చెన్నయ్ నుంచి వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ చిత్రంలో తమిళ నటుడు, బిల్లా మూవీ హీరో అజిత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతనిపై కొన్ని సీన్లు చిత్రీకరించారని తెలుస్తోంది. శ్రీదేవికి వీరాభిమాని అయిన అజిత్ ఆ చిత్ర దర్శకులు అడగ్గానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒకే చెప్పాడట.
ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రాన్ని బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అజిత్‌తో నటింపజేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. అలా అని అందాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ సన్నటి తీగలా నవనవలాడుతోంది. మరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఏమేరకు సక్సెస్ అవుతుందో..
No comments:
Post a Comment