Sunday, August 19, 2012

అందరికీ అతను డార్లింగ్‌ - నాకు మాత్రం తమన్నా...

"ప్రభాస్‌కు లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువని విన్నాను. సినిమా షూటింగ్‌లో కూడా చాలా జెంటిల్‌గా ఉంటాడు. చాలా హైట్‌" అంటూ నటి దీక్షాసేథ్‌ ప్రభాస్‌ గురించి చెప్పింది. 'రెబల్‌' సినిమాలో ఆమె నటించింది. ఆమెతోపాటు తమన్నా కూడా నటించింది. సెకండాఫ్‌లో దీక్షా పాత్ర వస్తుంది. ఇద్దరు హీరోయిన్లు కలుసుకోరట. దర్శకుడు రాఘవ లారెన్స్‌ అద్భుతంగా తెరకెక్కించాడట సినిమాను.

తమన్నా మాట్లాడుతూ... నేను ఇప్పటివరకు '100%లవ్‌'లో పెర్‌ఫార్మెన్స్‌ పాత్ర చేశాను. డాన్స్‌ పరంగా పెద్దగా చేయలేదు. రెబల్‌లో లారెన్స్‌ మాస్టర్‌ నాచేత డాన్స్‌ చేయించారు. ఆయన నా గురువు. అద్భుతంగా వచ్చింది" అంది.

దీక్షాసేథ్‌ మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన హీరోయిన్‌ తమన్నా. చాలా క్యూట్‌గా తెల్లగా ఉంటుంది. డాలింగ్‌ అంటూ అప్పుడప్పుడూ పిలుస్తా"నంటూ వ్యాఖ్యానించింది. రెబల్‌ సినిమా టీజర్‌ గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలైంది.

ఈ నెల 25న ఆడియోను విడుదల చేస్తామని త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు జె.పుల్లారావు, దానయ్య తెలిపారు.

No comments:

Post a Comment