Monday, July 30, 2012

చిరంజీవికి పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్..........

Pawan Kalyan Birthday Gift Chiranjeevi
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలు లేవనే పుకార్లు గత కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లను పటా పంచలు చేయడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు. అన్నయ్య బర్తడే(ఆగస్టు 22) వేడుకలను ఘనంగా చేయాలని, అదే సందర్భంలో తన తాజా చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ వేడుకలకు యూనిట్ సభ్యులు ఎవరూ మిస్ కాకూడదని పవన్ కళ్యాణ్ ఆర్టర్ వేసినట్లు, అభిమానులు కూడా భారీ ఎత్తున హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ భారీ విజయంతో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. గతంలో పవన్-పూరి కాంబినేషన్లో బద్రి సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. దీంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో హిట్టయిన ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మాస్ ఆడియన్స్ మెచ్చే డైలాగులు రాయడంలో మంచి అనుభవం ఉన్న పూరి ఈచిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో కేక పెట్టించే డైలాగులు రెడీ చేశాడు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల స్థలంలో జరుగుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్‌పై పాట చిత్రీకరణ జరుగుతోంది.
అక్టబోర్ 18న విడుదల చేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని వివిధ స్టూడియోల్లో శరవేంగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment