Monday, August 13, 2012

హీరో నానికి కాబోయే భార్య ఈవిడే..(ఎంగేజ్ మెంట్ ఫోటో)....

Actor Nani Engagement Pic
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు అంజుతో నాని ఎంగేజ్ మెంట్ ఆదివారం జరిగింది. నాని తాజాగా తాజాగా కొన్ని నిమిషాల క్రితం తన ఎంగేజ్ మెంట్ ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.
అయితే గతంలో అంజుతో ఎంగేజ్ మెంట్ జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన నాని...ఇప్పుడు ఆమెతోనే ఏడడుగులకు సిద్ధం అవ్వడం గమనార్హం. ఈమెతో నానికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ....తమ పరిచయ వివరాలను నాని ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదు.

No comments:

Post a Comment