ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ...నవంబర్లో గ్రాండ్‌గా పెళ్లి జరుగుతుందని, త్వరలోనే డేట్ ప్రకటిస్తానని చెప్పారు. ఎంగేజ్‌మెంట్ వివరాలు ముందుగా ప్రకటించక పోవడానికి పెద్ద కారణమేమీ లేదని, కావాలనే ఈ కార్యక్రమాన్ని సింపుల్‌గా ముగించినట్లు చెప్పుకొచ్చారు.
అదే విధంగా అంజన తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచమైందనే వార్తల్లో నిజం లేదన్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా 5సంవత్సరాల క్రితం వైజాగ్‍లో కలిసామని... అప్పటి నుంచి తమ మధ్య పరిచయం ఉందని తెలిపారు. ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా అతనో రేడియో జాకీ(ఆర్‌జె), సినిమా రంగంతో పరిచయం లేని వ్యక్తి అని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment