Monday, August 13, 2012

'దేవుడు చేసిన మనుషులు'గ్యారెంటీ సూపర్ హిట్......

Producer About Devudu Chesina Manusulu
రవితేజ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం సెన్సార్ పనుల్ని పూర్తిచేసుకుని ఈ నెల 15న విడుదలకు సిద్ధమయింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ "మా సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. రఘు కుంచె సంగీత సారథ్యంలో రూపొంది ఇటీవల విడుదలైన ఆడియో చాలా పెద్ద హిట్టయింది. ఇప్పటివరకు రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా హిట్టవడమే కాకుండా సినిమాలు కూడా పెద్ద హిట్టయ్యాయి. అదే తరహాలో ఈ సినిమా ఆడియో సూపర్ హిట్టవడంతో, సినిమా కూడా అదే తరహాలో హిట్టవుతుందనే నమ్మకం ఉంది. మా బేనర్‌లో కచ్చితంగా మరో సూపర్‌హిట్‌గా నిలుస్తుంది'' అని చెప్పారు.

ఈ చిత్రం గురించి పూరీ జగన్నాధ్ మాత్రం ..దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అన్నారు. అలాగే చిత్రం పొగ్రెస్ వివరిస్తూ...ఇటీవల బ్యాంకాక్‌లో రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం అన్నారు.

No comments:

Post a Comment