పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి టాలీవుడ్లో ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. హిట్టు ఫట్టు అనే తేడా లేకుండా నిర్మాతలకు మంచి మార్జిన్లు తెచ్చే హీరోగా పవన్ స్టార్‌కు పేరుంది. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆయనకున్న ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉండటమే ఇందుకు కారణం. గబ్బర్ సింగ్ చిత్రం అంత పెద్ద విజయం సాధించడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ నటించడమే. వేరే ఎవరు నటించినా ఆ చిత్రం అంత పెద్ద హిట్ కాలేదు అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్, నటించే విధానం సినిమాకు అదనపు ఆకర్షణ తెచ్చి సినిమాను ఓ రేంజికి తీసుకెళ్లాయి.
గబ్బర్ సింగ్ తమిళ, మళయాల ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంది. అక్కడ ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ తాజా సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి కోలీవుడ్, మాలీవుడ్లలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈచిత్రం హక్కులు దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు.
పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా రూపొందుతున్న ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ మెకానిక్ గా నటిస్తున్నారు. తమన్నా జర్నలిస్టుగా కనిపించనుంది. ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గతంలో పవన్, పూరి, ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి' చిత్రం సూపర్ హిట్టయింది. ఈ నేపథ్యంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి.
No comments:
Post a Comment