Tuesday, August 21, 2012

చిరంజీవి 'శుభలేఖ' సాంగ్ రీమిక్స్....

Subhalekha Rasukunna Song Shot Iceland
చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో ' ఇళయరాజా సంగీతం అందించిన ఈ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాటను రామ్ చరణ్ హరోగా వి.వి.వినాయక్ దర్శకత్వం లో రూపొందుతున్న ‘నాయక్' చిత్రంలో రీమిక్స్ చేస్తున్నారు.

ఈ సాంగు చిత్రీకరణ ఆగస్టు 22 నుంచి ఐస్ లాండ్ ద్వీపంలో జరుగనుంది. తొలత ఈ పాటను కాజల్‌తో చిత్రీకరించాలని భావించినప్పటికీ చివరకు అమపాల్‌తో చిత్రీకరించాలని నిర్ణయించాడు దర్శకుడు. సంగీత దర్శకుడు తమన్ కు ఎంతో ఇష్టమైన ఈ పాటను విపరీత సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చక్కనైన మెలోడి సాంగ్ గా కంపోజ్ చేస్తున్నారు . చిరంజీవి హిట్ సాంగ్స్ రీమిక్స్ చేసిన రెండు చిత్రాలు 'మగధీర', 'రచ్చ' ఘన విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కుడా వర్క్ అవుట్ అయ్యి చరణ్ కు ఈ చిత్రం మరో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు.

No comments:

Post a Comment