ప్రముఖ దర్శకుడు శంకర్, చియాన్ విక్రమ్ కాంబినేషన్లో
త్వరలో రాబోతున్న చిత్రం ‘ఐ'. ఈ చిత్రంలో విక్రమ్ సరసన తొలుత సమంతను
అనుకున్నప్పటికీ చివరకు అమీ జాక్సన్ హీరోయిన్ ఖరారైంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం అమీ జాక్సన్ ఈ చిత్రంతో తన కెరీర్లోనే
అత్యంత భారీ మొత్తం తీసుకుంటోంది. ‘ఐ' చిత్రం కోసం ఆమెకు రూ. 75 లక్షల
రెమ్యూనరేషన్ నిర్మాతలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
తన తొలి సినిమా ‘మదరాసి పట్టణం' చిత్రానికి రూ. 5 లక్షల పారితోషికంతో మొదలు పెట్టిన అమీ జాక్సన్ ఇటీవల విక్రమ్ ‘తాండవం' చిత్రానికి రూ. 40-45 లక్షల పారితోషికం తీసుకుంది. శంకర్ లాంటి భారీ దర్శకుడి చిత్రం కాబట్టి ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగా 75 లక్షలు ఫిక్స్ చేశారు. వాస్తవానికి ఇంతకు ముందు సమంతను అనుకున్నప్పుడు ఆమెకు రూ. 1.25 కోట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ అనుకోని కారణాలతో సమంత తప్పుకుంది. ఆ మొత్తంతో పోల్చితే అమీ జాక్సన్ కు ఇచ్చింది పెద్ద మొత్తమేమీ కాదు.
ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది.
‘మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ రవి చంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments:
Post a Comment