రొమాన్స్ చేయనుంది. సునీల్, నాగచైతన్య హీరోలుగా చిత్రం ఒకటి రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హన్సిక, సునీల్ సరసన ఆండ్రియా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆండ్రియా గతంలో యుగానికి ఒక్కడు చిత్రంలో నటించింది. రాఖీ, బొమ్మరిల్లు చిత్రాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

తమిళంలో ఆర్య, మాధవన్ హీరోలుగా నటించగా వచ్చిన సూపర్ హిట్ "వేట్టై" చిత్రం ఆధారంగా, తెలుగులో సునీల్, నాగచైతన్య హీరోలుగా ఈ చిత్రాన్ని పునర్నిర్మించబోతున్నారు. తమిళంలో "వేట్టై" చిత్రంలోని మాధవన్ పాత్రలో సునీల్, ఆర్య పాత్రలో నాగచైతన్య నటించనున్నారు.

ఈ "వేట్టై" చిత్రం తెలుగు రీమేక్ కి "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" ఫేం పి. కిషోర్ కుమార్(డాలీ) దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ అన్నగా, నాగచైతన్య తమ్ముడిగా నటిస్తున్నారు. ఆగస్టు 10 నుంచి ఈచిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు.

ప్రస్తుతం ‘తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్ గా రూపొందున్న చిత్రంలో నటిస్తున్నాడు. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘సీతా వెడ్స్ రాముడు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 

ఈగ-2, ప్రభాస్ ప్రాజెక్టులపై రాజమౌళి వివరణ.......

Eega 2 Is Not The Pipeline Ss Rajamouli
‘ఈగ' చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడు రాజమౌళి ఆ చిత్రానికి సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడని, నిర్మాతలు కూడా సీక్వెల్‍‌పై ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై రాజమౌళి స్పందించారు. ఈ వార్తను ఆయన ఖండించలేదు కానీ....ఇప్పుడైతే ఆ ఆలోచన లేదని, నెక్ట్స్ తాను చేయబో చిత్రం ప్రభాస్‌‍తోనే అని స్పష్టం చేశారు.

ఆయన మాటలను బట్టి ఎప్పటికైనా సీక్వెల్ ఖాయమని స్పష్టం అవుతోంది. అయితే దానికి కథ, స్క్రిప్టు రెడీ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడప్పుడే దానిపై ప్రకటన చేయడానికి రాజమౌళి ఇష్టపడటం లేదని అర్థమవుతోంది.
ప్రభాస్ సినిమా విషయానికొస్తే...ఈ చిత్రం కాకతీయుల చరిత్రను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాజు పాత్రలో కనిపించనున్నారు. కాకతీయుల నేపథ్యంతో పాటు వివిధ రకాల నేపథ్యాలను యాడ్ చేసి ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్‌ను ఈచిత్రంలో రాజమౌళి సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నారు.
తను అనుకున్న కాన్సెప్టును పర్‌ఫెక్టుగా ప్రజెంట్ చేయడానికి రాజమౌళి చాలా కష్టపడతాడు. ఏదో కానిచ్చామని కాకుండా తనకు ఎవరూ వంక పెట్టకుండా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రమోగాత్మకంగా చేపట్టిన ‘ఈగ' చిత్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నాడు. తీసుకుంటే తీసుకున్నాడు కానీ తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా దాన్ని రూపొందించారు. ప్రభాస్ చిత్రం పూర్తవడానికి కూడా లాంగ్ టైమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం చారిత్రక సీన్లతో కూడుకుని ఉండటం వల్ల చాలా స్టడీ చేయాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం మామూలే అనే వాదన వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ఎంట్రీ..........


Pawan Kalyan Bollywood Entry
‘గబ్బర్ సింగ్'తో టాలీవుడ్ రికార్డుల్ని తిరిగరాసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక ప్రొడక్షన్స్ ప్రై.లి పతాకంపై కొండ కృష్ణం రాజు నిర్మించే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ బాలీవుడ్లో నటించే తొలి చిత్రం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది బాలీవుడ్ నిర్మాతలు, టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో హిందీ చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనతో తొలి సినిమా చేసే అవకాశం నాకు రావడం ఓ వరంగా భావిస్తున్నాను అన్నారు.

ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్మెంట్ మూవీగా రూపొందనున్న ఈచిత్రానికి ఇప్పటికే సబ్జెక్టు రెడీ అయిందతీ, హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మాణం అయ్యే అ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అని, అక్టోబర్లో సినిమా ప్రారంభమవుతుందని కృష్ణంరాజు చెప్పారు.

పవన్ కళ్యాణ్-సింగితం శ్రీనివాసరావు కాంబినేషన్లో కొండా కృష్ణం రాజు నిర్మాణంలో ఏస్తుక్రీస్తు ఇతివృత్తంతో కూడిన సినిమా రానుందని ఆ మధ్య వార్తలు వినిపించినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. తాజాగా నిర్మాత కొండా కృష్ణం రాజు పవన్ తో సినిమా తీయబోతున్నట్లు అఫీషియల్‌గా మీడియాకు వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే ఇది గతంలో చెప్పినట్లు జీసెస్ సినిమానేనా? కాదా? దర్శకుడు ఎవరు? అనేదానిపై నిర్మాత క్లారిటీ ఇవ్వక పోవడంతో అభిమానులు కన్ ఫ్యూజన్లో ఉన్నారు.

పవన్-త్రివిక్రమ్ మూవీ ఇన్ఫో.....


Pawan Trivikram Movie Info
ది సక్సెస్ ఫుల్ జోడీ ఆఫ్ జల్సా.....కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఆలోపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇప్పటికే రెడీ అయింది. త్వరలో త్రివిక్రమ్ స్క్రిప్టు వర్కు మొదలు పెట్టనున్నాడని, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దీన్ని ప్లాన్ చేస్తుననట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' షూటింగులో బిజీగా గడుపుతుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తాజా చిత్రం ‘జులాయి'కి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్, ప్రమోషన్ వర్కులో మునిగి తేలుతున్నాడు. జులాయి బాధ్యతలు తీరగానే త్రివిక్రమ్ పవన్ సినిమా స్క్రిప్టు వర్కుపై తన పూర్తి సమయం కేటాయించనున్నాడని తెలుస్తోంది.

బిల్లా' రీ రిలీజ్ కి ఏర్పాట్లు...ఎందుకంటే.........


Why Billa S Re Release
రీసెంట్ గా అజిత్ తాజా చిత్రం బిళ్లా 2(తెలుగు డేవిడ్ భిళ్లా)విడుదలైన సంగతి తెలిసిందే. మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తమిళంలో ఓకే అనిపించుకుంది. మొదటి వారం కలెక్షన్స్ కూడా అక్కడ చాలా బాగున్నాయి. సినిమా పెద్దగా బాగోలేదని టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం డ్రాప్ కాలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం భిళ్లా సినిమాకు ప్రీక్వెల్ కాబట్టి మళ్లీ ఒక్కసారి భిల్లా చూసి ఈ సినిమా చూస్తే బెస్ట్ అని రీ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో అజిత్ కూడా ఏకీభవించటంతో నిర్మాతలు 2007 లో వచ్చిన అజిత్ భిళ్లా చిత్రాన్ని తిరిగి విడుదల చేస్తున్నారు. పంజా దర్శకుడు విష్ణు వర్ధన్ రూపొందించిన భిళ్లా చిత్రం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఇప్పటి భిళ్లా మాత్రం కేవలం టేకింగ్ కే పరిమితమై నిరాశపరిచింది.

తెలుగు 'డేవిడ్‌ బిల్లా'విషయానికి వస్తే...రెండు వారాల క్రితం మంచి ఓపినింగ్స్ తో విడుదలైంది. డబ్బింగ్ చిత్రమైనా ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు,బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే స్ధితిలో క్రేజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా మాత్రం అందరి అంచనాలనూ తల క్రిందులు చేస్తూ ప్లాప్ గా మిగిలింది. స్టైలిష్ నటన పేరుతో సినిమాను లాజిక్ లు లేకుండా నత్త నడకతో నడిపించటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. గతంలో అజిత్ మంగత్తా మాదిరిగానే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కానీ స్ధితి చేరుకుంది.

ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు తోలేటి చక్రి మాట్లాడుతూ...''గ్యాంగ్‌స్టర్‌ సినిమాల్లో లాజిక్‌, నాటకీయత కంటే... కథానాయకుడి భావోద్వేగాలే కీలకం. ప్రతి సన్నివేశం కూడా స్త్టెలిష్‌గా కనిపించాలి. ఆ విషయంలో నేను, మా బృందం విజయం సాధించాం. తొలిసారి కమర్షియల్ విలువలున్న సినిమాకి అర్థమేమిటో నాకు తెలిసింది''అన్నారు .

అలాగే ''ప్రతి డాన్‌కీ ఓ చరిత్ర ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన చిత్రం 'డేవిడ్‌ బిల్లా'. వాస్తవంగా 'బిల్లా'కి ప్రీక్వెల్‌ చెయ్యాలనే ఆలోచన నాది కాదు. స్వతహాగా అజిత్‌ కోరిక అది. ఆయన ఉద్దేశం నచ్చడంతో కథ సిద్ధం చేసుకొన్నాను. ఒక సామాన్య యువకుడు డాన్‌గా ఎదిగే తీరును ప్రతిబింబిస్తూ... మొదట చేతితో, తర్వాత కత్తితో, చివరికి తుపాకులతో పోరాట సన్నివేశాల్ని తీర్చిదిద్దాం అన్నారు.

ఇక క్లైమాక్స్ సన్నివేశాల్లో నటీనటుల చేతుల్లో కనిపించిన ప్రతి ఆయుధం కూడా నిజమైనదే. అజిత్‌ డూప్‌ లేకుండా చేసిన యాక్షన్‌ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగులోనూ ఓ సినిమా చెయ్యాలనే ఆలోచన ఉంది. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను. అజిత్ స్టైలిష్ పెర్‌ఫార్మెన్స్, పతాక సన్నివేశాల్లో ఆయన చేసిన ప్రమాదకరమైన ఫీట్స్, జార్జియాలోని అత్యంత శీతల వాతావరణంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్స్‌గా నిలిచాయి. నిజమైన ఆయుధాలను ఉపయోగించిన జార్జియాలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. ఎంతో కష్టానికోర్చి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించడం ఆనందంగా ఉంది అన్నారు.

మీడియా, పవన్ కళ్యాణ్ మధ్య తగువేంటి?........


Why Pawan Kalyan Avoid Media
మొదటి నుంచీ పవన్ కళ్యాణ్ మీడియాను దూరం పెడుతూనే వస్తున్నారు. తన సినిమా హిట్టైనా, ప్లాపైనా మీడియాకు ఇంటర్వూలు ఇవ్వరు. గబ్బర్ సింగ్ లాంటి పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా ఆయన మీడియా ఇంటర్వూలకు చాలా దూరంగా ఉండిపోయారు. ఆయనే స్వయంగా ఓ ఇంటర్వూ ఎరేంజ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసి మీడియా వారికి పంపారు కానీ మీడియాతో స్వయంగా ఆయన ఇంటరాక్ట్ కాలేదు. ఇది టీవీ ఛానెల్స్ కు మింగుడు పడని విషయం. చాలా టీవీ ఛానెల్స్ ఆయన ఇంటర్వూ కోసం పీఆర్వోల మీద,మేనేజర్ల మీద ప్రెజర్ తెచ్చినా ఫలితం లేకుండా పోయింది.

రీసెంట్ గా తెలుగు ఓ పాపులర్ టీవీ ఛానెల్ ఆయన ఇంటర్వూ కోసం శత విధాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఉపయోగం లేదు. దాంతో అసలు పవన్ కళ్యాణ్ ఎందుకని మీడియాకు దూరం ఉంటారు. ఆయన తోటి హీరోలు మీడియాకు కంటిన్యూగా ఇంటర్వూలు ఇస్తూంటే ఆయన ఒక్కసారి కూడా మీడియా ముందుకు రావటానికి ఎందుకు ఇష్టపడరనేది చర్చనీయాంసంగా మారింది. ప్రస్తుతం మీడియా పై ఆయన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం చేస్తున్నారు. అందులో మీడియా పై సెటైర్స్ ఉంటాయని చెప్తున్నారు.

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం నిమిత్రం పద్మాలయా స్టూడియోలో భారి సెట్ వేస్తున్నారు. ఓ స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్ ని అక్కడ వేసారు. ఈ నెల 11 నుంచి 17 వ తేదీ వరకూ ఇక్కడ షూటింగ్ జరగనుంది. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం.
అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అలాగే 'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. వచ్చే అక్టోబర్‌ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేశాడు.

జూ.ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ కూడా ఆశ్చర్యపోయారు......

