Thursday, August 23, 2012

వర్మపై ఇరవై కోట్ల అప్పు కేసు??....

Rgv Owes Rs 20 Cr Producer
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నిర్మాత భరత్ షా కేసు వేసినట్లు సమాచారం. తన వద్ద నుంచి తీసుకున్న పది కోట్ల రూపాయలు..దాని వడ్డి మరో పది కోట్లు కలిపి కట్టాలని నోటీసు పంపినట్లు ముంబై పత్రికల సమాచారం. ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ ..వర్మ జవాబు కోసం ఎదురుచూస్తున్నట్లు అక్కడి మీడియా వ్యాఖ్యానించింది. అయితే వర్మ ఈ వడ్డిని కట్టడానికి సిద్దంగా లేరని,అదీ కూడా ఆ నిర్మాత స్వయంగా తాను పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నాడు,ఆయన పేరే నిర్మాత,సమర్పడుగా వేసారు కాబట్టి కట్టక్కర్లేదని కొందరు అంటున్నారు. ఈ విషయమై వర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది తెలియరాలేదు.

ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో '26/11' అనే చిత్రం రూపొందబోతోంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్ర కథలో ఉగ్రవాద నిరోధక సంస్థ ఉన్నతాధికారి పాత్ర కీలకం. ఇది రాకేష్‌ మారియా అనే ఐపీఎస్‌ అధికారి జీవితానికి దగ్గరగా ఉంటుందని బాలీవుడ్‌ సమాచారం. ఆ పాత్ర కోసం కమల్‌హాసన్‌నీ దర్శకుడు సంప్రదించారు. అయితే ఆయన రిజెక్టు చేసారని సమాచారం. తర్వాత సంజయ్‌ దత్‌నీ అనుకున్నారు కానీ డిపార్టమెంట్ చిత్రం డిజాస్టర్ కావటంతో సంజూ సైతం వర్మ ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. దాంతో ఆ పోలీసు పాత్రను నానాపటేకర్‌ పోషిస్తున్నారు.

No comments:

Post a Comment