సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ
స్టారర్‌గా రూపొందుతున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్
రాజు నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న
ఈచిత్రంలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు.
ఆ మధ్య సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ ట్రైలర్‌ను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో రాముడు, లక్ష్మణుల పాత్రల్లా ఉంటాయి వెంకటేష్ మహేష్ బాబు పాత్రలు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
ప్రస్తుతం ఈచిత్రం షూటింగుకు బ్రేక్ ఇచ్చాడు. కూతరు సితార పుట్టిన ఆనందంలో ఉన్న సూపర్ స్టార్...కొన్ని రోజుల పాటు ఆమెతో గడిపేందుకు షూటింగుకు శెలవు పెట్టారు. తన పుట్టినరోజు వేడుక అనంతరం బహుషా తిరిగి షూటింగులో పాల్గొనే అవకాశం ఉంది.

No comments:
Post a Comment