‘ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం. ఎందుకంటే విద్యార్థుల్ని భావి భారత
పౌరులుగా తీర్చిదిద్దే మహత్తరమైన ఉన్నతమైన ఉద్యోగం అది. క్రమ శిక్షణ
నేర్పే కొలువు కూడా అది. మీ అందరికీ తెలుసు...నేను సినిమా నటుడు కాకముందు
ఉపాధ్యాయుడిగా పని చేశానని. అయితే ఒక సంవత్సరం ఆ వృత్తి లో పని చేసిన
తర్వాత నా ‘కులం' ఆ సంస్థ యజమానికి తెలిసి, అది రుచించని కారణంగా నన్ను
వారు ఉద్యోగం నుంచి తొలిగించిన విషయం కూడా మీకు గతంలో పలుమార్లు చెప్పి
ఉన్నాను. నేనే కాదు...మా నాన్నగారు కూడా బడిపంతులు ఉద్యోగం చేసారు. ఆయన
పేరు నారాయణస్వామి నాయుడు. ఆయన జీవితమంతా పిల్లల్ని తీర్చిదిద్దడానికి
వెచ్చించారు. ఆయన క్రమ శిక్షణే నాక్కూడా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు
చెబుతున్నాను అంటే...సెప్టెంబర్ 1న తిరుపతికి సమీపంలో నేను నెలకొల్పిన
విద్యా సంస్థల సముదాయం ‘శ్రీ విద్యానికేతన్'లో గ్రాడ్యుయేషన్ డే గర్వంగా
జరుపుతున్నాను.200 మంది ఎంటెక్ విద్యార్థులకు ఈ రోజు సర్టిఫికెట్లు ప్రదానం
చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు మంచి స్నేహితుడైన, పాండిచ్చేరి
లెఫ్ట్ నెంట్ గవర్నర్ శ్రీ ఇక్భాల్ సింగ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ శుభ
సందర్భంలో నా మనసు ఎంతో ఆనందంగానూ గర్వంగానూ ఉంది. కలలో కూడా ఊహించని
రీతిలో నేను విద్యా సంస్థల్ని నెలకొల్పడం, ఎంతో మంది పేద విద్యార్థులకు
కుల, మతాలకు అతీతంగా ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చి చదువు చెప్పించే అవకాశం
దొరకడం నా జీవితంలో మరువలేని ఓ ఆనందకర ఘట్టంగా నేను భావిస్తున్నాను.
Friday, August 31, 2012
స్పెయిన్ కి వెళ్లిన అల్లు అర్జున్...
రీసెంట్ గా విడుదలైన జులాయి హిట్ టాక్ తెచ్చుకోవటంతో హ్యాపీ ఫీలైన అల్లు అర్జున్ కొద్ది రోజులు రెస్ట్ కు హాలీడే ట్రిప్ కు వెళ్లారు. స్పెయిన్ లో ఈ హాలీడే ని ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం చివరలో ఇక్కడికి తిరగి వస్తారని సమాచారం. ఇండియాకి తిరిగి రాగానే... తన తదుపరి చిత్రం హడావిడిలో పడిపోతారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చి ఈ మ్యూజిక్ సిట్టింగ్ లో పాల్గొంటారని సమాచారం.
అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన పూరీ జగన్నాగ్ ఈ మేరకు స్కిప్టు వినిపించటం జరగింది. అది విన్న అల్లు అర్జున్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారని సమాచారం. అసలు కరెక్షన్ ఏమీ చెప్పలేదని,ఈ చిత్రం తన కెరిర్ లో మరోసారి దేశముదరు రేంజిని దాటే హిట్ వస్తుందని నమ్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శిరిడి సాయి' - సెప్టెంబర్ 6 విడుదల...
ఈ చిత్రం విడుదల కోసం నాగార్జున అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎ.సులోచనా రెడ్డి సమర్పణలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్న 'శిరిడిసాయి' ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎ.మహేష్ రెడ్డి మాట్లాడుతూ - ''ఈరోజు మా శిరిడి సాయి సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఒక మహాద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మా యూనిట్‌ని ప్రశంసించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నాగార్జునగారి అభిమానులు, ప్రేక్షకులు, సాయిబాబా భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్‌లో మొదటి సినిమాగా వస్తోన్న 'శిరిడి సాయి' చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ వుంది'' అన్నారు.
'ఏక్ థా టైగర్' 2 వారాల్లో రూ. 185 కోట్లు...
రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అననంగా రెండు రోజులతో కలుపుకుని తొలి వీకెండ్‌లో రూ. 154.21 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే మొదటి వారంలో పోల్చుకుంటే రెండో వారంలో మాత్రం ఒక్కసారిగా 80% బిజినెస్ డ్రాప్ అయింది.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 16 రోజుల్లో ఈచిత్ంర రూ. 185.5 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే సినిమా కేవలం సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్ పైనే ఆడుతోంది. సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బిజినెస్ మరో వారంలో పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘జోకర్' చిత్రం ఈ రోజు విడుదలవ్వడం కూడా ఈ చిత్రానికి గట్టి పోటీ అని చెప్పొచ్చు.
జూ ఎన్టీఆర్ కొత్తలుక్ హల్చల్....
జూ ఎన్టీఆర్,
కాజల్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అండ్ కామెడీ
ఎంటర్ టైనర్ ‘బాద్ షా'. చిత్రంలో జూ ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా
కొత్తలుక్‌తో కనిపించనున్నారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో జూ ఎన్టీఆర్ సరికొత్త
హెయిర్ స్టైల్‌తో కనిపించిన విషయం తెలిసిందే. జూనియర్ కర్లింగ్ హెయిర్
కాస్త సాఫ్ట్ హెయిర్‌లా తయారైంది. అదంతా కూడా అతను నటిస్తున్న ‘బాద్ షా'
చిత్రం షూటింగులో భాగంగా చేసిన మేకప్ స్టైల్. జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో 7
సరికొత్త హెయిర్ స్టైల్స్‌లో కనిపించనున్నాడు.
తాజాగా బాద్ షా చిత్రానికి సంబంధించిన జూ ఎన్టీఆర్ న్యూలుక్ స్టిల్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదలయ్యాయి. ఫోటోలో కనిపిస్తున్నది ‘బాద్ షా' చిత్రంలోని స్టిల్లే. కొన్ని పాటల్లో...కొన్నీ సీన్లలో జూనియర్ ఈ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తెప్పించారు. ఈ సినిమాలో జూనియర్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తేవడం ఖాయం అంటున్నారు.
మరో వైపు ఈచిత్రానికి సంబంధించి జూ ఎన్టీఆర్ పై విదేశాల్లో చిత్రీకరించిన డాన్స్ వీడియో షాట్ ఒకటి లీక్ అయింది. యూ ట్యూబ్‌లో ఇది హల్చల్ చేస్తోంది. అందులో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగి పోయాయి....
తాజాగా బాద్ షా చిత్రానికి సంబంధించిన జూ ఎన్టీఆర్ న్యూలుక్ స్టిల్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదలయ్యాయి. ఫోటోలో కనిపిస్తున్నది ‘బాద్ షా' చిత్రంలోని స్టిల్లే. కొన్ని పాటల్లో...కొన్నీ సీన్లలో జూనియర్ ఈ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తెప్పించారు. ఈ సినిమాలో జూనియర్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తేవడం ఖాయం అంటున్నారు.
మరో వైపు ఈచిత్రానికి సంబంధించి జూ ఎన్టీఆర్ పై విదేశాల్లో చిత్రీకరించిన డాన్స్ వీడియో షాట్ ఒకటి లీక్ అయింది. యూ ట్యూబ్‌లో ఇది హల్చల్ చేస్తోంది. అందులో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగి పోయాయి....
Thursday, August 30, 2012
రాణా జస్ట్ ఫ్రేండు మత్రమె : త్రిష...
దగ్గుబాటి హీరో రాణా, త్రిష మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. త్రిషకు రాణా ఓ ప్లాటినం ఉంగరాన్ని, నగల సెట్‌ను బహూకరించాడనే వార్త కూడా ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలను త్రిష ఖండించింది.
ఈ ప్రచారం అబద్ధమని, రాణాతో తనకు నిశ్చితార్థం కాలేదని త్రిష మండిపడింది. ఆ ఫొటోలూ వార్తలూ అవాస్తవమని.. తాను, రాణా ఎప్పటినుంచో మంచి స్నేహితులమని.. అలాంటి ది తమ మధ్య ఏదో జరుగుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఆమె తెలిపింది. అసలు జరగని ఎంగేజ్‌మెంట్ గురించి లేనిపోని వదంతులు సృష్టించొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్న తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది.
ఆసక్తి రేపుతున్న ‘రాంబాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్....
చిరంజీవి పుట్టినరోజుకు ఫస్ట్ లుక్ తో అలరిస్తాడనుకున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కాస్తా అనుకున్న సమయానికి రాలేకపోయాడు. తాజాగా ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడే విడుదలకానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 2న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫస్ట్ లుక్ తో పాటు ‘గబ్బర్ సింగ్’ శతదినోత్సవ వేడుక కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది.
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జర్నలిస్టుగా మొదటి సారి నటిస్తున్న పవన్ ను దర్శకుడు పూరి జగన్నాధ్ తన దైన శైలిలో తీర్చిదిద్దాడని, పూరి డైలాగులు అద్యంతం అలరిస్తాయని తెలుస్తోంది. పూరి దేవుడు చేసిన మనుషులు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్ గా తేలడంతో ఢీలాపడ్డ పవన్ అభిమానులు అంతగా చింతించాల్సిన అవసరం లేదని యూనిట్ వర్గాలు అంటున్నాయి. కేవలం మూడు పాటలు ఈ చిత్రంకోసం చిత్రీకరించాల్సి ఉంది. అందమైన లొకేషన్ల కోసం పూరి జగన్నాధ్ వెతుకుతున్నారు.
హా... నారాయణా (‘శ్రీమన్నారాయణ’ రివ్యూ)....
హీరో మారువేషం ఎందుకు వేస్తాడు? తననెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి! శ్రీమన్నారాయణలో బాలయ్య కూడా రకరకాల వేషాల్లో విలన్లను చంపడానికి వెళ్తాడు. ఒకసారి ‘ఒక్కమగాడు’లో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ వేషమేస్తాడు.. ఇంకోసారి సుల్తాన్ సినిమాలో గడ్డం క్యారెక్టర్ తరహా వేషమేస్తాడు. ఇంకోసారి నరసింహావతారమే ఎత్తుతాడు. మరి అతణ్ని ఎవరూ గుర్తుపట్టలేదా అంటే అదేం కాదు.. విలన్లు అతణ్ని చూడగానే ‘‘శ్రీమన్నారాయణా.. నువ్వా’’ అంటూ నోరెళ్లబెడతారు! హీరో వాళ్లను చంపేసి చక్కా పోతాడు. బాలయ్య విన్యాసాలు అభిమానులకు బాగానే ఉంటాయి.. కానీ సగటు ప్రేక్షకుడికే ఓ సందేహం.. ఇంతకీ హీరో ఆ వేషాలెందుకు వేసినట్లు.. అని. శ్రీమన్నారాయణ గురించి చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇది అభిమానులను మెప్పించే.. సగటు ప్రేక్షకుడికి సంతృప్తినివ్వని సినిమా! స్థూలంగా ఇది ఓ ఏవరేజ్ మూవీ.
శ్రీమన్నారాయణ (బాలకృష్ణ) ఓ టీవీ జర్నలిస్టు. అతను ఓ ల్యాండ్ స్కాంను బయటపెట్టి.. బైల్ రెడ్డి (జయప్రకాష్ రెడ్డి), పులికేశవరెడ్డి (సుప్రీత్), హర్షద్ మెహతా (సురేశ్)లకు శత్రువుగా మారతాడు. శ్రీమన్నారాయణ తండ్రి కల్కి నారాయణ మూర్తి (విజయ్ కుమార్) ఓ రైతు నాయకుడు. అతను జై కిసాన్ పేరుతో రైతుల కోసం ఓ ట్రస్టు నెలకొల్పి.. రూ. 5 వేల కోట్ల విరాళాలు సేకరిస్తాడు. ఐతే అనుకోకుండా నారాయణమూర్తి చనిపోతాడు. డబ్బు మాయమవుతుంది. ఈ డబ్బులు శ్రీమన్నారాయణే దొంగిలించినట్లు నేరం మోపబడుతుంది. అతను జైలుకు వెళ్తాడు. ఇంతకీ డబ్బులెక్కడికి పోయాయి? నారాయణమూర్తి ఎలా చనిపోయాడు? శ్రీమన్నారాయణ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? తనను ఇరికించిన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.
ఇప్పటికే లెక్కలేనన్నిసార్లు తెలుగు తెరపై చూసిన ప్రతీకార కథే ఇది. పోనీ కథనమైనా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. అంతా ఊహించినట్లే సాగుతుంది. హీరో ఒక్కో విలన్ని చంపడం చూస్తుంటే మొన్నటి దూకుడు వద్దన్నా గుర్తొస్తుంది. పైగా ఆ సినిమాలో ఉన్న కోట శ్రీనివాసరావు, సుప్రీత్ ఇందులోనూ ఉన్నారాయె. స్క్రీన్ ప్లేలో ఆసక్తికర విశేషాలేం లేవు. ఐతే ఇంటర్వెల్ మలుపు, ద్వితీయార్ధం రొటీన్ గానే ఉన్నా.. అభిమానులకు, మాస్ కు నచ్చే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయం సాధించాడు. తొలి ముప్పావు గంటలో పేలవమైన సన్నివేశాలు.. ఎలాంటి మలుపులు లేని కథనం… పావుగంటకోసారి వచ్చే సిగరెట్ సాంగులు.. చూస్తుంటే బాలయ్య ఖాతాలో మళ్లీ ఓ ఫ్లాపు చేరడం ఖాయమనిపిస్తుంది. అప్పటిదాకా అభిమానులు కూడా నీరసంగానే ఉంటారు. ఐతే ఇంటర్వెల్ కు ముందు మలుపుతో కథ ట్రాక్ లోకి వచ్చి.. ఆసక్తి నెలకొంటుంది. ఐతే ఇంటర్వెల్ తర్వాత అంతా ఊహించినట్లుగానే సాగినప్పటికీ ప్రథమార్ధంతో పోలిస్తే చాలా రిలీఫ్ గానే ఉంటుంది. ద్వితీయార్ధంలో బాలయ్య నటన, డ్యాన్సులు, ఫైట్లు అన్నీ అభిమానుల్ని అలరించేలా సాగుతాయి.
‘సామాన్యుడు’ సినిమాతో తనకంటూ ఓ శైలి ఉందని చూపిన రవికుమార్ చావలి.. ఇందులో ఏమాత్రం తన ముద్రను వేయలేకపోయాడు. ఓ మాస్ హీరో చేతిలో బందీ అయిపోయిన రవి.. రొటీన్ కథ, రొటీన్ కథనాలతో బండి నడిపించేశాడు. క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం, కృతకంగా అనిపించే పాటలు చూస్తేనే అతను ఎంతగా కాంప్రమైజ్ అయ్యాడో అర్థమవుతుంది. మన దర్శకుల్లో ఇటీవల కనిపిస్తున్న పెద్ద సమస్య ఏంటంటే వారు సమాజానికి సంబంధించిన ఏ విషయాన్నీ వాస్తవిక కోణంతో పరిశీలించట్లేదు. జనరల్ ఒపీనియన్స్ ను నమ్మి అదే వాస్తవమన్నట్లు చూపిస్తున్నారు. హీరోను జర్నలిస్టుగా చూపించిన దర్శకుడికి మీడియా విషయంలో కనీస అవగాహన కూడా లేదని అర్థమవుతుంది. ఓ స్కాంను జర్నలిస్టు బయటపెడితే.. ఆ జర్నలిస్టు స్కాంను బయటపెట్టాడని.. అతనికి అభినందనలు వెల్లువెత్తాయని స్క్రోలింగ్ ఇస్తారా.. సినిమాటిక్ గా సన్నివేశాలుండాలనుకుంటే హీరోను మామూలు వ్యక్తిగానే చూపించొచ్చు కదా. జర్నలిస్టుగా చూపించడమెందుకు?
ఓ రైతు నాయకుడు నాలుగు మీటింగుల్లో మాట్లాడేసి, రూ.5 వేల కోట్లను తాను సొంతంగా సమీకరించేస్తాడా..? అతణ్ని బ్యాంకులోనే కూర్చోబెట్టి చంపేసి, విలన్లు అంత సులభంగా డబ్బులు కొట్టేస్తారా? హీరో విలన్లను జైల్లోనే ఉంటూ సీబీఐ అధికారిని వెర్రి వెంగళప్పను చేసి, విలన్లను చంపేస్తాడా? దర్శకుడు మరీ ఇంత స్వేచ్ఛ తీసుకుంటే ఎలా? ప్రేక్షకుడిని మరీ తక్కువ అంచనా వేస్తే ఎలా? హీరోను అత్యంత శక్తిమంతుడిగా (మన హీరోలు అంతేకదా) చూపించిన దర్శకుడు.. విలన్ పాత్రల్ని మరీ బలహీనంగా మార్చేశాడు. పాటల కోసం కూర్చిన సన్నివేశాలు.. పాటల చిత్రీకరణ.. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ మరీ రొటీన్ గా, మొహం మొత్తేలా ఉన్నాయి. చక్రి సంగీతం ఔట్ డేటెడ్. పాటలు పేలవంగా ఉన్నాయి. అన్నీ రొటీన్ మాస్ సాంగ్సే. పోలూర్ ఘటికాచలం మాటలు కొన్ని చోట్ల మాత్రమే బాగున్నాయి. అందరూ వారసత్వంగా ఆస్తిని కోరుకుంటారు.. నువ్వు నా ఆశయాన్ని కోరుకున్నావు అనే డైలాగ్ బాగుంది. కానీ పదేపదే వాడటం వల్ల దాని విలువ తగ్గిపోయింది. విజయ్ కుమార్ రైతుల గురించి చెప్పే మాటలు కూడా ఓకే. దువ్వాసి మోహన్ క్యారెక్టర్ తో మాస్ కు నచ్చే పంచ్ లు వేయించాడు రచయిత. ఐతే కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు హద్దులు దాటాయి. దువ్వాసి కనిపించిన కాసేపు బాగానే నవ్వించాడు. అతని తర్వాత జయప్రకాష్ రెడ్డి కాస్త నవ్వులు పంచాడు. ఎమ్మెస్, కృష్ణభగవాన్ ల కామెడీ పండలేదు. హీరోయిన్లు పాటలకు తప్ప మరెందుకూ పనికి రాలేదు. ఉన్నంతలో పార్వతి మెల్టన్ పాత్ర కాస్త నయం. కానీ ఆమె మరీ బక్కచిక్కి చూడలేనట్లు తయారైంది.
బాలయ్య తన అభిమానుల్ని వందశాతం సంతృప్తి పరిచాడు. వారేం కోరుకుంటారో అదిచ్చాడు. ఈ వయసులోనూ డ్యాన్సులు, ఫైట్ల విషయంలో బాగా కష్టపడ్డాడు. బాలయ్య మేకప్ విషయంలో మళ్లీ ఏమాత్రం శ్రద్ధ కనబరచలేదు. నప్పని విగ్గు, డ్రెస్సులు, ముఖానికి అతికించినట్లు మేకప్ ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.
రొటీన్ సబ్జెక్టే అయినా.. పరమవీరచక్ర, అధినాయకుడు లాంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఒప్పుకోవడం మంచి నిర్ణయమే. ఫలితం కూడా నిరాశ కలిగించకపోవచ్చు.
Wednesday, August 29, 2012
బాబా సెహగల్ ‘పవర్ సాంగ్' .....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా.....బాగా ఇంప్రెస్ అయిన పాప్ గాయకుడు బాబా సెహగల్ ‘పవర్ సాంగ్' కంపోజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ యొక్క తత్వాన్ని ‘పవనిజం' అంటూ ఆరాదిస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపే విధంగా ఈ సాంగ్ ఉండనుంది. పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ‘పవర్ సాంగు'ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా సెహగల్ మాట్లాడుతూ...పవర్ సాంగ్ పవన్ కళ్యాణ్‌కి భజనలా ఉండదని స్పష్టం చేసారు. పవర్ స్టార్ యొక్క ఇమేజ్‍ని, ఆయన ప్రత్యేకతని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని వివరిస్తూ... అతనిపై ప్రేక్షకులు, అభిమానులు కురిపిస్తున్న అభిమానాన్ని ప్రతిభింభిస్తూ ఉంటుందన్నారు.
తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడటం మొదలు పెట్టాక పవన్ కళ్యాణ్ గురించి తెలిసింది. పవన్‌కి ఉన్న ట్రెమండస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్యర్య పోయారు. పీపుల్ ఆయన పట్ల అంత క్రేజీగా ఉండటానికి కారణం ఏమిటో ఆయన సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను కూడా పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్ అయిపోయానని బాబా సెహగల్ చెప్పుకొచ్చారు. పవర్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారికి అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు.
‘సుడిగాడు’ కలెక్షన్స్ (ట్రేడ్ టాక్)....
‘అల్లరి' నరేష్, మోనాల్ జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి. నిర్మించిన ‘సుడిగాడు' క్రితం శుక్రవారం విడుదలైంది . ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అల్లరి నరేష్ గత చిత్రాలు దేనికి రానంతగా ఈ చిత్రానికి కలెక్షన్స్ వస్తున్నాయి. విడుదలైన ఐదు రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్లు కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా నైజాంలో రెండు కోట్ల యాభై లక్షలు రూపాయలు కలెక్టు చేసిందని చెప్తున్నారు. ఇదే రన్ కంటిన్యూ అయితే ఫస్ట్ వీక్ లోనే పది కోట్లు వరకూ కలెక్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ కలెక్షన్స్ కు ప్రధాన కారణం పబ్లిసిటీ అని తేలుస్తున్నారు. మీడియాలో ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ చేయటంలో ట్రైలర్స్,పోస్టర్స్ ప్రధాన పాత్ర పోషించాయి. అందుకు తగ్గట్లుగానే ఓపినింగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజులు ఈ చిత్రం ఓ రేంజిలో కలెక్షన్స్ రాబట్టింది. కామెడీ చిత్రం కావటం, పెద్ద హీరోలను స్పూఫ్ చేయటం ఈ సినిమాకు కలిసివచ్చింది. తమ హీరోలను ఏ విధంగా స్పూఫ్ చేసారు అన్నది వీక్షించటానికే జనం ఎగబడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు.
సూపర్ బైక్ రేసింగ్ పార్ట్నర్లుగా నాగార్జున -ధోని
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, క్రికెటర్
ధోనీ బిజినెస్ పార్ట్నర్లు అయ్యారు. బైక్‌లంటే వల్లమాలిన వ్యామోహం కనబర్చే
టీమిండియా కెప్టెన్ ధోనీ, రేసింగులంటే పడిచచ్చే సినీ నటుడు నాగార్జున
ఇప్పుడు సంయుక్తంగా రేసింగ్ రంగంలకి దిగారు. వరల్డ్ సూపర్ బైక్
చాంపియన్‌షిప్‌లో ధోనీ- నాగార్జున టీమ్ పాల్గొననున్నాయి.
వచ్చే ఏడాది ఈ చాంపియన్‌షిప్ జరగనుంది. అంతకంటే ముందు దాని అనుబంధ రేస్ అయిన ఎఫ్ఐఎమ్ సూపర్‌స్పోర్ట్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మహీ-నాగార్జున సొంత జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు 'ఎమ్ఎస్‌డీ ఆర్-ఎన్ రేసింగ్ టీమ్ ఇండియా' అని నామకరణం చేశారు. 17 రేసుల చాంపియన్‌షిప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌లో జరిగే 10వ రేసులో మహీ-నాగ్ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఫ్లోరియన్ మరినో (ఫ్రాన్స్), డాన్ లిన్‌ఫుట్ (బ్రిటన్) ధోనీ-నాగ్ జట్టుకు రైడర్లు.
ఓ మధ్యవర్తిద్వారా ధోనీకి, నాగార్జునకు లింకు కలిసినట్లు ప్రముఖ ఆంగ్లపత్రిక పేర్కొంది. ఈ క్రమంలో ఇద్దరూ ఈ బైక్ రేసింగ్ జట్టులో పార్ట్నర్లు అయినట్లు స్పష్టమవుతోంది. ధోనీ మేనేజర్ అరుణ్ పాండే ఈ రేసింగ్ జట్టుకు మేనేజింగ్ డైరెక్టర్ కాగా...నాగార్జున డైరెక్టర్‌గా ఉన్నారని సమాచారం.
వచ్చే ఏడాది ఈ చాంపియన్‌షిప్ జరగనుంది. అంతకంటే ముందు దాని అనుబంధ రేస్ అయిన ఎఫ్ఐఎమ్ సూపర్‌స్పోర్ట్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మహీ-నాగార్జున సొంత జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు 'ఎమ్ఎస్‌డీ ఆర్-ఎన్ రేసింగ్ టీమ్ ఇండియా' అని నామకరణం చేశారు. 17 రేసుల చాంపియన్‌షిప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌లో జరిగే 10వ రేసులో మహీ-నాగ్ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఫ్లోరియన్ మరినో (ఫ్రాన్స్), డాన్ లిన్‌ఫుట్ (బ్రిటన్) ధోనీ-నాగ్ జట్టుకు రైడర్లు.
ఓ మధ్యవర్తిద్వారా ధోనీకి, నాగార్జునకు లింకు కలిసినట్లు ప్రముఖ ఆంగ్లపత్రిక పేర్కొంది. ఈ క్రమంలో ఇద్దరూ ఈ బైక్ రేసింగ్ జట్టులో పార్ట్నర్లు అయినట్లు స్పష్టమవుతోంది. ధోనీ మేనేజర్ అరుణ్ పాండే ఈ రేసింగ్ జట్టుకు మేనేజింగ్ డైరెక్టర్ కాగా...నాగార్జున డైరెక్టర్‌గా ఉన్నారని సమాచారం.
మళ్లీ వాయిదా పడ్డ ప్రభాస్ ‘రెబల్’.....
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు లారెన్స్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రెబెల్'. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. తొలుత ఈచిత్రం ఆడియో సెప్టెంబర్ 5న, సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.....పోస్టు ప్రొడక్షన్ పనులు లేటవుతుండటంతో సెప్టెంబర్ 14న ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బిజినెస్ డిటేల్స్....
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ చిత్రం బిజినెస్ చాలా ఊపుగా జరుగుతోంది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రం ఘన విజయం సాధించటంతో అలాంటి కాన్సెప్ట్ తరహాలో ఈ చిత్రంకి ట్రేడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. వచ్చే నెల 13న విడుదల అవుతున్న ఈ చిత్రం నైజాం రైట్స్ ని దిల్ రాజు ఫ్యాన్సీ ఎమౌంట్ కు తీసుకున్నారు. అలాగే ఆంధ్రా రైట్స్ మొత్తం ఇప్పటికే అమ్ముడుపోగా, సీడెడ్ రైట్స్ కూడా బిజినెస్ ముగింపు దశలో ఉంది. అలాగే ఓవర్ సీస్ బిజినెస్ చాలా బాగ జరిగినట్లు చెప్తున్నారు. ఇక శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు మంచి ఎమౌంట్ కి ఇప్పటికే తీసుకున్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...-‘‘నేను ఏ సినిమా చేసినా విలువల్ని మాత్రం మర్చిపోను. ఈ సినిమా మిమ్మల్ని షాక్‌కి, థ్రిల్‌కి గురి చేస్తుందని చెప్పను కానీ, కొన్నాళ్ల పాటు మీతో జర్నీ చేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. కోరికలు, ఆశలు, సంతోషాలు... ఇదే ఈ సినిమా కథ. ఓ కాలనీలోని ఆరుగురు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది. మన బాంధవ్యాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమా ఓ విధంగా నా కల. ఈ కల కార్యరూపం దాల్చడానికే రెండేళ్లు పట్టింది. ఈ సినిమా మేకింగ్‌లో చాలా అవాంతరాలు ఎదురొచ్చినా అధిగమించగలిగాం. వేటూరిగారు లేకపోవడం నాకు గొప్ప విషాదం. ఈ సినిమాలో అమల తొలుత చేయనన్నారు. చాలా బతిమిలాడాను. ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఈ విషయంలో నాగార్జున గారికి కృతజ్ఞతలు చెబుతున్నా'' అన్నారు.
Tuesday, August 28, 2012
‘పవనిజం’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పవనిజం'పై ఓ పాట ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఈ పాట రిలీజ్ డేట్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఈ సాంగును రిలీజ్ చేయబోతున్నారు.
తనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఉదారగుణం, స్టైల్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పట్ల... అభిమానులు ఎంతో గర్వంగా ఫీలవుతూ ఉంటారు. అలాంటి స్టార్ కోసం పాడుతున్న పాటను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబా సెహగల్ తానే స్వయంగా లిరిక్స్ రాసి మరీ దీన్ని కంపోజ్ చేసారు.
పవర్ స్టార్ అభిమానులకు కలకాలం గుర్తిండి పోయేలా... మంచి జోష్‌తో కూడి ఈ పాట ట్యూన్స్ ఉండనున్నాయి. ఇందులో ఇప్పటి వరకు పవన్ నటించిన సినిమాల పేర్లతో పాటు, అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాలను తెలియ పరుచనున్నారు. అదే విధంగా అభిమానులంటే పవన్ ఎంత విలువిస్తారో కూడా ఇందులో పొందు పరుచనున్నట్లు తెలుస్తోంది.
రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్ సినిమా !...
సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్లో గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించబోతున్నానరే వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఏవిఎం శరవణన్ ఈ ఇద్దరు స్టార్లతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల నిర్మాత శరవణన్, కమల్ హాసన్ ప్రొడ్యూసర్ నివాసంలో భేటీ అయ్యారని...ఈ క్రమంలో రజనీ, కమల్ కాంబినేషన్ సినిమా ప్రస్తావనకు వచ్చిందిన తెలుస్తోంది.
ఈ విషయమై శరవణన్ మాట్లాడుతూ...ఈ ఇద్దరి కాంబినేషన్ కేవలం కె. బాలచందర్ వల్లనే సాధ్యం. ఈ ఇద్దరు స్టార్లకు గురువు ఆయన. ఆయన వల్లే వాళ్లు ఈ స్థాయికి వచ్చారు. వాళ్ల ఇద్దరితో సంయుక్తంగా ఆయన గతంలో చాలా చిత్రాలు రూపొందించారు అని చెప్పుకొచ్చారు.
రజనీ, కమల్ కాంబినేషన్ ఐడియాపై బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి ఆనందం వ్యక్తం చేసింది. అయితే తన తండ్రి ప్రస్తుతానికి వీరుతో సినిమా చేయాలనే ఆలోచనలో మాత్రం లేరని వెల్లడించారు. ఏది ఏమైనా వీరి కాంబినేషన్లో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి త్వరలోనే అదని నిజం కావాలని ఆశిద్దాం.
రామ్ చరణ్ 'నాయక్ ' లేటెస్ట్ ఇన్ఫో ....
ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా,ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము''అన్నారు.
ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తున్నామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు అన్నారు.
10 కోట్లతో బన్నీ న్యూ గెస్ట్‌హౌస్ ?....
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్‌ను మరింత లగ్జరీగా గడిపేందుకు అన్ని హంగుళతో కూడిన గెస్ట్ హౌస్‌ను నిర్మించుకుంటున్నాడు. గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్లో నిర్మాణం అవుతున్న ఈ గెస్ట్ హౌస్ ఇంటర్నేషనల్ స్టాండర్స్, అత్యాధునిక ఆర్కిటెక్చర్‌తో నిర్మిస్తున్నారు.
ఈ గెస్ట్ హైస్‌లో విశాలమైన స్విమ్మింగ్ ఫూల్ తదితర ఏర్పాట్లతో పాటు ఓపెన్ రూఫ్ ఉన్న బెడ్ రూమ్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. బెడ్ రూమ్ నుంచి నేరుగా ఆకాశంలో చుక్కలను చూస్తూ కబుర్లు చెప్పుకోవచ్చన్నమాట. అదే విధంగా స్నేహితులు, బంధువులతో కలిసి పార్టీలు చేసుకోవడాని బెస్ట్ ప్లేసుగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. ఈ ఇంటి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారట. పుట్టుకతోనే చాలా రిచ్ అయిన బన్నీకి ఇలాంటి ఇల్లు నిర్మించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.....
బాలకృష్ణ, నారా రోహిత్ 'క్షత్రియులు'.......
ప్రస్తుతం ఒక్కడినే షూటింగ్ లో ఉన్న రోహిత్ కి ఆ స్క్ర్రిప్టు బాగా నచ్చి వెంటనే చేయాలనే ఉత్సాహంతో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే బాలకృష్ణ.. మంచు మనోజ్ చిత్రంలో గెస్ట్ గా చేసి మల్టి స్టారర్ కి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో తన బంధువైన నారా రోహిత్ చిత్రం వెంటనే ఓకే అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం ఫ్యామిలీ ,యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య..శ్రీమన్నారాయణ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. అది తీరిక దొరకగానే స్క్ర్రిప్టు పూర్తిగా వినటం జరగుతుందని చెప్పారుట. ఇక ఈ చిత్రం ఓకే అయితే సోలో నిర్మాతలే దీన్ని నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది.
మాస్క్'లో సూపర్‌హీరోగా జీవా....
నాకు తెలిసిన సూపర్‌హీరోలు అంటే ఎన్టీఆర్, ఎమ్జీఆర్. వారి సినిమాల నే ‘మాస్క్'లో ఆదర్శంగా తీసుకోవడం జరిగింది అని చెప్పారు మిస్కిన్ దర్శకత్వంలో జీవా తమిళంలో నటించిన చిత్రం ‘ ముగమూడి'. ఈ సినిమాను ‘మాస్క్' పేరుతో మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్ ప్రై.లిమిటెడ్ ద్వారా నిర్మాత ఆర్బీ చౌదరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 31న ‘మాస్క్' విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవా పై విధంగా స్పందించారు.
అలాగే ....‘మాస్క్'లో సూపర్‌హీరోగా చేశాను. అయితే ఆ పాత్రకు మానవాతీత శక్తులేం ఉండవు. తనలో అంతర్గతంగా దాగున్న ఓ మానవశక్తే ఆ పాత్రను సూపర్ హీరోను చేస్తుంది. గతంలో వచ్చిన కొన్ని సూపర్‌హీరోల చిత్రాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమాను మలిచామని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వాటికీ ‘మాస్క్'కీ సంబంధం ఉండదు. ఇది పూర్తి భిన్నమైన నేపథ్యం. కనిపించడానికి సూపర్‌హీరో సినిమాలా అనిపించినా... మన దేశానికి చెందిన భావోద్వేగాలన్నీ ఇందులో మెండుగా ఉంటాయి అన్నారు.
ఇక చాలా ఇంట్రిస్టింగ్ నేపథ్యంతో ఓ అద్భుతంగా మిస్కిన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 90 శాతం రాత్రి సమయంలోనే ఈ కథ నడుస్తుంది. హాంకాంగ్‌లో పేరిన్నికగన్న ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాకు పనిచేశాను. ఇందులో పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. కుంగ్‌ఫూలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలాగే సంగీత దర్శకుడు కె పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. టోటల్‌గా ‘మాస్క్' ఓ యూనివర్సల్ ఫిలిం అని జీవా తెలిపారు.
వర్మ ఆ రెండు సినిమాలు ఆగిపోయినట్లే?....
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో
హడావిడిగా అమ్మ 3డి చిత్రం చేస్తానని ప్రకటించారు. అంతేగాక రానా ప్రధాన
పాత్రలో అందం అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించారు. అయితే అమ్మ చిత్రానికి
భారీ బడ్జెట్ అవటంతో ఆ సినిమా ఆపేసారు. ఆ తర్వాత దగ్గుపాటి రానా చిత్రాలు
వరసగా ఫెయిల్యూర్ కావటం,డిపార్టమెంట్ చిత్రం అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవటంతో
వర్మ ఈ అందం చిత్రాన్ని మూలన పెట్టేసారని వినపడుతోంది. ప్రస్తుతం ఆయన
దృష్టి మొత్తం సత్య సీక్వెల్,భూత్ 2, 26/11 ముంబై ఎటాక్స్ సినిమాలపైనే
ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో భూత్ చిత్రాన్ని తెలుగుకి డబ్బింగ్ చేసి
విడుదల చేయనున్నారు.
