Sunday, July 22, 2012

అయ్యో..'DCMమళ్లీ మారిపోయింది


Devudu Chesina Manushulu Postponed To Agugust 15
పూరీ జగన్నాధ్,రవితేజ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రం ఇప్పటికి పలుమార్లు రిలీజ్ డేట్స్ మార్జచుకుంది. తాజాగా ఆగస్టు 15 న ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మరి కొద్ది రోజుల్లో అపీషియల్ గా ప్రకటన రానుంది. బిజినెస్ సమస్యల వల్ల లేక ధియోటర్స్ సమస్యల వలనో ఈ రిలీజ్ డేట్స్ ఇలా మార్చుకుంటూ వెళ్తున్నారు. ఈగ సూపర్ హిట్ అవటం కూడా ఈ విడుదల తేదీ ఛేంజ్ కి కారణం కావచ్చని తెలుస్తోంది.

'దేవుడు చేసిన మనుషులు'ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా గురించి ఆయన తెలియజేస్తూ "ఇటీవల విడుదలైన ఆడియో సూపర్ హిట్టయింది. సినిమా విడుదలకు ముందే అన్ని పాటలూ ఆదరణ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ తెలుపుతూ...పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయట. మరి ప్రేమ పుట్టుక కూడా అక్కడే జరుగుతుందా? ఎవరు ఎవరిని ప్రేమించాలో దేవుడే నిర్ణయిస్తాడా? ప్రేమ అనే కాదు... ఈ సృష్టిలోని సమస్త విషయాలకూ బీజం భగవంతుడే వేస్తాడు. దేవుడికి అదో ఆట. ఈసారి ఆయనకు మరో ఇద్దరు దొరికారు... ఏదో మాయ చేసి వారిద్దరి మధ్య ప్రేమ సృష్టించాడు. మరి ఆ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలి అన్నారు.

No comments:

Post a Comment