Manchu Laxmi About Uu Kodathaara Ulikki Padathaara
తారక్(ఎన్టీఆర్),కళ్యాణ్ రామ్ కూడా పూర్తిగా సర్పైజ్ అయ్యారు...మేము బాలకృష్ణను మంచు మనోజ్ సినిమాలో చేయటానికి ఒప్పించినందుకు అంటూ గర్వంగా చెప్తున్నారు మంచు లక్ష్మి ప్రసన్న. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే బాలకృష్ణ పోషించిన పాత్ర సినిమాలో బాగా ఎలివేట్ అయ్యింది. అందరూ మా నాన్నగారు మోహన్ బాబు ని ఈ సినిమాలో ఆ పాత్రకు తీసుకుంటామనుకున్నారు. కానీ బాలకృష్ణ ని తీసుకోవటం అందరకీ ఆశ్చర్యమనిపించింది. ఆ ఆశ్చర్యపోయే ఫాక్టరే సినిమాకు క్రేజ్ తెచ్చింది అన్నారామె.
నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' ఆగస్టు 2న కాకుండా వారం రోజులు ముందుగానే అంటే

అలాగే ...'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నాలుగేళ్ల మా టీమ్ కల నిజమవుతోంది. మా టీమ్ ని ఎంకరేజ్ చేయండి అని ట్వీట్ చేసారు. అలాగే మా సినిమా కు విపరీతమైన క్రేజ్ రావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ పెంచమని అడుగుతున్నారు అన్నారు. ఇది ప్రింట్స్ పెంచటం అనేది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ ఛాయిస్ అని మంచు మనోజ్ ఈ సందర్భంగా చెప్పారు.

బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. అలాగే ఊ కొడతా రా... ఉలిక్కి పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం దన్నారు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారన్నారు. తండ్రి మోహన్‌బాబు క్రమశిక్షణను పునికి పుచ్చుకున్న లక్ష్మీప్రసన్న ఈ చిత్రా న్ని ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.

ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి పడతారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు. ఇక బాలకృష్ణ రీసెంట్ గా నటించిన అధినాయకుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో ఆయన మళ్లీ హిట్ జోన్ లోకి వెళ్తారంటున్నారు.

రాజమౌళి ఆఫర్ పట్ల చిరంజీవి విముఖత?......


Chiru Say No Rajamouli
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం భారీ ఎత్తున గ్రౌండ్ వర్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరు చేయబోయే ప్రతిష్టాత్మక సినిమా కావడంతో సినిమా సంచలనాత్మకంగా ఉండాలని, ఒక మెసేజ్ ఫుల్ గా, తన రాజకీయ కెరీర్ కి ప్లస్సయ్యేలా ఉండటంటో పాటు...అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాలు కూడా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవి 150వ చిత్రానికి దర్శకుడు ఎవరు అని గత కొంత కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిలో రాజమౌళి, వివి వినాయక్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే ఇటీవల రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి లాంటి పెద్ద హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించను, చిన్న హీరోలతోనే చేస్తా....కానీ చిరంజీవి కోరితే ఆయన 150వ చిత్రానికి స్క్రిప్టు అందిస్తానని బహిరంగ ప్రకటన చేశారు.

రాజమౌళి ఆ ప్రకటన చేసిన అనంతరం మీడియాలో రకరకాల ఊహాగానాలతో కూడిన వార్తలు వినిపించాయి. మగధీర సమయంలో మెగా కుటుంబం చేసిన కొన్ని చర్యల వల్ల ఆయనతో కసి రగిలి చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ దర్శకుడిగా తన సత్తా నిరూపించుకుంటున్నారనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హర్టయిన చిరంజీవి స్క్రిప్టు అందిస్తానని రాజమౌళి చేసిన ఆఫర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించ కూడదని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

రాజమౌళికి అవకాశం ఇవ్వడం వల్ల ఆయనకు మనమే మరింత స్టార్ ఇమేజ్ తెచ్చిన వాళ్లం అవుతామని, రేపు సినిమా హిట్టయితే రాజమౌళి అందించిన స్క్కిప్టు వల్లనే అయిందని మీడియా కోడై కూస్తుంది....ఇది మెగాస్టార్ ఇమేజ్ పై ప్రభావం పడుతుందనే ఆలోచనలో మెగా వర్గం ఉందట.

