కథలోకి వస్తే...గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు (బాలకృష్ణ). గంధర్వ మహల్‌ను సొంతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మహల్‌లోకి ఓ యువకుడు (మంచు మనోజ్) ప్రవేశిస్తాడు. నరసింహరాయుడు కుటుంబానికి ఆ యువకుడికి ఉన్న సంబంధం కథలో కీలకం. నరసింహరాయుడు మహల్‌ను రక్షించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ.
విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే ప్రధాన బలం. ప్రతి సన్నివేశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. బాలకృష్ణ, మనోజ్‌ల నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. వారు తమ పాత్రలకు ప్రాణం పోశారు. గంధర్వమహల్ సెట్‌ని రూ.6 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దాం. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణ'' అన్నారు.
ఇప్పటికే ‘ఊకొడతారా..ఉలిక్కి పడతారా'ట్రైలర్స్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై ‘ఊ కొడతారా..ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారు. గత నెలలో ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment