Tuesday, August 21, 2012

గంగతో రాంబాబు షూటింగ్: విద్యార్థుల ఆందోళన....



 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌ సినిమాలకు ఓవర్సీస్‌లో..ముఖ్యంగా యూఎస్‌లో క్రేజ్ ఏమిటో ‘గబ్బర్ సింగ్' చిత్రంతో రుజువైంది. ఆ చిత్రం అక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య యూఎస్‌లో తానే స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారీగా లాభాలు వస్తాయనే ఆశతోనే దానయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీస్. ఓ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ దీనికి ఏకంగా రూ. 4.5 కోట్లు కోట్ చేశాయి.
అయితే...ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రం డిజాస్టర్ కావడంతో కన్నింగ్ ప్లాన్ వేసిన సదరు సంస్థ దీన్ని సాకుగా చూపి కేవలం రూ. 2.5 కోట్లు మాత్రమే ఇస్తామని పేచీ పెట్టింది. చీప్ గా పవన్ కళ్యాణ్ సినిమా రైట్స్ దక్కించుకుని కోట్లు వెనకేసుకుందామని స్కెచ్ వేసింది. ఇతర డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ కూడా ఈచిత్రాన్ని తీసుకోకుండా పక్కాగా ప్రణాళిక రచించింది.

ఈ విషయాన్ని గ్రహించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' నిర్మాత డివివి దానయ్య.....వాళ్ల అంచనాలు తలక్రిందులు చేస్తూ షాక్ ఇచ్చారు. యూఎస్, ఓవర్సీస్‌లో తానే స్వయంగా ఈ చిత్రాన్ని విడుదల చేసుకుంటానని ప్రకటించారు. దీంతో అత్యాశకు పోయిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అవాక్కయ్యారు.
.
కాగా....కెమెరామెన్ గంగతో షూటింగ్ పాతబస్తీలోని సిటీ కాలేజీలో వేసిన హాస్పిటల్ సెట్‌లో జరుగుతుండగా కొంత మంది విద్యార్థి నాయకులు షూటింగును అడ్డుకున్నారు. చారిత్రాత్మకమైన ఈ కాలేజీ శిథిలావస్థకు చేరుకుందని, ఈ కట్టడాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా షూటింగులకు అద్దెకివ్వడం ఏమిటని ఆందోళన చేశారు. ఈ ఆందోళనతో తాత్కాలికంగా చిత్రం షూటింగ్ నిలిపి వేశారు.

No comments:

Post a Comment