రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ'
చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఈ రోజుతో ఈ చిత్రం వారం రోజులు
పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ రోజు వరకు నైజాం
ఏరియాలో ఈచిత్రం రూ. 7.45 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న సెంకడ్ షో
ఎండ్ అయ్యే వరకు రూ. 6.83 కోట్ల కలెక్షన్ ఉండగా....నేటి కలెక్షన్లతో కలిసి
ఏడున్నర కోట్ల మార్కను అందుకుంది.
ఒక్క నైజాం ఏరియాలో ఈ రేంజిలో కలెక్షన్లు ఉంటే...ఆంధ్రా, సీడెడ్, ఓవర్సీస్, తమిళనాడు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. రేపటి వరకు పూర్తి వివరాలు తెలియనున్నాయి.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రాజమౌళి దర్శకత్వం తర్వాత సుదీప్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అసలు ఎలాంటి కమర్షియల్ స్టార్ హీరో లేకుండా ఈ రేంజిలో ఈచిత్రం కలెక్షన్లు కురిపించడం దర్శకుడు రాజమౌళితో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కథ కొత్తగా ఉండటం, మైండ్ బ్లోయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రం సక్సెస్ రేటును పెంచాయి.
ముఖ్యంగా యూఎస్‌లో చిత్రం ఊహించని విధంగా కలెక్షన్లు కురిపిస్తోంది. త్వరలోనే మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా. ప్రస్తుతం అక్కడ డిమాండ్‌కు తిగిన విధంగా థియేటర్లో విడుదల చేయక పోవడంతో సెకండ్ వీక్‌లో థియేటర్ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments:
Post a Comment