అజయ్ దేవగన్, ఊర్మిళతో రామ్ గోపాల్ వర్మ తీసిన హారర్ చిత్రం 'భూత్' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రానుంది. 'భూత్-2' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వర్మ త్రీడిలో రూపొందిస్తున్నారు. గతంలో అజయ్ దేవగన్, ఊర్మిళతో వర్మ తీసిన 'భూత్' సినిమా చక్కని విజయాన్నే సాధించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు వర్మ. 'భూత్-2' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వర్మ త్రీడీలో తెరకెక్కిస్తున్నారు.
హీరో హీరోయిన్లు పాడుబడిన బంగళానుండి బయటకు రావటం 'భూత్'లో చివరి సన్నివేశం. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న జె.డి.చక్రవర్తి, మనీషా కోయిరాలా ఆ బంగళాలోకి ఎంటరవటంతో సీక్వెల్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ. మనీషా కోయిరాల 'భూత్-2' తో రీ-ఎంట్రీ ఇస్తోంది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ సినిమాతో మళ్ళీ పాత వర్మను చూస్తారని హీరోగా నటిస్తున్న జెడి. చక్రవర్తి అన్నారు. ఇందులో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి మధుశాలిని నటిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
రామ్ గోపాల్ వర్మ,జెడీ చక్రవర్తి కాంబినేషన్ లో రూపొందిన సత్య అప్పట్లో ఓ సంచలనం. ముంబై మాఫియామీద వర్మ తీసన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ ని జాన్ అబ్రహం నిర్మించబోతున్నట్లు సమాచారం. విక్కీ డోనర్ చిత్రంతో నిర్మాతగా విజయం సాధించిన జాన్ అబ్రహం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉన్నారు. తన బ్యానర్ పై సీరియస్ సబ్జెక్టులు చేయాలనుకుంటున్నట్లు జాన్ తెలిపారు. అందులో భాగంగానే వర్మ నుంచి విన్న సత్య సీక్వెల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సత్య సీక్వెల్ లో జెడీ నటిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
అజయ్ దేవగన్, ఊర్మిళతో రామ్ గోపాల్ వర్మ తీసిన హారర్ చిత్రం 'భూత్' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రానుంది. 'భూత్-2' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వర్మ త్రీడిలో రూపొందిస్తున్నారు. గతంలో అజయ్ దేవగన్, ఊర్మిళతో వర్మ తీసిన 'భూత్' సినిమా చక్కని విజయాన్నే సాధించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు వర్మ. 'భూత్-2' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వర్మ త్రీడీలో తెరకెక్కిస్తున్నారు.
హీరో హీరోయిన్లు పాడుబడిన బంగళానుండి బయటకు రావటం 'భూత్'లో చివరి సన్నివేశం. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న జె.డి.చక్రవర్తి, మనీషా కోయిరాలా ఆ బంగళాలోకి ఎంటరవటంతో సీక్వెల్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ. మనీషా కోయిరాల 'భూత్-2' తో రీ-ఎంట్రీ ఇస్తోంది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ సినిమాతో మళ్ళీ పాత వర్మను చూస్తారని హీరోగా నటిస్తున్న జెడి. చక్రవర్తి అన్నారు. ఇందులో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి మధుశాలిని నటిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
రామ్ గోపాల్ వర్మ,జెడీ చక్రవర్తి కాంబినేషన్ లో రూపొందిన సత్య అప్పట్లో ఓ సంచలనం. ముంబై మాఫియామీద వర్మ తీసన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ ని జాన్ అబ్రహం నిర్మించబోతున్నట్లు సమాచారం. విక్కీ డోనర్ చిత్రంతో నిర్మాతగా విజయం సాధించిన జాన్ అబ్రహం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉన్నారు. తన బ్యానర్ పై సీరియస్ సబ్జెక్టులు చేయాలనుకుంటున్నట్లు జాన్ తెలిపారు. అందులో భాగంగానే వర్మ నుంచి విన్న సత్య సీక్వెల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సత్య సీక్వెల్ లో జెడీ నటిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Monday, August 27, 2012
నిర్మాతగా గర్వంగా చెప్పుకునే చిత్రం శిరిడీ సాయి: నాగార్జున...
నాగార్జున పుట్టిన రోజు ఈ నెల 29. అంటే బుధవారం. సోమవారం ఆయన్ను అన్నపూర్ణ స్టూడియోలో కలిశాం. ముందుగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాం. వెబ్‌దునియా పేరు చెప్పగానే... దునియా అంతా మీదే అంటూ.. ఛలోక్తి విసిరారు. ఈ సందర్భంగా ఆయన వెబ్‌దునియాకు పలు విషయాలను తెలియజేశారు.
శిరిడీసాయి గురించి ఏమయినా ప్రత్యేకతలు తీసుకున్నారా?
కె. రాఘవేంద్రరావు చెప్పినట్లే చేశాను. నిజానికి ఈ సినిమా ఆరంభానికి ముందు పెద్దగా తెలియదు. వినడం తప్ప. శిరీడీ కూడా వెళ్లనూలేదు. కానీ అనూహ్యంగా ఓసారి శిరీడీ వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చాక రాఘవేంద్రరావు కథ చెప్పారు. ఆ క్షణం నుంచి ఏదో రూపంలో బాబా అనుగ్రహం లభిస్తూనే ఉందని చెప్పారు. ఈ చిత్రాన్ని అన్నమయ్య, రామదాసులతో పోల్చకూడదు. ఇది సాయి చరిత. హావభావాలు, వేషధారణ కోసం.. గత బాబా సినిమాలు చూడమన్నా.. చూడలేదు. దర్శకునిపై నమ్మకంతో చేశాను. అన్నమయ్య తర్వాత 15 ఏళ్ళకు ఈ సినిమా చేశాను.
అభిమానుల నుంచి స్పందన ఎలా ఉంది?
కొత్తగా ఏం చేసినా అభిమానులు స్వీకరిస్తారు. ఎంకరేజ్ చేస్తారు. నా కెరీర్‌లో జరుగుతుంది అదే. కలెక్షన్ల గురించి వారు మాట్లాడుకోరు. అభిమానుల పేరుతో ఏదో మాస్ మసాలా చేశాక రిజల్ట్ రాకపోతే వేస్టేగదా. వారికి కావాల్సింది మంచి సినిమా. అది చేస్తుంటాను.
శిరిడీ సాయి పాత్రలు యూత్‌కు నచ్చుతాయంటారా?
అసలు బాబా భక్తుల్లో ఎక్కువమంది యువతే. శిరిడీలోనే కాదు ఎక్కడ బాబా దేవాలయాలున్నా అంతా వారే కన్పిస్తారు. యువతలో ఆధ్యాత్మిక చింతన కన్పించడం నాకు ఆశ్చర్యమేసింది.
హీరోలకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఈ విషయంలో మీ ఆలోచన ఏమిటి?
నటుడికి ఇమేజ్ అనేది లేకపోతే స్టార్ కాలేరు. అయితే ఆ కథ చేస్తే ఇమేజ్ వస్తుందేమోనని ఆతృత నాలో లేదు. నలుగురు మెచ్చిన కథ అయితే చాలు. ప్రేక్షకుల్ని మెప్పించే ఇమేజ్ కంటే ఇంకేం కావాలి చెప్పండి. నేను స్టార్ అయినా భిన్నంగా కథలు చేయడం ఆదరించడం అదృష్టంగా భావిస్తున్నాను.
మీ బేనర్‌లో వచ్చిన రాజన్న ఫలితం ఎలాగుంది?
ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. బిజినెస్ పరంగా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇటీవలే టీవీలో కూడా వేసేశారు. చూసివాళ్లు ఫోన్లు చేసి నటుడిగా ధన్యుడివయ్యావని, తెలిసినవారు మెచ్చుకుంటుంటే అంతకంటే కావాల్సింది ఏముంది..? నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్‌లో రావడం ఇప్పటికీ గర్వంగా ఫీలవుతున్నా. ఆ చిత్రాన్ని చలనచిత్రోత్సవాలకు కూడా పంపించాలి.
ఇప్పుడు కొత్త గెటప్‌లో లవ్‌స్టోరీ చేస్తున్నారే?
అవును. అది పరిణితితో కూడిన కథ. నాదైన శైలిలో ఉంటుంది. దర్శకుడు దశరథ్ దాన్ని చక్కగా చెబుతున్నారు.
డమరుకం ఆలస్యానికి కారణం?
ఇది దేవుడికి మనిషికి సంబంధించిన కథే అయినా భక్తుడి కథ కాదు. 'డమరుకం' చిత్రం చిత్రీకరణ పూర్తయింది. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా బాగా తీశాడు. అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల రిలీజ్ ఆలస్యమైంది. నిర్మాత ఆర్.ఆర్. వెంకట్ రాజీ లేకుండా ఖర్చుచేశారు. సోసియో ఫాంటసీ కథలో మాస్ మసలాను అద్భుతంగా మిక్స్ చేసి దర్శకుడు తెరకెక్కించారు. నా 25 ఏళ్ల కెరీర్‌లో ఎవరూ చేయని కొత్త తరహా చిత్రమిది. బ్యాలెన్స్ పాటను ఈ నెల 30 నుంచి చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నాం.
మాఫియా చిత్రం చేస్తున్నారు?
అవును. భాయ్ అనేది టైటిల్. అయితే మాఫియా కథ కాదు. హలో బ్రదర్‌లా ఎంటర్‌టైనర్. వీరభద్రమ్ కథ చెప్పాడు. కానీ టైటిల్ అలా ఉంటుంది అంతే.
మూడు తరాలు నటించే చిత్రం ఎంతవరకు వచ్చింది?
కొంత సమయం పడుతుంది. ఎందుకంటే విక్రమ్ కె.కుమార్ కథ చెప్పాడు. బాగా నచ్చింది. అయితే దానికి కొన్ని మెరుగులు దిద్దాలి.
అఖిల్ రంగప్రవేశం?
ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. సినిమా అంటే ఇంట్రెస్ట్.. ఇటీవలే వాళ్ళమ్మ నటించిన సినిమా షూటింగ్‌కు వెళ్లాడు. చూశాక.. షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. శేఖర్ కమ్ముల చెప్పిన కథ నచ్చి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో నటించింది.
ఫిల్మ్ స్కూల్ విశేషాలు?
మనదగ్గర సాంకేతిక నిపుణుల కొరత ఉంది. సినిమా రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. రాబోయే ఐదేళ్ళలో డిజిటల్ విధానం వస్తుంది. 24 క్రాఫ్ట్‌లోనూ ఆ మార్పులు కన్పిస్తున్నాయి. అందుకే కొత్త పద్ధతులు తెలుసుకోవాలి. ఎక్కడో విదేశాల్లోనో, ముంబై ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్‌లో చేరువలో ఉండాలని ఫిల్మ్ స్కూల్ స్థాపించాం. మంచి నిపుణులు తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నాం.
మరి మీ బేనర్‌లో చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
ఉంది. మా బేనర్‌లో చేస్తూ.. ఫిల్మ్ స్కూల్ వారిని ఇన్వాల్వ్ చేస్తూ తీస్తున్నాం. భాయ్ చిత్రం పూర్తిగా మా బేనర్‌తోపాటు మా విద్యార్థులు పని చేస్తున్నారు. మంచి కథ, కథనాలు దొరికితే చిన్నచిన్న చిత్రాలు కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాం.. అని ముగించారు.
షాకిచ్చిన ఓవర్ సీస్ బిజెనెస్.....
పవన్ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం
'కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం
ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. పూరీ జగన్నాధ్,పవన్
కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో అంతటా షాకిచ్చే
రేంజిలో బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఇప్పటివరకూ ఏ హీరోకు లేనంతగా అమెరికా
మినహా ఓవర్ సీస్ బిజెనెస్ కోటి రూపాయలు జరిగింది.
