మెగా అభిమానులకు చాలా ఇష్టమైన రోజంటే ఆగస్టు 22.
ఎందుకంటే ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. కొన్నేళ్లుగా మెగా
అభిమానులంతా చిరు పుట్టిన రోజు వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తూ
వస్తున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక కార్యక్రమాల్లో
పాలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా రక్తదానం, ఆసుపత్రుల్లో
రోగులకు పండ్లు పంచడం లాంటి చేస్తుంటారు.
అయితే ఈ సారి బర్త్ వేడుకలకు పవన్ అభిమానులు హాజరవుతారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కారణం అదే రోజు పవన్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' ఫస్ట్ లుక్ పోస్టర్ అదే రోజు రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులంతా ఆ హడావుడిలో ఉంటారనే వాదన వినిపిస్తోంది.
మరో వైపు చిరంజీవి అభిమానులు కూడా ఆ రోజు పవర్ స్టార్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని పట్టించుకునే అవకాశం లేదంటున్నారు. మెగాకుటుంబ హీరోలకు సంబంధించిన అభిమానులంతా ఒకే గొడుకు కింద వారైనప్పటికీ ఒకే రోజు ఇలా వేర్వేరు కార్యక్రమాలు ఉంటే మాత్రం తమ తమ అభిమాన హీరోల కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతూ వస్తున్నారు, ఇందుకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. బయట వినిపిస్తున్నట్లు ఈ సారి కూడా అలానే జరుగుతుందో ఏమో!
పవన్, తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 18న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments:
Post a Comment