సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు శుక్రవారం
ఉదయం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు
రాజమౌళి మహేష్ బాబు దంపతులకు విష్ చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా ఆయన మహేష్
ఇంట పుట్టిన లిటిల్ ఏంజల్ పేరును కూడా వెల్లడించారు.
ఆయన తన సోషల్ నెట్వర్కింగ్ బ్లాగులో వెల్లడించిన పేరు ‘సితార'. మరి ఈ పేరుపై పాపాయిని రాజమౌళి ముద్దుగా పిలుచుకుంటున్నారా...? లేక మహేష్ బాబు మనసులో ఉన్న ఆలోచనను ఈ విధంగా బయట పెట్టారా? అనేది తేలాల్సి ఉంది. మహేష్ బాబుకు చాలా దగ్గరి స్నేహితుల్లో రాజమౌళి ఒకరు. తరచూ ఆయన్ను ఈయన..ఈయన్ను ఆయన పొగుడుకుంటుండం మనం చూస్తూనే ఉన్నాం. ఆచొరవతోనే రాజమౌళికి మహేష్ బాబు అందరికంటే ముందు ఈ పేరు చెప్పినట్లు తెలుస్తోంది. మరో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా మహేష్ కూతురి పేరు ’సితార‘ అని కన్‍ఫర్మ్ చేశారు.
ఇక మహేష్ బాబు పాపాయి విషయానికొస్తే... నమ్రత ప్రసవించిన స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, కాన్పు జరిగే సమయంలో మహేష్ భార్య పక్కనే ఉన్నాడని చెప్పారు. మహేష్ బాబు బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి ముందుగానే చేరుకున్నారని, మహేష్ బాబు తనయుడు గౌతం కూడా ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారని, తన చిట్టి చెల్లి చూసి మురిసి పోయాడని వెల్లడించారు.

No comments:
Post a Comment