దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక్కసారి కథ చెబితే చాలు ఎంత పెద్ద టాప్ హీరో అయినా ఒకే దెబ్బకు ఓకే అనాల్సిందే. రెండో సారి పూరితో సినిమా చేసే హీరోలు ఆయనపై నమ్మకంతో కథ వినకుండానే ఓకే చెప్పేస్తారు. ఆ రేంజిలో ఉంటుంది హీరోలకు పూరీ స్టోరీ వివరించే తీరు. ఒక్కసారి పూరి ఒక కథ పట్టుకుని హీరో దగ్గరి వెళ్లాడంటే ఓకే కావాల్సిందే. ఎందుకంటే ఏ హీరో ఇమేజ్‌కు తగిన విధంగా ఆ సబ్జెక్టును రెడీ చేసుకోవడం పూరి స్టైల్. హిట్టా? ప్లాపా? అనేది వేరే విషయం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ ఈ చిత్రం తర్వాత బన్నీతో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేయబోతున్నాడు. ఇటీవల పూరి బన్నీకి కథ వివరించగా చాలా ఎగ్జైట్ అయ్యాడని, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.
పూరీ జగన్నాధ్, అల్లు అర్జున్ కలయికలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో...'. గణేష్ బండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. దర్శకుడు పూరీ జగన్నాధ్ దేశముదురు తర్వాత బన్నీ కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పూరీ జగన్నాధ్.
No comments:
Post a Comment