Monday, July 16, 2012

విక్రమ్, శంకర్ ల 'ఐ' ఫస్ట్ లుక్ ఇదే...........

విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించబోతున్న తాజా చిత్రం 'ఐ'. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ ప్రై.లి. సంస్థ పై భారీగా వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందబోతోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం చెన్నైలో జరిగింది. విక్రమ్‌, అమీ జాక్సన్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్ని చిత్రీకరించినట్లు సమాచారం. కథకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
shankar i first look unveiled
ఇక షూటింగ్ ప్రదేశాల కోసం దర్శకుడు కొద్దిరోజుల కిందట చైనాలో పర్యటించారు. మరో పది రోజుల్లో చిత్రబృందం చైనాకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడే నెలరోజుల పాటు షూటింగ్ చేస్తారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలీవుడ్‌ సినిమా 'త్రీ ఇడియట్స్‌' ని రీమేక్‌ చేసిన తరవాత శంకర్‌... మళ్లీ తన శైలిలోకి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. విక్రమ్‌ని దృష్టిలో పెట్టుకొని శంకర్‌ ఈ కథను సిద్ధం చేసుకొన్నారని సమాచారం.

కొన్ని రోజులుగా ఈ కథ విషయంపై శంకర్‌, విక్రమ్‌ల మధ్య చర్చలు నడుస్తున్నాయి. విక్రమ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'అపరిచితుడు'. శంకర్‌ ఆలోచనలకు, సృజనాత్మకతకూ ఈ సినిమా అద్దం పట్టింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.. ఆ అవకాశం ఉందంటున్నారు శంకర్ అభిమానులు. ఇది పొలిటికల్ డ్రామా అని చెప్తున్నారు. ఎన్నికల విధానంపై ఈ చిత్రం సాగుతుందని సమాచారం. దర్సకుడు శంకర్ కోరిక మీదట ఈ చిత్రానికి సమంత 180 రోజులు కేటాయించారు. అలాగే పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నారు.

విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ‘ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశం తో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment