అసలు విషయంలోకి వెళితే...పవర్ స్టార్ కోసం వెంకట్ మంచి కథ సిద్ధం చేశారు. ఇటీవల పలు సందర్భాల్లో పవన్‌ని కలిసి స్టోరీ డిస్కస్ చేశాడు. పవన్ కూడా ఆ కథ పట్ల సుముఖంగానే ఉన్నాడు. దీని గురించి కోన వెంకట్ తాజాగా తన ట్విట్టర్లో వివరిస్తూ...‘పవన్ కళ్యాణ్ తో నా స్టోరీ చర్చలు జరుగుతున్నాయి. ఆ కథను డైరెక్ట్ చేయగల రైట్ డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్నా' అని వెల్లడించారు.
ఫన్ అండ్ యాక్షన్ గా సాగే ఈ స్క్రిప్టు విషయమై కోన వెంకట్ కొన్ని రోజుల క్రితం ట్విట్టర్లో స్పందిస్తూ...దీన్ని శ్రీను వైట్ల అయితే పర్ ఫెక్టుగా తెరకెక్కిస్తాడని నా నమ్మం. ఈ కథ మొత్తం ఫన్ అండ్ యాక్షన్ తో కూడుకుని ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు. మరి చివరకు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
No comments:
Post a Comment