కాగా...చిరంజీవి 150వ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడుగా ఖరారైనట్లు స్పష్టం అవుతోంది. ఆయన చిత్రానికి పరుచూరి బ్రదర్స్ స్కిప్టు అందించే పనిలో ఉన్నారని, గతంలో చిరంజీవి హిట్ చిత్రాలకు అద్భుతమైన స్క్రిప్టు అందించిన అనుభవం ఉన్న వీళ్లు ఉండగా రాజమౌళి అవసరం లేదనే ఆలోచనలో చిరంజీవి ఉన్

Monday, July 23, 2012

కూతురు సితార కోసం మహేష్ బాబు బ్రేక్...

Mahesh Babu Takes Break Be With Daughter Sitara
మహేష్ బాబు, నమ్రత దంపతులు మూడు రోజుల క్రితమే పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు ‘సితార' అనే పేరు కూడా పెట్టేశారు. పాపాయి పుట్టిన ఆనందంలో ఉన్న మహేష్ బాబు సినిమాలకు కొంత కాలం బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నాడు. మరో రెండు వారాల పాటు ఆయన ఏ షూటింగులోనూ పాల్గొనకుండా ఇంటిపట్టునే ఉంటూ సితారతో గడపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి డాక్టర్లు నమ్రతకు జులై 26న డెలివరీ డేట్ ఇచ్చారట. అయితే అంతకంటే ఆరు రోజుల ముందుగానే...అందులోనూ శ్రావణ శుక్రవారం సితార జన్మించడంతో మహేష్ దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఇల్లు బంధువుల హడావుడితో సందడిగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్ బాబుకు సంబంధించిన షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా పడింది. ఈ గ్యాప్ లో ఇతర తారాగణంపై సీన్ల చిత్రీకరణ చేయాలని నిర్ణయించినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ లీడ్ రోల్స్ చేస్తుండగా మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈగ @ $.1M...పవన్, మహేష్ రికార్డ్స్ స్మాష్.......


Eega Surpasses Gabbar Singh Dookudu Record
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ' చిత్రం యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నిన్నటితో 3 వీకెండ్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 1 మిలియన్ అమెరికన్ డాలర్స్ వసూలు చేసి చరిత్ర తిరగరాసింది. గతంలో మహేష్ బాబు దూకుడు చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా ఉండగా...దాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం తుడిచేసింది. తాజాగా ఈ ఇద్దరి రికార్డును రాజమౌళి ‘ఈగ' దెబ్బకు గల్లంతయ్యాయి.

సుదీప్, సమంత, నాని ముఖ్య పాత్రలు పోషించిన ఈగ చిత్రం అమెరికాలో విడుదలైన తొలి నాలుగు రోజులతో కలుపుకుని ఫస్ట్ వీక్ లో రూ. 3.65 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్స్ అక్కడ ఈ రేంజిలో రావడం ఒక రికార్డే. అయితే తొలుత ఈ చిత్రం థియేటర్ల సమస్య కారణంగా తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. లేకుంటే కలెక్షన్లు మరిన్ని ఎక్కువ వచ్చేవి.

ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్మాతలు సెకండ్ వీక్ నుంచి మరో 20 స్క్రీన్లు పెంచారు. దీంతో రెండో వీకెండ్ పూర్తయ్యే సరికి రూ. 1.35 కోట్ల వసూళ్లతో మొత్తం రూ. 4.99 కోట్లు కలెక్ట్ చేసింది. అనంతరం ఈ చిత్రాన్ని లోకల్ ఇంగ్లీష్ పీపుల్ కూడా చూసే విధంగా ఇంగ్లీష్ సబ్ టైటిల్ వేసి రిలీజ్ చేశారు. దీంతో ఈగ చిత్రం మూడో వీకెండ్ గడిచే సరికి 1 మిలియన్ డాలర్స్ మార్కును దాటింది.

గతంలో స్టార్ హీరోలు మాత్రమే రికార్డులు బద్దలు కొట్టగలరు అనే భావన ఉండేది. కానీ దర్శకుడు తలుచుకుంటే హీరో లేకుండా కూడా రికార్డులను తిరగరాయగలడు అని నిరూపించిన రాజమౌళిని పరిశ్రమలోని వారంతా అభినందిస్తున్నారు. ఈగ చిత్రం జులై 6న విడుదలైంది. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రంపై ఈచిత్రాన్ని నిర్మించగా డి. సురేష్ బాబు సమర్పణలో రిలీజ్ అయింది. కీరవాణి సంగీతం అందించారు.