‘లీడర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో దగ్గుబాటి రాణా బాలీవుడ్,టాలీవుడ్ లలో నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తూనే తాజాగా తమిళ చిత్రం రంగంలోనికి కూడా అడుగుపెట్టాడు. అయితే తెలుగు, బాలీవుడ్ చిత్రాలలో ఎంత ప్రయత్నించినా అనుకున్నంత ఫలితాలను ఇవ్వకపోవడంతో రాణా తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. అన్ని భాషల్లో తెరంగేట్రం చేస్తే ఏదో ఒకనాడు జాతీయస్థాయి నటుడిగా పేరు తెచ్చుకోలేక పోతానా అని రాణా అనుకుంటున్నాడు.
తాజాగా ముంబయిలో తన పరిచయాలను పెంచుకునేందుకు రాణా ఓ ఇల్లు కోసం వెతుకుతున్నట్లు సమాచారం. సినిమా వాళ్లు ఎక్కువగా ఉండు జుహు, బాంద్రా ప్రాంతంలో వెతుకుతున్నట్లు సమాచారం. రాణా పర్సనాలిటీ ఆకట్టుకునే విధంగా ఉన్నా నటుడిగా అంతగా రాణించలేకపోవడం మైనస్ గా మారింది. మరి ఈ అవరోధాలు దాటుకుని రాణా సక్సెస్ అవుతాడా వేచిచూడాలి.
No comments:
Post a Comment