''ప్రభాస్ ఈ సినిమా చూసి.. ఇందులో నటించింది నేనేనా? అని
ఆశ్చర్యపోవాలని ఈ చిత్రాన్ని మొదలుపెట్టాను. ఆయన తనను తాను మార్చుకొని ఈ
చిత్రంలో నటించారు''అంటున్నారు లారెన్స్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న
చిత్రం 'రెబల్'. ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. తమన్నా, దీక్షాసేథ్
హీరోయిన్స్ . అలాగే ''ప్రభాస్ కుటుంబానికున్న ఓ పేరు... రెబల్. ఆ పేరుతో
సినిమా అన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది.
అభిమానులకు ఓ
పండగలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాను''అన్నారు
అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు.
''రెబల్.. అంటే యాక్షన్ మాత్రమే అనుకోవద్దు. ఇందులో వినోదం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు అన్నీ ఉన్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు..
No comments:
Post a Comment