Thursday, July 26, 2012

బడా దర్శకుల గుప్పిట్లో స్టార్ హీరోలు!.......

లాభాలొచ్చే సినిమా తీయాలంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరోలతో అయితేనే సేఫ్. అప్పుడప్పుడు స్టార్ హీరోలు లేకుండా ‘ఈగ' లాంటి సినిమాలు సక్సెస్ అయినా ప్రతిసారి అలాంటి మ్యాజిక్ పని చేస్తుందనే నమ్మకం లేదు. అలా అని స్టార్ హీరోల సినిమాలన్నీ హిట్టవుతాయని కాదు. కాక పోతే అది మాగ్జిమమ్ సేఫ్ రూట్.
star heroes big directors hand
బడా దర్శకులు, బడా నిర్మాతలు, బడా హీరోలు...ఇలా బడాబాబుల ఆలోచనలన్నీ బడాగానే ఉంటాయి. తమ రేంజి ఉన్న వారితోనే సినిమా తీయాలనుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతున్నది అదే. టాలీవుడ్ టాప్ దర్శకులు రాజమౌళి, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు చూపుతో బడా హీరోల డేట్స్ అన్నీ అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్నారు.

ఇటీవలే ఈగ చిత్రంతో హిట్ కొట్టిన రాజమౌళి...నెక్ట్స్ ప్రభాస్‌తో సినిమాకు సిద్దం అవుతున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‍తో సినిమాలు...ఇలా నాలుగేళ్ల పాటు బిజీ అయిపోవడానికి సిద్ధం అవుతున్నారు. మరో దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‍‌తో చేస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో సినిమాతో పాటు మహేష్ బాబు బిజినెస్ మేన్-2 చిత్రం చేయబోతున్నాడు.
మరో దర్శకుడు శ్రీను వైట్ల దూకుడు చిత్రాన్ని మించిన హిట్ కొట్టాలని కమిట్ మెంట్‌తో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్‌తో ‘బాద్ షా' చిత్రం చేస్తున్న వైట్ల...ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ లతో సినిమాలకు కథను సిద్దం చేసుకోబోతున్నాడు. అదే విధంగా వివి వినాయక్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా తర్వాత చిరంజీవి 150వ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. బాలయ్య 100వ సినిమాకు కూడా వివి వినాయక్ పేరే వినిపిస్తోంది.

No comments:

Post a Comment