వివరాల్లోకి వెళితే...ఎక్సలియర్ ఇండియా ఎంటర్టైన్మెంట్సా
వారు ఆస్ట్రేలియా,న్యూజ్ లాండ్ రైట్స్ ని 30 లక్షలుకు తీసుకున్నారు. అలాగే
కలర్స్ మీడియా వారు యుకె,యూరప్ ఏరియాలకు గానూ ముప్పై లక్షలకు తీసుకున్నారు.
ఇక కువైట్,గల్ఫ్ ప్రాంతం ఏరియాలకు నలభై లక్షలకు గానూ కె.జాని రత్న కుమార్
తీసుకున్నారు. మొత్తం కోటి రూపాయల వ్యాపారం జరిగింది. ఇక యు.ఎస్ రైట్స్ ని
నిర్మాత దానయ్య తన వద్దే ఉంచుకున్నారు. గబ్బర్ సింగ్ బిజినెస్..ఓవర్ సీస్
లో బాగా జరగటంతో ఈ సినిమాకు ఈ రేంజి రేటు పలుకుతోంది.
ఇక ఈ చిత్రం విడుదల తేదీ మొదట అక్టోబర్ 11న ఫిక్స్ చేసారు. సాధారణంగా రిలీజ్ డేట్స్ షూటింగ్స్ పూర్తవకో,బిజినెస్ లేటయ్యో ముందుకు పోతూంటాయి..కానీ పూరి రివర్స్ లో ..ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తూ అతి తక్కువ టైమ్ లో సినిమా పూర్తి చేయటమే కాకుండా ముందు అనుకున్న విడుదల తేదీని కూడా కాదని,ముందుకు రిలీజ్ డేట్ తెచ్చి షాక్ ఇస్తున్నారు. ఇది పవన్ అభిమానులకే కాక అందరికీ ఆనందం కలిగించే విషయం.
ఈ చిత్రం తమన్నా కాకుండా మరో హీరోయిన్ కూ స్కోప్ ఉందని సమాచారం. ఆ సెకండ్ హీరోయిన్ స్థానం బ్రెజిల్ మోడల్ గాబ్రియాలాకు దక్కింది.గాబ్రియాలా పాత్ర గరమ్ గరమ్‌గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నైట్ ఎఫెక్ట్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ చిత్రం విడుదల తేదీ మొదట అక్టోబర్ 11న ఫిక్స్ చేసారు. సాధారణంగా రిలీజ్ డేట్స్ షూటింగ్స్ పూర్తవకో,బిజినెస్ లేటయ్యో ముందుకు పోతూంటాయి..కానీ పూరి రివర్స్ లో ..ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తూ అతి తక్కువ టైమ్ లో సినిమా పూర్తి చేయటమే కాకుండా ముందు అనుకున్న విడుదల తేదీని కూడా కాదని,ముందుకు రిలీజ్ డేట్ తెచ్చి షాక్ ఇస్తున్నారు. ఇది పవన్ అభిమానులకే కాక అందరికీ ఆనందం కలిగించే విషయం.
ఈ చిత్రం తమన్నా కాకుండా మరో హీరోయిన్ కూ స్కోప్ ఉందని సమాచారం. ఆ సెకండ్ హీరోయిన్ స్థానం బ్రెజిల్ మోడల్ గాబ్రియాలాకు దక్కింది.గాబ్రియాలా పాత్ర గరమ్ గరమ్‌గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నైట్ ఎఫెక్ట్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
నాన్సెన్స్ అది గౌరవంగా ఇచ్చింది: నాని.....
హీరో నాని తన స్నేహితురాలు అంజనతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న వైజాగ్‌లో చాలా సింపుల్‍గా ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో హడావుడి లేకుండా జరిగి పోయింది. అయితే పెళ్లి మాత్రం ఇలా సింపుల్‌గా కాకుండా ఆడంబరంగా చేసుకుంటాను అంటున్నాడు ఈ యువ హీరో.
కాగా...అతని మామగారు నానికి కట్నకానుకల కింద భారీగానే ముట్టజెప్పాడని జూబ్లీహిల్స్ ఏరియాలో ఖరీదైన బంగళా, కూతురు-అల్లుడు షికార్లు కొట్టడానికి ఖరీదైన కారు ఇచ్చాడట. ఈ నేపథ్యంలో నాని డౌరీ తాను కట్నం తీసుకుంటున్నాని.. ఖరైదీన బంగాళా, కారు తన మామగారు ఇస్తున్నారని వస్తున్న వార్తలపై నాని సోమవారంనాడు ఖండించారు. అది అల్లుడిగా మామగారు తనపై చూపే గౌరవం.. ఈ మాత్రం దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు.
సినిమా హీరో కాకముందే వారు నాకు తెలుసు. హీరో అయ్యాక వారే ఇస్తున్న గౌరవం.. దీన్ని పెద్దది చేయవద్దని అన్నాడు. తన స్నేహితురాలు అంజనతో ఈ నెల 12న వైజాగ్‌లో నిశ్చితార్థం జరిగింది. పెండ్లి మాత్రం వైభవంగా జరుగుతుందనీ, ఇండస్ట్రీ పెద్దలంతా వస్తున్నారని చెప్పారు.
ఆ వివరాలు త్వరలో చెబుతానని ప్రకటించారు. మా స్నేహితుల ద్వారా పరిచయమైన అంజన.. చాలా మంచిమనిషి. నన్నెంతో ప్రోత్సహించేది. పరిచయం ప్రేమగా మారింది.
నవంబర్లో గ్రాండ్‌గా నాని-అంజన పెళ్లి జరుగనుంది. త్వరలోనే పెళ్లి తేదీ అధికారికంగా ప్రకటించనున్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా 5సంవత్సరాల క్రితం వైజాగ్‍లో నాని-అంజనకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏది ఏమైతేనేం నాని ఓ ఇంటివాడు కాబోతున్నాడు....
‘సుడిగాడు’ ఓపెనింగ్స్ కెక....
యూఎస్ ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం గురు, శుక్రవారాల్లో ఈచిత్రం రూ. 24.55 లక్షలు($ 44,255) వసూలు చేసింది. దీంతో ఇటీవల బెస్ట్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన తెలుగు చిత్రాల వరుసలో ‘సుడిగాడు' కూడా చేరాడు. ఇటీవలి కాలంలో జులాయి, గబ్బర్ సింగ్, ఈగ చిత్రాలు మినహా ఇతర తెలుగు చిత్రానికి సరైన స్పందన రాలేదు.
రవితేజ దేవుడు చేసిన మనుషులు అమెరికాలో 29 స్క్రీన్లలో విడుదలై తొలి రోజు రూ. 3.48 లక్షలు ($ 6,288) వసూలు చేయగా...ఓనమాలు చిత్రం తొలి వీకెండ్‌లో రూ. 1.80 లక్షలు ($ 3,243) కలెక్ట్ చేసింది. ఇక బాలయ్య అధినాయకుడు చిత్రం తొలి రోజు రూ. 5.45 లక్షలు ($9,844) రాబట్టింది. వీటితో పోలిస్తే సుడిగాడు చిత్రానికి వచ్చి ఓపెనింగ్స్ చాలా ఎక్కువ.
మరో వైపు సుడిగాడు చిత్రం ఇండియాలో కూడా 70% నుంచి 90% ఆక్యుపెన్సీతో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. టాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 5 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Sunday, August 26, 2012
యుగాంతం అనే అంశంతో నాగార్జున 'డమరుకం' సినిమా.....
గ్రహాలన్నీ ఒక చోటకి వస్తే ఎలాంటి ప్రళయం సంభవిస్తుందనే ఆసక్తికర అంశంతో మా చిత్రం తయారువుతోంది. 2012 తర్వాత యుగాంతం అనే అంశంతో మనకి కొన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఆ తరహా కథాంశంతో రూపొందుతున్న సినిమా అంటున్నారు నాగార్జున. నాగార్జున, అనుష్క జంటగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం'. ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు.
అలాగే "చందమామ, అమరచిత్రకథల తరహాలో ఉండే కథ 'డమరుకం'. కథ చాలా బాగుంటుంది. ప్రేక్షకులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ కారణంగానే ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. ఈ విషయంలో నిర్మాత వెంకట్ ఏ మాత్రం రాజీ పడకుండా గొప్పగా గ్రాఫిక్స్ చేయించారు. సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమా విడుదలవుతాయి. నాకు ఇది తొలి సోషియో ఫాంటసీ. పైగా నాకు తెలిసి తెలుగులో ఈ తరహా సినిమా ఎవరూ చేయలేదు'' అని నాగార్జున చెప్పారు.
కె. అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తయైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
నాగ చైతన్య.. క్లాస్ హీరోనా.. మాస్ హీరోనా?....
తెలుగు సినీ చరిత్రలో అక్కినేని ఫ్యామిలీ ఎంతటి రొమాంటిక్ హీరోలో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఒకప్పటి ఏ.యన్.ఆర్.. నిన్నటి నాగార్జున.. నేటి నాగ చైతన్య వరకు. ఈ అక్కినేని వంశం తెలుగు సినిమాలలో చేసే రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందంటే కాదనే వారుండరు. అదే కోవలోకి నాగ చైతన్య చేరనున్నాడు తన తండ్రిలా రొమాంటిక్ హీరో అనిపించుకోనున్నాడా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం నో అనే చెప్పాలట?
నాగ చైతన్యకు రొమాంటిక్ హీరో టైటిల్‌ను తగిలించడం నాగార్జునకు ఇష్టం లేదట. రొమాంటిక్ హీరోగా నాగార్జునకు బోర్ కొట్టిందేమో మరి! టాలీవుడ్‌లో మాస్ హీరోలకున్న క్రేజ్ అంత ఇంతా కాదు. సినీ ప్రస్థానంలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్న వ్యక్తి చిరంజీవి. అందుకే కాబోలు నాగార్జున, చైతూను రొమాంటిక్ హీరో కన్నా మాస్ హీరో ఇమేజ్‌లో చూడాలనుకుంటున్నారట.
ఐతే చైతు మాస్ ఇమేజ్ తేచ్చుకోగలడా లేదా అనేది అక్కినేని వారి ముందున్న సవాల్! ఇప్పటికే చైతూకి చేసిన రెండు ఫుల్ లెంగ్త్ మాస్ చిత్రాలు "దడ", " బెజవాడ" బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడగా ప్రస్తుతం త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న"ఆటో నగర్ సూర్యా" చిత్రంతో నాగ చైతన్య నిలదొక్కుకోకుంటే మాస్ హీరోల కొనసాగే అవకాశముందని లేకుంటే రొమాంటిక్ హీరోల ఇమేజ్ తప్పదని నాగార్జున ఆలోచనట. మరి చైతూ క్లాసా.. మాసా అనేది వేచిచూడాల్సింది...
నాగ చైతన్యకు రొమాంటిక్ హీరో టైటిల్‌ను తగిలించడం నాగార్జునకు ఇష్టం లేదట. రొమాంటిక్ హీరోగా నాగార్జునకు బోర్ కొట్టిందేమో మరి! టాలీవుడ్‌లో మాస్ హీరోలకున్న క్రేజ్ అంత ఇంతా కాదు. సినీ ప్రస్థానంలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్న వ్యక్తి చిరంజీవి. అందుకే కాబోలు నాగార్జున, చైతూను రొమాంటిక్ హీరో కన్నా మాస్ హీరో ఇమేజ్‌లో చూడాలనుకుంటున్నారట.
ఐతే చైతు మాస్ ఇమేజ్ తేచ్చుకోగలడా లేదా అనేది అక్కినేని వారి ముందున్న సవాల్! ఇప్పటికే చైతూకి చేసిన రెండు ఫుల్ లెంగ్త్ మాస్ చిత్రాలు "దడ", " బెజవాడ" బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడగా ప్రస్తుతం త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న"ఆటో నగర్ సూర్యా" చిత్రంతో నాగ చైతన్య నిలదొక్కుకోకుంటే మాస్ హీరోల కొనసాగే అవకాశముందని లేకుంటే రొమాంటిక్ హీరోల ఇమేజ్ తప్పదని నాగార్జున ఆలోచనట. మరి చైతూ క్లాసా.. మాసా అనేది వేచిచూడాల్సింది...
