ఇండియాలోనే గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ తాజాగా ‘ఐ' అనే భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దాదాపు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తన రేంజికి తగిన విధంగా తీసేందుకు లొకేషన్ల వేటలో పడ్డారు శంకర్.
శంకర్ ప్రస్తుతం లొకేషన్ల అన్వేషణలో భాగంగా చైనాలో పర్యటిస్తున్నారు. సినిమా గ్రాండ్‌గా రావడానికి బెస్ట్ లొకేషన్లు సెలక్ట్ చేస్తున్నారు. తను తీయబోయే ‘నంబన్' చిత్రాన్ని మక్కికి మక్కి దించి కాస్త అవమానకర పరిస్థితి ఎదుర్కొన్న ఆయన ఇక జీవితంలో రీమేక్‌లు చేయనని డిసైడ్ అయ్యారు. అందకే ‘ఐ' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో శంకర్ నిర్మించిన ‘జీన్స్' చిత్రంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు పలు ప్రపంచ ప్రసిద్ధ లొకేషన్లు చూపించారు. తాజాగా ఐ చిత్రం కూడా వరల్డ్ బెస్ట్ ప్లేసెస్‌లో చిత్రీకరణ జరుపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే ‘ఐ' చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం తాండవం చిత్రం షూటింగులో ఉన్న విక్రమ్ అది ముగిసిన అనంతరం శంకర్ సినిమాలో జాయిన్ కాబోతున్నారు. అమీ జాక్స్‌ను ఈచిత్రానికి హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది.
‘మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శంకర్, విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు చిత్రం కమర్షియల్‌గా సూపర్‌హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.......................
No comments:
Post a Comment