Saturday, August 25, 2012

‘తుపాకి’ తెలుగు రైట్స్ ఎస్వీఆర్కి....

 

 మెగాస్టార్ చిరంజవితో స్టాలిన్, సూర్యతో గజిని, సెవెన్త్ సెన్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఎస్.ఆర్.మురుగదాస్ తాజాగా తమిళంలో విజయ్, కాజల్ జంటగా ‘తుపాకి' చిత్రాన్ని హైబడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రం తెలుగు రైట్స్ ఎస్వీఆర్ మీడియా అధినేత్రి శోభారాణి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ... మురుగదాస్ వంటి గ్రేట్ డైరెక్టర్ విజయ్, కాజల్‌తో ‘తుపాకి' సినిమా తెలుగు రైట్స్‌కి ఎంతో కాంపిటీషన్ ఉన్నా ఫైనల్‌గా మాకు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్‌, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమానే అక్షయ్ తో హిందీలో రీమేక్ చేయబోతున్నాడు.


No comments:

Post a Comment