‘సుడిగాడు’కు సీక్వెల్ రాబోతుందట :-)...
పేరడీ సన్నివేశాల సమాహారం ‘సుడిగాడు’ సినిమాకు సీక్వెల్ రాబోతుందట. అల్లరి నరేష్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధిస్తున్న సుడిగాడు చిత్రానికి సీక్వెల్ తీస్తానని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ప్రకటించేశారు. దీనిని అల్లరి నరేష్ కూడా ఖాయం చేశాడు. చిత్రం ప్రమోషన్లో భాగంగా చెప్పారో లేక సీక్వెల్ ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి మరింత మంచిగా తీసి మెప్పించేందుకు ప్రయత్నమో గానీ సీక్వెల్ కు మాత్రం సిద్దమయిపోయారు ఇద్దరూ.
అవకాశం వస్తే ఈ చిత్రంలోనూ తానే హీరోయిన్ గా నటిస్తానని నటి మోనాల్ గజ్జర్ తెలిపింది. సుడిగాడు సినిమాలో పేరడీ హస్య సన్నివేశాలు ఎంతో బాగా ఉన్నాయని, అయితే కథ విషయంలో దర్శకుడు భీమనేని మరింత దృష్టి పెట్టి ఉంటే ఈ చిత్రం విజయం మరింత అద్భుతంగా ఉండేదని అంటున్నారు. మరి ఈ సూచనల నేపథ్యంలో భీమనేని రెండో సినిమాలో లోపాలు సవరిస్తే కామెడీ చిత్రాల్లో అది ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది...
‘అరుంధతి' ప్రేరణగా హిందీలో ప్రభుదేవా సినిమా ?....
ఆ మధ్య తమిళ, మలయాళ సినిమాలను బాలీవుడ్
తెరకెక్కించి హిట్లు కొట్టాడు దర్శకుడు ప్రియదర్శన్. ఇప్పుడా వారసత్వాన్ని
ప్రభుదేవా అందుకున్నాడు. పోకిరి,విక్రమార్కుడు చిత్రాలను రీమేక్ చేసి సూపర్
హిట్ కొట్టి అక్కడ మంచి కమర్షియల్ దర్శకుడుగా ముద్ర వేయించుకున్నాడు. ఈ
నేపధ్యంలో ఆ మధ్యన తెలుగులో అనూష్క ప్రధాన పాత్రలో చేసిన ‘అరుంధతి'
సినిమాని కొద్దిగా అటూ ఇటూ మార్చి హిందీ తెరకు ఎక్కించే ప్రయత్నాల్లో
ఉన్నట్లు బాలీవుడ్ సమాచారం.
త్వరలో ‘అరుంధతి' సినిమాను ప్రేరణగా తీసుకొని ఓ సరికొత్త కథాంశంతో ప్రభుదేవా ఈ సినిమా చేయనున్నారని సమాచారం. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను సోనాక్షి సిన్హా పోషిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో సోనాక్షి ‘రౌడీ రాథోడ్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ఆమె మరోసారి ప్రభుదేవాతో చేయాలని ఉత్సాహపడుతోంది. అంతేగాక త్వరలో రిలీజవుతున్న అక్షయ్‌కుమార్ ‘ఓ మై గాడ్' సినిమా కోసం ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఓ ఐటం సాంగ్ లో కూడా నర్తించారు సోనాక్షి.
ప్రస్తుతం తన వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్న సోనాక్షికి ఇటీవలే ప్రభుదేవా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారట. దాంతో ఈ పాత్రను సోనాక్షి కూడా ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నారని సమాచారం. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ఇక అరుంధతి చిత్రాన్ని హిందీలో చేయాలని చాలా కాలం నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ..ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఈ రకంగా అరుంధతిని ప్రేక్షకులకు చూపించాలని ప్రభుదేవా ఫిక్స్ అయ్యారు.
ప్రస్తుతం ప్రభుదేవా తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్‌కి కుమార్ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. శృతిహాసన్ ని హీరోయిన్ గా చేస్తోంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' స్క్ర్రిప్టులో ఛేంజ్ లు రాసి,నార్త్ కి తగినట్లు కామిడీని మార్చి తిరగరాస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
త్వరలో ‘అరుంధతి' సినిమాను ప్రేరణగా తీసుకొని ఓ సరికొత్త కథాంశంతో ప్రభుదేవా ఈ సినిమా చేయనున్నారని సమాచారం. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను సోనాక్షి సిన్హా పోషిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో సోనాక్షి ‘రౌడీ రాథోడ్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ఆమె మరోసారి ప్రభుదేవాతో చేయాలని ఉత్సాహపడుతోంది. అంతేగాక త్వరలో రిలీజవుతున్న అక్షయ్‌కుమార్ ‘ఓ మై గాడ్' సినిమా కోసం ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఓ ఐటం సాంగ్ లో కూడా నర్తించారు సోనాక్షి.
ప్రస్తుతం తన వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్న సోనాక్షికి ఇటీవలే ప్రభుదేవా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారట. దాంతో ఈ పాత్రను సోనాక్షి కూడా ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నారని సమాచారం. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ఇక అరుంధతి చిత్రాన్ని హిందీలో చేయాలని చాలా కాలం నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ..ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఈ రకంగా అరుంధతిని ప్రేక్షకులకు చూపించాలని ప్రభుదేవా ఫిక్స్ అయ్యారు.
ప్రస్తుతం ప్రభుదేవా తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్‌కి కుమార్ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. శృతిహాసన్ ని హీరోయిన్ గా చేస్తోంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' స్క్ర్రిప్టులో ఛేంజ్ లు రాసి,నార్త్ కి తగినట్లు కామిడీని మార్చి తిరగరాస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
మంచు విష్ణుకి డబ్బింగ్ చెబుతున్న ప్రభాస్.......
హీరో మంచు విష్ణు నటిస్తున్న ‘దేనికైనా రెడీ' చిత్రానికి ప్రభాస్ డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డబ్బింగ్ కార్యక్రమం పూర్తయింది. ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడంపై విష్ణు వివరణ ఇస్తూ..‘ఈ చిత్రంలో తన పాత్ర ప్రభాస్‌ను అనుకరిస్తుంది. అందుకే ప్రభాస్ డబ్బింగ్ చెప్పలి ఉందన్నారు.
తనకు సినీ పరిశ్రమలో ప్రభాస్, నితిన్, సునీల్ మంచి స్నేహితులని...వారి వాయిస్‌ని ఏదో ఒక సినిమాలో అనుకరించడానికి ముందుంటానని విష్ణు చెప్పుకొచ్చారు. తను అడగ్గానే వచ్చి డబ్బింగ్ చెప్పినందుకు ప్రభాస్‌కు థాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు.
‘ఢీ'తో తొలి విజయాన్ని ఢీ కొట్టిన మంచు విష్ణుకు ఆ తర్వాత అలాంటి హిట్టు దక్క లేదు. దీంతో ఇప్పుడు ‘దేనికైనా రెడీ' అంటున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని ‘ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.
Saturday, August 25, 2012
‘తుపాకి’ తెలుగు రైట్స్ ఎస్వీఆర్కి....
మెగాస్టార్ చిరంజవితో స్టాలిన్, సూర్యతో గజిని, సెవెన్త్ సెన్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఎస్.ఆర్.మురుగదాస్
తాజాగా తమిళంలో విజయ్, కాజల్ జంటగా ‘తుపాకి' చిత్రాన్ని హైబడ్జెట్‌తో, హై
టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రం తెలుగు
రైట్స్ ఎస్వీఆర్ మీడియా అధినేత్రి శోభారాణి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి సొంతం
చేసుకున్నారు.
ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ... మురుగదాస్ వంటి గ్రేట్ డైరెక్టర్ విజయ్, కాజల్‌తో ‘తుపాకి' సినిమా తెలుగు రైట్స్‌కి ఎంతో కాంపిటీషన్ ఉన్నా ఫైనల్‌గా మాకు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమానే అక్షయ్ తో హిందీలో రీమేక్ చేయబోతున్నాడు.
ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ... మురుగదాస్ వంటి గ్రేట్ డైరెక్టర్ విజయ్, కాజల్‌తో ‘తుపాకి' సినిమా తెలుగు రైట్స్‌కి ఎంతో కాంపిటీషన్ ఉన్నా ఫైనల్‌గా మాకు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమానే అక్షయ్ తో హిందీలో రీమేక్ చేయబోతున్నాడు.
రాజమౌళి-ప్రభాస్ మూవీ లేటెస్ట్ ఇన్ఫో....
‘ఈగ' చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ బాధ్యతలు తీరడంతో ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ గడిపేందుకు గోవా వెళ్లి దర్శకధీరుడు రాజమౌళి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభాస్‌తో సినిమాకు సిద్ధమౌతున్న జక్కన్న అందుకు సంబంధించిన పనులు ప్రారంభించారు.
గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు.
ఈచిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం.
శృతి హాసన్ అన్నగా సోనూ సూద్ !.....
తెలుగు ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని ‘రౌడీ రాథోడ్’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టిన ప్రభుదేవా ఇప్పుడు తెలుగులో తనే దర్శకత్వం వహించిన ’నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రంకోసం తెలుగులో శ్రీహరి పోషించిన త్రిష అన్నపాత్రను బాలీవుడ్ లో సోనూ సూద్ పోషించనున్నాడు. అయితే శృతి హాసన్ కు అన్నగా సోనూ సూద్ ఏంటి ? అన్న విమర్శలకు తెలుగులో త్రిషకు అన్నగా శ్రీహరి ఏంటి ? అని విమర్శించారని తరువాత ఆ పాత్రలో శ్రీహరి నటన చూసి ఆయనే కరెక్ట్ అన్నారని, ఇప్పడూ అదే జరుగుతుందని ప్రభుదేవా చెబుతున్నాడు.
రూ.40 కోట్ల క్లబ్ లో ‘జులాయి’......
త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ చిత్రాలు ఈ మొత్తం వసూలు చేసిన సినిమాల సరసన ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ ‘జులాయి’ కూడా చేరడంతో మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు ఈ క్లబ్ లో చేరారు. బద్రీనాథ్ వంటి డిజాస్టర్ తో ఉన్న అల్లు అర్జున్ కు ఈ చిత్రం హిట్ కావడం కొత్త ఊపిరినిచ్చింది.
అప్పుల్లో అతిలోక సుందరి !......
అతిలోక సుందరి శ్రీదేవి గత కొంత కాలంగా తెగ హడావిడి చేస్తోంది. అలనాటి ఈ అందాల తార కొన్నేళ్లుగా అడపాదడపా సినిమా ఫంక్షన్లలో తప్ప తెరమీదకు ఎన్నడూ రాలేదు. అలాంటి తార గత కొన్నాళ్లుగా తన కూతురు జాహ్నవిని హీరోయిన్ చేసేందుకు తెగ తిరుగుతోంది. తన బిడ్డల భవిష్యత్ కోసం ఆమె కంగారు పడుతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తోంది. అవును అతిలోక సుందరి శ్రీదేవి అప్పుల పాలయినట్లు తెలుస్తోంది. నిర్మాత బోనీకపూర్ ను పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఆ తరువాత సినిమాలకు దూరమయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆమె తిరిగి సినిమాల్లో నటించేందుకు ముఖానికి రంగులు వేసుకుంటోంది.
‘ఇంగ్లీష్ – వింగ్లీష్’ చిత్రంలో నటిస్తున్న శ్రీదేవి మరో తెలుగు చిత్రంలో నటించేందుకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాలు బయటకు వెళ్లడించడం లేదు. హఠాత్తుగా శ్రీదేవి సినిమాల వైపుకు రావడానికి కారణం ఏంటి చెప్మా అని బాలీవుడ్ వర్గాలు ఆరాతీస్తే అప్పులే కారణమని తేలింది. ఆమె నటించిన ‘ఇంగ్లీష్ – వింగ్లీష్’ చిత్రం అక్టోబర్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో శ్రీదేవి సరసన ప్రత్యేక పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో అజిత్ నటించగా హిందీలో అమితాబ్ బచ్చన్ నటించారు....
