Sunday, July 22, 2012

'కెమెరామేన్ గంగతో ...'రైట్స్ అల్లు అరవింద్ తీసుకోవటం వెనక...

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం నైజాం రైట్స్ ని గీతా ఆర్ట్స్ వారు ఎనిమిదిన్నర కోట్లకు సొంతం చేసుకున్నట్లు సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అరవింద్ తీసుకోవటానికి కారణం కేవలం ఆ నిర్మాతకి సాయిం చేయటానికే అని వినిపిస్తోంది. ఆ నిర్మాతకి ఆర్దికంగా ఇబ్బంది ఉంటే దానిని తొలిగించి షూటింగ్ జరగటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడని పరిశ్రమలో వినపడుతోంది.
why allu aravind take cgr nizam rights
అల్లు అరవింద్ కి తొలినుంచి సాటి నిర్మాతలకు ఆర్దికంగా సాయిం చేయటం అనే ఆనవాయితి ఉంది. అయితే అది కూడా ఆయన బిజినెస్ డీల్ క్రిందే పరిగణించి ఎగ్రిమెంట్ చేసుకుంటారని చెప్తారు. ఈ నేఫద్యంలో ఈ డీల్ జరిగిందని చెప్తున్నారు. 'కెమెరామేన్ గంగతో రాంబాబు'రిలీజ్ కు ముందే దాదాపు యాభై కోట్ల వరకూ బిజినెస్ జరగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలోని ప్రిన్సెస్‌ కేఫ్‌ ప్రాంతంలో చేశారు. ఫైట్ మాస్టర్ విజయ్‌ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఆ ఫైట్ సినిమాలో కీలకంగా నిలుస్తుందని,కథను మలుపు తిప్పేదని అని చెప్పుతున్నారు. ఆర్.ఎఫ్ సి లో ఐదు రోజులు చిన్న షెడ్యూల్ ఉంది. అక్కడ పూర్తి కాగానే మళ్లీ పద్మాలయాలో సెట్ కు వచ్చేస్తారు.

నిర్మాత మాట్లాడుతూ... పవన్‌ కల్యాణ్‌ పాత్ర చిత్రణ, ఆయన నటన మాస్‌ను ఆకట్టుకొనేలా ఉంటాయి. పూరి శైలి సంభాషణలు అందర్నీ అలరిస్తాయి. పవన్‌ అభిమానుల సమక్షంలో ఓ పాట చిత్రీకరణకు సన్నాహాలు సాగుతున్నాయి''అన్నారు. ఇక ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నిలిస్టు గా కనిపించనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తెలిసింది.

పవన్ ఈ చిత్రంలో మెకానిక్ గా కనిపించి అలరించనున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు.

No comments:

Post a Comment