మహేష్ బాబుతో పోకిరి తర్వాత పూరీ తన హవా చూపించాలేకున్నాడు అనడానికి మరో నిదర్శనం దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమాతో షాక్ తిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు త్వరలో పవన్, పూరీల కాంబినేషన్‌లో రానున్న"కెమేరామెన్ గంగతో రాంబాబు" ముంచుద్దో తేల్చుద్దోనని ఆందోళనలో పడ్డారట.
ఓవర్‌సీస్‌లో ఈ చిత్రాన్ని రూ.4.5 కోట్లకు బేరం పెట్టగా, ఆఖరుకు రూ.2.5 కోట్లకు కూడా కొనడానికి బయ్యర్లు మొగ్గుచూపడం లేదని భోగట్టా. మొత్తానికి పూరీ దేవుడు చేసిన మనుషులతో షాక్ తిన్న విదేశీ బయ్యర్లు పవన్ మార్కెట్ కన్నా పూరీపై అపనమ్మకం కలగడంతో ఈ సినిమాపై పెట్టుబడి పెట్టి తమ కుటుంబాలతో రోడ్డున పడుతామేమోనని బెంబేలెత్తిపోతున్నారట. దీంతో "గంగతో రాంబాబు"ను ఇక్కడా కొనేవారు లేక అక్కడా కొనేవారు లేక ఏమి చేయాలో పాలుపోని అయోమయ స్థితిలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్.
No comments:
Post a Comment