Friday, August 24, 2012
50 లక్షలు ఇచ్చుకున్న ‘రౌడీరాథోడ్’.....
తెలుగు, తమిళ హిట్ సినిమాలు బాలీవుడ్ కు రీమేక్ చేయడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. తెలుగులో హిట్
సినిమాలపై బాలీవుడ్ వర్గాలు ఓ కన్నేసి మరీ చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా
ప్రభుదేవా దర్శకత్వంలో హిందీలో అక్షయ్ కుమార్ – సోనాక్షీ సిన్హా జంటగా
‘రౌడీ రాథోడ్’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇది
తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజా హీరోగా వచ్చిన
‘విక్రమార్కుడు’కు రీమేక్.
ఈ చిత్రంలో హీరో రవితేజ ‘జింతాతా చితా చితా’ అనే ఊతపదాన్ని ఉప యోగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలో అలాగే ‘జింతాతా చితా చితా’ అని ఓ పాట కూడా వస్తుంది. దీనిని యధావిధిగా బాలీవుడ్ లోనూ వాడేశారు. దీంతో తెలుగు ఆడియో హక్కులు ఉన్న ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి నోటీసులు పంపించారు. దీంతో జరిగిన తప్పుకు మూల్యంగా ఏకంగా రూ.50 లక్షలు ఇచ్చినట్లు సమాచారం.
‘సుడిగాడు’ రివ్యూ......
ఎప్పుడైనా అల్లరి నరేష్ సినిమాకు ఒక్క రోజు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడం చూశారా? సినిమా మొదలవడానికి అరగంట ముందే థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు గమనించారా? నరేష్ తెరపై ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లు దద్దరిల్లిపోవడం చూశారా? సినిమా ముగిసేదాకా ఓ మాస్ హీరో స్థాయిలో నరేష్ జనాలతో చప్పట్లు, కేకలు, ఈలలు కొట్టించడం చూశారా? సుడిగాడు దెబ్బకు ఇవన్నీ సాధ్యమయ్యాయి. నరేష్ కెరీర్లో ఇలాంటి సినిమా ఇప్పటిదాకా రాలేదు. ఇకముందూ రాబోదు. ఇలాంటి క్యారెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో నరేష్ ఒక్కడే చేయగలడు. ఒక్కసారి మాత్రమే చేయగలడు. ‘సుడిగాడు’ జనాలు ఏం ఆశించాడో అదే ఇచ్చాడు. తెలుగు తెరపై ఇంతకుముందెన్నడూ లేనంత ‘పేరడీ’ వినోదం!
నిజానికి సుడిగాడు సినిమాలో కథే లేదు. ఇది తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాల పేరడీ సన్నివేశాల సమాహారం.. అంతే! టైటిల్ పడ్డప్పటి నుంచి మొదలైపోతుంది పేరడీ. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఈగకు స్పూఫ్. రాజమౌళి ఈగ సినిమా టైటిల్స్ లో ఓ పాపకు కథ చెబుతాడు కదా.. ఇందులో భీమనేని ఆ పని చేస్తాడు. అక్కడ ఈగ కథ చెబితే..ఇక్కడ తెలుగు సినిమా హీరో కథ.. టాలీవుడ్ హీరో అంటే అన్నీ సూపర్ మేన్ క్వాలిటీసే కదా. పుడుతూనే సిక్స్ ప్యాక్… ఉచ్చ పోసి విలన్ని చంపేయడం.. తన చిట్టి కాలితో తన్ని విలన్ని కోమాలోకి పంపేయడం.. ఇలా అన్నీ సూపర్ నేచురల్ పవర్స్ తో ఎంట్రీ ఇస్తాడు శివ (అల్లరి నరేష్). ఇక ఆ తర్వాత అతను పెరిగి పెద్దవడం.. ఆపై ఓ లవ్ స్టోరీ.. విలన్స్ తో ఫైటింగలు.. రకరకాల విన్యాసాలు.. చివరికి ఓ క్లైమాక్స్.
సుడిగాడు.. తమిళ్ పడం (తమిళ సినిమా) అనే కోలీవుడ్ మూవీకి రీమేక్. ఐతే అక్కడ హీరో వేషం వేసింది శివ అనే అనామకుడైన హీరో. అముదన్ అనే కొత్త దర్శకుడు చాలా సీరియస్ గా ఈ సెటైరికల్ మూవీని నడిపించాడు. రజనీకాంత్, కమలహాసన్ దగ్గరి నుంచి ఇప్పటి శింబు వరకు హీరోల మీద కూడా తీవ్రమైన సెటైర్లు విసిరారు. నిర్మాత దయానిధి అళగిరి (కరుణానిధి మనవడు) కావడంతో అక్కడ సినిమాకు ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. తమిళ జనాలు బాగా ఆదరించారు. సూపర్ హిట్టయింది. ఐతే మన తెలుగులో అంత సీరియస్ గా నడిస్తే హీరోలు, ఫ్యాన్స్ హర్టవుతారు కదా. అందుకే సీరియస్ నెస్ తగ్గించారు. లైటర్ వేలో సెటైర్లు వేశారు. ఇప్పటికే పేరడీలు చేయడం అలవాటైన నరేష్ తో ఈ సినిమా చేయాలనుకోవడంలోనే దర్శకుడు భీమనేని సగం విజయం సాధించారు. ఇక కాన్సెప్ట్ మాత్రమే తమిళం నుంచి తీసుకున్న భీమనేని.. ఇక్కడి నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టు రాసుకున్నాడు. మన సూపర్ హిట్ సినిమాల్ని బాగా స్టడీ చేసి.. సరైన పేరడీలు రాసుకున్నాడు.
హీరో ఇంట్రడక్షనే అదిరిపోతుంది. హీరో సైకిల్ తొక్కుతూ పెద్దోడైపోవడం.. అతను తన్నగానే ఒకడు విజయవాడలో.. ఇంకొకడు రాజమండ్రిలో.. ఇంకొకడు తిరుపతిలో పడటం.. ఆపై ఎయిట్ ప్యాక్ చూపించడం.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి. తర్వాత శివ, ఠాగూర్ స్పూఫ్, రౌడీ స్వర్ణక్క ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. ఇక సినిమాకే హైలైట్ గా నిలిచిన ఆట డ్యాన్స్ షో స్పూఫ్ తో ప్రథమార్ధం ముగుస్తుంది. ఇందులో పోసాని, శివశంకర్ ల కామెడీ అదిరిపోతుంది. ఐతే సెకండాఫ్ లో కొంతసేపు కథనం సాగతీతలా ఉంటుంది. ఐతే మళ్లీ హీరో రాయలసీమకు వెళ్లడంతో మళ్లీ నవ్వుల విందు మొదలవుతుంది. ఇక్కడ తొడకొట్టుడు కామెడీ మరో హైలైట్. పలనాటి బ్రహ్మనాయుడు ట్రైన్ సీన్ కు స్పూఫ్ గా తీసిన కామెడీ కెవ్వు కేక అనిపిస్తుంది. జయప్రకాష్ రెడ్డితో మర్యాద రామన్న ఎపిసోడ్ కూడా బాగానే నవ్విస్తుంది. క్లైమాక్స్ కు ముందు సన్నివేశాలు బావున్నా.. పతాక సన్నివేశంలో మాత్రం ఆశించిన స్థాయిలో కామెడీ లేదు. సినిమాకు కొసమెరుపులా ఉండాల్సిన క్లైమాక్స్ చప్పగా ఉంది. చిరంజీవి (ఠాగూర్), నాగార్జున (మాస్), వెంకటేష్ (ఘర్షణ), మహేష్ బాబు (పోకిరి), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్), జూనియర్ ఎన్టీఆర్ (దమ్ము), రామ్ చరణ్ (రచ్చ).. ఇలా అందరి సినిమాల్నీ పేరడీలకు వాడుకున్నారు.
ప్రతి సినిమాలోనూ మన పాపులర్ హీరోల్ని అనుకరించడం అలవాటుగా చేసుకున్న అల్లరి నరేష్.. ఈ సినిమా కాన్సెప్టే అదే కావడంతో ఇక చెలరేగిపోయాడు. ఫలానా సన్నివేశం అని చెప్పాల్సిన పనిలేదు. పేరడీలు చేసే ప్రతి సన్నివేశంలోనూ అదరగొట్టాడు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఓకే. మిగతా నటుల్లో జయప్రకాష్ రెడ్డి బాగా చేశారు. ఎమ్మెస్, కొండవలస, ఎల్బీ శ్రీరాం పెద్దగా నవ్వించలేకపోయారు. జఫ్ఫారెడ్డిగా బ్రహ్మీ, సిద్ధగా శ్రీనివాసరెడ్డి.. ఇంకా రఘుబాబు, ఫిష్ వెంకట్ బాగానే నవ్వించారు. సినిమా విజయవంతం కావడంలో సగం క్రెడిట్ నరేష్ దైతే.. సగం దర్శకుడు భీమనేనికి దక్కుతుంది. అతను సరైన సినిమాల్ని ఎంచుకుని.. వాటిని సరైన విధంగా పేరడీలు రాసుకున్నాడు. అతనే రాసుకున్న మాటలు కూడా బాగానే పేలాయి. సంగీత దర్శకుడు శ్రీ వసంత్ పర్వాలేదనిపించాడు. పేరడీ పాట జర జర బావుంది. ఈ పాట టేకింగ్ కూడా బావుంది.
‘సుడిగాడు’ను మిగతా సినిమాల్లా చూడకూడదు. ఎందుకంటే ఇది ఓ కథంటూ లేకుండా.. లాజిక్కులతో సంబంధం లేకుండా సాగే సినిమా. ఓ పద్ధతంటూ లేకుండా ముందుకెళ్తుంటుంది. కేవలం స్పూఫ్ లు మాత్రమే ఉంటాయని సిద్ధపడే సినిమాకు వెళ్లండి. కావాల్సినంత వినోదం దొరుకుతుంది.
Thursday, August 23, 2012
పుర్తి కవచ్చిన పవన్ సినిమా....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ పూర్తి కావస్తోంది. తాజాగా ఈచిత్రం షూటింగ్ విశేషాలను దర్శకుడు పూరి జగన్నాథ్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వివరిస్తూ... 3 పాటలు మినహా సినిమా షూటింగ్ ఈ నెలాకరుతో పూర్తవుతుందని వెల్లడించారు.
వచ్చే నెలలో మిగిలి ఉన్న మూడు పాటలు చిత్రీకరిస్తూనే...మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. చకచకా పనులు ముగుస్తుండటంతో అనుకున్న సమయం(అక్టోబర్ 18) కంటే వారం ముందుగానే అక్టోబర్ 11న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన ఈచిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పవర్ స్టార్ ఈ చిత్రంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు. పవన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అండ్ ఎంటర్ టైన్మెంట్ అంశాలతో ఈచిత్రం రూపొందుతోంది.
కోచ్‌గా అవతరమెత్తిన రవితేజ....
మాస్ మహారాజ రవితేజ హీరోగా పరుశు రామ్ దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మిస్తున్న చిత్రం "సార్ వచ్చారు ". ఇందులో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా నటించనున్నారు. ఇటీవలే ఊటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో ‘ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్.
మరో వైపు రవితేజ ‘బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించన్నారు. ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
మినిమమ్ హిట్ గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజను ఈ మధ్య వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. రవితేజ నటించిన వీర, నిప్పు, దొంగల ముఠా, దరువు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. తాజాగా రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది
‘దేవదాస్’గా మరిన హిరొ తనిష్....
అయితే ఈ చిత్రం గతంలో వచ్చిన దేవదాసు చిత్రాల మాదిరి ఉండదని, ఈ తరం యువతకు నచ్చేలా, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా జి. శ్రీనివాస్ అనే దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.
సెప్టెంబర్ 7న తనీష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈచిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. నిర్మాత వి.ఎస్. రామిరెడ్డి ఈచిత్రాన్ని వి.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి ఈచిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడు. హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు సినిమా ప్రారంభం రోజున వెల్లడి కానున్నాయి.
మనోళ్లకు దూల తీరలేదు!.....
