Sunday, July 22, 2012

వేగంగా పరుగులు పెట్టే టాప్ టెన్ స్పోర్ట్స్ కార్స్.......

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో గంటకు 200 మైళ్లకు పైగా వేగంతో ప్రయాణించే కార్లు చాలానే ఉన్నాయి. స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీ వాతావరణం కారణంగా అనేక స్పోర్ట్స్ కార్ తయారీ కంపెనీలు విభిన్న మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, 2012 సంవత్సరానికి గానూ అత్యంత వేగంతో పరుగులు పెట్టే టాప్ 10 కార్ల జాబితా ఇటీవలే విడుదలైంది. ఇందులో ఎప్పటిలాగే బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ కారు అగ్రస్థానంలో నిలువగా ఫెరారీ 458 ఇటాలియా ఆఖరి స్థానంలో నిలిచింది.

2013 సంవత్సరానికి గాను అత్యంత వేగంగా పరుగులు తీసే కార్లు:1. బుగాటి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్:
ఇంజన్ - 1,200 హెచ్‌పి 8.0 లీటర్ డబ్ల్యూ 16 (క్వాడ్ టర్బోఛార్జ్‌డ్)
ధర - 2.4 మిలియన్ డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 268 మైళ్లు (గంటకు 431.304 కి.మీ.)
2. లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి700:
ఇంజన్ - 700 హెచ్‌పి 6.5 లీటర్ వి 12
ధర - 376,000 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 217 మైళ్లు (గంటకు 349.228 కి.మీ.)
3. ఫెరారీ ఎఫ్12 బర్లినెట్టా:
ఇంజన్ - 730 హెచ్‌పి 6.3 లీటర్ వి 12
ధర - 343,385 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 211 మైళ్లు (గంటకు 339.572 కి.మీ.)
4. ఫెరారీ ఎఫ్ఎఫ్:
ఇంజన్ - 651 హెచ్‌పి 6.3 లీటర్ వి 12
ధర - 295,000 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 208 మైళ్లు (గంటకు 334.744 కి.మీ.)
5. ఎస్ఆర్‌టి వీపర్:
ఇంజన్ - 640 హెచ్‌పి 8.4 లీటర్ వి 10
ధర - 100,000 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 206 మైళ్లు (గంటకు 331.525 కి.మీ.)
6. మెక్‌లారెన్ ఎమ్‌పి4 12సి:
ఇంజన్ - 616 హెచ్‌పి 3.8 లీటర్ వి 8 (ట్విన్ టర్బోఛార్జ్‌డ్)
ధర - 239,400 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 205 మైళ్లు (గంటకు 329.916 కి.మీ.)
7. బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్:
ఇంజన్ - 616 హెచ్‌పి 6.0 లీటర్ డబ్ల్యూ 12 (ట్విన్ టర్బోఛార్జ్‌డ్)
ధర - 234,000 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 205 మైళ్లు (గంటకు 329.916 కి.మీ.)
8. చెవర్లే కార్వెట్టె జెడ్ఆర్1:
ఇంజన్ - 638 హెచ్‌పి 6.2 లీటర్ వి 8 (సూపర్‌ఛార్జ్‌డ్)
ధర - 111,600 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 205 మైళ్లు (గంటకు 329.916 కి.మీ.)
9. లాంబోర్గినీ గల్లార్డో ఎల్‌పి 570-4 సూపర్‌లెగ్గరా:
ఇంజన్ - 562 హెచ్‌పి 5.2 లీటర్ వి 10
ధర - 237,600 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 202 మైళ్లు (గంటకు 325.087 కి.మీ.)
10. ఫెరారీ 458 ఇటాలియా:
ఇంజన్ - 562 హెచ్‌పి 4.5 లీటర్ వి 8
ధర - 229,825 డాలర్లు
గరిష్ట వేగం - గంటకు 201 మైళ్లు (గంటకు 323.478 కి.మీ.)

No comments:

Post a Comment