Sunday, August 19, 2012

విక్రమ్,శంకర్ చిత్రం తెలుగు వెర్షన్ టైటిల్ 'మనోహరుడు'...

Vikram As Manoharudu
విక్రమ్,శంకర్ కాంబినేషన్ లో 'ఐ' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కి టైటిల్ గా 'మనోహరుడు'ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో 'ఐ' అనే పేరుని ఖరారు చేశారు. తెలుగులో 'మనోహరుడు' అనే పేరుని నిర్ణయించారు. అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తారు. పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంలో మలయాళ హీరో సురేష్‌ గోపి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

గతంలో కూడా శంకర్ సినిమాల తెలుగు వెర్షన్ టైటిల్స్ కు ఓ విశేషం ఉంది. దాన్నే ఈ సినిమాకు సెంటిమెంట్ గా ఫాలో కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన గత చిత్రాలు...ప్రేమికుడు,ఒకే ఒకే ఒక్కడు,భారతీయుడు,అపరిచితుడు..కు చివర'డు' తో పూర్తవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాకు కూడా మనోహరు'డు' అనే నిర్ణయించినట్లు చెప్తున్నారు. ఈ సినిమాకు పి.సి శ్రీరామ్ కెమెరా వర్క్,రహమాన్ సంగీతం ఎప్పటిలాగే హైలెట్ గా నిలుస్తాయంటున్నారు.

ఇక బాలీవుడ్‌ సినిమా 'త్రీ ఇడియట్స్‌' ని రీమేక్‌ చేసిన తరవాత శంకర్‌... మళ్లీ తన శైలిలోకి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. విక్రమ్‌ని దృష్టిలో పెట్టుకొని శంకర్‌ ఈ కథను సిద్ధం చేసుకొన్నారని సమాచారం. విక్రమ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'అపరిచితుడు'. శంకర్‌ ఆలోచనలకు, సృజనాత్మకతకూ ఈ సినిమా అద్దం పట్టింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.. ఆ అవకాశం ఉందంటున్నారు శంకర్ అభిమానులు. ఇది పొలిటికల్ డ్రామా అని చెప్తున్నారు. ఎన్నికల విధానంపై ఈ చిత్రం సాగుతుందని సమాచారం. దర్సకుడు శంకర్ కోరిక మీదట ఈ చిత్రానికి అమీ జాక్సన్ 180 రోజులు కేటాయించారు.

No comments:

Post a Comment