Tuesday, July 24, 2012

బిల్లా' రీ రిలీజ్ కి ఏర్పాట్లు...ఎందుకంటే.........


Why Billa S Re Release
రీసెంట్ గా అజిత్ తాజా చిత్రం బిళ్లా 2(తెలుగు డేవిడ్ భిళ్లా)విడుదలైన సంగతి తెలిసిందే. మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తమిళంలో ఓకే అనిపించుకుంది. మొదటి వారం కలెక్షన్స్ కూడా అక్కడ చాలా బాగున్నాయి. సినిమా పెద్దగా బాగోలేదని టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం డ్రాప్ కాలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం భిళ్లా సినిమాకు ప్రీక్వెల్ కాబట్టి మళ్లీ ఒక్కసారి భిల్లా చూసి ఈ సినిమా చూస్తే బెస్ట్ అని రీ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో అజిత్ కూడా ఏకీభవించటంతో నిర్మాతలు 2007 లో వచ్చిన అజిత్ భిళ్లా చిత్రాన్ని తిరిగి విడుదల చేస్తున్నారు. పంజా దర్శకుడు విష్ణు వర్ధన్ రూపొందించిన భిళ్లా చిత్రం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఇప్పటి భిళ్లా మాత్రం కేవలం టేకింగ్ కే పరిమితమై నిరాశపరిచింది.

తెలుగు 'డేవిడ్‌ బిల్లా'విషయానికి వస్తే...రెండు వారాల క్రితం మంచి ఓపినింగ్స్ తో విడుదలైంది. డబ్బింగ్ చిత్రమైనా ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు,బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే స్ధితిలో క్రేజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా మాత్రం అందరి అంచనాలనూ తల క్రిందులు చేస్తూ ప్లాప్ గా మిగిలింది. స్టైలిష్ నటన పేరుతో సినిమాను లాజిక్ లు లేకుండా నత్త నడకతో నడిపించటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. గతంలో అజిత్ మంగత్తా మాదిరిగానే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కానీ స్ధితి చేరుకుంది.

ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు తోలేటి చక్రి మాట్లాడుతూ...''గ్యాంగ్‌స్టర్‌ సినిమాల్లో లాజిక్‌, నాటకీయత కంటే... కథానాయకుడి భావోద్వేగాలే కీలకం. ప్రతి సన్నివేశం కూడా స్త్టెలిష్‌గా కనిపించాలి. ఆ విషయంలో నేను, మా బృందం విజయం సాధించాం. తొలిసారి కమర్షియల్ విలువలున్న సినిమాకి అర్థమేమిటో నాకు తెలిసింది''అన్నారు .

అలాగే ''ప్రతి డాన్‌కీ ఓ చరిత్ర ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన చిత్రం 'డేవిడ్‌ బిల్లా'. వాస్తవంగా 'బిల్లా'కి ప్రీక్వెల్‌ చెయ్యాలనే ఆలోచన నాది కాదు. స్వతహాగా అజిత్‌ కోరిక అది. ఆయన ఉద్దేశం నచ్చడంతో కథ సిద్ధం చేసుకొన్నాను. ఒక సామాన్య యువకుడు డాన్‌గా ఎదిగే తీరును ప్రతిబింబిస్తూ... మొదట చేతితో, తర్వాత కత్తితో, చివరికి తుపాకులతో పోరాట సన్నివేశాల్ని తీర్చిదిద్దాం అన్నారు.

ఇక క్లైమాక్స్ సన్నివేశాల్లో నటీనటుల చేతుల్లో కనిపించిన ప్రతి ఆయుధం కూడా నిజమైనదే. అజిత్‌ డూప్‌ లేకుండా చేసిన యాక్షన్‌ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగులోనూ ఓ సినిమా చెయ్యాలనే ఆలోచన ఉంది. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను. అజిత్ స్టైలిష్ పెర్‌ఫార్మెన్స్, పతాక సన్నివేశాల్లో ఆయన చేసిన ప్రమాదకరమైన ఫీట్స్, జార్జియాలోని అత్యంత శీతల వాతావరణంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్స్‌గా నిలిచాయి. నిజమైన ఆయుధాలను ఉపయోగించిన జార్జియాలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. ఎంతో కష్టానికోర్చి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించడం ఆనందంగా ఉంది అన్నారు.

No comments:

Post a Comment