ఇప్పటిదాకా
ఒంట్లో కేజీ కండ లేకుండా టాలీవుడ్ వెండితెరపై అగ్ర స్థానంలో రాణిస్తున్న
హీరోయిన్ ఇలియానా. ఈ గోవా బ్యూటీ ఛాన్సుల్లేకనో ఏమోగానీ ఉన్నట్లుండి
నిర్మాతలకు డిస్కౌంట్లు ప్రకటిస్తోందట.
ఇటీవల ఒకేసారి విడుదలైన దేవుడు చేసిన మనుషులు, జులాయి రెండు సినిమాలు ఈ భామను అటూఇటూ కాకుండా గోడ మిద పిల్లిలా నిలబెట్టేసాయి. తాజాగా విడుదలైన "జులాయి" ఇలియానా ఖాతాలోకి మంచి విజయాన్ని అందించగా మరో వారానికే విడుదలైన "దేవుడు చేసిన ముషులు" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఇల్లీ కథ మళ్లీ మొదటికొచ్చింది.
దీంతో ఇలియానా ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్‌పై డిస్కౌంట్లు ప్రకటించిందట. అగ్రహీరోల సినిమాలైతే పారితోషికంలో ౩౦-40 శాతం వరకు తగ్గిస్తానని, చిన్న సినిమాలకైతే "కండీషన్స్ అప్లై" అంటుందట.
ఇదిలా ఉండగా "ఒంట్లో మరీ ఊపిరిలేనట్లున్నావు... కొంచెం బొద్దుగా అయితే బాగుంటుంది" అన్న డైరెక్టర్లపై ఒకప్పుడు ఎగిరిన ఇలియానా ఇప్పడు కొంచెం కండ పెంచే పనిలో పడిందట. ఇన్నాళ్లకు ఇల్లీకి "దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల"నే సామెత గుర్తుకొచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
No comments:
Post a Comment