మనసు పెట్టి తీస్తే చిన్న సినిమాలను కూడా సూపర్ హిట్ చేయవచ్చు అని
అనేక మంది నిర్మాతలు, దర్శకులు రుజువు చేస్తున్నారు. ఇక స్టార్ హీరో తో
సినిమాలు చేస్తే తొలి రెండు వారాల్లోనే మంచి కలెక్షన్లు దక్కించుకోవచ్చు
అని నిరూపణ అవుతోంది. కానీ మన తెలుగు నిర్మాతలకు తమిళ సినిమాలపై ఆసక్తి ఏ
మాత్రం తగ్గలేదు. ఒకవైపు భారీ రేట్లు పెట్టి కొనుక్కొన్న సినిమాలు దారుణ
పరాజయాల్ని మూటగట్టుకొంటున్నా…పేరున్న నిర్మాతలు కూడా కోట్ల రూపాయలు పెట్టి
తమిళ సినిమా హక్కులను కొనుక్కొంటున్నారు. తాజాగా బెల్లంకొండ సురేశ్ ఇలాంటి
సాహసం చేశాడు. ఇతడు సూర్య నటించిన తమిళ సినిమా ‘మాట్రాన్’ తెలుగు హక్కులను
17 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నాడు అని సమాచారం. కేవీ ఆనంద్
దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ
ఏకంగా 17 కోట్ల రూపాయలు అంటే మాటలుకాదు. భారీ స్థాయి హిట్ టాక్ వస్తే తప్ప
నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టేంత సీన్దీనికి ఉండదు. మరి కేవలం సూర్యను నమ్ముకొని అంత బడ్జెట్ పెట్టడం ఎంత
మేరకు సేఫ్ అనుకొన్నాడో కానీ బెల్లం కొండ దుమ్ము రేపాడు. ఈ సినిమా తెలుగులో
‘డూప్లికేట్’ గా అవుతోంది. ఇక సూర్య పరిస్థితి కూడా తెలుగు లో ఈ మధ్య
కాలంలో ఏ మంత బాగాలేదు. ఇతడి సెవెన్త్ సెన్స్ తెలుగు ప్రేక్షకులను
ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ మధ్య నట్టి కుమార్ త్రీ అనే సినిమా రైట్స్ ను
భారీ మొత్తానికి కొని నెత్తిన గుడ్డ వేసుకొన్నాడు. సూర్య సినిమా విషయానికి
వస్తే నిజంగానే ఆ ధరకు రైట్స్ కొని ఉంటే, పాజిటివ్ టాక్ వస్తే తప్ప
బెల్లంకొండను గట్టెక్కే పరిస్థితి లేదని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ
ప్రయోగాత్మక సినిమాతో బెల్లంకొండ ఏ కాడ తేలునో!
ఆగస్టు 30న బాలయ్య ‘శ్రీమన్నారాయణ’....
బాలకృష్ణ కథానాయకుడిగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి
దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ‘శ్రీమన్నారాయణ' ఆగస్టు 30న
విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల చిత్ర
విశేషాలను వివరిస్తూ-‘ మా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ద్వీతీయ చిత్రంగా
బాలకృష్ణతో ఈ శ్రీమన్నారాయణ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించింది. పాటలు
అన్ని వర్గాల శ్రోతలను విశేషంగా అలరించాయి. ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ని
ఆగస్టు 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు
తెలిపారు. ఈచిత్రం మంచి విజయాన్ని అందుకుని మా బ్యానర్‌కు మంచి పేరును
తెస్తుందన్న నమ్మకం నాకుంది'' అన్నారు.
వర్మపై ఇరవై కోట్ల అప్పు కేసు??....
ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో '26/11' అనే చిత్రం రూపొందబోతోంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్ర కథలో ఉగ్రవాద నిరోధక సంస్థ ఉన్నతాధికారి పాత్ర కీలకం. ఇది రాకేష్ మారియా అనే ఐపీఎస్ అధికారి జీవితానికి దగ్గరగా ఉంటుందని బాలీవుడ్ సమాచారం. ఆ పాత్ర కోసం కమల్‌హాసన్‌నీ దర్శకుడు సంప్రదించారు. అయితే ఆయన రిజెక్టు చేసారని సమాచారం. తర్వాత సంజయ్ దత్‌నీ అనుకున్నారు కానీ డిపార్టమెంట్ చిత్రం డిజాస్టర్ కావటంతో సంజూ సైతం వర్మ ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. దాంతో ఆ పోలీసు పాత్రను నానాపటేకర్ పోషిస్తున్నారు.
పవన్ కోసం దిల్ రాజు 'జనగణమణ'....
పవన్ కళ్యాణ్,దిల్ రాజు కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసినా దిల్ రాజుకు ఇప్పటికీ పవన్ డేట్స్ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా పవన్ ...దిల్ రాజుకి ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. దాంతో దిల్ రాజు ఈ జనగణమణ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. పవన్ తో చేయబోయే చిత్రం తమిళ,హిందీ,తెలుగు భాషల్లో చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ
ఇక జనగణమణ టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయగానే అంతా ఎన్టీఆర్,హరీష్ శంకర్ చిత్రం కోసం అని భావించారు. అయితే దిల్ రాజు అలాంటిది ఏమీ లేదని మరుసటి రోజు వివరణ ఇచ్చారు. దాంతో ఈ టైటిల్ ఖచ్చితంగా పవన్ కోసమే అని ఫిక్స్ అవుతున్నారు.
Wednesday, August 22, 2012
నరేష్ 'యముడికి మొగుడు' ఫస్ట్ లుక్.....
టాలీవుడ్ అల్లరోడు నరేష్ త్వరలో మెుగాస్టార్ చిరంజీవి
నటించిన మూవీ ‘యముడికి మొగుడు' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న
సంగతి తెలిసిందే. తాజాగా ఈ టైటిల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
టైటిల్ తో పాటు దాని డిజైన్ కూడా ఉన్నదున్నట్లు కాపీ చేశారు. దానికి ‘ఈ
నెలతక్కువోడు..' సబ్ టైటిల్ తగిలించారు. సినిమా స్టోరీలైన్ కూడా చిరంజీవి
సినిమానే పోలి ఉంటుందని, అయితే అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యేలా
స్ర్కీన్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి పుట్టిన రోజును
పురస్కరించుకుని దీన్ని రిలీజ్ చేసారు.
ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ సంస్థ
నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని శ్రీమతి అడ్డాల ధనలక్ష్మి
సమర్పణలో చంటి అడ్డాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రిచా పనయ్ కథానాయిక. ఈ
చిత్రంలో కోసం రాజమోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం 11 భారీ సెట్లు వేశారు.
ఇందులో యమునిగా షయాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందని, సినీయర్ హాస్య నటీనటులతో ఆద్యంతం వినోదంతో రూపొందిస్తున్నారు.
ఇందులో యమునిగా షయాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందని, సినీయర్ హాస్య నటీనటులతో ఆద్యంతం వినోదంతో రూపొందిస్తున్నారు.
ఎయిర్ పోర్టులో నాగ్ లవ్‌స్టోరీ!.....
అక్కినేని నాగార్జున, నయనతార జంటగా దశరత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ'. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లతో పాటు కె.విశ్వనాథ్ లపై సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వివాదంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ......
హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇటీవల
‘శ్రీమన్నారాయణ' ఆడియో ఫంక్షన్లో తండ్రితో కలిసి పత్యక్షమై వార్తల్లో
వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్లో మోక్షజ్ఞ తెరంగ్రేటం
గురించి చర్చ మొదలైంది.
ఆ సంగతి అలా ఉంచితే.... మోక్షజ్ఞ తాజాగా ఎవరూ ఊహించని కారణాలతో వార్తల్లో వ్యక్తిగా మారాడు. మోక్షజ్ఞ ప్రయాణిస్తున్న టాటా సఫారి కారును బంజారా హిల్స్ పోలీసులు సీజ్ చేసారు. వీకెండ్ పార్టీ పూర్తి చేసుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.... మోక్షజ్ఞ తన స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలో పాల్గొని ఆదివారం రాత్రి(ఆగస్టు 19)న బంజారా హిల్స్ రోడ్ నెం.12 వైపు వస్తుండగా, విధి నిర్వహణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు కాపు కాసుకుని ఉన్నారు. ఈ క్రమంలో ఆ వాహనాన్ని పోలీసులు పట్టకున్నారు.
వివరాల ప్రకారం...టాటా సఫారి వెహికిల్(AP 16 BK 1)ని ట్రాఫిక్ ఎస్ఐ బాలకృష్ణారెడ్డి పట్టుకుని దాన్ని డ్రైవ్ చేస్తున్న వెంకట్ సుధాకర్ పేరుపై కేసు రిజిస్టర్ చేసారు. దీంతో మోక్షజ్ఞ, అతని స్నేహితులు వేరే వెహికిల్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు మీడియాను అవాయిడ్ చేసి వేరే వాహనం రాగానే వెళ్లి పోయారు.
కాగా...వెంకట్ సుధాకర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా 30 mg పరిమితిని మించి 77 mg ఆల్కహాల్ మోతాదు అతని రక్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతనిపై మోటార్ వెహికిల్ చట్టంలోని నిబంధనల మేరకు సెక్షన్ 185(a) ప్రకారం కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసారు.
బాలయ్య ఇటీవల మోక్షజ్ఞను ‘శ్రీమన్నారాయణ' ఆడియో వేడుకకు తీసుకురాగా ఇదంతా అతనికి పబ్లిసిటీ పెంచడంలో భాగంగానే అని అంతా అనుకున్నారు. కానీ వీకెండ్ పార్టీ సంఘటనతో మెక్షజ్ఞ తనకు తానుగా బ్యాడ్ పబ్లిసిటీ సొంతం చేసుకున్నాడు. మోక్షజ్ఞ తన స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలో ఏ పానీయం తీసుకున్నారు? అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆ సంగతి అలా ఉంచితే.... మోక్షజ్ఞ తాజాగా ఎవరూ ఊహించని కారణాలతో వార్తల్లో వ్యక్తిగా మారాడు. మోక్షజ్ఞ ప్రయాణిస్తున్న టాటా సఫారి కారును బంజారా హిల్స్ పోలీసులు సీజ్ చేసారు. వీకెండ్ పార్టీ పూర్తి చేసుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.... మోక్షజ్ఞ తన స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలో పాల్గొని ఆదివారం రాత్రి(ఆగస్టు 19)న బంజారా హిల్స్ రోడ్ నెం.12 వైపు వస్తుండగా, విధి నిర్వహణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు కాపు కాసుకుని ఉన్నారు. ఈ క్రమంలో ఆ వాహనాన్ని పోలీసులు పట్టకున్నారు.
వివరాల ప్రకారం...టాటా సఫారి వెహికిల్(AP 16 BK 1)ని ట్రాఫిక్ ఎస్ఐ బాలకృష్ణారెడ్డి పట్టుకుని దాన్ని డ్రైవ్ చేస్తున్న వెంకట్ సుధాకర్ పేరుపై కేసు రిజిస్టర్ చేసారు. దీంతో మోక్షజ్ఞ, అతని స్నేహితులు వేరే వెహికిల్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు మీడియాను అవాయిడ్ చేసి వేరే వాహనం రాగానే వెళ్లి పోయారు.
కాగా...వెంకట్ సుధాకర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా 30 mg పరిమితిని మించి 77 mg ఆల్కహాల్ మోతాదు అతని రక్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతనిపై మోటార్ వెహికిల్ చట్టంలోని నిబంధనల మేరకు సెక్షన్ 185(a) ప్రకారం కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసారు.
బాలయ్య ఇటీవల మోక్షజ్ఞను ‘శ్రీమన్నారాయణ' ఆడియో వేడుకకు తీసుకురాగా ఇదంతా అతనికి పబ్లిసిటీ పెంచడంలో భాగంగానే అని అంతా అనుకున్నారు. కానీ వీకెండ్ పార్టీ సంఘటనతో మెక్షజ్ఞ తనకు తానుగా బ్యాడ్ పబ్లిసిటీ సొంతం చేసుకున్నాడు. మోక్షజ్ఞ తన స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలో ఏ పానీయం తీసుకున్నారు? అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
Subscribe to:
Comments (Atom)