పవన్ ‘కెమెరామెన్ గంగతో...’ ఫస్ట్‌లుక్!.......
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్
పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్‌పై పవన్ కళ్యాణ్‌ను చూసిన అభిమానులు
మాత్రం తమ హీరో కేక అంటూ సంబర పడిపోతున్నారు. అయితే ఇది ప్రొడక్షన్ హౌస్
నుంచి విడుదలైన అఫీషియల్ ఫోస్టర్ కాదని, సినిమాకు సంబంధించిన
ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ సంపాదించిన పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోషియేషన్‌కు
చెందిన సభ్యులు దీన్ని క్రియేట్ చేసిన ఫేస్‌బుక్‌లోకి వదిలినట్లు
తెలుస్తోంది. అఫీషియల్ పోస్టర్ చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల
కానుంది. ఏది ఏమైనా ఈ స్టిల్‌లో పవర్ స్టార్‌లో పవర్ చూస్తుంటే మరోసారి
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు ఖాయం అనే వాదన వినిపిస్తోంది.
పూరి జగన్నాథ్
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్‌గా
నటిస్తోంది. ఇందులో పవర్ స్టార్ మెకానిక్ పాత్రలో కనిపిస్తుండగా...తమన్నా
జర్నలిస్టు పాత్రలో మెరవనుంది. సమాజంలో జరిగే అన్యాయాలపై తమన్నా
పోరాడుతుండగా, పవన్ వాళ్ల పనిపట్టే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
సాధారణం
పూరి సినిమా అంటే అదిరిపోయే డైలాగులు ఉంటాయి. అందులోనూ టాప్ హీరోలంటే
ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని థియేటర్లో విజిల్స్ వేయించే
డైలాగులు రాస్తుంటాడు. తాజాగా పవన్ కోసం కూడా అదే రేంజిలో దుమ్ము రేపే
డైలాగులు రాసాడు పూరి.
చిత్రీకరణ విషయంలో పక్కాగా ఉండే పూరి అనుకున్న
సమయంలోపు సినిమాను పూర్తి చేసే క్రమ శిక్షణ గల డైరెక్టర్లలో ఒకరు. ఈ
చిత్రం షూటింగ్ కూడా అదే రేంజిలో స్పీడుగా కానిస్తున్నాడు. అక్టోబర్ 18
వరకు ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. డీవీవీ దానయ్య యూనివర్స్ మీడియా
బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment