Tuesday, July 10, 2012

సమంతకు రూ.కోటి ప్లాట్ గిఫ్ట్?.............

Samantha Gets Rs 1 Crore Plot From Bellamkonda
సమంత ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టం. ఆమె ఏ చిత్రం చేసినా సక్సెసే...అందుకే ఈ భామ హీరోయిన్‌గా వరుస అవకాశాలతో దూసుకెలుతోంది. అందం, టాలెంట్‌తో పాటు సినిమాకు విజయం తెచ్చిపెట్టే లక్కు కూడా ఆమె వెంట ఉండటంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌గా మారింది.

ప్రస్తుతం సమంత డేట్స్ దొరకాలంటూ కనీసం ఆరు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. అందుకే ఏమాత్రం ఖాళీ ఉన్నా ఆమె ముందు వాలిపోతున్న నిర్మాతలు అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం నిర్మాత బెల్లకొండ సురేష్ హైదాబాద్‌లోని గండిపేటలో 1,000-1,500 స్వేర్ యార్డ్స్ వైశాల్యం గల రూ. 1కోటి విలువ చేసే ప్లాట్‌ను గిఫ్టుగా ఇచ్చాడట.

బెల్లంకొండ సిద్ధార్థ-సమంత హీరో హీరోయిన్లుగా నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఆ చిత్రం తర్వాత తన కొడుకు సాయిని హీరోగా పరిచయం చేస్తూ మరో చిత్రం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆ చిత్రంలో తన కుమారుడి సరసన సమంతను హీరోయిన్ పెట్టాలని డిసైడ్ అయిన బెల్లంకొండ ఆ చిత్రానికి ఇచ్చే రెమ్యూనరేషన్లో భాగంగానే ఈ ప్లాట్ కొనిచ్చాడని టాక్.

ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. గతంలో బెల్లంకొండ వివి వినాయక్‌కి ‘ఆది' చిత్రం చేసే చాన్స్ ఇచ్చి అతని కెరీర్‌కి బ్రేక్ ఇచ్చాడు. అందుకు ప్రతిఫలంగా బెల్లంకొండ తనయుడు సాయికి బ్రేక్ ఇవ్వడానికి అతనితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట వినాయక్.

No comments:

Post a Comment