పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కెమెరామెన్
గంగతో రాంబాబు చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి
వచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి
నటించిన ‘ఠాగూర్' చిత్రానికి సంబంధించిన మెసేజ్‌ఫుల్ లైన్స్ ఉంటాయని, పూరి
జగన్నాథ్ తన స్టయిల్‌లో లంచగొండి తనంపై డైలాగ్స్ రాశాడని తెలుస్తోంది.
స్ర్కిప్టులో భాగంగా ఈ డైలాగులు కలిపారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వీటిని అప్రూవ్ చేశారని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలిసింది. అన్నయ్య చెప్పిన డైలాగులు కాబట్టి...తమ్ముడి నోట మరోసారి పలికిస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని పూరి ఇలా డిసైడ్ చేశాడని......అన్న చెప్పిన మంచి మాటలే కాబట్టి వాడితే ఫర్వాలేదని పవన్ ఓకే చెప్పాడని టాక్.
ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం షూటింగ్ పద్మాలయా స్టూడియోలో జరుగుతోంది. ఇక్కడ వేసిన టీవీ ఛానల్ సెట్లో.....పలు ఆఫీస్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ పాత్ర....జర్నలిస్టయిన తమన్నాకు సహాయ పడే రీతిలో ఉంటుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రచ్చ చిత్రం తర్వాత మెగా కుటుంబంతో ఈ ప్రాజెక్టు చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మంచి జోష్ ఉన్న ట్యూన్లతో పాటు, అదిరిపోయే మెలెడీస్‌ని కంపోజ్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments:
Post a Comment